top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 14

1 hour ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 14లో శివక్షేత్రాల తీర్థయాత్ర గురించి చర్చిస్తున్న సుఖదేవ్, ప్రణవి; వ్యాపార నిర్వహణపై నాగముని సలహా.
తీర్థయాత్ర గురించి చర్చిస్తున్న సుఖదేవ్, ప్రణవి; వ్యాపార నిర్వహణపై నాగముని సలహా.

Vyapara Prapancham – Part 14 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 14 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 18/11/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 14లో సింగాణీ అనే ప్రముఖ వ్యాపారవేత్త ఆకస్మిక మరణవార్త సుఖదేవ్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వ్యాపార నిర్వహణలో లోపాలు, భారీ ఆర్థిక నష్టాలు, కీలక స్థానాల్లో నమ్మకమైన వ్యక్తులు లేకపోవడం ఆయన పతనానికి కారణాలని నాగముని వివరిస్తాడు. ఈ పరిణామంతో ప్రణవిని సుగుణ్ ట్రేడర్స్ ప్రధాన వ్యాపార వ్యవహారాల్లోకి తీసుకురావాలన్న సుఖదేవ్ సంకల్పం మరింత బలపడుతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత ప్రణవి తన వ్రత పూజలో భాగంగా శ్రీకాళహస్తి, శ్రీశైలం, తిరుపతి, తిరుమల, తిరువణ్ణామలై క్షేత్రాలను భర్తతో కలిసి దర్శించాలని కోరుతుంది. వ్యాపార పనులతో తీరికలేని సుఖదేవ్ చివరకు భార్య కోరికను అంగీకరిస్తాడు.

వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు.


రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గీతామాధురితో  దూరంగా  ఉండాల్సిన  అవసరం  లేదని  సుఖదేవ్ తో  చెబుతాడు నాగముని.


సుఖదేవ్ చెల్లెలు విద్యాభవానికి, భానుప్రసాద్ కు పరిచయం పెరుగుతుంది. ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన కథకు మరో మలుపునిస్తుంది. అనుకోని సంఘటనలో సుఖదేవ్ ఆమెను ముద్దుపెట్టుకోవడంతో గీతా మాధురి దిగ్భ్రాంతికి గురవుతుంది. గీతామాధురి తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు సుఖదేవ్.

వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ప్రపంచం - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కాఫీలు తీసుకోవడం పూర్తయిన తరువాత బయటకు వెళ్ళిన ప్రసన్న ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి మాధురి- “ఎక్స్క్యూజ్ మీ!” అంటూ పి.యే.ల గది వైపు నడిచింది. 


అప్పుడా గ్యాప్‌ని ఆసరాగా తీసుకుని నాగముని లేచి వెళ్ళడానికి సంసిద్ధుడవుతూ అన్నాడు- “మంచి ప్రసన్నపూర్వకమైన మూడ్‌లో ఉన్నట్టున్నావబ్బాయీ! ఆ వార్త ఇప్పుడు నీకు చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నాను”. 


“ఏ వార్త?” అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. 


“అదే— సింగాణీ గారి దుర్వార్త గురించి—” 


ఈసారి సుఖదేవ్ అసహనంగా చూశాడు- “చెప్తే కదా తెలిసేది బాబాయ్!”


“చెప్తాను చెప్తాను, నోరు రావడం లేదోయ్— వ్యాపార పర్యటనపైన లండన్ వెళ్ళిన సింగాణీ గుండెపోటుతో పోయారు!”


సింగాణీ ఆకస్మిక మరణం, వ్యాపార నష్టాల కారణాలను సుఖదేవ్‌కు వివరిస్తున్న నాగముని.
సింగాణీ ఆకస్మిక మరణం, వ్యాపార నష్టాల కారణాలను సుఖదేవ్‌కు వివరిస్తున్న నాగముని.

