top of page
Original.png

తోలు బొమ్మలు - పార్ట్ 3

37 minutes ago
4 min read

తోలు బొమ్మలు పార్ట్ 3 – పార్వతీపురంలో మూడు కుటుంబాలు, మూడు తరాల జీవిత కథ

Tholu Bommalu - Part 3 - Telugu Serial | Ch. C. S. Sarma 

తోలు బొమ్మలు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 16/09/2026

 

జరిగిన కథ: సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు జీవితం ప్రారంభించిన చంద్రశేఖర్ మనసులో కొత్త ఆలోచన మొలకెత్తుతుంది. తన జీవితంలో జరిగిన సంఘటనలను రాసుకోవాలనే ఉద్దేశంతో జైలర్ రఘునందన్‌ను కాగితాలు, పెన్నులు కోరతాడు. అదే సమయంలో అతన్ని కలవడానికి వచ్చిన బావ, మిత్రుడు వివేకానంద కుటుంబ పరిస్థితులను వివరించి ధైర్యం చెబుతాడు. ఆ తరువాత చంద్రశేఖర్‌ను కలిసేందుకు వచ్చిన చంద్రిక తన ప్రేమను వెల్లడించడంతో కథ భావోద్వేగభరితమైన మలుపు తిరుగుతుంది.


తోలు బొమ్మలు - పార్ట్ 3

ఈ భాగం నవలలో చాలా ముఖ్యమైన background / foundation episode. పార్వతీపురం గ్రామం, మూడు కుటుంబాలు, మూడు తరాలు, వారి మధ్య బంధాలు–వైరాలు, అలాగే చంద్రశేఖర్–కావ్య–అమృత–చంద్రికల భవిష్యత్ ఆశయాలు ఇక్కడ పరిచయమవుతున్నాయి.


అది అందమైన చిన్న పల్లెటూరు. రెండు వందల ఇళ్ళు ఉంటాయి. బాగున్న కుటుంబాలు పది పన్నెండు, మిగతా వారిలో నూటికి పైగా మధ్య తరగతి వారు, మిగతా వారంతా కాయకష్టం చేసుకుని బ్రతికేవారు.


కానీ... ఆశ్చర్యకరమైన విషయం, వారందరూ తరతమ కులమత భేదాలు లేకుండా ఒకటిగా, సఖ్యతతో కలసిమెలసి ఉండేవారు. ఉన్నవారు లేని వారికి సాయం చేసేవారు.


ఆ ఊరిలో అన్ని కులాల వారూ ఉన్నారు: బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కుమ్మరి, కమ్మవారు, గొల్లవారు, రెడ్లు, హరిజనులు.


ఆ ఊరి పేరు పార్వతీపురం. ఊరి మధ్యన శివాలయం తూర్పు, పడమరగా, ఉత్తర దక్షిణంగా నాలుగు ముఖ్య వీధులు. ఊరి చుట్టూ పడమర, ఉత్తరం, దక్షిణపు వైపున పంటభూములు; తూర్పువైపు పండ్ల తోటలు.


ఆ తోటల వెనుక చెరువుకట్ట, కట్టపైన నేరుగా ఐదు కిలోమీటర్ల దూరంలో జిల్లా నగరం.


ఆ ఊరిలో హైస్కూలు వరకూ ఉంది. జిల్లా నగరంలో కాలేజీ చదువుకు ఆ గ్రామ విద్యార్థులు ఆ చెరువు కట్టపైన సైకిళ్ళపైన, గుర్రపు బండిలో, స్కూటర్లపైన జిల్లా నగరానికి వెళుతుంటారు.


ఆ పండ్ల తోటలలో మామిడి చెట్లు, జామ చెట్లు, పనస చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు మెండుగా ఉంటాయి. ప్రకృతి సౌందర్యానికి కారణమైన చిలుకలు, గోరువంకలు, శకున పక్షులు, ఉడతలు, కోతులు, కొన్ని తోటల్లో కుందేళ్ళు, పిచ్చుకలూ, కాకులూ కూడా ఉంటాయి. వాటి గళ స్వరా‍లు వినడానికి ఎంతో రమ్యంగా, ఇంపుగా ఉంటాయి.


ఆ గ్రామానికి పెద్ద వీరరాఘవయ్య గారు, వారి అర్థాంగి పార్వతి, వారి తనయుడు పద్మనాభయ్య, వారి సతీమణి భవాని, పద్మనాభయ్యగారి సోదరుడు సత్యయ్య, సోదరి సుశీల.


సుశీల, సత్యయ్యలు ఆ గ్రామం ప్రైమరీ స్కూల్లో చదివి, హైస్కూలు, కాలేజీ నెల్లూరులో చదివారు. ఆ గ్రామ వాస్తవ్యులు గోవర్ధనరావు, వారి భార్య నిర్మలమ్మ వీరరాఘవయ్యగారి చెల్లెలు. 


