దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 20
- seetharamkumar mallavarapu
- 16 hours ago
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

చివరి భాగం
Dayyam@thommido Mailu - Part 20 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 05/02/2026
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 20 - తెలుగు ధారావాహిక
రచన: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జరిగిన కథ:
సెజ్ ఏర్పాటుకోసం తొమ్మిదో మైలు, వేటపాలెం పరిసరాల్లో వెయ్యి ఎకరాల భూసేకరణ జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా సంకల్పిస్తుంది. ముందుగా ఆ విషయం పసిగట్టిన రాజకీయ దళారీ వెంకటయ్య, పేదల భూమి చవగ్గా కొని, తరువాత అధిక ధరకు అమ్ముకోవచ్చని ప్లాన్ వేస్తాడు.
తొమ్మిదో మైలు ప్రాంతంలో దయ్యం తిరుగుతున్నట్లు పుకార్లు పుట్టిస్తాడు వెంకటయ్య. తన దారికి అడ్డు వస్తున్న ప్రజా నాయకుడు దీనదయాళును హత్య చేయిస్తాడు. బినామీ పేర్లతో చాలా భూములు చవగ్గా కొంటాడు. ఆ హత్యపై విచారణ చేయించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు, యాక్సిడెంట్‌లో రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు.
పదేళ్ల తరువాత దీనదయాళు కొడుకు మురళి, కూతురు రితిక, శ్రీనివాసరావు కొడుకులు దీపక్, గౌతమ్, కూతురు నవ్య, మరికొందరు యువతీయువకులు ఒక టీమ్‌గా ఏర్పడుతారు. తాము కోల్పోయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దీనదయాళు, దయ్యంగా వచ్చినట్లు ప్రచారం చేస్తారు.
చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను, కనకయ్య అనుచరుడు ఆర్ముగంను భయపెడతారు. దీపక్, రితికలు వెంకటయ్యను భయపెడతారు. తమ ప్లాన్‌లో చివరి భాగం అమలు చేయడానికి సిద్ధమవుతారు మురళి బృందం.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 20 చదవండి.
కాలభైరవ ఆలయం దగ్గర మురళి బృందం మాట్లాడుకున్న మాటలు పొదల మాటునుండి ఒక వ్యక్తి విన్నాడు.
'మంచి ప్లాన్ వేశారు. కానీ ముగింపు నేను అనుకున్నట్లు జరుగుతుంది' అనుకుంటూ చప్పుడు చేయకుండా ఆలయం వెనుకనుండి, ఆ చీకట్లో కలిసిపోయాడు ఆ వ్యక్తి.
తమ మాటలు ముగించుకున్న మురళి బృందం, ముందువైపు నుండి బాట వైపుకు కదిలారు.
మరో రెండు రోజుల తరువాత స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, స్థానికుల సమక్షంలో కాల భైరవ ఆలయంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రెండు రోజుల తరువాత సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థులు సమావేశమయ్యారు.
సర్పంచ్ మాట్లాడుతూ, "మన గ్రామం వెనుక ఉన్న ప్రభుత్వ బీడు భూములు అటవీభూములు కాదంటూ గతంలో స్థానికేతరులు కొందరికి పట్టాలు ఇచ్చారు. ఆ విషయంగా మనం వేసిన కేసు ముగింపు దశకు వచ్చింది. అవి అటవీభూములు కాని పక్షంలో మన గ్రామంలోని పేదలకే పట్టాలు ఇవ్వాలని మనం కోరాము. నిన్న ఆ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా మనకు సహకరిస్తామన్నారు.
బ్రతికి ఉన్నప్పుడు మనకోసం పాటుపడ్డారు మన దీనదయాళు గారు. ఇప్పుడు దయ్యంగా మారి మన భూములు ఆక్రమించుకున్న వాళ్ళను భయపెట్టారు. దాంతో వాళ్ళు భూములు తిరిగి మనకు అమ్మే యోచనలో ఉన్నారు. రేటు దగ్గరే కొంత తేడా వస్తోంది. కానీ కాలభైరవ విగ్రహం వచ్చేసింది కాబట్టి ఇక దయ్యాలు రావని, భూములు ఇప్పుడు అమ్మాల్సిన అవసరం లేదనీ అవి కొనుక్కున్న వాళ్ళు అనుకుంటున్నట్లు తెలిసింది," అన్నాడు.
