top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 17 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 24/02/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.


సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.


కమలవాణి డిప్యూటీ ఎమ్.డి.గా ఉన్న ఆఫీసులో ఇంద్ర కిరణ్‌కు ఉద్యోగం వస్తుంది. కమలవాణి మంచి ప్రతిభావంతురాలని ఇంట్లో చెబుతాడు ఇంద్రకిరణ్.


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 17 చదవండి.

రాత్రి ఏడున్నర అవుతోంది. మధులిక చీర మార్చుకుని, నగలు వేసుకుని మెట్లు దిగింది. ఆమె వెనుకే సోమశేఖరం కూడా దిగాడు. నర్సమ్మ నోరు తెరవకుండానే మనవణ్ణి ఎగాదిగా చూసింది, 'ఎక్కడికన్నట్టు?' "మధులికకు అలా బయటకు వెళ్ళి రావాలనిపిస్తుందట. చాలా రోజులయ్యిందని రెస్టారెంట్‌లో తినాలనిపిస్తుందట. అందుకని..."


"వెళ్ళిరండి, వెళ్ళిరండి. జాలీగా వెళ్ళిరండి. కానీ నీకొక మాట చెప్పాలని మనసు రెపరెపలాడుతుందిరా! సమయానికి నువ్వే వచ్చావు," 


"చెప్పు బామ్మా," అంటూ దగ్గరకు వచ్చాడు శేఖరం. 


"ఊళ్ళో మా తండ్రిగారిది—అంటే మీ ముత్తాతగారిది పెద్ద హోదా గల కొలువు. కానీ— విషయం అది కాదు. తెలిసినవారు ఒకరికొకరు ఎప్పుడు ఎదురైనా— 'మీకెన్ని ఎకరాల భూమి? దానిపై సాలీనా రాబడి ఎంత?' అని అడగరు. వాడలోని వీధిలో, పొలం గట్టున ఎన్ని ఇళ్ళు ఉన్నాయని కూడా అడగరు. ఎదురొచ్చిన వారిని ఒకటే ఒకటి అడిగేవారు. అమ్మా మధులికా! అదేమిటో ఊహించి చెప్పగలవా?" అని అడిగిందామె. 


చిరునవ్వు చిందిస్తూనే చెప్పలేనట్టు తల అడ్డంగా ఆడించింది మధులిక. 


అప్పుడక్కడకు ఇంద్రకిరణ్ వచ్చి పురికొసను అందుకోబోయాడు. "నేను చెప్తాను బామ్మా! కొత్త మామిడి కాయ పూతతో కొత్త ఊరగాయ ఊరబెట్టారా అని." 


నర్సమ్మ చిన్న మనవడి వైపు ముఖం చిట్లించి చూసింది. "నువ్వూరుకోరా కొంటె వెధవా!" అని ఇటు తిరిగింది. "మీరు చెప్పలేరని నాకు తెలుసు. మీదంతా గుర్రపు డెక్కల పరుగేగా! ఇప్పుడు వినండి. 'మీకు పిల్లలు ఎంతమంది?' అని చూసీ చూడటంతో అడిగేవారు. అందుకే అప్పటి రోజుల్లో కొందరు అమ్మాయిలకు 'సంతాన లక్ష్మి' అని పేరు పెట్టుకునేవారు. ఇక ఆఖరి పాయింటుకి వచ్చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు మీకా అవసరం లేకపోవచ్చు. కానీ మాకు వయసు పైబడుతుందిగా! మునిమనవణ్ణి ఎత్తుకోవాలన్న ఆశ ఉంటుందిగా! ఇది గుర్తుంచుకునేగా మీరు మెసలాలి. ఇక మీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని రెస్టారెంట్కి వెళ్ళవచ్చు." 


