top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12

Updated: 7 days ago

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 12 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 26/01/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.


సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది. అత్తగారి ఇంట్లో అందరూ తనని అభిమానిస్తున్నట్లు గ్రహిస్తుంది.


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 12 చదవండి.


ఆరోజు మధుమురళి టూరు ముగించుకుని ఇంటికి రావడం, సరోజమ్మ కూడా అదే సమయాన చెల్లిని చూసి రావడానికి ఇంటి మెట్లు ఎక్కడం ఒకేసారి జరిగింది. పెద్దమ్మను చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్లాడు - “ఎలాగున్నావు పెద్దమ్మా? మందులూ మాత్రలూ టైముకు మరచిపోకుండా తీసుకుంటున్నావా! అన్ని మందులూ ఒకేలా తీసుకోకూడదు. కొన్ని పడగడుపున - ఇంకొన్ని భోజనం తరవాత - గుర్తుంది కదూ!”


“ ఆ సోదె తరవాత చెప్తావు గాని - మొదట దీనికి బదులివ్వరా! నీకు కాంచిపురంలో పెళ్లై ఇన్నాళ్లవుతుంది కదా! నీ కొత్త పెళ్లానికి ఎప్పుడైనా మూరడు పువ్వులు కొనిచ్చావురా?” ఎదురు చూడని ఆ ప్రశ్నకు తెల్లబోయాడతడు - “ఏ పువ్వులు?”


“చదువుకున్న కుర్రాడు వేయవలసిన ప్రశ్నరా ఇది! పువ్వులంటే పువ్వులే - శివగామికి నువ్వు ఎప్పుడైనా కొనిచ్చావా?”


“నేను కొనివ్వడం దేనికి పెద్దమ్మా! పెరడు తోటలో చాలా రకాల పువ్వులున్నాయిగా! వాటిని తెంపుకుని కొప్పులో పెట్టుకోవచ్చుగా - అయినా ఈ పువ్వుల గొడవ నీకెందుకు పెద్దమ్మా -“


“కారణం ఉందిరా! కారణం లేకుండానే పనిలేని పాలేరమ్మలా అడుగుతానా? మొన్నొకరోజు నేనిటువైపు వచ్చినప్పుడు అనుకోకుండా నీ పెళ్ళాం పాడుతున్న తమిళ పాట విన్నాను. అప్పుడు మాధవిని అడిగాను అదేం పాటని - “అప్పుడు మాధవి


చప్పున వాళ్ళ మధ్యకు వచ్చి బామ్మకు అడ్డుగా వచ్చి అంది. “నేను చెప్తాను పెద్దమ్మా! ‘మామా ఒరునాళ్ మల్లిగై పూ కొడుత్తా నా!’ అని నాయకి సంతోషంతో చెప్పుకుంటుందన్నమాట“ ఇక చాలు చెప్పడం ఆపమని సంకేతం ఇస్తూ మురళి వైపు తిరిగి అందామె “విన్నావు కదూ!” మురళి నవ్వలేక నవ్వుతూ అన్నాడు. “అర్థమైంది పెద్దమ్మా! అయినా ఇది ఎక్కడి డిమాండ్? తోటలో ఇన్ని పూమొక్కలుండగా నేను పనీపాటూ మానుకుని అంగడికి వెళ్ళి పువ్వులు తేవడమా! తోటలో మొలవని పూలకోసం మాధవికి చెప్తే అదే పరుగున వెళ్ళి తెచ్చివ్వదూ -“


“నీ తెలివి తెల్లారిపోనూ! నాకు కావలసిన బదులిది కాదు. స్నానం చేసి అలుపూ సలుపూ అనకుండా శివగామిని గుడికి తీసుకువెళ్ళి గుడి ముందున్న అంగడి వద్ద మల్లెపువ్వులు కొనివ్వు. పిసినారితనం చూపించకుండా మూరడంటే మూరడే కాదు” అతడికి ఏమీ అనలేదు. ఉన్నపళంగా గది గుమ్మం వైపు చూసాడు. శివగామి చిలిపితనం ఉట్టిపడేలా ముసిముసిగా నవ్వుతూంది. ఇంట్లోని పెద్దవాళ్ళకు తన అవస్థ తెలియనట్లుంది. ఘుమఘుమలాడే మల్లెపువ్వులంటే కోరికలు రేపే సన్నటి నిప్పు జ్వాలలేగా! విషయ వాంఛ తెలిసిన సొగసుల సరసురాలైన శివగామి మల్లెపూలు సాదా సీదాగా కొప్పులో తురుము


