top of page

కచదేవయాని - పార్ట్ 22

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 22 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 10/11/2025

కచదేవయాని - పార్ట్ 22తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 22 చదవండి. 


నహుష చక్రవర్తి దూతలు వృషపర్వుని దగ్గరికి వచ్చి చక్రవర్తి పంపించిన సందేశాన్ని వినిపించారు.


ఆ సందేశ సారాంశం తెలిసాక శర్మిష్ఠకు చాలా బెంగగా అనిపించింది. యయాతి తన పుట్టినరోజుకు రావడం లేదు.ఆమె మదిలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. మళ్లీ ఉదాసీనత... పరధ్యానం.. ఆమెను చుట్టుకున్నాయి.


ఆమెను చూస్తూ ఉంటే దేవయానికి చిత్రంగా అనిపిస్తోంది. కొన్ని రోజులు ఉత్సాహంగా, ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటుంది. మరి కొన్ని రోజులు  ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటోంది. ఏమిటో మర్మం!...


ఎంత అడిగినా "ఏమీ లేదక్కా!  బాగానే ఉన్నానుగా!" అంటూ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని కృత్రిమంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శర్మిష్ఠ తనని మానసికంగా దూరం పెడుతోందని దేవయానికి అర్థమవుతోంది. అంతఃపురంలో ఏదో విశేషం జరుగుతోంది... కానీ విషయం మాత్రం బయటికి రావటం లేదు.


శర్మిష్ఠ పుట్టిన రోజుకు వారం రోజుల ముందు విరజాదేవి, సంయాతి వచ్చారు. వృషపర్వుడు పరివారంతో సహా ఎదురు వచ్చి వాళ్ళకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశాడు.


కాబోయే కోడలికి, ఆమె చెలికత్తెలకు, స్నేహితురాళ్ళకు విరజాదేవి ఎన్నోవిలువైన బహుమతులు తెచ్చింది. ఆమె వచ్చిన రోజు సాయంత్రం ఆడవాళ్లందరు శర్మిష్ఠ భవనంలో కూర్చున్నారు.


ree

శర్మిష్ఠను  చక్కగా అలంకరించి బంగారు ఉయ్యాల మీద కూర్చోబెట్టారు. విరజాదేవి తను తెచ్చిన చీరలు నగలు శర్మిష్ఠకు   చదివించి ఆశీర్వదించింది.తప్పనిసరిగా అక్కడికి వచ్చి కూర్చుంది దేవయాని.


 సమూహంలో ఉన్నా కూడా ఒంటరితనంగా అనిపిస్తోంది దేవయానికి.

'ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ శర్మిష్ఠ బంధువులే!అందరూ ఆమెను ఎంత ముద్దు చేస్తున్నారో!


తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి తన పుట్టినరోజును ఇంత వైభవంగా ఎప్పుడూ జరిపించలేదు....ఆరోజు కొత్త బట్టలు కట్టుకుంటే తన ఆయురారోగ్యాల కోసం గణపతి హోమం చేస్తాడంతే!పేరంటాలు లేవు!....పెట్టు పోతలు లేవు!తల్లి ఉండి ఉంటే ఎంత బాగుండు!...'మనసుని ఎవరో మెలి తిప్పినట్లు బాధ.. ముళ్లమీద కూర్చున్నట్లు ముభావంగా కూర్చుంది దేవయాని.


 విరజాదేవి అందరికీ బహుమానాలు పంచుతూ దేవయాని దగ్గరికి వచ్చింది.

"ఈ అమ్మాయి మన గురువుగారైన శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని." అంటూ ఆమెకు పరిచయం చేసింది సుమాలినీదేవి.


విరజాదేవి నవ్వుతూ "అలాగా మీ నాన్నగారి గురించి ఎవరికి తెలియదు?  ఈ మధ్యే మా యజ్ఞానికి కూడా వచ్చారు.గొప్పతపశ్శాలి. ఈ భూలోకంలోనే అటువంటి మంత్రసిద్ధి కలిగిన గురువు ఎవ్వరూ లేరు!మా  శర్మిష్ఠ ఎంతో అదృష్టవంతురాలు.నీవంటి స్నేహితురాలు దొరికింది. మీ స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి!" అంటూ కొన్ని నగలు చీరలు దేవయానికి పెట్టింది.


ఆమెకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది దేవయాని. కాసేపటికి హోరెత్తిపోతూ సంగీత కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వాటిని చూస్తూ ఉంటే కాసేపటికి విసుగు పుట్టింది దేవయానికి.


తనకు నిద్ర వస్తోందని చెప్పి  గదిలోకి వచ్చేసింది.తనకిచ్చిన చీరలను నగలను పరిశీలించి చూచి శర్మిష్ఠకు  బహూకరించిన వాటికంటే కొంచెం తక్కువ విలువైనవని గుర్తించింది. కోపంగా వాటిని ఒక మూలకు విసిరేసింది దేవయాని. 


'ఆవిడ ఎవరో కానీ తన తండ్రి భూలోకంలోనే గొప్ప తపశ్శాలి అంటూ దాసీ వాళ్ళతో సమానంగా నాసిరకం చీరలు నగలు పెట్టింది.ఆవిడది ఎంత అల్పబుద్ధి! గొప్ప గురువుగా పేరు తెచ్చుకుంటే ఏం లాభం?  కూతురికి  ఏమి కావాలో చూసుకోవటం తన తండ్రికి చేతకాదు.చెప్పినా   అర్థమే కాదు.దాస దాసీలా?.. భోగ భాగ్యాలా?..'  అనుకుంటూ దేవయాని  తన గది తలుపులను ధడేలు మంటూ  వేసింది. అయినా శర్మిష్ట భవనంలోంచి ఇంకా సంగీతం వినిపిస్తూనే ఉంది.


'ఛ!ఛ! ఈ దిక్కుమాలిన గోలతో సుఖంగా నిద్ర కూడా పట్టదు!' అనుకుంటూ లేచి  కాస్త పత్తి తెచ్చుకొని చెవుల్లో పెట్టుకొని పడుకుంది.


 శర్మిష్ఠకున్న వైభోగం అగ్నిలాగా  ఆమె మనసును దహించి వేస్తుంటే  ఎప్పటికో నిద్ర పోయింది దేవయాని.

======================================================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 23 త్వరలో

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page