సోమశేఖరం నవ్వుకుంటూ మధులిక చేయి అందుకుని బయటకు నడిచాడు. నడచి వెళ్తున్న శేఖరాన్ని చూస్తూ నర్సమ్మ మనసున అబ్బురపడకుండా ఉండలేకపోయింది. నిజంగా వీడు ఒక్కదాని చేయి మాత్రమే పట్టుకుని జీవనం సాగిస్తున్నాడా? ఊఁహుం! తనకా నమ్మకం లేదు. ఈ రోజు మధులిక, మరుసటి రోజు కమలవాణి. ఎన్నాళ్ళు సాగుతుందీ తతంగం? రెండు పడవల ఏటి ప్రయాణంలా, ఇలా సాగుతూ పోతే, తమ ఇంటికి వారసుడెప్పుడు ఏతెంచుతాడు? ఇంటిని ఎప్పుడు పావనం చేస్తాడు? లేక, చిట్టచివరన రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతాడా?-----


శనివారం. పత్రిక చూస్తూ వరండాలో కూర్చున్న మధుమురళికి టీ కప్పు ఇస్తూ శివగామి తనతో అలా బయటకు రమ్మనమని పిలిచింది.

"ఎందుకూ?" అని అడిగాడు మురళి. 

"ఏం— చెప్తే గాని రారా! మీ కాంచీపురం అత్తామామలపైకి గురిపెట్టినట్లు నిందారోపణల మిస్సైల్‌ని నా పైన విసరకండి. ఇందులో నేను నిమిత్త మాత్రురాలినే—"


"నో నో! అదెప్పుడో మరచిపోయాను. నువ్విచ్చిన వివరణ విని— మీ కాంచీపురం వాళ్ళు 'సింగినాదం జీలకర్ర' బాగానే పాటిస్తారని నాకెప్పుడో తేటతెల్లమైందిగా! ఇకపైన రియాక్ట్ అవడానికేముంది? మౌనమునిలా ఉండటం తప్ప? బై ది బై— ముఖం అదోలా పెట్టకు. షర్ట్ మార్చుకుని వస్తున్నాను" అని లేచి దుస్తులు మార్చుకుని వచ్చాడు మధుమురళి. 


అప్పుడే పెరడు తోట నుండి వచ్చిన మాధవి— "ఎక్కడికిరా అన్నయ్యా! నేనూ వస్తాను" అని అడిగింది. 


సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చిన పుష్పవల్లి కూతురికి కళ్ళతో సైగ చేసింది, మొగుడూ పెళ్ళాల మధ్యకు వెళ్ళకన్నట్టు. అది గమనించిన మాధవి వెంటనే మాట మార్చి తనకేదో ముఖ్యమైన పనుందంటూ పెరడు వైపు జారుకుంది. మురళీ, శివగామి నవ్వుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. కాసేపు నడిచిన తరువాత అడిగాడు మధు మురళి— "ఇప్పుడు చెప్పు ఎక్కడికని—"


"చెప్తే గాని మీరు విడిచిపెట్టేట్లు లేరు. రమణ ఇంటికి వెళ్తున్నాం. కారణం కూడా చెప్తాను. మంచి కుర్రాడు. ఎక్కడో భూమి సడలి వాళ్ళ ఇంటి గోడ కూలిపోయింది. కోచింగ్ క్లాసుకి రావడం ఆపుచేసేసాడు." 


రమణ పేరు విన్నంతనే మురళి ఆగిపోయాడు. "వాడికి ఇంట్లో కూడా మంచి పేరుంది కదూ— చెప్పిన పని కాదనకుండా చకచకా చేసిపెడ్తాడని. మొన్న ఏదో మంచి రోజు మంగళ స్నానం చేయడానికి కుంకుడు కాయలు లేకపోతే, అవి ఇక్కడి అంగట్లో కూడా లేకపోతే వాడు పరుగున వేరే వాడకు వెళ్ళి తీసుకువచ్చి మిమ్మల్ని గట్టు చేర్చాడు. వాడేనా?" 


నవ్వుతూ తలూపింది. 


మురళి విషయానికి వస్తూ అడిగాడు— "ఇప్పుడు వర్షాలు కూడా లేవే— గోడ ఎలా కూలిపోయిందంటావు?"