కుంటుందా - లేదు. కనుసన్నల్లోంచి కోరికల చిద్విలాసాలను పదును పెట్టిన బాణాల్లా విసురుతుంది. తను తట్టుకోగలడా! కాంచిపురం నుండి బస్సులో శివగామితో కలసి వచ్చినప్పుడు తను అనుభవించిన విరహ వేదన కొంచెమా నంచమా! ఇటు తన తండ్రి త్యాగరాజు గారు - అటు మామగారు దీనదయాళన్ గారు ఆదిలోనే ఆంక్ష విధించే ఉన్నారుగా, కాంచీపురం ప్రౌఢ స్త్రీలు శుభముహూర్తమూ పుణ్యకాలమూ స్వయంగా చూసి రామకృష్ణాపురం ఏతెంచి శాంతి ముహూర్తం జరిపిస్తారని - అలా జరిగే లోపల ఎందుకు ఇంటి పెద్దలు - మత్తు గొలిపే అగరుబత్తి నైవేద్యాలతో తనను ఉక్కిరి బిక్కిరి చేయడం - మల్లెపూలంటే వాంఛల తరంగాలు రేపే మోహపు గుసగుసలేగా!


మధుమురళి స్నానం చేసి మాధవి అందించిన కప్పు కాఫీ తీసుకుని ఎదురుగా నిల్చున్న శివగామి వైపు తలెత్తి చూసాడు. ఎర్రటి జరీ అంచు చీర. బుగ్గన చేర్చుక్క - నుదుట కుంకుమబొట్టుతో గ్రీకు పురాణాల్లోని శృంగార కన్యలా ఉంది. ఎందుకీమె అంత పసందుగా నిండుగా ముస్తాబై వచ్చిందో! కరిగిపోతున్న వెన్నెలను నిట్టూర్పుల నిశ్వాసాలతో చూడటం తప్ప ఇద్దరికీ ఒరిగేదేముందని. మాధవిని తమతో వెళ్ళొద్దన్నట్టు తల్లి తల అడ్డంగా ఆడిస్తూ సైగ చేయడం అతడు గమనించక పోలేదు.


ఇద్దరూ ఇంట్లోని పెద్దలందరికీ ఓ మాట చెప్పి రోడ్డుపైకి వచ్చారు. ఇరుగు పొరుగు గృహిణులు ఇంటి గడపల వద్దకు వచ్చి తొంగి చూడటం ఇద్దరూ గమనించారు. ఇక్కడి తెలుగబ్బాయి ఎక్కడో కాంచిపురంలో పుట్టి పెరిగిన తమిళమ్మాయితో కలసి వెళ్ళడం వాళ్ళకు వింతకాకపోయినా కొత్తే కదా! వాళ్ళిద్దరూ కాసేపు అలా కలసి నడిచేటప్పటికి దారిలో ఇద్దరు ముగ్గురు ఎదురొచ్చి నమస్కారం మేడమ్ అని పలకరించడం గమనించి మురళి ఆశ్చర్య పడ్డాడు. శివగామి ముఖంలోకి తేరి చూసాడు. ఆమె అదేమీ గమనించనట్టు ముఖాన చెదరని దరహాసంతో సజావుగా నడచి వస్తూంది. ఇక ఉండబట్టలేక అడిగాడతను - “ఏమిటిది శివగామీ! నేను ఈ ఊళ్ళో పుట్టాను. ఇక్కడే పెరిగి పెద్దవాడినయ్యాను. ఒక్కడు కూడా నన్ను పరామర్శించిన పాపాన పోలేదు. నువ్వేమో నిన్న కాక మొన్న రామకృష్ణాపురం వచ్చావు. ఇప్పుడిప్పుడే మా ప్రాంతపు తెలుగు నేర్చుకుంటున్నావు. ఈ వూరి యువకుల వద్ద ఇంతటి మన్ననా! హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?“ దానికామె చిరునవ్వు చిందిస్తూ మురళి ముఖంలోకి చూస్తూ అంది ఆమె - “మనసుంటే మార్గం ఉంటుంది కదండీ! సాధించాలన్న తపన ఉంటే కొండ సైతం కరిగే తీరుతుంది కదా!”


