వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట
- Pandranki Subramani
- 2 days ago
- 4 min read

త్వరలో ప్రారంభం కాబోతున్న ధారావాహిక పరిచయం
Vyapara Prapancham - Introduction of New Telugu Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం - తెలుగు ధారావాహిక - ముందుమాట | పాండ్రంకి సుబ్రమణి |
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 02/08/2026
వ్యాపార ప్రపంచంలో లాభనష్టాలు, నైతిక విలువలు, కుటుంబ బంధాలు, వ్యక్తిగత బలహీనతలు ఒకే సమయంలో మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఆవిష్కరించే నవల "వ్యాపార ప్రపంచం". ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి రచించిన ఈ నవలలో విజయవంతమైన యువ వ్యాపారి సుఖదేవ్ జీవితం చుట్టూ తిరిగే సంఘటనలు, వ్యాపార ఒత్తిడులు, కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, నైతిక సంఘర్షణలు ఆసక్తికరంగా మలచబడ్డాయి. ఈ ముందుమాట నవలలోని ప్రధాన పాత్రలు, కథా నేపథ్యం, రచయిత ఆలోచనా విధానాన్ని పరిచయం చేస్తూ పాఠకులను ప్రధాన కథలోకి ఆహ్వానిస్తుంది.
సగటు మనిషిగా నాకున్న అవగాహన మేరకు కొన్ని విషయాలు అనుకున్న ప్రకారమే జరగవచ్చు. ప్రణాళిక ప్రకారమే పథకాలు రూపొందవచ్చు. అయితే... కొన్ని మాత్రం ఊహించని రీతిన జరుగుతుంటాయి. వాటిలో కొన్ని అంతర్గతమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు. ముఖ్యంగా బయటకు చెప్పుకోలేనివి కూడా కావచ్చు. ఆ మాటకు వస్తే — అటు చూసినా, ఇటు చూసినా అవన్నీ మానవ బంధాలకు, మానవ మనుగడకు సంబంధించినవే — విస్మరించరానివే.
ఎంతగా బిజినెస్ ప్రపంచం, ఎంతగా ఆదాయ వ్యయాలతో, స్వార్థపూరితమైన లాభనష్టాల పథకాలతో పెనవేసుకున్నవైనా, ఎల్లకాలమూ ఆ సంక్లిష్ట వ్యాపార లావాదేవీలు మానవ బంధాలకు అతీతంగా, అంటీ అంటని రీతిన మాత్రం ఉండజాలవన్నదే రచయితగా నా అభిప్రాయం. అందుకే కాబోలు — ప్రపంచ ప్రసిద్ధ గాడ్ ఫాదర్ నవలా(హాలివుడ్ సినిమాకి చిత్రానువాద రచయిత కూడాను) రచయిత ఫ్యూజో ఇలా అంటాడు- “ ఎక్కడైతే, ఏ వ్యవస్థలోనైతే సంపద అమాంతం పెరిగిపోయిందంటే దాని వెనుక ఏదో ఒక రూపంలో కనిపించి, కనిపించని రీతిన నేరం తాండవం చేసిందన్న మాటే--”
ఇక నవలా రచన విషయానికి వద్దాం. సుగుణ్ ట్రేడర్స్ సీఈఓ సుఖదేవ్ నిలకడ గల మనసుతో తొట్రుపాటుకు లోనుకాకుండా మనుగడ చేయాలనుకుంటాడు. తన వ్యాపార ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం లేని విషయాలకు దూరంగా వ్యాపార క్లయింట్స్ పట్ల అనాసక్తంగా ఉండాలనుకుంటాడు. అతడికి తారసిల్లే వ్యక్తులతో ముఖ్యంగా ఫిమేల్ బిజినెస్ పార్టనర్ లతో ఎడంగా ఉండాలని తాపత్రయపడుతుంటాడు. Because he is honest to himself.
అంతేకాక-అతడికి భార్య ప్రణవి అంటే అమిత వాత్సల్యం. ఎంతటి నిండుదనం గల స్త్రీలు ఎదురు వచ్చినా, ఎంతగా కైపెక్కించేలా అతడి వైపు లీలగా, లాలనగా చూపులు విసరడానికి ప్రయత్నించినా అతడు తన సతీమణిని గుర్తుకు తెచ్చుకుని, తన ఇద్దరు బిడ్డలను జ్ఞప్తికి తెచ్చుకుని చాకచక్యంగా తొలగిపోతుంటాడు. ఈ వైఖరి అతడికి బాబాయి వరసైన కంపెనీలో డిప్యూటీ మేనేజరైన నాగమునికి సరిపడదు. ఇప్పటి సంక్షోభిత స్టోర్మీ(stormy) వ్యాపార ప్రపంచంలో అటువంటి పట్టీ పట్టని విముఖత్వంతో ఎక్కువ కాలం నెట్టుకు రాలేమంటాడు.
