top of page
Original.png

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 14 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 03/12/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక

రచన: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన “దయ్యం@తొమ్మిదోమైలు” కథతో, ఎస్సై మోహన్, రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి రాత్రివేళ తొమ్మిదో మైలు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది. హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే నైట్ స్టే చేస్తే.. దయ్యం వారిలో చిట్టిబాబును భయంకరంగా గాయపరిచింది. 

తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్, మురళిని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు. ఊర్లో దీనదయాళు ధైర్యం చెప్పడంతో భూములు అమ్మకుండా తప్పించుకున్నారు. అయితే కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాలెంలో భయం పెరిగింది. ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు దీనదయాళును హత్య చేయించారు. 



గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 చదవండి. 


దీనదయాళు మృతి చూసి ఆకాశం కన్నీరు కారుస్తున్నట్లుగా జోరున వర్షం కురుస్తోంది. 

పోలీసులు ముందుగా చింత చెట్టు కింద శవం పడున్న ప్రదేశాన్ని మార్క్ చేసుకున్నారు. తమకు చెప్పకుండా శవాన్ని తరలించినందుకు గ్రామస్థులను కోప్పడ్డారు. పక్కన పొలాల్లో ఉన్న షెడ్ ఎవరిదని అడిగారు. ఆ షెడ్ తనదేనని, వర్షం వచ్చేలా ఉండటంతో రాత్రి పొలం దగ్గరకు నీళ్లు కట్టడానికి రాలేదని రంగయ్య చెప్పాడు. వచ్చి ఉంటే అలికిడికి బయటకు వచ్చి చూసేవాడినని వాపోయాడు. 

తరువాత వాగు వరకు జీపులో వచ్చి, స్థానికుల సహాయంతో వాగు దాటారు పోలీసులు. అప్పట్లో స్వామినాథం వేరే చోట పని చేస్తున్నాడు. అయినా సెలవు మీద ఉండటంతో స్థానిక పోలీసులకు సహాయంగా ఉన్నాడు. 


వాగు దాటాక బాట పక్కన దీనదయాళు సైకిల్ పడిఉన్న ప్రదేశాన్ని ఫోటోలు తీసుకున్నారు. 


తరువాత వేటపాలెం గ్రామం చేరుకున్నారు. 


పోలీసులు.. పక్కనే గుమికూడిన గ్రామస్తులు.. 

దీనదయాళు ఇంటి హాలు మధ్యలో శవాన్ని కప్పిన తెల్లటి గుడ్డ. 

స్వామినాథం ఆ గుడ్డను తొలగించి, ఆ ముఖాన్ని చూసినప్పుడు అతని గుండె బరువెక్కింది. 


"దీనదయాళు..” అని నిస్సత్తువగా అన్నాడు. 


చామంతమ్మ గుండెలు బాదుకుంటూ రోదిస్తోంది. 

పది, పన్నెండేళ్ళు ఉన్న రితిక, మురళి ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పే పరిస్థితిలో ఉన్నారు. తండ్రి జీవితం ఇంత తొందరగా ముగుస్తుందని వాళ్ళు ఊహించలేదు. 


అతి కష్టం మీద పోలీసులు శవాన్న పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామస్తులందరూ వాగుదాటి శవాన్ని జీపులో ఎక్కించేవరకు అక్కడే ఉన్నారు. స్వామినాథం కూడా పోలీసులతో జీపులో వెళ్ళాడు. కొందరు గ్రామస్థులు వానలో తడుస్తూనే బైకుల్లో జీపును అనుసరించారు. 


మిగిలిన వారు బాధగా వెనుతిరిగారు. 


వాళ్ళ మాటల్లో దయ్యం గురించిన చర్చ జరుగుతోంది. 


 “దయ్యమే చంపింది..!”

 “కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ”

 “కాల భైరవుడి కోపం..!”


ఆ రోజు నుంచే.. అన్ని టీవీ న్యూస్ ఛానళ్లు వేటపాలెం మీద పడ్డాయి. 

“దయ్యం చేసిన ఘాతుకం!” అనే హెడ్డింగ్ తో స్క్రోలింగ్, బ్రేకింగ్ న్యూస్, స్టూడియోలలో చర్చలు.. 


కొంతమంది యాంకర్లు సైతం విషపూరితమైన వాక్యాలు—

దయ్యాలు ఉన్నాయి"


"దయ్యాన్ని నమ్మకపోతే అంతం తప్పదు'


ఇలాంటి వార్తాకథనాలు వెలువడ్డాయి. 


మరో వైపు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. 