గోవర్ధనరావు ఆ గ్రామ కరణం, మున్సబ్. వారి కుమారుడు ధనుంజయరావు గారితో సుశీల వివాహాన్ని వీరరాఘవయ్యగారు, వారి అర్థాంగి పార్వతి ఘనంగా జరిపించారు.


ధనుంజయరావు-సుశీల దంపతులకు మూడు సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ కలిగింది. ఆమె పేరు అమృత. కూతురంటే ధనుంజయరావుకు ఎంతో ప్రేమ... అభిమానం…


భద్రాచల శ్రీరాములవారి దర్శనానికి బయలుదేరిన గోవర్ధనరావు, నిర్మలమ్మ, వీరరాఘవయ్య, పార్వతులు బోటులో గోదావరి నదిలో ప్రయాణం చేసేటప్పుడు గోదావరి పొంగి బోటు తిరగబడి ఆ నలుగురు, మరికొందరు యాత్రికులు గతించారు. తన తల్లిదండ్రులు వీరరాఘవయ్యగారి మూలంగా చనిపోయారని ధనుంజయరావుకి పద్మనాభయ్య కుటుంబం పట్ల పగ, ద్వేషం…


ఆ కారణంగా ఆ రెండు ఇండ్లకు పెద్దలుగా పద్మనాభయ్య, ధనుంజయరావులు మారిపోయారు.

గోవర్ధనరావు... వ్యసనపరుడు. ఆడవారంటే అతనికి గౌరవం లేదు. మనిషి అహంకారి. తన మాటే—అది మంచైనా, చెడైనా—నెగ్గాలనే తత్త్వం. నాస్తికుడు. ధనబలంతో దేన్నైనా సాధించగలమనే అహంకారం.


పద్మనాభయ్యగారు సౌమ్యుడు, ఆస్తికుడు, పరోపకారి, హైస్కూలు టీచర్, వ్యవసాయదారుడు, మధ్యతరగతి కుటుంబీకుడు. వారి భార్య భవాని సహనశీల.


సుశీల తన అన్న పద్మనాభయ్యగారి వలెనే దైవభక్తి కలది. పూజలు, నోములు, వ్రతాలు పద్ధతిగా చేసేది. లేనివారికి దానధర్మాలు చేసేది. ఆమెలోని ఈ తత్త్వాలు ధనుంజయరావుకు నచ్చేవి కావు. 


అకారణంగా భార్యాభర్తల మధ్యన అనుకూలవంతమైన దాంపత్యానికి అంతరాయం, భేదాభిప్రాయాలు...

కానీ ధనుంజయరావుకూ తన కూతురు అమృత అంటే పంచప్రాణాలు. ఆమె ఏది కోరినా నిమిషాల్లో ఆమె ముందు ఉంచేవాడు…


పద్మనాభయ్య-భవానీలకు ఒక కొడుకు చంద్రశేఖర్, ఒక కూతురు కావ్య. కావ్య పెద్దది... చంద్రశేఖర్ చిన్నవాడు. రెండేళ్ళ వయస్సు వ్యత్యాసం. చంద్రశేఖర్‌కు తన అక్క కావ్య అంటే ప్రాణసమానం. ఇంట్లో అక్కను ఏ పనీ చేయనివ్వడు, అన్ని పనులూ తనే చేసేవాడు. 


తల్లిదండ్రులయందు ఎంతో ప్రేమానురాగాలు.

సుశీల, తన భర్త ప్రవర్తన సరిగా లేకపోయినా, అతన్ని గురించి తన అన్నవదినలకు ఒక్క మాటను కూడా చెప్పేది కాదు. తన కష్టాలను సర్వేశ్వరుడితో చెప్పుకునేది. తన భర్తలో పరివర్తనను కలిగించమని ఆ దేవుని నిత్యం మనసారా ప్రార్థించేది.


కాలగతిలో ధనుంజయరావు సుశీలకు దూరమైనాడు. తన కామవాంఛలను పట్నంలో ఉన్న కాంతలతో తన ఇష్టానుసారంగా తీర్చుకునేవాడు. కొంతకాలానికి ఆ విషయం తెలిసిన సుశీల ఎంతగానో ఏడ్చేది. ఏనాటికైనా భర్తలో మార్పు రాదా అని తనను తాను సమాళించుకునేది. తన భర్త తత్త్వాన్ని మార్చమని దైవాన్ని వేడుకునేది.


ధనుంజయరావు గారి ఘనచరిత్ర గ్రామంలో ఒక నోటి నుంచి మరొకరి చెవికి పాకి, కొందరికి తెలిసిపోయింది.

గోవర్ధనరావుకు, సుశీలకు పదేళ్ళ వయస్సు వ్యత్యాసం; అయినా వీరరాఘవయ్య, గోవర్ధనరావుల మధ్య ఉన్న బంధుత్వం, స్నేహం కారణంగా వీరరాఘవయ్య దంపతులు ధనుంజయతో సుశీల వివాహానికి అంగీకరించారు, జరిపించారు.


