top of page
Original.png

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 19

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory


Dayyam@thommido Mailu - Part 19 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 21/01/2026

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 19 - తెలుగు ధారావాహిక

రచన: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జరిగిన కథ:


సెజ్ ఏర్పాటుకోసం తొమ్మిదో మైలు, వేటపాలెం పరిసరాల్లో వెయ్యి ఎకరాల భూసేకరణ జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా సంకల్పిస్తుంది. ముందుగా ఆ విషయం పసిగట్టిన రాజకీయ దళారీ వెంకటయ్య పేదల భూమి చవగ్గా కొని తరువాత అధిక ధరకు అమ్ముకోవచ్చని ప్లాన్ వేస్తాడు. 


తొమ్మిదో మైలు ప్రాంతంలో దయ్యం తిరుగుతున్నట్లు పుకార్లు పుట్టిస్తాడు వెంకటయ్య. తన దారికి అడ్డు వస్తున్న ప్రజా నాయకుడు దీనదయాళును హత్య చేయిస్తాడు. బినామీ పేర్లతో చాలా భూములు చవగ్గా కొంటాడు. ఆ హత్యపై విచారణ చేయించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాస రావు యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. 


పదేళ్ల తరువాత దీనదయాళు కొడుకు మురళి, కూతురు రితిక, శ్రీనివాస రావు కొడుకులు దీపక్, గౌతమ్, కూతురు నవ్య మరికొందరు యువతీయువకులు ఒక టీమ్ గా ఏర్పడుతారు. తాము కోల్పోయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దీనదయాళు, దయ్యంగా వచ్చినట్లు ప్రచారం చేస్తారు. 


చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను, కనకయ్య అనుచరుడు ఆర్ముగంను భయపెడతారు. దీపక్, రితికలు వెంకటయ్యను భయపెడతారు. 



గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 19 చదవండి. 


"బావగారూ! వెంకటయ్య నెక్స్ట్ స్టెప్ ఏమిటి?" బయటకు వచ్చాక అడిగింది రితిక.


"రాము, మనం చెప్పినట్లు కాలభైరవ ఆలయంలో విగ్రహం పెట్టించమని వెంకటయ్యతో చెబుతాడు. ఇప్పుడు భూములు అమ్ముదామన్నా కొనే వాళ్లు లేరు. కాబట్టి విగ్రహం తిరిగి వస్తే కాలభైరవుడు కాపాడుతాడనే ధైర్యం వచ్చి భూములు అమ్ముడవుతాయని అతను నమ్ముతాడు. కాబట్టి అతను ఆ ప్రయత్నంలో ఉంటాడు. అమ్మకుండా ఉంటే పాత విగ్రహాన్ని రేపే దొరికేలా చేస్తాడు. లేకుంటే కొత్త విగ్రహం చేయించి పెడతాడు." చెప్పాడు దీపక్.


"మరొక సందేహం. ఈ ప్లాన్ అమలు చేయడానికి నేను, గౌతమ్ కదా రావాలి.." అంది రితిక.


"అదలా వుంచు. వెంకటయ్యను  చూడగానే నీకేమనిపించింది?" 


"మా నాన్న చావుకు కారణమైన అతన్ని చూడగానే చాలా కోపం వచ్చింది. బలవంతంగా ఆపుకున్నాను."


"అదే గౌతమ్ అయితే ఆవేశం అణచుకోలేడు. మా నాన్నగారికి యాక్సిడెంట్ చేయించిన వెంకటయ్య ఎదురుగా ఉంటే అతని మీదకి దూసుకెళ్తాడు. మన ప్లాన్ పాడవుతుంది. అందుకే ఆఖరి క్షణంలో ప్లాన్ లో మార్పు చేశాను." చెప్పాడు దీపక్.


మర్నాడు కామయ్యను పిలిపించాడు వెంకటయ్య.


"మీ ఇంటి వెనుక ఉన్న పాడుబడ్డ బావిలో దాచిన విగ్రహాన్ని బయటకు తియ్యి. దాన్ని వాగు ఒడ్డున సగం బయటకు కనిపించేలా ఉంచు. కాలభైరవుడు తిరిగి వచ్చినట్లుగా ప్రచారం చేయించు. నేను మీ ఊరికి వచ్చి, నా ఖర్చులతో ఆ విగ్రహానికి పునఃప్రతిష్ఠ చేయిస్తాను. దయ్యం భయం పోగొట్టి భూములు అమ్ముకుందాము" అన్నాడు వెంకటయ్య.

