top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 18

Updated: Mar 15

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 18 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 05/03/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 18 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

“ఒకే రోజు… ఒకే చోట… ఒకే వార్త… కానీ ఇద్దరి నోళ్లనుండి! ఈ ఆనందం ఎందుకు షాక్‌గా మారింది?”


పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక ఉదయరాగ ఉద్వేగాలు 18 వ భాగంలో తెలుస్తుంది.

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.


సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.


కమలవాణి డిప్యూటీ ఎమ్.డి.గా ఉన్న ఆఫీసులో ఇంద్ర కిరణ్‌కు ఉద్యోగం వస్తుంది. కష్టాల్లో ఉన్న శిష్యుడు రమణకు సహాయం చేయాలనుకుంటుంది శివగామి.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 18 చదవండి.


మంగళవారం. 

సోమశేఖరానికి వరుసగా ఫోన్లు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో మధులిక గ్రహించకపోలేదు. ఎక్కడి నుంచో ఆ మహారాణి ఫోను చేస్తుందని తనకు తెలియదా! ఈ సమయాన ఎందుకు ఫోను చేస్తుందో తనకు తెలియనిదా! ఆలయాలలో మంగళ తోరణాలతో సౌభాగ్యదాయిని శ్రావణ గౌరీవ్రతం జరుగుతోంది. అమ్మతల్లికి అర్చించి తమ మాంగల్య సౌభాగ్యాన్ని కాపాడమని, అమ్మలగన్న అమ్మ మంగళ గౌరిని గృహిణులు వేడుకుంటారు. పుస్తెల తాడుకి పసుపు కుంకుమ పూస్తారు.


“సర్వమంగళ మాంగళ్యే 

శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ 

నారాయణీ నమోస్తుతే“ 


అని మనసా వాచా పూజిస్తారు. భర్త ఆయుర్దాయాన్ని కాపాడమని వేడుకుంటారు. ఆమె అలా ఆలోచించుకుంటూ చీర మార్చుకుంటున్నప్పుడు, తల జుత్తు తుడుచుకుంటూ శేఖరం వచ్చాడు. వస్తూనే అడిగాడు, “ఏదో విషయం చెప్పాలన్నావుగా! అది ఇక్కడే ఇప్పుడే చెప్పవచ్చుగా—“


“లేదు. చాలా ముఖ్యమైన విషయం. శుభకరమైన తీర్థ స్థలంలోనే చెప్పాలి. ఏం— ఏమైనా అర్జంట్ పని తగిలిందా?”


“అబ్బే! మరీ పెద్ద పనేమీ లేదోయ్! తెలిసిన ఫ్రెండ్ ఒకరు పిలిస్తేనూ—“


‘నువ్వు చెప్పకపోయినా ఆ ఫ్రెండ్ ఎవరో నాకు తెలుసు లేవోయ్!’ అనాలని నాలిక చివరి వరకూ వచ్చి చటుక్కున ఆగిపోయింది. మంగళప్రదమైన రోజు- ఎందుకు శ్రీవారిని అలజడికి లోను చేయటమని ఊరుకుందామె. మరొకసారి ఆమె గొంతు వినిపించక ముందే సోమశేఖరం లాల్చీ, జుబ్బా వేసుకుని ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు- ఎలా ఉన్నానని అడుగుతూ—


“నా యవ్వనాన్ని కొల్లగొట్టి జీవితాంతమూ నన్ను ఆక్రమించుకున్న మన్మథుడిలా ఉన్నారు!” అంటూ ముంగాళ్లపైకి లేచి అతడి నుదుట ముద్దుపెట్టుకుంది.


ఇద్దరూ గుడి ఆవరణ చేరుకున్న తరువాత మధులిక అడిగింది- “ఎందుకు మీరింకా పాత మోడల్ కారునే వాడుతున్నారు. కొత్త మోడల్ కారుండగా ఆ పొదుపుతనం ఎందుకంట? కారు వాడుకోవచ్చుగా! అఫీషియల్లీ గాని, అన్ అఫీషియల్లీ గాని పరుల ఫోర్ వీలర్లలో వెళ్ళడం అంత బాగుండదు అండీ—” 


మధులిక మాటలోని భావాన్ని అతడు పసిగట్టాడు. తను అప్పుడప్పుడు కమలవాణితో కలిసి ఆమె కారులో వెళ్ళిరావడం మధులికకు తెలిసుంటుంది. 