 కారణం: తీవ్రమైన భయంతో గుండె ఆగిపోవడం (Cardiac Arrest due to Extreme Fear). 


ఇది విన్న గ్రామస్తులలో ఆలోచన.. 


 “దీనదయాళు భయపడేవాడు కాదు. అంటే నిజంగానే దయ్యమేనేమో..” అనే సందేహాలు బలపడ్డాయి. 


స్వామినాథం మాత్రం నమ్మలేదు.. 

 అతనికి ఒక విషయం ఖచ్చితంగా తెలుసు—

 ఇది భయం వల్ల కాదు.. బయటి వాళ్ల కుట్ర. 


ఇన్నాళ్లు లేని దయ్యం భూముల కొనుగోలుకు కొందరు ప్రయత్నిచే సమయంలోనే జరగడం సహజం కాదని అతని నమ్మకం. 

ఆ రోజు సాయంత్రం స్వామినాథం, రంగయ్య, సర్పంచ్, ఇంకొందరు పెద్దలు కలిసి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. 


కలెక్టర్ వారి మాటలను ప్రశాంతంగా విన్నాడు. 

 కానీ వాళ్లు ఊహించినట్టు ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. 

“మీరు చెప్పింది తీవ్రమైన ఆరోపణలు.. మన దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు పోస్టుమార్టంలో గుండెపోటు అని ఉంది.. ఇంకేమీ తప్పుగా కనిపించడం లేదు. కానీ మీరు కోరితే సబ్ కలెక్టర్‌ని అడగండి..” అన్నాడు. 


స్వామినాథం ఒక్క క్షణం ఆగాడు. “సబ్ కలెక్టర్.. శ్రీనివాసరావు గారా?” అని అడిగాడు. 


“అవును. ఆయనే మీ సబ్ కలెక్టర్. ” అన్నాడు కలెక్టర్. 


చిక్కు ముడులు వీడి పోతున్నట్టు అనిపించింది గౌతమ్‌కు. 

“అంటే..?” అని అడిగాడు అతను. 

స్వామినాథం బాధగా చెప్పాడు.. 

“అవును నాయనా.. మీ నాన్నగారే. ఆయనే..” 


గతం గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పడం మళ్ళీ మొదలు పెట్టాడు స్వామినాథం. 


“కలెక్టర్ దగ్గర నుంచి నిరాశగా బయటకొచ్చాం. 

 నేనే శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశాను. 

 మొదట్లో ఆయనైతే.. ‘పోలీసుల దర్యాప్తు సరిపోతుంది’ అన్నారు. 

 ‘నేను రానవసరం లేదు’ అన్నారు. ”


గౌతమ్ ఆశ్చర్యపోయాడు. 


“మరి నాన్నగారు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు గౌతమ్. 


“రెండు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేశాను. సాధారణంగా అయన అన్యాయాన్ని ఎదిరించే విషయాల్లో ముందుంటారు. కానీ ఆ రోజు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నారు. ఉన్న ఒక్క ఆశ కూడా దూరమైందని బాధ పడ్డాను. మరుసటి రోజు ఉదయం, ఎవరికి చెప్పకుండా, శివయ్య జలపాతం దగ్గరకు టూర్ వచ్చినట్లు వచ్చేశారు. అక్కడ్నుంచి కారులో వాగు వరకు వచ్చారు. వాగు దాటి మా ఊరికి నడిచి వచ్చారు. ” అన్నాడు స్వామినాథం. 


గౌతమ్ కళ్లలో నీళ్లు మెదిలాయి. 


“యూనిఫాం లేదు. అధికార హంగు లేదు.  కానీ.. ఒక్క చూపులోనే ఆయనలో అధికారాన్ని అందరూ గమనించారు. ” అన్నాడు రంగయ్య. 


“ఆయన ఊరివారిని విచారించారు. వాగు వరకూ నడిచారు. కాలభైరవ ఆలయాన్ని పరిశీలించారు. సైకిల్ కింద పడ్డ ప్రదేశంలో నేలలోకి బలంగా దిగబడినట్లు ఉన్న అడుగుల ముద్రలు పరిశీలించారు. ఆ రోజు సాయంత్రం ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. 


'ఇక్కడ దయ్యం లేదు.. కానీ దయ్యం కన్నా ఘోరమైన మనుషులు ఉన్నారు. '


ఆ మాటలు చెప్పారు శ్రీనివాసరావు. 

ఆ తర్వాత ఆయన ఒక ఫైల్ తీసి చూపించారు. 