“హాఁ! సింగాణీ గారు పోయారా! మన లాంగ్ స్టాండింగ్ క్లయింట్ కదూ— వయసు పైబడుతున్నప్పుడు ఇటువంటివే వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తుంటాయి కాబోలు—”

“ఆయన వెన్నుపోటుకి లోనయ్యాడన్నది వాస్తవమైనా దానికి కారణం అతడి వయసు కాదు. దెబ్బపైన దెబ్బ అన్నట్టు అతడికి ఆ పరిస్థితి దాపురించడానికి రెండు కారణాలు. ఒకటి- వ్యవస్థ మిస్‌మేనేజ్‌మెంట్— రెండవది- ఉప్పెనలా తాకిన భారీ నష్టాలు. అందుకే కుప్పకూలిపోయాడు సింగాణీ”


 సుఖదేవ్ కాసేపు స్తబ్దుగా ఉండిపోయి అడిగాడు- “ఆయన కూలిపోవడానికి అదొక్కటే కారణమంటారా బాబాయ్?”


“కాదు. మరొక కారణం కూడా ఉంది. అది ఇన్‌సైడర్ వ్యవహారం వంటిది. ఖర్చుల మొహం చూసి కీలకమైన స్థానాలలో నమ్మకస్థులను పెట్టకపోవడం- అంతా తాను చూసుకోగలనన్న అలక్ష్య భావం” 


సరే అంటూ సుఖదేవ్ సీటులో నుండి లేచాడు.

ఎక్కడికన్నట్టు చూశాడు సందేహాస్పదంగా నాగముని. 


“ఇంకెక్కడికి— సింగాణీ గారి ఇంటికి— అతడి భార్యనూ కుటుంబీకుల్నీ పరామర్శించి రావడానికి—” 


నాగముని నవ్వుతూ లేచాడు- “నేననుకున్నదే మీరూ చెప్పారు బాస్— పనిలో పనిగా మనతో మాధురి గారిని కూడా తీసుకెళదాం.”


“ఎందుకూ—“ అనబోయి చప్పున ఆపుకున్నాడు. 


ఇప్పుడిప్పుడేగా బాబాయి అన్నాడు- కీలకమైన స్థానాలలో నమ్మకస్థులు ఉండాలని— అటువంటి వారిని జల్లెడ పట్టి వెతకక తప్పదని— ఏది ఏమైతేనేమి— ప్రణవిని ఏదో ఒకలా మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ లైన్‌లోకి ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించక తప్పదు. డొంకతిరుగుడు సమాధానాలతో కంపెనీ వ్యవస్థలోకి రానంటే, రాలేనంటే-- ఈత తాడుతో చుట్టి లోపలకు లాగక తప్పదు. 


చూద్దాం, ఎంతకాలం కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉండగలదో! వ్రతాలూ నోములూ చేస్తూ, అత్తగారి ఆధ్యాత్మిక ఆదేశాలు పాలిస్తూ పిల్లల్ని ముద్దారా లాలిస్తూ ఎన్నాళ్ళు తనకు దూరంగా ఉండగలదో— ఆమె ఉనికి సుగుణ్ ట్రేడర్స్ కుటుంబానికి జీవనాడి వంటిదని తెలుసుకోవద్దూ! 


అంతేకాక— తన వ్యూహం ప్రకారం ప్రణాళిక సాగితే, అనువైన సమయం చూసి ప్రణవిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి సజావుగా తీసుకోవచ్చు— అంతేకాక, ఇప్పుడు బడి చదువులు సాగిస్తున్న కొడుక్కీ కూతురికీ మెలమెల్లగా కుటుంబ బిజినెస్ టెంపర్‌మెంట్ నూరిపోయాలని, సమయం వస్తే బిజినెస్ బాధ్యతలను తాముగా స్వీకరించగల స్థాయికి తీసుకురావాలని--