“మరేం లేదోయ్! ఉదయం పూట రోడ్లన్నీ యమ రద్దీగా ఉంటాయి కదా! పాత బండిలో వెళితే మలుపులు తిరుగుతూ ఆఫీసుకి అడ్డ దారిన దూసుకుపోవచ్చు. కొత్తబండి నాన్నగారిది కదా- నొక్కులు పడుతుంది. రిపేరింగ్ కి ఖర్చవుతుంది.” 


ఆపైన ఆమె మాటలు కలపలేదు. కాళ్లూ, చేతులూ కడుక్కుని, నెత్తిపైన జలం చిలకరించుకుని, గర్భ గుడి ముందు దేవార్చన ముగించుకుని, ముమ్మార్లు ప్రదక్షిణ చేసి, ధ్వజస్తంభం వద్దకు వచ్చి నిల్చున్నారు. అప్పుడు భక్తజనం పల్చగా ఉన్నచోట మధులిక చేయి పట్టుకుని ఆపి “ఉఁ, ఇప్పుడు చెప్పవోయ్” అని అడిగాడు. 


తనకు దగ్గరగా ముందుకు వంగమని సైగ చేసిందామె. అతడు అలాగే ఆమెకు సమీపంగా వంగాడు. ఆమె సన్నగా తోటలోని గాలి తెరలా అంది- “నేను త్వరలో చిన్న సోమశేఖరానికి తల్లి కాబోతున్నాను.” 


ఆ మాటతో అతడు ఆనందంతో నిలువెల్లా పారవశ్యం చెందుతూ తనను దగ్గరకు తీసుకుంటాడనుకుంది. కానీ— అతడు స్టన్ అయిపోయినట్టు కనురెప్పల్లో కదలిక లేకుండా చూస్తూండిపోయాడు. 


“అదేమిటి అలా అయిపోయారు! మీ బిడ్డకు మీరు తండ్రవడం, మీ కుటుంబానికి వంశాంకురం రాబోవడం మీకు సంతోషం కలిగించడం లేదా!” 


గుడి గంటలు మ్రోగుతుండగా అతడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నిదానంగా అన్నాడు- “మేటర్ అది కాదు మధులికా! నా రూపం నీ కడుపున శోభిల్లడం నాకు సంతోషం కలిగించదా! నాకు షాక్ తగిలింది- అంతే—” 


ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది- “షాక్ తగిలిందా! ఎందుకూ?”


“మొన్నటి రోజు ఇదే వార్తను ఇదే చోట కమలవాణి చెప్పింది. నమ్మలేకపోతున్నాను.” 


మధులిక బరువుగా ఊపిరి పీలుస్తూ మౌనంగా ఉండిపోయింది. కమలవాణి తన జీవితంలోనే కాక- తనకు మాత్రమే స్వంతమైన ఆత్మానందంలో కూడా పాలు పంచుకోబోతున్నదన్నమాట! గెలుపు తలుపుల్ని పూర్తిగా తెరచుకోనివ్వకుండా లోలోన తనకు ఓటమి పొడసూపిందన్నమాట!


ఇద్దరూ ఇల్లు చేరిన తరువాత మధులిక గుడి ప్రసాదం నర్సమ్మకు, అత్తా మామలకు పంచిపెట్టి, మిగతాది ఇంద్ర కిరణ్‌కి ఇచ్చింది. నర్సమ్మ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటూ ఉమాదేవిని ఉద్దేశించి అంది- “ఏమిటమ్మా ఉమా— నీ కోడలు పిల్ల ఎంత కళగా వెలిగిపోతుందో గమనించావా!“


“అదే నాకు తెలియడం లేదత్తయ్యా! మధులికది కళైన ముఖమే-- కాని ఇంత కళగా వెలిగిపోతుండటం నేను ఎప్పుడూ చూడలేదు” 

అప్పుడు సదానందం అందుకున్నాడు- “ఉఁ, నేనూ గమనించానోయ్ - శేఖరం మధులికకు ఇష్టమైనదేదో ఆఫర్ చేసి ఉంటాడు. లేకపోతే అంతలా నీ కోడలు పిల్ల ముఖం వెలిగిపోదు.” 