“అదే అడుగుతున్నానోయ్ ఎలాగని?” ఆమె నడుస్తూనే కాళ్ళ చెప్పుల్లోకి చొరబడ్డ ఇసుక రేణువుల్ని దులుపుకుంటూ - అతడి ఇద్దరు చెల్లెళ్ళ చొరవతో ప్రియురాలి తిరస్కరణకు లోనైన సోమ్రాజు రంగ ప్రవేశంతో ఆరంభమైన కోచింగ్ క్లాసులూ - మిగతా నిరుద్యోగ యువకుల హాజరు వరకూ వివరించి చెప్పింది ఆమె. అంతా విన్న మధుమురళి ఏమీ అనలేదు. ముఖం అదోలా పెట్టి చూసాడు -


“నువ్వు ఒక్కపెట్టున అందని దూరానికి చేతులు చాచడానికి ప్రయత్నిస్తున్నావేమో!” అర్థం కానట్టు కళ్ళెత్తి చూసింది చెదరని అదే నవ్వు ముఖంతో -


“నేను నీకేమి చెప్పాను, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవమని. దానికి నువ్వు గొప్ప కాంచిపురం జోక్ కొడ్తూ కొట్టి పారేసావు - అదేదో పిలిస్తే ఎగిరొచ్చే పావురంలా - సివిల్ సర్వీసు పోస్టుకి వెళితే నన్ను మించిపోతావని - అలా మించిపోవడం నీకిష్టం లేదని - దానికి నేను ప్రత్యామ్నాయం చెప్పాను, బ్యాంకింగ్ సర్వీసులోకి చేరమని - బ్యాంకింగ్ సర్వీసు సౌకర్యాలను అట్టడుగున ఉన్న జనానికి అందేలా సేవలందించవచ్చని. దీనికి ఒప్పుకున్నావు. వెంటనే బ్యాంకింగ్ ప్రొబేషనరీ పోస్టుకి కావలసిన ఎగ్జామ్ పేపర్లను తదితర గైడ్ పుస్తకాలకు ఆర్డర్ చేశాను. ఇప్పటికే కొన్ని చేరాయి కూడాను. మరికొన్ని ఆన్ ది వే - ఇప్పుడు చూస్తే పేదరాశి పెద్దమ్మ అవతారం ఎత్తి కోచింగ్ క్లాసులు తీసుకోవడం ఆరంభించావు.


బ్యాంకింగ్ సర్వీస్ మామూలు సర్వీసు కాదు. దేశానికి దిశా నిర్దేశం చేస్తూన్న ప్రిస్టేజి సర్వీసు. నిజం చెప్పాలంటే నాకు మొదట నిన్ను ఉద్యోగంలో చేరమని చెప్పే ఉద్దేశ్యమే లేదు. నీ అక్కయ్యలిద్దరూ నిన్ను బ్రిలియంట్ స్టూడెంటువని ఆరితేరినదానివని ఆకాశానికి ఎత్తేస్తూ చెప్తేనే నాకు ఆ ఆలోచనే వచ్చింది”


ఆమె ఏమీ అనకుండా ఆలయ ముఖ ద్వారం వరకూ వచ్చిన తరవాత అంది - “మనం మొదట దైవార్చన ముగించిన తరవాత నిదానంగా నవ్వుతూ మాట్లాడుకుందామా!”


అతడు ఆమెను వింతగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. గుడిలో నవ్వుతూ మాట్లాడుకోవలసిందేముంటుంది - అతడు ఆమె ముఖంలోకి మరొకసారి అదోలా చూసి అన్నాడు. “ముందు పువ్వులు కొనుక్కుని కొప్పులో పెట్టుకో! కాస్తంత ఎక్కువే పెట్టుకో, మా పెద్దమ్మ చేత నన్ను పిసనారి అనిపించుకోనివ్వకుండా!”