ఆ పెద్దలు కాలగతిలో కలిసిపోయారు. కానీ వారు ముడివేసిన ధనుంజయరావు-సుశీలల వివాహబంధం అస్తవ్యస్తంగా మారింది.


పద్మనాభయ్య, గోపాలయ్య ఇరువురూ హైస్కూలు టీచర్లు, మంచి స్నేహితులు. పద్మనాభయ్య తెలుగు పండిట్, గోపాలయ్య ఇంగ్లీష్ మాస్టర్.


గోపాలయ్య భార్య మాలతి. వారికి ఒక కూతురు, పేరు చంద్రిక.


పద్మనాభయ్య కొడుకు చంద్రశేఖర్, కూతురు కావ్య. గోపాలయ్య కూతురు చంద్రిక. ఆ గ్రామంలో హైస్కూలు చదువు ముగించి పట్నంలో (జిల్లా హెడ్ క్వార్టర్స్, నెల్లూరు) కాలేజీలో చేరారు. కావ్య, చంద్రిక దాదాపు... ఒకే వయస్సు వారు.

చంద్రికకు చంద్రశేఖర్ పట్ల అభిమానం, గౌరవం చాలా ఎక్కువ.


చంద్రికకు బి.ఎస్సీ. ముగించి, బి.ఈడి. చదివి తన తండ్రి గారిలా టీచర్ కావాలనే ఆశ.

కావ్యను బాగా చదివించి, సివిల్స్ పరీక్షలు వ్రాయించి కలెక్టర్ చేయాలనే కోరిక.


అమృతకు బి.ఎస్సీ. ముగించి చంద్రశేఖర్‌ను పెళ్ళి చేసుకోవాలనే ఆశ.

చంద్రశేఖర్‌కు డిగ్రీ చదువు ముగించి ఐ.పి.ఎస్. చేయాలనే భావన.


అందరిలో అతి తెలివైనది కావ్య.

అమృత, చంద్రిక, చంద్రశేఖర్‌లు కావ్యను అడిగి వారి సందేహాలను తీర్చుకునేవారు.


అందరూ కాలగమనంలో వారి వారికి తోచినట్లు ఆడాలనుకుంటున్న తోలుబొమ్మలు.

యావత్ ప్రపంచ సృష్టికర్త సర్వేశ్వరుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు.


హైందవ పెద్దల విశ్వాసం: పూర్వజన్మ సుకృత ఫలమే ఈ జన్మలో జీవుల/మనుషుల జీవిత విధానాలు. దీన్నే హైందవ పెద్దలు జన్మసుకృతం అంటారు. మరుజన్మ ఉందనేది వారి విశ్వాసం.


గతజన్మల పాప ఫలితాన్ని మరుజన్మలో అనుభవించక తప్పదనేది హైందవత వాదన, నమ్మకం.


పై మూడు కుటుంబాల్లో తాతల తరం ముగిసిపోయింది. అంటే పద్మనాభయ్యగారి తండ్రి వీరరాఘవయ్యగారు, వారి సతీమణి పార్వతి; ధనుంజయరావు గారి తండ్రి గోవర్ధనరావు, వారి అర్థాంగి నిర్మలమ్మగారు; తాతగారు పుండరీకయ్య, వారి అర్థాంగి వనజాక్షి (గోపాలయ్యగారి అమ్మనాన్నలు) సుచరితతో బ్రతికి గతించారు.


వారి తరువాతి తరం వారు... పద్మనాభయ్య, అర్థాంగి భవాని, వారి తమ్ముడు సత్యయ్య, అర్థాంగి మాధవి; ధనుంజయరావు, వారి భార్య సుశీల (పద్మనాభయ్య సోదరి); గోపాలయ్య, వారి ఇల్లాలు మాలతి; సరాగాల సాంబయ్య రెండవ తరం ప్రముఖులు.


పద్మనాభయ్యగారి కూతురు కావ్య, చంద్రశేఖర్; ధనుంజయరావుగారి కూతురు అమృత; గోపాలయ్య గారి కూతురు చంద్రిక; సరాగాల సాంబయ్య కొడుకులు మురారి, నరహరి మూడవ తరం వారు.


అందరూ ఆ దేవుడు చేసిన తోలుబొమ్మలు... ఆ బ్రతికి ఉన్న వారి జీవిత విధానాలను సృష్టికర్త ఎలా చిత్రించి ముందుకు నడిపాడో!... ఎలా వారి వారి అవతారాల పరిసమాప్తిని నిర్ణయించాడో!! ఆ నటన సూత్రధారి సర్వేశ్వరుడికే ఎరుక...


============================================================

ఇంకా వుంది..

తోలు బొమ్మలు - పార్ట్ 4 త్వరలో మీ ముందుకు వస్తుంది.

============================================================


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page