వాళ్ళ వ్యాఖ్యానాలు వింటూ నిల్చున్న శేఖరం ఇక సస్పెన్స్‌కి తావివ్వకూడదని తలపోస్తూ దగ్గరకు వచ్చి రహస్యం విప్పాడు- “అసలు కారణం ఉంది బాబూ! అది చెప్పడానికే నన్ను గుడివరకు తీసుకెళ్ళింది మీ కోడలు పిల్ల. మీరిద్దరూ తాతా బామ్మలు కాబోతున్నారు. బామ్మ ముత్తవ్వ కాబోతుంది. ఇంద్రకిరణ్ చిన్నాయన కాబోతున్నాడు.” 


ఒక నిమిషం అందరూ ఊరకుండిపోయి, ఆ తరువాత అందరి ముఖాలూ నవ్వుల పువ్వులతో ఫెళ్ళున మెరిశాయి. కెరటం జల కిరీటమై ఆకాశం ఎత్తున ఎగిసినట్లనిపించింది. ఆ ఊపున ఇంద్రకిరణ్ ఒక్క ఉదుటున వచ్చి అన్నయ్యను కౌగలించుకున్నాడు –హుర్రే- అంటూ—


క్షణాలలో హాలంతా వసంత మండపంలా మారిపోయింది. పూలవనంలా పరిమళించింది. అంతవరకూ ఓ మూల ఇంటి సందడిని గమనిస్తూ నిల్చున్న కాంతమ్మ పరుగున వెళ్లి కావలసిన దినుసులు తీసుకువచ్చి వాటితో మధులికకు దిష్టి తీసి “ఎంతటి కమ్మటి కబురందించావు తల్లీ!” అంటూ నుదుట బొట్టు పెట్టింది. 


శేఖరం కాంతమ్మ చేతిలో ఐదు వందల నోటు పెట్టాడు. మధులిక అందరి వైపు నవ్వులు చిందిస్తూనే మనసు పొరన అబ్బురపడకుండా ఉండలేకపోయింది; అక్కడ మరొక వంశాంకురం వీళ్ళ కోసం పుట్టబోతుందని తెలిస్తే ఉన్నపాటున అందరి ముఖాలు ఎలా మారిపోతాయో!


ఆరోజు రాత్రి తోటలోకి వెళ్ళి కాసేపు గాలిలో కూర్చుని శేఖరంతో కలిసి వస్తున్నప్పుడు అనుకోకుండా నడవమ్మట నర్సమ్మ గొంతు వినిపించి ఇద్దరూ ఆగారు- “అమ్మవారి చల్లని చూపు మనింటి పైన బాగానే వాలిందిరా అబ్బాయీ! ఎక్కడ ఇక్కడ కాకుండా అక్కడెక్కడో దాని కడుపున మనింటి నలుసు కదలాడుతుందోనని భయపడ్డాననుకో!” 


ఆ మాట వింటూనే భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు సాగిపోయారు. కమలవాణి ఎంతటి సౌందర్యవతి అయినా, ఎంతటి పై అంతస్తుకి చెందినదైనా, ఇంట్లో పెద్దవాళ్ళెవరూ ఆమెను మానసికంగా రెండవ కోడలుగా స్వీకరించలేక పోతున్నారన్నది సోమశేఖరానికే కాదు; మధులికకు కూడా తెలుస్తూనే ఉంది. 


మరి, ఈ అంతర్గత మానసిక ఘర్షణ అనవరతం జ్వలిస్తూనే ఉండాలా! ఘర్షణాత్మక వాతావరణం ఇంటా బయటా చెలరేగుతూనే ఉండాలా! ఎప్పుడు చల్లారుతుందో ఈ నిప్పుకుంపటి!