శివగామి కిలకిలా నవ్వుతూ మురళి మోచేతి షర్టును పట్టుకుని లాగింది, ఆమె నవ్వుల గలగలతో బాటు గుడి గంటలు ఘణఘణ మ్రోగాయి. పూలమ్మి వద్దకు తీసుకెళ్ళి మూడు మూరల మల్లెపువ్వులు కొనిచ్చి శివగామిని గుడిలోపలకు తీసుకు వెళ్లాడు మురళి. మొదట ఇద్దరూ గుడి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం వద్ద మోకరిల్లి నమస్కరించి గర్భగుడి ముందు నిల్చున్నారు. పూజారి వాళ్ళను చూసిన తోడనే అమ్మవారికి హారతి అర్పించి చతుర్వేద ఆశీర్వచనం పలికి శఠగోపం ఇద్దరికీ చూపించి మళ్ళీ లోపలకు వెళ్ళి కొబ్బరి చిప్పతో బాటు పువ్వులూ పండ్లూ తెచ్చి తిన్నగా శివగామి వద్దకు వచ్చి భవ్యంగా అందించి ఆశీర్వచనం పలికాడు.


మధుమురళి ఆశ్చర్యం అణచుకుంటూ అడిగాడు - “పూజారిగారితో పరిచయం ఉందా శివగామీ!” ఆమె నవ్వింది. నవ్వుతూనే అంది.


“మరేం లేదండీ! అత్తయ్యతో మాధవితో కలసి అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటాగా! అది గుర్తించి గావాలి ఈ ప్రత్యేక ఆదరణలు“ మురళి అది కాదన్నట్టు “ఊహఁ“ అని తల అడ్డంగా ఆడించాడు. ఆడిస్తూనే అన్నాడు - “ఇంకేదో ఉన్నట్లుంది. అసలు సంగతి చెప్తావా శివగామీ - “


“మీరు ఆడిట్ ఆఫీసరులా పాయింటుకి రాక పోతే విడిచి పెట్టేటట్లు లేరు. ముందు పళ్ళెంలో దక్షిణం వేయండి. చెప్తాను“ అతడలాగే దక్షిణం వేసిన తరవాత శివగామి మరచిపోకుండా పూజారికి నమస్కరించి అక్కడి నుంచి కదులుతూ చెప్పింది.


”మీకు వాసు తెలుసు కదూ - ఆ కుర్రాడు పూజారి కొడుకు. అతను కూడా నా వద్దకు ప్రిలిమనరీ కోచింగ్ క్లాసుకి వస్తున్నాడు”


అది విని మురళి చిటికె వేసాడు - “అదన్నమాట! మేడమ్ కి గుడి ప్రాంగణంలో అంతపాటి రాచమర్యాదలెందుకు లభిస్తున్నాయో - ఇప్పుడు తెలుస్తూంది. మొత్తానికి విద్యాదేవికి అగ్రాసనం అన్నమాట -“ అంటూ ముందుకు నడచి చప్టా పైన కూర్చున్నాడు.


అతడి ప్రక్కన కూర్చుంటూ అడిగింది ఆమె “ఇంకేమైనా అడగాలా మహాశయా!” అతడు బ్రాడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు “నథింగ్ - ఐ ఫీల్ యు ఆర్ రియల్లీ బికమ్మింగ్ ఫేమస్ ఇన్ ది సిటీ ఆఫ్ రామకృష్ణా పురం“


“చాల్లెండి మీ ఎకసెక్కాలు, ఫేమస్ అనే విషయానికి వస్తే నిజంగా ఈ ఊళ్ళో ఇద్దరు చాలా ఫేమస్” ఎవరన్నట్టు ఆమె వైపు చూసాడు మధుమురళి.


“ఇద్దరూ మీ చెల్లెళ్ళే - వాళ్ళిద్దరే నన్నీ సోషియల్ కోచింగ్ సర్వీసులోకి దించి, నలుగురు నోట్లో నానేలా చేశారు. ఇక నేను విషయానికి రానా!” వినటానికి తను ఎదురు చూస్తున్నానన్నాడతను.


శివగామి కొనసాగించింది - “నిజం చెప్తున్నాను అన్యథా భావించ కుండా వినండి. మొదట ఇక్కడకు రాకమునుపు గట్టిగానే అనుకున్నాను ఏదో ఒక ఎగ్జామ్ వ్రాసి ఏదో ఒక పోస్టులో ఫిక్సయిపోయి ఊరు దాటి చెరువు దాటి రెక్కలు కట్టుకున్న పిల్ల పక్షిలా దూరంగా ఎగిరిపోవాలని -“


“అదెలా? నేను ఇక్కడ ఉండగానే దూరంగా ఎగిరిపోవాలనా!”