సర్పంచ్ మాటలకు సమాధానంగా రంగయ్య మాట్లాడుతూ, "గ్రామం కోసం పాటుపడ్డ దీనదయాళు దయ్యం ఎందుకు అవుతాడు? అతడు దైవ శక్తిగా వచ్చాడు. చెడ్డవాళ్లకు మాత్రమే అతడు దయ్యం. కాల భైరవుడు అతన్ని అడ్డగించడు. ఆ విషయం తొందరలోనే రుజువవుతుంది," అన్నాడు.
సాధారణంగా తమ మాటలకు ఎప్పుడూ అడ్డం వచ్చే కామయ్య బృందం మౌనంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఉండబట్టలేక, స్వామినాథం కామయ్య వంక చూస్తూ, "ఏమిటో మాజీ సర్పంచి గారు మౌనవ్రతం పట్టినట్లున్నారు..." అన్నాడు.
కామయ్య మాట్లాడుతూ, "తొందరెందుకు? నిజం బయట పడక మానదు," అంటూ అక్కడినుండి నిష్క్రమించాడు.
అందరూ అతనివంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
***
ఆ రోజు మురళి బృందం ప్లాన్‌లో ఆఖరి రోజు.
తొమ్మిదో మైలు చింత చెట్టు దగ్గర గతంలో చిట్టిబాబు, పండు టెంట్ వేసిన ప్రదేశాన్ని గురించి ఒక వీడియో చెయ్యాలని ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు. నిజానికి వాళ్ళను అక్కడికి వచ్చేలా చేసింది దీపక్.
డ్రోన్ కెమెరాలతో వాళ్ళు పరిసరాలను చిత్రీకరిస్తున్నారు. హఠాత్తుగా ఏపుగా పెరిగిన చెరుకు తోటలోనుండి ఒక తెల్లటి దయ్యం లాంటి ఆకారం రంగయ్య షెడ్ వద్దకు వచ్చింది.
"ఊరంతా నాకు భయపడుతుంటే నువ్వుమాత్రం భయం లేకుండా ఒంటరిగా ఉంటావా... ఇప్పుడు నేను నిన్ను ఈడ్చుకుని వెళ్తాను. నీ అంతు చూస్తాను," అని ఆ దయ్యం వికటంగా నవ్వింది.
ప్లాన్ ప్రకారం ఇప్పుడు రంగయ్య బయటకు రావాలి. దయ్యం లాంటి ఆకారం రంగయ్యను పొలాల్లోకి ఈడ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో కాల భైరవ ఆలయ సాధువు ఆ దయ్యంతో, స్థానికులకు అపకారం చెయ్యవద్దని కాల భైరవుని ఆజ్ఞగా చెబుతాడు. ఊరివాళ్లకు వాళ్ళ భూములు ఇప్పించమని, ఆక్రమణదారుల పని పట్టమని కోరుతాడు. అందుకు అంగీకరించిన ఆ దయ్యం రంగయ్యను వదిలేస్తుంది. ఇదంతా డ్రోన్ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది.
మురళి, అతని బృందం చింత చెట్టు కింద ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ముందు రోజు రాత్రి మురళి, గౌతమ్ రంగయ్యను షెడ్ దగ్గర కలిశారు. దయ్యం లాక్కుని వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండమని రంగయ్యకు చెప్పాడు మురళి. తనకేమీ భయం లేదని అన్నాడు రంగయ్య. ఆ వయసు వ్యక్తిని ఈ పనికి ఉపయోగించడం మురళికి ఇష్టం లేకపోయినా రంగయ్య పంతం వల్ల ఒప్పుకోవలసి వచ్చింది.
మురళి, అతని బృందం చింత చెట్టు కింద రంగయ్య షెడ్ నుండి బయటకు రావడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
రంగయ్యకు బదులుగా కామయ్య షెడ్ నుండి బయటకు వచ్చాడు.
ఆశ్చర్యంతో చూస్తున్నారు మురళి, గౌతమ్.
దయ్యం పాత్రధారిని చెన్నై నుండి పిలిపించారు. షెడ్ నుండి బయటకు వచ్చిన వ్యక్తిని పొలాల్లోకి లాక్కుని వెళ్లడం అతని పని.
ఆ దయ్యం కామయ్య పైకి దూకింది. అతని మెడను తన పళ్లతో కరుచుకుని చెరుకుతోట మధ్యలోకి తీసుకుని వెళ్ళింది.
హఠాత్తుగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ ఆవహించింది.
"నేనిప్పుడు మాయమైపోయి నిన్ను ఆవహిస్తాను. నిన్ను నువ్వే చంపుకుంటావు," అన్న మాటలు వినిపించాయి.
పొగ తగ్గింది. దయ్యం ఆకారం కనిపించలేదు.