సింగాణీ గారింటికి వెళ్లి కుటుంబ సభ్యులందర్నీ పరామర్శించి ఇల్లు చేరిన తరువాత సుఖదేవ్ మలిస్నానం చేశాడు. ప్రణవి అందించిన టవల్ అందుకుని తల తుడుచుకుంటూ విల్లులా వంగిన ఆమె నడుము నుండి చూపు మరల్చకుండా అన్నాడు- “ఏమిటి విశేషం— చాలా ఫ్రెష్‌గా తాజా ఊటీ పండులా కనిపిస్తున్నావు. ఎనీ ట్రీట్ ఫర్ మీ—” 


ఆమె నవ్వి ఊపిరి లోతుగా పీల్చుకుని అంది- “అయ్యా మన్మథరూపా! తలంటు పోసుకుంటే ఏ తెలుగు ఆడపడుచయినా తాజాతనం ఉట్టిపడే కళతో నిండుగానే కనిపిస్తుంది. ఇందులో చోద్యమేముంది? ఇప్పుడు మీకొకటి చెప్పాలి. నిజానికి కాంప్లిమెంట్ ఇవ్వాలి.”


“కాంప్లిమెంట్ నాకా! ఎందుకూ?” అంటూ ప్రణవి ప్రక్కకు వచ్చి ఆమె నడుంపైన చేయి వేశాడు. 


ఆమె వెంటనే ఎడంగా జరిగింది- “దూరం దూరం— నేను పూజాదీక్షలో ఉన్నానన్నది తెలవదా!”


“ఉంటే ఏమైందంట— కట్టుకున్నోడికి అవన్నీ వర్తించవోయ్! నేనెప్పుడైనా ఎక్కడైనా నిన్ను ముట్టుకుంటాను, మురిపెంతో ముద్దారా లాలిస్తాను. మైమరపిస్తాను. ఇంతకీ నీ ముఖ భావంలో కనిపిస్తున్నది వెరపా లేక మైమరుపా—”


“అవన్నీ తరువాత చర్చించుకుందాం గాని— మొదట నా కాంప్లిమెంట్ అందుకుంటారా లేదా!” 


చెప్పు చెప్పు- అంటూ సుఖదేవ్ సీరియస్‌గా ముఖం పెట్టి భవ్యంగా దూరం జరిగాడు. 


ఆమె అదే విధంగా స్పందించింది- “అదీ— అలాగుండాలి. నా మాటకు దారివ్వాలి. పెద్దగా మరేమీ లేదు గాని— ఈసారి మీరు నా ఘోష విని మరొకసారి లాటిన్ అమెరికన్ దేశాల వైపు వెళ్ళకుండా భవ్యంగా దివ్యంగా మన ఆసియా ఖండం చుట్టి వచ్చారు కదా- దానికి నా మెచ్చుకోలు. బౌద్ధ విహారాలు చూశారు. ప్రాచీన హైందవ ఆలయాలు దర్శించారు. వినడానికి ఎంత బాగుందో—” 


భార్య మాటలకు అతడు స్పందించలేదు. దీర్ఘంగా ఓసారి ఆమె కళ్ళలోకి చూసి ముఖం తిప్పుకున్నాడు. నిశ్శబ్దంగా అల్మెరా నుంచి దుస్తులు తీసి వేసుకోసాగాడు. ప్రణవి రియాక్ట్ అయింది- “అదేమిటి అలా ముఖం పెట్టేశారు— ఇంతకీ నేనేమన్నానని— సంస్కృతి పరంగా మన దేశానికి దగ్గరితనం గల దేశాలు ఎంపిక చేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశాను— అంతే కదా!” 