"కారణం చెప్తే విస్మయంగానే ఉంటుంది. కొన్ని రోజులుగా వాళ్ళింటి చుట్టుపక్కల భూమి అట్టడుగు నుండి వింత వింత శబ్దాలు వస్తున్నాయట. ఇంటి గోడ కూలిపోవడానికి భూమి లోపలనుండి వస్తున్న ఆ వింత శబ్దాలే కారణమని కచ్చితంగా చెప్పలేం గానీ— మొత్తానికి రెండు మూడు ఇళ్ళు ఒరిగిపోయాయి. రెవెన్యూ అధికారులు వచ్చి ఆదుకుంటామని చెప్పి వెళ్ళారట. ఏదో ఒక విధంగా ఆ కుర్రాడికి సహాయం చేయడానికి మనం వెళ్తున్నాం. 


కుటుంబంలో వాడితో చేరి మొత్తం ఐదుగురు. ఇద్దరు మగ కుర్రాళ్ళు - ముగ్గురు ఆడపిల్లలు. పెద్దోడు ఏదో కిరాణా షాపులో పని చేస్తున్నట్టున్నాడు. రమణ ఒక్కడే స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. నా వద్ద కోచింగ్ తీసుకుంటూ క్వాలిఫైయింగ్ రిటన్ టెస్టు వ్రాసి ఇంటర్వ్యూకి హాజరవడానికి పొరుగూరులో ఉన్న కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లులో స్టైపెండరీ ట్రైనింగ్ పోస్టు కోసం గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఎదురు చూడని విధంగా ఇప్పుడిలా జరిగిపోయింది." 


వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ రమణ వాళ్ళ ఇంటి ముందు ఆగారు. శివగామిని చూసి అందరూ లేచి వచ్చి నమస్కరించారు. రమణ తల్లిదండ్రులను మర్యాద పూర్వకంగా పరామర్శించిన తరువాత ఇద్దరూ తెలుసుకున్న వైనం— కూతుళ్ళు ముగ్గురూ ఇప్పుడు ఎవరో బంధువులింట్లో ఉన్నారని— ఇంటి మరమ్మతులు పూర్తి అయ్యేంతవరకూ అక్కడే ఉంటారని— కాసేపు మౌనంగా వింటూ నిల్చున్న మధుమురళి శివగామిని ఉద్దేశించి అడిగాడు— "ఇప్పుడీ కుర్రాడి కోసం ఏం చేయదలిచావు శివగామి?"


"ఏం చేయాలన్నా మీరు తలచుకుంటేనే  వీలవుతుంది. 'బ్రోచుటకిది సమయము కాదా' అన్న కీర్తన జ్ఞాపకం తెచ్చుకోండి," అని మెరిసే కళ్ళతో అంది.


అతడు అయోమయంగా చూస్తూ అడిగాడు— "ఏం చేయాలో చెప్పు."


"మీరు గానీ అత్తయ్యకూ, మామగారికీ నచ్చచెప్తే రమణ మనింట్లో పదిహేను రోజులుండగలడు. మిల్లులో ఇంటర్వ్యూ అయిపోగానే—" అని ఆగిపోయింది శివగామి. 


కాసేపు నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉండిపోయిన తరువాత మురళి అన్నాడు— "అలాగే— రమణను బట్టలూ, పుస్తకాలూ సర్దుకోమను. ఇంట్లో ఉగ్రాణం ప్రక్క గదిలో ఉంటాడు. నేను రిక్షా తీసుకు వస్తాను," అంటూ రోడ్డుపైకి వెళ్ళాడు. 


రమణ ముఖం ఫెళ్ళున మెరిసింది. శివగామి వైపు తిరుగుతూ చేతులు జోడించాడు— "థాంక్స్ మేడమ్" అంటూ—


ఇంటి గుమ్మం వద్ద నిల్చున్న రమణను చూసి పుష్పవల్లి కొడుకు వైపు తిరిగి అడిగింది— "వేళకాని వేళ ఆ కుర్రాణ్ణి పిలిచి పాఠాలు చెప్పడమేమిట్రా?" తల్లి లేవదీసిన ప్రశ్నకు రమణ వాళ్ళింట్లో జరిగిందంతా వివరించి చెప్పాడు మురళి. 


"మరి మీ బాబుకి చెప్పావట్రా!" 