ఈ విషయంలో నాగముని అబ్బాయి సుఖదేవ్‌కి ఒక నిర్మాణాత్మకమైన ఉదాహరణ ఇస్తాడు — “పట్టున కోప్పడటం నాశకరం. కాదనను. కాని — సంఘటనకు అనుకూలంగా కోప్పడినట్లు భావన చూపించడం నాశకరం కానేరదు“
నాగముని ఇలా ఎప్పుడు చెప్పవలసి వచ్చిందంటే-ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే — నగరంలో ముఖ్య వ్యాపారవేత్త అగర్వాల్ గారి సతీమణి మేడమ్ శోభోదేవి వాళ్ళ వ్యాపార డీల్ గురించి చర్చించడానికి, చర్చించి డీల్ కి ఆఖరి దిద్దుబాటులు చేయడానికి భర్త తరపున తన ఇంటికి- ఇంట్లోనున్న కార్యాలయానికి ఆహ్వానిస్తుంటుంది. ఆమె పిలుపు అందుకున్న సుఖదేవ్ అసహనం కనబరుస్తాడు. ఇటువంటి బాహాటమైన విముఖత అందలమెక్కాలనుకుంటున్న యువ వ్యాపారికి తగదంటాడు నాగముని. వ్యాపార సంబంధాలలో వ్యక్తిగత పోకడలు కూడా కౌంట్ అవుతాయంటాడు నాగముని.
దీనికి అతడు ఒక చరిత్రాత్మకమైన ఉదంతాన్ని ఎత్తి చూపుతాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రు రాజ్యాల రహస్యాలను రాబట్టుకోవడానికి స్ఫురద్రూపులైన యువకులను మగతోడు లేని సింగిల్స్ స్త్రీల వద్దకు వాళ్ళ శత్రురాజ్య సైనికాధికారులు పంపిస్తుంటారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం, యువకులు ఆ సింగిల్స్ స్త్రీలతో స్నేహం చేస్తారు. దగ్గరితనం పెంచుకుంటారు. కావలసిన రహస్యాలు గైకొన్న తరవాత ఆ యువకులు అక్కడ ఉండరు. వెంటనే వాళ్ళ దేశాలకు వెడలిపోతుంటారు.
అదే విధంగా అబ్బాయి సుఖదేవ్ డీల్ వ్యవహారాన్ని సరిదిద్దుకుని కార్యసాధన పూర్తి చేసుకుని రివ్వున ఇల్లు చేరుకోవాలంటాడు. (కాని — ఈ ఆలోచనా విధానంతో సుఖదేవ్ అంగీకరించడు) ఇంతకీ — అటువంటి ఆలోచనలిస్తున్న నాగముని అల్పవిషయాల పట్ల ఆసక్తి గలవాడు కాదు. ఇంకా చెప్పాలంటే--కుటుంబ విలువలకు అమితంగా గౌరవం ఇచ్చే మనిషి. సుగుణ్ ట్రేడర్స్ సంస్థకు ఉద్యోగులను (కీలక స్థానాలకు) సెలక్ట్ చేస్తున్నప్పుడు అతను అభ్యర్థుల విద్యార్హతల కంటే కుటుంబ విలువలకు అధిక ప్రాముఖ్యత ఇస్తుంటాడు.
ఈయన వ్యాఖ్యానాలు వింటుంటే మనకు పూర్వపు చైనా దేశపు నాయకుడు డెంగ్ సో పింగ్ మాటలు గుర్తుకు రాకుండా మానవు: “పిల్లి నలుపా, తెలుపా అన్నది ముఖ్యం కాదు. అది ఎలుకను పట్టుకోగలుగుతుందా లేదా అన్నదే ముఖ్యం“
ఏది ఏమైతేనేమి-సుఖదేవ్ కూడా మానవ మాత్రుడే కదా — అతడికి కూడా దాట వీలుకాని పరిధులు కొన్ని ఉంటాయి కదా! ఎంతటి చిత్తశుద్ధి చూపించినా ఏదో ఒక సందర్భాన మానవీయ బలహీనతకు లోంగే తీరాలి కదా! (విశ్వామిత్రుడి ఉదంతం మనకు తెలియనిదా!) ఆ రీతిన సుఖదేవ్ వాళ్ళ సంస్థలో పెట్టుబడుల డివిజన్ కి సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా వచ్చిన గీతామాదురికి దగ్గరవుతాడు. మానసికంగానే కాక-శారీరకంగాను కూడా —
అలా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నవలా రచనలో వివరించాను. “ఎంతటి వారలైనా కాంతలకు దాసులే!“ అని త్యాగయ్య ఊరకేనా అన్నాడు!