-----

బ్యాంకింగ్ సర్వీసు పోటీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఎదురుచూసినట్లే శివగామి మంచి ర్యాంకుతో ఎంపికైంది. ఇక ఢిల్లీకి వెళ్లి ఇంటర్వ్యూకి హాజరయి రావలసిందే--ఆ తరువాత పోస్టింగు ఆర్డర్స్ వచ్చేస్తాయి. చాలామంది గుంపులు గుంపులుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె వద్ద కోచింగ్ తీసుకుని వివిధ రకాల ఉద్యోగాలలో స్థిరపడిన కొందరు పండ్లూ పూలతో వచ్చి ఆమెను మనసారా సత్కరించారు. 


ఆమె ఆడపడుచులిద్దరూ ఆమెను విడిచిపెట్టకుండా ఆమె సరసనే ఉంటున్నారు. ఆమెకు లభిస్తున్న సత్కారంలో ఆత్మీయానందం పంచుకుంటున్నారు. కలిసి కాఫీలు తాగుతూనే చంద్రిక ఏదో స్ఫురణకు వచ్చినట్లు అడిగింది- “ఏం వదినా! అన్నయ్యకు నీకొచ్చిన రిజల్టు గురించి తెలుసా” 


శివగామి తెలుసన్నట్టు తలూపింది. 


“మరి ఇక్కడ ఎక్కడా కనిపించడేం?” 


కంగ్రాట్స్ చెప్పి ఆఫీస్‌కి వెళ్లిపోయాడని చెప్పింది ఆమె. 


“ఈరోజు ఆఫీస్‌కి వెళ్లిపోయాడా! ఇంట్లో ఎంత గొప్ప విషయం జరిగింది! ఈరోజు ఇంట్లో ఉండకుండా కార్యాలయం వెళ్ళిపోతాడా! రానియ్యి. వాణ్ణి అడగకుండా విడిచిపెట్టను. ఎడాపెడా దులిపేస్తాను” అని మాధవి వైపు కనుబొమలెగరేసి చూసింది. 


అలాగే- అన్నట్టు మాధవి తలూపింది. అప్పుడు వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడానికన్నట్టు త్యాగరాజూ, పుష్పవల్లీ గది లోపలకు వచ్చి- “ఇదిగో—తీసుకో అమ్మా!” అని అందించారు. లేచి నిల్చుంటూ శివగామి అడిగింది- “అదేమిటని.” 


“కొత్త చీరమ్మా! కాంచీపురం నుంచి మీ అమ్మా నాన్నా నీ గురించి చెప్పి ఎంత మురిసిపోయారనుకున్నావు- నువ్వు సాధించిన విజయానికి గుర్తింపుగా దీనిని ఉంచుకోవమ్మా!”


“ప్లీజ్! ఇప్పుడు వద్దత్తయ్యా! మీ అబ్బాయి వచ్చిన తర్వాత తీసుకుంటాను.”


“అంటే—నీ భర్త చేతులతోనే తీసుకుంటావన్నమాట! మా చేతులతో తీసుకోవన్నమాట—“


“అబ్బే—అది కాదత్తయ్యా! ప్లీజ్—నన్ను అర్థం చేసుకోండత్తయ్యా!“ అని అభ్యర్థన పూర్వకంగా చెప్పి భార్యాభర్తలిద్దరి కాళ్ళకూ వంగి నమస్కరించింది. 


ఈసారి త్యాగరాజు కలుగచేసుకున్నాడు- “వాడు ప్రొద్దుటే అలా విసురుగా వెళ్తున్నప్పుడే అనుకున్నాను ఇక్కడేదో జరిగి ఉంటుందని—అంతే కదమ్మా!”


‘అటువంటిదేమీ లేదు మామగారూ! దయచేసి సాయంత్రం మీ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఏమీ అడక్కండి” 


“ఎందుకడక్కూడదూ! వాడి వద్ద నీకు జంకుగా ఉంటుందేమో గాని—మాకు ఆ అవసరం లేదమ్మా!“


“విషయం అది కాదు అంకుల్—సాయంత్రం నేను ఆయనతో బయటకు వెళ్ళాలి. మూడ్ పాడైతే మీ అబ్బాయి రావడానికి ఇష్టపడరు” 


ఆ మాటతో వాళ్ళు ఇక అక్కడ నిల్చోకుండా హాలు వైపు వెళ్ళిపోయారు. ఆడపడుచులిద్దరూ కిసుక్కున నవ్వేశారు.

===============================================

                                                ఇంకా వుంది

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page