ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట
- Pandranki Subramani

- 12 hours ago
- 2 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

త్వరలో ప్రారంభం ఉదయరాగ ఉద్వేగాలు కాబోతున్న ధారావాహిక పరిచయం
Udayaraga Udvegalu - New Telugu Web Series Introduction Written By - Pandranki Subramani
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట - తెలుగు ధారావాహిక - కథాపరిచయం
రచన : పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
ఈ నవలా రచనను సూటిగా సాఫీగా మూడు కుటుంబాలుగా మూడు వేర్వేరు భాగాలుగా విభజించవచ్చు. ఐతే— ఈ మూడు కుటుంబాల మధ్యా అంతర్లీనమైన సంబంధాలుంటాయి. వీటిని ఈ విధంగా వివరించాను.
1). సదానందం— బాధ్యత గల కుటుంబ పెద్ద. తల్లి పేరు-నర్సమ్మ-భార్యపేరు-ఉమాదేవి. పెద్ద కొడుకు-సోమశేఖరం-చిన్న కొడుకు ఇంద్రకిరణ్-సోమశేఖరం భార్య-కోడలు-మధులిక—సౌమ్యురాలు సాత్వికురాలు. సోమశేఖరానికి అనుకూలవతి ఐన సతీమణి. అన్ని విషయాలలోనూ అత్తామామలకు అందుబాటులో ఉండే కోడలు.
2)త్యాగరాజు-సదానందానికి తమ్ముడు. నర్సమ్మ చిన్నకొడుకు.
భార్య-పుష్పవల్లి-కొడుకు-మధుమురళి-కూతురు-మాధవి.
ఒకసారి కాంచీపురంలో జరుగుతూన్న తన సహోద్యోగీ మిత్రుడూ ఐన దీనదయాళన్ కడపటి కూతురు శివగామి వివాహానికి అనారోగ్య కారణంగా భార్య పుష్పవల్లి- అకాడమిక్ పరీక్షల రీత్యా కూతురు-మాధవి త్యాగరాజుతో కాంచీపురం వెళ్ళలేకపోతారు. అప్పుడు క్లాస్ ఒన్ పోస్టుకి సెలక్టయిన మధుమురళి ఢిల్లీలో ముఖ్యమైన ట్రైనింగ్ కోర్సులో లీనమయి ఉంటాడు. దీనదయాళన్ మిత్రుడైన త్యాగరాజు ఎలాగో ఒకలా మూడురోజుల స్పెషల్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ తీసుకుని ఖర్చు ముఖం చూడకుండా కాంచీపురం రమ్మని కొడుకుని ఆదేశిస్తాడు. ట్రైనింగ్ సెషన్స్ నుండి రావడం ఇక్కట్టైన పరిస్తితి ఐనా తండ్రికీ దీనదయాళన్ గారితో ఉన్న క్లోజ్ నెస్ యెరిగిన మధు మురళి తండ్రి ఆదేశాను సారం-ఫ్లయిట్ లో చెన్నై చేరుకుని అక్కణ్ణించి కాంచీపురం చేరుకుంటాడు.
ఇక్కడే అతడు యేమాత్రమూ యెదురు చూడని మలుపు గిరికీలు తిప్పుతూ ఢీకొడ్తుంది. పెండ్లి పీటల పైన కూర్చోవలసిన పెళ్ళి కొడుకు చెప్పాచెయ్యకుండా తన ప్రియురాలితో ఊరువిడిచి ఉడాయిస్తాడు. అప్పుడు కాంచీపురంలో పరపతి గల దీనదయాళన్ కుటుంబం తీవ్ర సంక్షోభానికి లోనవుతుంది. అటువంటి ఇక్కట్టైన పరిస్థితిలో తండ్రి పోద్బలంతో తమిళం యేమాత్రమూ తెలియని మధు మురళి తమిళమ్మాయైన శివగామి మెడన పుస్తె కడ్తాడు. ఈ చర్య ఇరు కుటుంబాలలోనూ తీవ్ర అశాంతి కలుగ చేస్తుంది.