అతడు తల అడ్డంగా ఆడించాడు- ముఖం చిట్లించాడు- “ఎందుకంటే నీ కంఠస్వరం నాకంత పాజిటివ్‌గా వినిపించలేదు. విద్యావంతురాలివి. నువ్వంత కట్ షార్ట్‌గా మాట్లాడకూడదు. మాది బిజినెస్ ఫ్యామిలీ- అందులో నువ్వు సహితం ఒక భాగానివి. మాకున్న పరిస్థితుల్ని పరిధుల్ని అర్థం చేసుకోవాలి. నేనేమిటి సరదాలు చేసుకోవడానికి సంబరాలు జరుపుకోవడానికి లాటిన్ అమెరికన్ దేశాలకు వెళ్ళాననుకుంటున్నావా! 


బిజినెస్- మన ఫ్యామిలీ బిజినెస్ కోసం వెళ్ళాను మంతనాలు జరుపుకుని ఒప్పందాలు చేసుకోవడానికి. న్యాయంగా చెప్పాలంటే నువ్వీపాటికి సుగుణ్ ట్రేడర్స్ మెయిన్ స్ట్రీమ్‌లో భాగమై ఉండాల్సింది. నీకు కుటుంబ బాధ్యతలతో ఏర్పడ్డ అనుబంధం వల్ల పలు వ్యక్తిగత కారణాల వల్ల బిజినెస్ మెయిన్ స్ట్రీమ్‌లోకి రాకుండా దూరంగా ఉండగలుగుతున్నావు. రేపో మాపో నువ్వు మాకు దగ్గరగా వచ్చే తీరాలి. 


ఒకవేళ బిజినెస్ పట్ల అనువైన టెంపర్‌మెంట్ లేకపోతే, దానిని అనువైన పద్ధతిలో అలవర్చుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్— బాగా గుర్తుంచుకో— పాడవాలనుకున్న మగాడు విదేశాలకు వెళ్ళే పాడవనవసరం లేదు. ఉన్న చోటే చప్పుడు చేయకుండా రంకెలు వేయవచ్చు. అన్నట్టు మాటలో మాటగా మరొకటి చిత్తగించాలి. 


బౌద్ధ మత ధర్మాలను పాటించే దేశాల పట్ల నాకు అభిమానం ఉంది. వాటి ఆధ్యాత్మిక జీవన సరళి పట్ల గౌరవం ఉంది. కానీ— వీటన్నిటికీ మాతృ ఆధ్యాత్మిక- గంగోత్రి- హైందవ దేశమైన భారతదేశమన్నది మనం మరచిపోకూడదు” అంటూ షర్ట్‌కి గుండీలు వేసుకోసాగాడు. 


అతడి రియాక్షన్‌కి ప్రణవి ఉలిక్కిపడింది. వెంటనే అతడికి సమీపంగా వెళ్ళింది- “అబ్బే- నేనా ఉద్దేశ్యంతో అలా అనలేదండీ- ఎప్పటిలాగే జోవియల్‌గా అన్నాను. ప్లీజ్ అండర్‌స్టాండ్.”


“నువ్వే ఉద్దేశ్యంతో అన్నావో నాకు తెలియదు. నేను ఆ ఉద్దేశ్యంతో అన్నట్టే భావించాను, నీ కంఠస్వరాన్ని బట్టి— నేను బయలుదేరాలి. ఏమైనా చెప్పాలా?” అతడామెకు దూరంగా జరుగుతూ అడిగాడు. 


ఉఁ అంటూ మళ్ళీ అతడికి సమీపంగా వచ్చి నిల్చుంది. 


తలెత్తి చూడకుండానే- చెప్పు- అన్నాడతను- 


తన వ్రత పూజలో భాగంగా శివక్షేత్రాల తీర్థయాత్రకు కలిసి వెళ్లాలని సుఖదేవ్‌ను కోరుతున్న ప్రణవి.
తీర్థయాత్రకు కలిసి వెళ్లాలని సుఖదేవ్‌ను కోరుతున్న ప్రణవి.