అప్పుడతడు తల్లి భుజంపైన చేతులుంచి— "అదంతా నేను బాబుకి వివరించి చెప్తాలే! ఈ అబ్బాయి తప్పని పరిస్థితిలో మనింట్లో పదిహేను రోజులుంటాడు. మిల్లులో ట్రైనీగా చేరడానికి ఏదో క్వాలిఫైయింగ్ పోటీ పరీక్ష వ్రాయాలట. అతడిక మునుపులా ఇంటి పనులు చేయడు. మూడు పూటలా భోజనం మనింట్లోనే చేస్తాడు. ఇక్కడే చదువుకుంటాడు. సరేనా!"


"ఇదంతా శివగామి ఏర్పాటన్నమాట! ఈ అబ్బాయి వ్యవహారంతో దీనిని ఆఖరు విషయంగా సరిపుచ్చితే మంచిది రోయ్— ధర్మానికి కోచింగ్ క్లాసులు తీసుకోవడంతోబాటు ఇదొక్కటీనా! అయినా— నీ కాంచీపురం సతీమణికి వేగమూ, ఉద్వేగమూ కాస్తంత ఎక్కువే రా!" 


ఆ మాటతో లోపలకు వెళ్తున్నవాడల్లా ఆగి తిరిగి చూసాడు మురళి, 'ఏమిటన్నట్టు?' 


"మనింటి పెరడు తోటను శివగామి బాగానే ఏపుగా పెంచింది— ఏవేవో భూసార పరీక్షలు ముమ్మరంగా చేసి. మనం దైవ వృక్షంగా చూసుకునే ఉసిరి కొమ్మను నాటింది. నీలాల మామిడి చెట్టుని కూడా తెచ్చి నాటింది. ఇంకా చాలా మొక్కల్నే నాటింది, అగ్రికల్చర్ డిపార్టుమెంటుకి చెందిన ఆ నిర్మలాదేవి సహాయంతో— ఇప్పుడేమో వాటితో సరిపుచ్చుకోకుండా మరొకటి నాటి పెంచుతానంటుంది. అదేమిటో తెలుసా! బ్రహ్మ కమలాల మొక్కలను తెచ్చి నాటుతానంటుంది." 


అప్పుడతను శివగామి వైపు ఆశ్చర్యంగా చూసాడు— "అలాగా శివగామీ! అవి హిమాలయ పర్వత ప్రాంతాలకు చెందిన మొక్కలు— చాలా పవిత్రంగా చూసుకునే మొక్క. ఉత్తరాంచల్-జార్ఖండ్ వంటి చలి ప్రాంతాలలో పెరిగే మొక్కలు. నేను విన్నకాడికి, జార్ఖండ్‌లో విస్తారమైన ఒక బ్రహ్మ కమలాల తోటే ఉందట. అటువంటిది మన ప్రాంతానికి ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సాధ్యమా! ఎందుకింత అంబీషియస్‌గా ఉన్నావు?" 


ఈసారి పుష్పవల్లి కొడుకుని తన వైపు తిప్పుకుంది— "దీనికే ఇంతలావు గింగిర్లెత్తి పోతున్నావు— మరొకటి కూడా చెప్పనా!" 


"ఊఁ" అన్నాడతను.


"ఎవరో ఎక్కడో ఫామ్‌హౌస్‌లో పెంచనారంభించారంట— ఇక్కడ మన పెరడు తోటలో కూడా రుద్రాక్ష వృక్షాన్ని పెంచుతానంటుంది నీ ప్రియ సతీమణి. దానికి నా సహాయం— నీ ఇద్దరి చెల్లెళ్ళ సహాయమూ కావాలంటుంది. ఏమంటావు?" 


శివగామి వైపు మరింత ఆశ్చర్యంగా చూసాడు మధుమురళి— "మన ప్రాంతాలలో ఇంగువ మొక్క కూడా పెరగడం లేదు. తెలుసా! ఇరాన్-ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలలోని మంచు మైదానాలలో మాత్రమే ఆ మొక్కలు పుష్పిస్తాయి. అటువంటిటప్పుడు నేపాల్ వంటి ప్రాంతాలలో పెరిగే రుద్రాక్ష వృక్షాన్ని రామకృష్ణాపురంలో పెంచుతావా! నిజానికి మన వాళ్ళకు చాలామందికి రుద్రాక్షలు ఎలా తయారవుతాయో తెలియదు. వాటి అసలు రూపం పండ్లని, నీలంగా ఉంటాయని— బాగా ఎండారబెట్టాక పైన పెచ్చు తీసిన తరువాతనే మనముందు రుద్రాక్షలుగా మారుతాయని— కాబట్టి—" 