ముఖ్యకారణం-మాధవపురలో ఉంటూన్న సదానందం- తల్లి నర్సమ్మ అతడి భార్య ఉమాదేవి మధుమురళి కోసం అప్పటికే పెళ్ళి సంబంధాలు వెతకడంలో ముమ్మరంగా ఉంటారు, కాంచీపురంలో మధుమురళి వ్యవహారం వాళ్ళకు పిడుగుపాటుగా యెదురవుతూంది. తమిళమే తెలియని కుటుంబానికి ఎక్కడో కాంచీపురం నుండి ఒక్క తమిళమ్మాయిని కోడలు పిల్లగా తీసుకురావడం తీవ్ర పరిస్థితిని సృశ్టిస్తుంది.
3)దీనదయాళన్-ఇతడు త్యాగరాజుకి సహోద్యోగి. స్నేహితుడు. సంస్కారవంతడు. ఇతడి భార్య-ధనమ్మాళ్. ముగ్గురు కూతుళ్లు—వేదనాయగి-షన్బుగ వల్లి-చిన్న కూతురు శివగామి. వీళ్ళది కాంచీపురానికి చెందిన తమిళ కుటుంబం, ఇతడి చిన్నకూతుర్నే త్యాగరాజు కొడుకు మధుమురళి కొన్ని అనివార్య కారణాల వలని చేసుకుంటాడు
ఇదేవిధంగా సత్యానందం కుటుంబంలో కూడా మరొక విధమైన భావోద్వేగ పూరితమైన సంక్షోభం యెదురవు తుంది. అతని పెద్ద కొడుకు సోమశేఖరానికి మధులికతో బాటు మరొక భార్య ఉందని తెలుసుకుని తీవ్ర వేదనకి గురవుతాడు. అదెలాగంటే—కాలేజీ ముగించి ఉద్యోగంలో చేరిన యవ్వనపు రోజుల్లో పెద్దింటి అమ్మాయి- తన ప్రియారాలైన కమలవాణికి కొన్ని భావోద్వేగ పూరిత పరిస్థితిలో అతడు మాటా మాటా వచ్చి కమలవాణి మెడన గర్భగుడి ముందు పసుపు తాడు కడ్తాడు సోమశేకరం. ఐతే—అలా జరిగిన కొన్నిరోజూలకు మెడికో ఐన కమలవాణి మెడికల్ సేవలందించటానికి ఓ గ్రామం వెళ్ళిన కమలవాణి కనిపించకుండా పోతుంది. ఎంత వెతికినా సోమశేఖరానికి ప్రియురాలి ఆచూకీ తెలియకుండా పోతుంది, అప్పుడే అతడు తల్లిదండ్రుల పోద్బలం వల్ల దిక్కుతోచని పరిస్థితిలో మధులికను చేసుకుంటాడు. అతడు కుటుంబస్థుడైన కొన్నాళ్ళకు కమలవాణి అనుకోని రీతిలో ఎదురు చూడని పరిస్థితిలో అతడికి యెదురవుతుంది. ఆ తరవాత అన్నయ్య ప్రవర్తనలో మార్పు గమనించిన తమ్ముడు ఇంద్రకిరణ్ సోమశేఖరమూ కమలవాణీ కలుసుకున్న వైనాన్ని ముబైల్ లో పోటో తీసి ఇంట్లో అమ్మానాన్నల ముందుంచుతాడు. సోమశేకరం కాదనలేని పరిస్థితిలో ఒప్పుకుంటాడు-ఔను-కమల వాణి తన భార్యేనని. ఇంట్లోవాళ్ళందరూ అతడిపైన మండిపడతారు ఒకరు తప్ప-అతడి సతీమణి మధులిక తప్ప—అప్పుడు నిదానపరు రాలు సాత్వికురాలూ ఐన మధులిక ఇలా అంటుంది-తన భర్త అటువంటి తరహామనిషి కాడని—ఎక్కడో ఎందుకో యేదో కిరికిరిలో చిక్కుకుని ఉంటాడని. అతడలా చేయడానికి ఏదో కారణం ఉంటుందని చెప్తుంది.
ఇలా రచనా గమ్యం పలు కోణాలతో పలు మలుపులతో నవల ముందుకు సాగుతూంది
కథకుడిగా నామనోభావం—అంతటా కాకపోయినా, అన్నిటా కాకపోయినా-మానవ జీవితం చాలావరకు ఉద్వేగ భరితమై సాగుతుంటుంది. కొన్ని ఉదాత్తమైన భావోద్వేగాలు మనిషిని గగనం యెత్తుకి చేర్చుతాయి.. మరి కొన్ని పతనావస్థకి తోస్తాయి. అంతే తేడా—
ఇట్లు
రచయిత పాండ్రంకి సుబ్రమణి




Comments