“మీ అమ్మగారి సూచన ప్రకారం మనం తీర్థయాత్రలకు వెళ్ళి రావాలండీ—”


“తీర్థయాత్రలకేగా- మీ అత్తగారిని తీసుకువెళ్ళు. వీలైతే పిల్లలిద్దర్నీ తోడు తీసుకుని వెళ్ళు. మీ ఆడపడుచుకి కూడా ఓ మాట చెప్పు తీర్థయాత్రలకు మీతో కలసి వస్తుందేమోనని- రావడానికి వీలుకాకపోతే అది మీ ప్రయాణంలో కావలసిన స్టేకి ఏర్పాట్లు చేస్తుంది.”


“అబ్బే— ఇది మామూలు తీర్థయాత్రలు కాదండీ— నేను పాటిస్తున్న వ్రత పూజలో ఇదొక ముఖ్యమైన భాగం. మనం కలసి వెళ్ళాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది. దోష పరిహారం పూర్తవుతుంది. అత్తయ్య ఇదంతా తానుగా చెప్పడం లేదు, పురోహితుణ్ణి సంప్రదించే చెప్తున్నారు.”


అదంతా విని షర్ట్‌కి గుండీలు బిగించడం పూర్తి చేసుకుని అతడు తలెత్తి ప్రణవి కళ్ళలోకి చూశాడు. ఒకసారి కాదు, రెండుసార్లు తనను బుజ్జగించడానికి మెడ చుట్టూ చేతులు పెనవేయడానికి ముందుకు జరుగుతూ వచ్చింది. కానీ జరుపుతున్న వ్రత పూజ గుర్తుకి వచ్చి కాబోలు చేతులు వెనక్కి లాక్కుంది. వ్రత భంగం కలగకూడదుగా-- తడబాటుతో కూడుకున్న ఆ తతంగం తను గమనించలేదనుకుందేమో-- 


భార్య విశాల నేత్రాలలోకి చూసిన తరువాత అతడు చల్లబడ్డాడు. అతడు సర్వగుణ సంపన్నురాలైన భార్యను మనసా వాచా అణువణువునా ప్రేమిస్తున్నాడన్నది వేరే చెప్పాలా! అది ఆమెకు మాత్రం తెలియదా ఏమిటి! ముఖాన ప్రసన్నత కోల్పోకుండా జాగ్రత్త పడుతూ నిదానంగా అడిగాడు- “సరే— ఏయే క్షేత్రాలకు వెళ్తున్నామో చెప్పు— నాకున్న బిజీ బిజినెస్ షెడ్యూల్‌ని గుర్తుంచుకుని చెప్పు-- ఓకే!”


“చెప్తాను. అది చెప్పే ముందు మీకొకటి స్పష్టం చేయాలి. ఇప్పుడు నేను సాగిస్తున్న ఈ వ్రత పూజలు, నోస్తున్న నోములూ నాకోసం మాత్రమే కాదు. మీ కోసం- మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడాను- ఇంకా చెప్పాలంటే మీకు ఎటువంటి తడబాటూ కలగకుండా మీ వ్యాపారం పచ్చగా ఉండాలని- వ్యాపారమే కాక, మన కుటుంబం చల్లగా ఉండాలని— ఇది గుర్తుంచుకుంటే ఉభయతారకం.”


“ఇది నువ్వు చెప్పాలా ఏమిటి? ఇక విషయానికి వస్తావా—”


ఉఁ అంటూ చెప్పసాగింది “మొదట శ్రీకాళహస్తి, శ్రీశైలం- ఆ తరువాత తిరుపతి, తిరుమల- అక్కణ్ణించి తిన్నగా తిరువణ్ణామలై- దారిలో అన్నదానాలకు ఏర్పాటు చేయడమే కాక- ప్రతి క్షేత్రంలోనూ కొలువు తీర్చి ఉన్న క్షేత్రపాలకులను దర్శించి పూజలు చేయడం తప్పనిసరి—”


“ఓకే ఓకే! పర్యాటక స్థలాల లిస్టుని పొడిగించకుండా ఆపు చేయి. అన్నట్టు— బై ది బై- నేనొకటి ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. నిష్కర్షగా చెప్పడం నాకలవాటని నీకు తెలుసుగా— అందుకని—”


“ఉఁ చెప్పండి. వింటాను” అందామె. 