అప్పుడు శివగామి పెదవి తట్టున విప్పింది. "మీరందరూ మరీ కంగారు పడిపోతున్నారు గానీ— దైవ వృక్షాలని మన స్వంత తోటలో మనకు అనుకూలమైన రీతిలో పెంచుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదండీ! అయినా— ఇదంతా నేనుగా చేయను కదండీ— వ్యవసాయ నిపుణురాలు నిర్మలాదేవిగారు ట్రయల్ బేసిస్‌లో వత్తాసుగా నిలుస్తారు కదండీ!"


"మొత్తానికి నీది 'మాసివ్ అంబిషన్' శివగామీ! ఇకపోతే— ఇవన్నీ చేసుకుంటూ పోతే పోటీ పరీక్షలకు ఎవరు చదువుతారు? ఇకపోతే బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పరీక్షలు నువ్వనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలతో బాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన పాయింటు మరొకటి ఉంది. ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్‌లో నెగెటివ్ మార్కులు విధించే ప్రసక్తి కూడా ఉంటుంది. ఇక నీ విషయానికి వస్తాను. అట్టడుగున ఉన్న కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు చేయూత నివ్వాలనుకోవడం మంచి లక్షణమే— కాదనను. మరి నీ పోటీ పరీక్షలకు ఎప్పుడు తయారవుతావు! 'ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది' నీకు తెలవదా!"


"మీరు నా గురించి వర్రీ అవకండి. నేను ఎప్పుడో ప్రారంభించేశాను. రోజు తప్పి రోజు సిటీ లైబ్రరీకి వెళ్ళొస్తున్నాను. పాత పరీక్షా పత్రాలతోబాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను నోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనింటికి ఒకటి కాదు, రెండు ఆంగ్ల దినపత్రికలు వస్తున్నాయి. ఇంకా మీకు అనుమానమా!" 


అతడేమీ అనలేదు. శివగామి ముఖంలోకి తేరిపార చూసాడు. ఆమె తేరుకుంటూ అతణ్ణి దూరంగా నెట్టుకుంటూ వెళ్ళి— "ఉష్! అంతలావు చూపులతో నా వైపు చూడకండి. ప్రక్క అత్తయ్య ఉన్నారు." 


అదే హస్కీ వాయిస్‌తో అడిగాడు— "ఏం చూస్తున్నానంటావు?" 


"నాకు తెలుసు మీరు ఏటువైపు గ్రుచ్చి చూస్తున్నారో!"


 "నువ్వూ, మీ కాంచిపురం వాళ్ళూ 'సింగినాదం జీలకర్ర' పాటిస్తూ అసలు నన్నెక్కడ సరిగ్గా చూడనిచ్చారు గనుక— ఊరించడం తప్ప—" 


వాళ్ళిద్దరి నిశ్శబ్ద నిశ్వాసాలు విన్న పుష్పవల్లి అడిగింది— "ఏమిట్రా ఆ గుసగుసలు? నా ముందు అందరికీ వినిపించేలా మాట్లాడవచ్చుగా!"


"మరేం లేదమ్మా! నీ కోడలు పిల్లను కంట్రోల్‌లో ఉండమని హెచ్చరిస్తున్నాను. అంతటి అంబిషన్ పనికిరాదంటున్నాను. బయటి పనులతోబాటు ఇంటి పనులు కూడా చేస్తుండమని. నీకు చేదోడుగా ఉండమంటున్నాను. అంతే!" అంటూ కదిలాడు మధుమురళి. 


'అంతే' అన్నట్టు తలూపింది శివగామి సిగ్గు దొంతర్లను దాచుకుంటూ— మోహం! మోహంలో తీరని దాహం— తెలిసి తెలియని సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. దాని వెనుక ఉన్న రంగుల తెరను చూడగలగడం అందరికీ సాధ్యం కాదు కదా!

===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 18 త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page