ఇందులో మరొక ముఖ్యమైన పాత్ర- గజపతి నగరానికి చెందిన భాను ప్రసాద్. అతను గజపతి నగరం నుండి వచ్చి భాగ్యనగరంలో ఉన్న ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. ఒకసారి అతను రాత్రిపూట బైక్ పైన వస్తున్నప్పుడు కుక్కలు అర్థాంతరంగా ఇంటి నుండి రోడ్డుపైకి వచ్చిన పాపను అరుస్తూ చుట్టుముడతాయి. అప్పుడతను వెనుకా ముందూ ఆలోచించకుండా బైక్ ని కుక్కల పైకి పోనిచ్చి పాపను కాపాడుతాడు. పాపను క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకునేలా సహాయపడతాడు.
సీసీటీవీలో క్యాప్చర్ అయిన ఆ దృశ్యం నలుమూలలా వైరల్ అవుతుంది. అది చూసి హైకోర్టులో జూనియర్ లాయర్ గా ఉంటున్న సుఖదేవ్ చెల్లెలు విద్యా భవాని భాను ప్రసాద్ చూపించిన తెగింపుకి సంతోషించి తిన్నగా భాను ప్రసాద్ కార్యాలయానికి వెళ్ళి తన మెచ్చుకోలు తెలియజేసి అతడితో పరిచయం పెంపొందించుకుంటుంది. అతడికి కాల క్రమేణా దగ్గరవుతుంది. అతను సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జాముకి అప్పియర్ అయ్యేలా తోడ్పడుతుంది. ప్రోత్సహిస్తుంది. చివరన భాను ప్రసాద్ ని తనవాడిగా చేసుకుంటుంది.
ఇప్పుడు “వ్యాపార ప్రపంచం” నవలలోని పాత్రలను క్రమరీతిలో పేర్కొంటున్నాను.
1.సుఖదేవ్ — యువ వ్యాపారి. సుగుణ్ ట్రేడర్స్ సంస్థ సీఈఓ
అ.భార్య- ప్రణవి
ఆ.తల్లి — వనజమ్మ
ఇ.విద్యా భవాని-చెల్లెలు. హైకోర్టులో జూనియర్ లాయర్
ఈ.కామిని-సుఖదేవ్ కూతురు. వాగ్దేవి హైస్కూలు విద్యార్థిని
ఉ.రాఘవ్ — సుఖదేవ్ కొడుకు. అదే హోస్కూలు విద్యార్థి
2.సుగుణ్ ట్రేడర్స్‌లో పని చేస్తున్నవారు-
అ.మాలిని-సీనియర్ పీఏ
ఆ.రాగిని — జూనియర్ పీఏ
ఇ.డ్రైవర్-చంద్రం
3.సుగుణ్ కార్యాలయంలో ముఖ్య ఉద్యోగులు —
అ.నాగముని — డిప్యూటీ వర్క్ మేనేజర్. సుఖదేవ్ కి దూరపు బంధువు-బాబాయి
ఆ.వినాయక రావు-మునుపటి కంపెనీలో వ్యాపార ఒప్పందాల డివిజన్ ఇన్చార్జి
ఇ.గీతా మాధురి — వినాయక రావు స్థానంలో కొత్తగా చేరిన వ్యాపార ఒప్పందాల డివిజన్ ఇన్చార్జి
ఈ.వసుదేవ్-ప్రొడక్షన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్.
4.భాను ప్రసాద్ అండ్ కో-
ఆ.దీనదయాళ్-సీనియర్ సూపర్ వైజర్.
ఇ.వైష్ణవి-సహోద్యోగిని--
ఈ.త్రిలోక్-చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్.
ఉ.పరమశివం-ఇతని చాంబర్ లో పనిచేస్తున్న ప్యూను.
ఊ.భవానీ శంకర్ — భాను ప్రసాద్ రూమ్మేట్.
5.అ.ప్రసన్న-గీతా మాధురి పెద్దమ్మ కూతురు
ఆ.ఇందువదన-పెద్దమ్మ కొడకు.
6.అ.అగర్వాల్-సుఖదేవ్ బిజినెస్ క్లయింట్
ఆ.శోభాదేవి-బిజినెస్ లో సహాయపడే భార్య-హొయలు చిందే స్త్రీ.
7.అ.చంగాళమ్మ-రాములమ్మ — ఇద్దరూ సుఖదేవ్ ఇంటి పని మనుషులు.
8.అ.సదా లక్ష్మి-గీతా మాధురి ఇల్లు చేరిన పెద్దమ్మ-వితంతు.
ఆ.దుర్గమ్మ-మాధురి చిన్నమ్మ పిల్లలు లేని వితంతు.
ఇ.కాంతమ్మ — గీతా మాధురి తల్లి.
============================
వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 త్వరలో ప్రారంభం.
============================
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a