అప్పుడతను అరవిచ్చుకున్న పెదవులతో అన్నాడు- “నాకు చిలిపితనం ఎక్కువ. అందులో నిన్ను చూస్తే మరీనూ— అప్పుడు నిన్ను నీవు నిగ్రహించుకుని జాగ్రత్తపడి గట్టెక్కడం నీ వంతు. పరిమళిస్తున్న పువ్వుని చూస్తూ దూరం నుంచి ప్రవరాఖ్యుడిలా ఆఘ్రాణించకుండా తొలగి ఉండడం నాకు అలవాటు లేదు. ఐ వార్న్ యూ—”


“ఈ విషయంలో మీరు నా విషయమై చింతించనవసరం లేదు. నా వ్రత ఫలాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. అత్తయ్య గారికి నేనిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఇది నిశ్చయం-- నిశ్చయం!”


“ఓకే ఓకే! ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్— బై ది బై- మరొకటి అడగాలనుకుంటున్నాను. చెప్తావా?” 


ఉఁ అందామె. 

“నువ్వు ఇద్దరు బిడ్డల తల్లివి కదా— ఇంత మంచి ఆకృతితో బిగి నడుముతో ఎలా ఉండగలుగుతున్నావు? పగలు నాకు తెలియకుండా లేడీస్ జిమ్‌కి వెళ్ళొస్తున్నావా!”


“యు ఆర్ రైట్ మై లవర్ బోయ్! నేను వ్యాయామం చేస్తుంటాను. కానీ— జిమ్‌లో కాదు—” 


అదెలా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడతను. ఆమె కొనసాగించింది- “చెప్తాను. వినండి. కొన్ని విషయాలలో నన్ను నేనే కదా చూసుకోవాలి. విద్యా భవాని కోర్టుకి వెళ్ళక ముందు నాకు చేదోడుగా ఉండేది. చాలా హాయిగా ఉండేది. ఇప్పుడది లేదుగా— కోర్టు కేసులతో కుస్తీ పడుతూ ఉంటుందిగా— అందుకని వేరే గత్యంతరం లేక నేను మన గది బాల్కనీలోనే ఆసనాలు చేస్తుంటాను. నౌకాసనం- త్రికోణాసనం- అమృతాసనం వంటివన్నమాట— ఇది చాలా లేక ఇంకేమైనా అడగాలా!” అంటూ అతడి ముక్కును పట్టి లాగింది ప్రణవి గలగల నవ్వుతూ--. 


అతడేమీ అనలేదు. అదన్నమాట ప్రణవి యవ్వన ప్రాయంలోని సొగసుకి మెరుపుకి కారణం! అలా రసవత్తర ఊహలతో కొట్టుమిట్టాడుతూ కాళ్ళకు సాక్స్ వేసుకోసాగాడు సుఖదేవ్.


అనుకున్న ప్రకారం సుఖదేవ్ తాను మూడు రోజుల పాటు కంపెనీ కార్యాలయంలో ఉండనని, కంపెనీలో రెండవ స్థానానికి చెందిన సీనియర్ మేనేజర్‌కి చెప్పి, ముఖ్యమైన అర్జంట్ విషయాలు ఉంటే సాధ్యమైనంత మేర తన చెవికి చేరనివ్వకుండానే పరిష్కరించుకోవాలని బాబాయి నాగమునికి కూడా చెప్పి-- అవసరం ఉన్నా లేకపోయినా గీతామాధురి గారిని లూప్‌లో ఉంచమని ఆమెను అలూఫ్‌గా ఉంచకుండా చూడమని సలహాయిచ్చి ఇల్లు చేరాడతను.