“మిమ్మల్ని విడిచిపెట్టా? ఏం మాటలవి? మీతో బాటు గువ్వల్లా కలసి ఎగిరిపోవాలని - కాని - అది అప్పటి ఊహాలోకం!”


“మరి ఇప్పటి మాట!” అడిగాడతను. ఆమె నవ్వింది “మీతో ఇక్కడి వాళ్ళతో కలకాలం ఇలాగే ఉండిపోవాలని - మీలో సగభాగమై కలసిపోవాలని - ఇక్కడి తెలుగు వాళ్ళందరితోనూ ముఖ్యంగా మా ఇద్దరి ఆడపడుచులతోనూ మమేకం అయిపోవాలని. అందుకేనేమో - నాకు తెలియకుండానే పోటీ పరీక్షల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే ఉద్యోగం చేయాలనే ఆసక్తే అడుగంటిపోయింది”


“ఆగు! అది కుదరదు. సముపార్జించుకున్న సామర్థ్యాన్ని వృధా చేసుకునేవారంటే నాకు గిట్టదు. నీకు బ్రిలియంట్ అకాడమిక్ నేపథ్యం ఉందని మీ అక్కయ్యలిద్దరూ పదే పదే బాకా ఊదినట్లు చెప్పారు. నౌ ఇట్స్ మై టర్న్ టు గివ్ ఫైనల్ ఆర్డర్ - ఇప్పటికి నీకందిన పుస్తకాలు అధ్యయనం చేయనారంభిస్తావు. మిగతా వాటి కోసం ఫాలో చేసి త్వరలో రప్పిస్తాను. ఓకే!” ఆ మాటకామె కిలకిలా నవ్వింది -


“నూరేళ్ళపాటు నన్నేలుకోబోయే మగాడి మాటను జవదాటగలనా! నూరు శాతం నాకు ఓకే - ఈరోజు నుండే చదవనారంభిస్తాను. ఈ లోపల నా కోసం వివిధ సబ్జెక్టులతో సంబంధం ఉన్న అప్డేటెడ్ సిలబస్ తీసుకొచ్చి ఇవ్వండి. ఇక నేను చెప్పవలసినవి రెండు విషయాలు” అంటూ ఆడపడుచులు ఇద్దరు కోచింగ్ లో కొత్తగా అదనంగా చేర్పించడానికి తీసుకు వచ్చిన నలుగురు అభ్యర్థుల గురించి చెప్పింది.


మురళి వెంటనే స్పందించాడు - “వద్దనక తక్షణం చేర్పించుకో - కొందరిని చేర్పించుకుని మరి కొందరిని వద్దంటే లేనిపోని అపోహలకు చోటిచ్చినట్లవుతుంది. నిరుద్యోగులైన యువకులకు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం సత్కార్యమే కదా! గైడెన్స్ ఇస్తే చాలదు. వాళ్ళది అనుసరిస్తున్నారా లేదా అన్నది కూడా గమనిస్తుండాలి. అప్పుడే పుణ్యమూ ఫలమూ రెండూ దక్కుతాయి. ఇక - రెండో విషయానికి రా -“


“మరేం లేదు. మీరు మాధవపురం వ్యవహారం వినే ఉంటారు. వినడం ఏమిటి, తెలిసే ఉంటుంది. మీ అన్నయ్య అటువంటి కార్యానికి పాల్పడతాడని నేను అనుకోలేదు”


“ఉష్! తొందరపడి ఏవేవో అపోహలకు తావివ్వకు. మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. వాడు అటువంటి థర్డ్ రేట్ తరహాకి చెందిన వాడు కాడు. మా బామ్మ గురించీ మా పెద్దమ్మా పెదనాన్నల గురించీ నాకు తెలుసు. ఆ ఇంట్లో పుట్టిన మా అన్నయ్యకే కాదు తమ్ముడు ఇంద్రకిరణ్ కి కూడా అటువంటి పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉండదు. ఆ ఇంటి వాతావరణం నిక్కచ్చితనం తో కూడుకున్నది. ధర్మబద్ధమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఎక్కడో ఏదో ఎదురు చూడని రీతిన జరిగి ఉంటుంది. అందులో వాడు చిక్కుకుపోయి ఉంటాడు.