“మీ ఊరికి వెనుక వైపున ఉన్న అటవీ ప్రాంతం భూములపై ఇటీవల కొన్ని అర్జీలు వచ్చాయి.  పట్టాలు తమవంటూ కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. ఆ లిస్ట్ చూడండి. ”

అది చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. 


వాళ్లెవరూ స్థానికులు కారు. 

 చెన్నై అడ్రసులు..

 పెద్ద కంపెనీల పేర్లు..

 నమ్మకం కలగని పేర్లు..


“వీళ్లకు మీ భూముల మీద ఆసక్తి.. 

 భూముల కోసం భయాన్ని వ్యాపారం చేస్తున్నారు. ”

 అన్నాడు శ్రీనివాసరావు. 


ఆయన “కలెక్టర్‌కి అన్నీ వివరంగా నివేదిస్తాను. విచారణ జరిపిస్తాను. ఎంతటి పెద్దవాళ్లున్నా వదిలిపెట్టను” అన్నారు. 

గ్రామానికి ఆ మాటలు కొత్త ఆశ. 


కాని..

రెండో రోజే ఆయన హైదరాబాద్ వెళ్తుండగా కారు యాక్సిడెంట్.. 

రెండు కాళ్లు పోయాయి. గ్రామస్తులకు అర్థమైంది. 

ఇది యాక్సిడెంట్ కాదు, నిస్సందేహంగా హత్యాప్రయత్నమని.. 


కాని..

ఎవరి మీద కేసు పెట్టాలి?

 ఎవరి మీద వేలు ఎత్తాలి?

పెద్ద నాయకుల పేర్లు..

 పెద్ద కంపెనీలు..

పెద్ద మనుషులు..

అవసరం అనే మాట..

 భయం అనే మాట..

ఇవే గెలిచాయి. 

స్వామినాథం మాటలో వణుకు. 


“రంగయ్య లాంటి ఒకరిద్దరు భూములు అమ్మలేదు. బయట ఊళ్లలో సెటిల్ అయిన కొందరు అమ్మలేదు. కాలభైరవ ఆలయ భూములు ఆక్రమించకుండా మాత్రం మేము కోర్టు నుండి స్టే తెప్పించాము. 


అప్పుడే ఎలెక్షన్లు వచ్చాయి. అధికారం మారిపోయింది. 

 చెన్నైలో ఉన్న రమణయ్య బంధువులు కేసుల్లో ఇరుక్కొన్నారు. 

 ఆ తర్వాత ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ”

ఆఖరి మాటలు చెప్పి నిట్టూర్చాడు స్వామినాథం.


గౌతమ్ కళ్లలో ఇప్పుడు బాధ లేదు. 

కోపం ఉంది. 

తన తండ్రి నిజాయితీని తలుచుకుని సంతోషించాడు. 

“నాన్నగారు నిలబడినది న్యాయం కోసం. ఆయన అభిమన్యుడిలా నేలకొరిగాడు. కానీ పోరాటం ఆగలేదు” అన్నాడు గౌతమ్. 


మురళి అతని భుజంపై చేయి వేసాడు. 

ఏ దయ్యం భయంతో వాళ్ళు మా భూముల్ని ఆక్రమించుకున్నారో అదే భయాన్ని ఇప్పుడు కలిగించి, మా భూముల్ని తిరిగి చవగ్గా కొనాలనుకుంటున్నాము. 

వాళ్లకు అప్పుడు పోలీసులు, నాయకులూ, వారి కొమ్ము కాచే పత్రికలూ పూర్తిగా సహకరించారు. 


మనకు అన్ని హంగులు, ఆర్భాటాలు, యంత్రాంగం లేవు. కానీ పక్కా ప్లానింగ్ తో, సైనికుల్లాంటి యువకులతో ముందుకు సాగాలి. 


మీ నాన్నగారి గురించి విచారించాను. అప్పుడే మీ అక్కయ్య మా క్లాస్ మేట్ అని తెలిసింది. ఆమె ద్వారా మీ అన్నయ్యను కలిసాను. అలాగే మా చెల్లాయి రితిక నిన్ను కలిసింది. మన యువతరంలో పాటు స్వామినాథంగారు, రంగయ్య గార్ల సహకారంతో ముందుకు సాగుదాం. దయ్యం@తొమ్మిదో మైలు సృష్టిద్దాం" అన్నాడు మురళి. 

అతని చేతిలో చెయ్యి కలిపాడు గౌతమ్. 


కానీ మరో అదృశ్య శక్తి  సహకరించబోతోందని ఆ క్షణంలో వారికి తెలీదు.   


==================================================

ఇంకా ఉంది

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 15 త్వరలో

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page