కామయ్య పరుగెత్తుకుంటూ రంగయ్య షెడ్‌లోకి వెళ్ళాడు.
పొలం పనులకు వాడే గునపాన్ని తీసుకుని బయటకు వచ్చాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన సాధువుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దయ్యం రంగయ్యను చంపబోతుంటే, స్థానికులను చంపవద్దని ఆపాలి. ఇప్పుడు రంగయ్య స్థానంలో కామయ్య వున్నాడు. చెడ్డవాడైనా కామయ్య కూడా ఆ ఊరి వాడే. ఆకాశం వంక చూస్తూ ఆ మాటే పలికాడు సాధువు.
"కాల భైరవుడి ఆన! స్థానికులను ఏమీ చెయ్యొద్దు. బయట్నుంచి వచ్చి భూములు ఆక్రమించిన వాళ్ళను ఏమైనా చేసుకో!" అన్నాడు.
కామయ్య బొంగురు గొంతుతో, "చనిపోయే ముందు నిజం చెప్పు కామయ్యా," అని తనకు తానే చెప్పుకున్నాడు.
తరువాత తన గొంతుతో, "వెంకటయ్య చెప్పాడని దీనదయాళు హత్యకు మనుషులను మాట్లాడాను," అంటూ ఆ హత్యలో పాల్గొన్న వాళ్ల పేర్లు చెప్పాడు. తరువాత తన మాటలు కొనసాగిస్తూ, "నేను చేసిన పాపాలకు ఈ దయ్యం నా ప్రాణాలు తీస్తోంది. ఈ దయ్యం వెంకటయ్యను, అతని మనుషులను కూడా వదలదు. కాజేసిన భూములు ఊరివాళ్లకు ఇస్తే దయ్యం దయ తలచవచ్చు. నన్ను క్షమించు దీనదయాళు," అని పెద్దగా అరుస్తూ గునపంతో తనను తాను గట్టిగా పొడుచుకున్నాడు.
మురళి వేగంగా ఆ షెడ్ వద్దకు పరుగెత్తాడు. షెడ్ బయట నేలపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు కామయ్య.
బలవంతంగా కళ్ళు తెరిచి, "నన్ను క్షమించు మురళీ! చేసిన పాపానికి తగిన శిక్ష పడింది. నాకే కాదు, తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది," అంటూ చివరి శ్వాస విడిచాడు కామయ్య.
ఎస్సై మోహన్ తన సిబ్బందితో వచ్చి కామయ్య శవాన్ని పోస్టుమార్టానికి తరలించాడు. టీవీ ఛానల్ వాళ్ళు డ్రోన్ కెమెరా రికార్డింగ్‌లను పోలీసులకు అప్పజెప్పారు.
షెడ్‌లో ఉన్న రంగయ్య, తనకు మైకం కమ్మినట్లయిందని, స్పృహ కోల్పోయానని, బయటకు వచ్చి చూసేసరికి కామయ్య రక్తపు మడుగులో ఉన్నాడని చెప్పాడు.
దీనదయాళు హత్యలో పాల్గొన్న వాళ్ల పేర్లు కామయ్య చెప్పడంతో వాళ్లందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి వాంగ్మూలాలను బట్టి వెంకటయ్యను కూడా అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకటయ్య, చెన్నైలో ఉన్న తన బంధువులను పిలిపించాడు. తాను కొన్న ధరకే భూములను రైతులకు తిరిగి అప్పగించాడు.
మురళి చేతులు పట్టుకుని, "నేను చేసిన నేరం క్షమించరానిది. అయినా వీలుంటే క్షమించు. కామయ్యలాగే నా కథ కూడా త్వరలో ముగుస్తుంది. లేకున్నా కోర్టులో నా తప్పులన్నీ ఒప్పుకుని, నాకు పడ్డ శిక్షను అనుభవిస్తాను," అని చెప్పాడు.
***
కొద్ది రోజుల తరువాత మురళి బృందం కాల భైరవ ఆలయం వద్ద కలిశారు.
ఈసారి ఎస్సై మోహన్ కూడా వారితో ఉన్నాడు.
మురళి తల్లి చామంతమ్మ మాట్లాడుతూ, "కామయ్య భార్య నన్ను కలిసింది. సంవత్సరం కిందట వాళ్ల కూతురు కాలుజారి బావిలో పడి చనిపోయింది కదా! అది ఆత్మహత్యట. పట్నంలో చదువుతున్న వాళ్ల అమ్మాయిని వెంకటయ్య బంధువుల అబ్బాయి ఒకడు పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడట. ఆ అమ్మాయి నెల తప్పటంతో మొహం చాటేసాడట. కామయ్య పట్నం వెళ్లి వాళ్ల పెళ్లి చేయించమని వెంకటయ్యను అడిగాడట. వెంకటయ్య, అవమానకరంగా మాట్లాడి, అబార్షన్ చేయించుకోమని డబ్బులు ఇవ్వబోయాడట,"
చెప్పింది చామంతమ్మ.