సుఖదేవ్–ప్రణవి తీర్థయాత్ర కోసం ప్రయాణ మార్గాన్ని సిద్ధం చేస్తున్న విద్యాభవాని, భానుప్రసాద్.
తీర్థయాత్ర ఏర్పాట్లలో విద్యాభవాని, భానుప్రసాద్

అన్నా వదినెల తీర్థయాత్రలకు ముందస్తు ఏర్పాట్లు చూడడం కోసం ఆరోజు కోర్టుకి వెళ్ళడం మాని వాళ్ళిద్దరూ వెళ్ళవలసిన రోడ్డు మ్యాప్‌ని అందించింది విద్యా భవాని. 


ఏర్పాట్లు చూడడంలో ఆమెకు వత్తాసుగా భాను ప్రసాద్ ఆఫీసుకి లీవు పెట్టి వాళ్ళతోనే వాళ్ళమధ్యనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ తయారు చేసిన రోడ్డు మ్యాప్ ప్రకారం భార్యాభర్తలిద్దరూ స్పెషల్ వ్యానులో శివక్షేత్రాలు దర్శిస్తూ తిరుపతి వరకూ వెళతారు. 


ఆ తరువాత ఫ్లైట్‌లో చెన్నై చేరుకుని అక్కణ్ణించి టాక్సీలో తిరువణ్ణామలై చేరుకుంటారు. అక్కడున్న సాధువులకు బైరాగులకు అన్నదాన సంతర్పణం ఏర్పాటు చేసి రమణ మహర్షుల ఆశ్రమంలో ఉన్న ధ్యానమందిరంలో గడిపి వచ్చిన రూట్ ప్రకారం తిరుగు ప్రయాణంలో చెన్నై చేరుకుంటారు. 


ఆ తరువాత అటునుండి ఫ్లైట్‌లో భాగ్యనగరం చేరుకుంటారు. పూజా గదిలో పూజ చేసి వనజమ్మగారి కాళ్ళకు నమస్కరించి స్పెషల్ వ్యానులో వెడలిపోయిన తరువాత విద్యాభవాని తల్లి కంట పడకుండా భాను ప్రసాద్ ప్రక్కకు చేరి నవ్వుతూ అంది- “టీ పుచ్చుకుందామా!” 


ఆ మాటకు స్పందిస్తూ అతడు అదే విధంగా నవ్వు చిలికిస్తూ- “ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఇట్—“ అన్నాడు ఉల్లాసంగా— 


“అలాగా!”- అంటూ ఆమె లోపలకు వెళ్లి చంగాళమ్మ అందించిన టీ-కప్పులు తీసుకుని హాలులోకి వచ్చింది. అతడు థాంక్స్ అంటూ అందుకుని- “ఆశ్చర్యంగా ఉంది భవానీ!” అన్నాడతను అదే ఉల్లాసపూరిత కంఠస్వరంతో. 


ఎందుకూ అన్నట్టు చూసిందామె టీ చప్పరిస్తూనే- 


అతడు బదులిచ్చాడు- “మరేం లేదు- కోర్టు కేసులు గన్ షాట్‌లో హాజరవుతుంటావు కదా— ఇంతసేపు ఇక్కడ కోర్టు వైపు వెళ్ళకుండా ఇక్కడే ఇంట్లోనే ఉండటం విస్మయాత్మకం కదూ!”


“అంతలావు విస్మయానికి చోటే లేదు. ఎందుకంటే— మా అన్నా వదినలు వెళ్ళేది పుణ్యక్షేత్ర దర్శనార్థం కదా— అత్యంత పుణ్యప్రదం కదా— అందుకని. అంతేకాదు అమ్మ ఇవన్నీ గమనించలేదా--. మా ఇద్దరు పనిగత్తెలూ ఇటువంటి విషయాలలో తగు రీతిన సహకరించలేరు. అమ్మకు తృప్తి కలిగించలేరు. కానీ— అసలు విషయం మరొకటి ఉంది.” 


అదేమిటని అడిగాడతను-


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 15

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page