వాడు తన మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఆవిడ పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీ అని విన్నాను. ఆమె డేషింగ్ స్మాషింగ్ గా ఉండటం మాత్రమే కాదు. హైలీ డిగ్నిఫైడ్ వ్యక్తిత్వం గల బిజినెస్ మాగ్నట్ అని కూడా విన్నాను. అటువంటప్పుడు ఆమెందుకు అకారణంగా అన్నయ్య వెంటబడాలి? ఎప్పుడో ఎక్కడో ఇప్పటికిప్పుడు సరిదిద్దుకోలేని విధంగా ఏదో జరిగి ఉంటుందని తెలుస్తూనే ఉందిగా! అసలు విషయం తేలేంతవరకూ అన్నయ్యను మాత్రమే పిన్ పాయింట్ చేయడం అసంబద్ధమే అవుతుంది. నీకు తెలియని విషయం మరొకటుంది“ ఏమిటన్నట్టు అతడి కళ్ళలోకి చూసింది శివగామి.


“మా వదినెను అన్నయ్య మనస్ఫూర్వకంగా ప్రేమిస్తున్నాడు. వదినెను వాడు పాలలో ముంచుతాడు గాని నీళ్ళలో ఎన్నటికీ ముంచడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ! మీ కాంచిపురం వాళ్ళకు ఇదంతా ఇప్పటికిప్పుడు చెప్పకు. అసలే వాళ్ళు సింగినాదం జీలకర్ర కరకరమని పాటిస్తారు. లేని కొసను తిప్పడానికి ప్రయత్నిస్తారు. మన మధ్య కొత్త చిక్కులు తెచ్చిపెట్టినా తెచ్చి పెడ్తారు” అని లేచాడు.


ఆమె కూడా నవ్వుతూ లేచి అంది - “ఆకలిగా ఉంది. నాకేమైనా తినిపించరూ!”


“వై నాట్! అదిగో అక్కడి వైట్ ఫ్లవర్ రెస్టారెంట్లో పెసరట్టు దొరుకుతుంది” ఆమె తలూపుతూనే చూపుడు వేలెత్తి చూపించింది.


అతడు తలతిప్పి చూసాడు. గంపనిండా కనకాంబరాలతో పూలమ్మి నిలుచుంది. అతడు అబ్బురపడుతూ కనురెప్పలాడించాడు. ఇప్పటికే శివగామి కొప్పులో మూడు మూరల మల్లెపూలున్నాయి. మరిన్ని పూలా - అనుకుంటూ రెండు మూరల కనకాంబరాలు ఇవ్వమని డబ్బులిచ్చాడు. పూలమ్మి చతురత గల సరసురాలులా ఉంది - “కొత్త పెళ్లానికి నువ్వే కొప్పులో పూలు పెట్ట కూడదూ! అది చూసి మాబోటి వాళ్ళం ఆనందించమా!” అతడు మరు పలుకుకి తావివ్వకుండా వెనుకగా వచ్చి శివగామి కొప్పులో పూలు తురిమాడు. ఆడవాళ్ళది అంతులేని ఆశ అని ఎవరో ఎక్కడ నుంచో వచ్చి చెప్పనవసరం లేదు. వాళ్ళు కొప్పులో తురుముకునే పూల గుత్తులే కథలు కథలుగా చెప్తాయి!


పూలు పెట్టుకున్న తరవాత కూడా శివగామి కదలకుండా అక్కడే నిల్చోవడం చూసి అడిగాడు మధుమురళి - “ఇంకేం కావాలోయ్?“ ఆమె నవ్వుల పరిమళాలు చిందుస్తూనే చేతితో సైగ చేసి చూపించింది; మరొక నాలుగు మూరల పువ్వులు కావాలని - “ఇంకా నాలుగు మూరలా!“ దాదాపు తెల్లబోతూ అడిగాడతను.


“ఔను. నాలుగే - కాని ఇవి నా కోసం మాత్రం కాదు. మా ఇద్దరు ఆడపడుచుల కోసం - నా మగణ్ణి కన్న అత్తయ్య కోసం -“


“అలాగా!“ అంటూ జేబు లోపల పెట్టిన పర్సుని బయటకు తీసాడతను.


===============================================

                                                ఇంకా వుంది

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page