 

మరో రెండు రోజుల తరువాత తొమ్మిదో మైలు వాగుకు అవతలి వైపు కాలభైరవ విగ్రహం కనిపించడంతో కలకలం చెలరేగింది.


వేటపాలెం గ్రామస్థులతో పాటు పరిసర గ్రామ ప్రజలు కూడా తండోపతండాలుగా గుమికూడారు.


విషయం తెలిసిన వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ మోహన్ స్థానికుల సహాయంతో విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీయించి, బాట పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచాడు. 


పత్రికా విలేఖరులు, న్యూస్ ఛానెల్స్ వాళ్లు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. 


అక్కడికి చేరుకున్న కామయ్య "కాలభైరవుడు తిరిగి వచ్చాడు. ఇక ఏ దయ్యమూ మనల్ని ఏమీ చేయలేదు." అన్నాడు. అతని అనుచరులు అందుకు వంత పాడారు.


"నిజమే. ఆ కాలభైరవుడు లేకపోవడం వల్లే మన దీన దయాళు దయ్యం లాంటి మనుషుల వల్ల బలయ్యాడు. ఇప్పుడు మన కాలభైరవుడు తిరిగి వచ్చాడు. దీన దయాళును మనకు దూరం చేసిన వాళ్ళ అంతు చూస్తాడు" అన్నాడు రంగయ్య.


స్వామినాథం, మురళి, మరికొందరు గ్రామస్థులు అతని మాటలను బలపరిచారు.


పైకి బింకంగా ఉన్నా కామయ్య మనుషుల ముఖాల్లో భయం తాలూకు ఛాయలు గమనించాడు మురళి.


విగ్రహాన్ని గుడి దగ్గరికి చేర్పించాడు ఎస్‌ఐ మోహన్. భయం, భక్తి—రెండూ కలిసి అందరి ముఖాల్లో ఒక విచిత్రమైన ఉద్వేగాన్ని నింపాయి. 


విగ్రహం ఆలయ ప్రాంగణంలో నిలిపిన తరువాత, స్థానిక మండలాధికారి ముందుకు వచ్చి అధికారిక స్వరంలో ప్రకటించాడు—

“పునః ప్రాణ ప్రతిష్ట ఎప్పుడు జరిపించాలో దేవాదాయ శాఖతో సంప్రదించి నిర్ణయిస్తాం. అంతవరకు ఎవరూ ఆందోళన చెందవద్దు. ఓపిక పట్టండి. ప్రతిష్ట అనంతరం మునుపటిలాగే దర్శనానికి అనుమతి ఇస్తాం.”

ఆ మాటలు విన్నాక కొందరికి ఊరట, మరికొందరికి ఇంకా అనిశ్చితి. కాలభైరవుడి చూపు, నిశ్శబ్దంగా అందరినీ గమనిస్తున్నట్టు అనిపించింది.

ఆ రోజు రాత్రి…చంద్రుడు మేఘాల వెనుక దాగిపోతూ, కాలభైరవ ఆలయం చుట్టూ గాఢమైన చీకటి అలముకుంది. మురళి బృందం ఒకరొకరుగా ఆలయం వెనుక భాగంలో చేరారు.

దీపక్, గౌతమ్, రితిక, నవ్య, స్వామినాథం, అతని కొడుకు గోపీనాథ్, రంగయ్య, చిట్టిబాబు, పండు హాజరైన వాళ్లలో ఉన్నారు.


మురళి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. అతని స్వరంలో ధైర్యం ఉన్నా, మాటల మధ్య బాధ దాగి ఉంది.

"నేను, నవ్య కలిసి చెన్నైలో ఉన్న వెంకటయ్య బంధువులకు, వారి అనుచరులకు దయ్యం భయం కల్పించాము. దాంతో వారు భూములను తమ పేర్ల మీద ఉంచవద్దని వెంకటయ్య పైన ఒత్తిడి తెచ్చారు. ఇక్కడ వెంకటయ్యను కూడా దీపక్, నా చెల్లెలు రితిక చెన్నై పోలీసుల్లాగా నటించి భయపెట్టారు. అతని దగ్గర పని చేసే రాము సహకారంతో దయ్యం కాల్ చేసినట్లు చేసి ఆ భయాన్ని మరింత పెంచాము. దయ్యం బాధ తప్పించుకోవడానికి తాను గతంలో మాయం చేసిన కాలభైరవ విగ్రహాన్ని తిరిగి కనపడేలా చేసాడు. దయ్యం భయం వల్ల వెంకటయ్యకు ఎంతో కొంత మొత్తానికి భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి ధరలు పెరగాలంటే దయ్యం పట్ల భయం పోవాలి. కాలభైరవ విగ్రహం అప్పగించడానికి అది కూడా ఒక కారణం. 