"చిక్కుముడి వీడుతున్నట్లుంది. కామయ్య సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో కామయ్యలో మార్పు వచ్చి ఉంటుంది. సరైన సమయంలో వెంకటయ్య పేరును బయట పెట్టి చనిపోయాడు. నాన్న హత్యలో పాలుపంచుకున్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు," అంది రితిక.
"కామయ్యను దయ్యం చంపిందని అందరూ అనుకుంటున్నారు. ఆ భయం అలాగే ఉండనిద్దాం. ఈ ప్రాంతంలో తప్పు చేయాలనుకునే వాళ్ళు దయ్యానికి భయపడతారు," అన్నాడు స్వామినాథం.
"ఆ రోజు నిద్ర లేచిన వెంటనే నాకెందుకో మైకం కమ్మినట్లయింది. తిరిగి పడుకున్నాను. తెల్లటి బట్టలలో నా మిత్రుడు దీనదయాళు నవ్వుతూ కనిపించాడు," చెప్పాడు రంగయ్య.
ఎస్సై మోహన్ మాట్లాడుతూ, "పదేళ్ల క్రిందట ముగిసిన విషయం మళ్ళీ వెలుగులోకి రావడం వెనుక దైవ శక్తి ఉంది. అందువల్లే మురళి, గౌతమ్, దీపక్, రితిక, నవ్య నిజం బయట పెట్టడానికి నడుం కట్టారు. దైవ శక్తిని నమ్మని వాళ్ళు కూడా దయ్యాన్ని నమ్ముతారు. కాబట్టి దయ్యం ఉందనే అనుకుందాం. ఆ దయ్యం మీ గ్రామాన్ని కాపాడుతుందని ఆశిద్దాం," అన్నాడు మోహన్.
అదే సమయంలో అతని ఫోన్ మోగింది. పక్కకు వెళ్లి మాట్లాడి వచ్చిన మోహన్, "ఒక ముఖ్యమైన విషయం," అన్నాడు.
అందరూ అతనివంక ఆసక్తిగా చూశారు.
"చెన్నై వెళ్తున్న ఒక కారు తొమ్మిదో మైలు దగ్గర యాక్సిడెంట్‌కు గురైందట. చూసిన వాళ్ళు స్టేషన్‌కు కాల్ చేశారు. స్టేషన్ నుండి మా వాళ్ళు బయలుదేరారట. నేను కూడా స్పాట్‌కు వెళ్తాను," అన్నాడు మోహన్.
"పదండి. మేము కూడా వస్తాము," అన్నాడు మురళి.
వీళ్లు వెళ్లేసరికి అక్కడ జనాలు గుమికూడి ఉన్నారు.
వాళ్ళను పక్కకు పంపి యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వెళ్ళాడు మోహన్. కార్లో ఉన్న నలుగురిలో ముగ్గురు అప్పటికే మరణించారు. కొస ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తి మోహన్‌ను దగ్గరకు రమ్మని పిలిచాడు.
'కారుకు అడ్డంగా ఏదో వింత ఆకారం కనపడింది. దాన్ని తప్పించబోయి స్టీరింగ్ పక్కకు తిప్పడంతో కారు తొమ్మిదో మైలు రాయిని కొట్టుకుని పల్టీ కొట్టింది. పదేళ్ల ముందు సబ్ కలెక్టర్ శ్రీనివాసరావుకు యాక్సిడెంట్ చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాము. మాతో ఆ పని చేయించింది వెంకటయ్య," అతి కష్టం మీద మాటలు పెగుల్చుకుని చెప్పి తల వాల్చేశాడతను.
కాల భైరవ ఆలయ సాధువు గాలికి చూస్తూ, "దయ్యం ఉందో లేదో తెలియదు. దేవుడు వస్తాడో రాడో తెలియదు. కానీ నువ్వు మాత్రం ఉన్నావు దీనదయాళు... ఎప్పటికీ తొమ్మిదో మైలు దగ్గర ఉంటావు," అన్నాడు.
=========================================================
సమాప్తం
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు డాట్ కామ్ తరఫున, రచయిత శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారి తరఫున మా అభివాదాలు తెలియజేస్తున్నాము.
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.




Comments