ఇక మనం మన చివరి ప్లాన్ అమలు చేయాలి. అందరూ చూస్తుండగా దయ్యం ఒక వ్యక్తిని తరుముకోవాలి. ఆ తరువాత ఆ దయ్యం అదృశ్యమై అతన్ని ఆవహించాలి. ఆ వ్యక్తి కత్తితో తనను తాను పొడుచుకోబోతున్నట్లు నటించాలి. 


ఆ సమయంలో కాలభైరవ ఆలయ సాధువు అక్కడికి వచ్చి, స్థానికులను ఏమీ చేయవద్దని, మన భూములు ఆక్రమించిన బయటివాళ్ల అంతు చూడమనీ, అందుకు సహకరించిన వాళ్ళ పని పట్టమనీ  ఆ దయ్యాన్ని వేడుకుంటాడు. అప్పుడు ఆ దయ్యం అతన్ని విడిచి పెడుతుంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మన భూములు మనకే తక్కువ ధరకు వస్తాయి." అని చెప్పాడు మురళి.


దీపక్ మాట్లాడుతూ "దయ్యం పాత్ర పోషించడానికి ఒక వ్యక్తిని సిద్ధం చేశాను. అతనికి సరైన మేకప్ చేయడానికి మనిషిని ఏర్పాటు చేశాను. కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేశాను. దయ్యం దాడికి గురయ్యే మనిషి పాత్రకు ధైర్యవంతుడైన స్థానికుడు కావాలి.  ఈ పాత్ర పోషించే వ్యక్తికి స్వల్పంగా గాయాలు కావచ్చు. అందుకు సిద్ధపడే వాళ్లే ముందుకు రండి" అన్నాడు.


"స్థానికులే కావాలి కాబట్టి నేనే ఆ పాత్ర పోషిస్తాను" అన్నాడు మురళి.


"వద్దు మురళీ. నువ్వు గాయపడితే తరువాత చేయాల్సిన కార్యక్రమాలు ఆగిపోతాయి. ఆ పాత్ర నేను తీసుకుంటాను." అన్నాడు రంగయ్య.


"వద్దు రంగయ్య గారూ! ముందే చెప్పానుగా.. ఈ ప్రయత్నంలో గాయాలు కావచ్చని. మీకు ఇంకా వివరంగా చెబుతాను. దయ్యం ఆకారంలో ఉన్న మనిషి, ఒక వ్యక్తిని ఈడ్చుకుని వెళ్తూ ఉంటాడు. కాబట్టి యువకులైతే గాయాలు తగిలినా కోలుకోవచ్చు" అన్నాడు దీపక్. 


"నా స్నేహితుడు దీనదయాళు గ్రామం కోసం ప్రాణాలు అర్పించాడు. నేనేమీ చేయలేక పోయాననే బాధ నన్ను వెంటాడుతూ ఉంది. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పరవాలేదు. నన్ను కాదంటే ఈ రాత్రికే ఉరి వేసుకుంటాను." దృఢ నిర్ణయంతో చెప్పాడు రంగయ్య.


ఎవరెంత చెప్పినా అతను అంగీకరించక పోవడంతో ఆ పాత్రకు అతన్నే ఎంపిక చేశారు.


వాళ్లకు తెలియదు…

ఆ చీకట్లో, పాత మర్రిచెట్టు వెనుక, ఒక వ్యక్తి వాళ్ల సంభాషణంతా వింటున్నాడని. అతని ముఖంపై చిరునవ్వు మెరిసింది.

“ఇంత పెద్ద ఆట ఆడుతున్నారు… కానీ ఈ ఆటలో చివరి పావు ఎవరిది?” అని అతను మనసులో అనుకున్నాడు.

ఆ వ్యక్తి నీడ చీకట్లో కలిసిపోయింది.

తొమ్మిదో మైలు ప్రాంతంలో  రాత్రి మరింత బరువెక్కింది.

దయ్యం కథ… నిజమైన భయానికి దారి తీస్తోంది.


==================================================

ఇంకా ఉంది

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 20  (చివరి భాగం) త్వరలో

==================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page