బందిపోట్ల తెలివి

Bandipotla Thelivi - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
బందిపోట్ల తెలివి - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 16/09/2026
అనగనగా గజపతినగరమనే రాజ్యం ఉండేది. ఆనందవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆనందవర్ధనుడి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. పంటలు సకాలంలో పండేవి. వర్షాలు సకాలంలో కురిసేవి. చెరువులు, బావుల్లో నీరు పుష్కలంగా ఉండేది. ప్రజలపై పన్నుల భారం తక్కువగా ఉండేది. దోపిడీలు, దొంగతనాలు ఉండేవి కావు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అనారోగ్యాలు లేవు. ఆకలి చావులు లేవు. అధిక ధరలు లేవు. రైతుల ఆత్మహత్యలు లేవు. అడుక్కుతినే బిచ్చగాళ్లు లేరు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేవు. ఆనందవర్ధనుని పాలనలో ఆనందం తప్ప ప్రజలకు మరేమీ లేదు.
ఆనందవర్ధనుని మరణం తరువాత అతని కుమారుడు మణివర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. రాజ్యాన్ని గురించి పట్టించుకోలేదు. రైతుల కష్టాలు తెలియవు. ప్రజల కన్నీళ్లు తెలియవు. పాలనపై మక్కువ లేదు. యుద్ధం చేయగల వీరుడే, కానీ చేయడు. యుద్ధం చేయడానికి బద్ధకం. పాలనకు బద్ధకం. జల్సాల్లో తేలేవాడు. ఒకసారి తన మీదకు దండెత్తి వచ్చిన శత్రురాజుకు లంచం ఇవ్వజూపాడు. అనేక బంగారు, వజ్ర, వైడూర్య, కెంపు నగలు శత్రురాజుకు ఇచ్చి సంధి చేసుకుందాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ నగలన్నీ అడవి మార్గం గుండా ఆ రాజుకు పంపసాగడు.
ఆ అడవి మార్గంలో బందిపోట్ల బెడద ఎక్కువ. మణివర్ధనుడు శత్రురాజుకు పంపుతున్న బహుమానాలను బందిపోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని సర్వసైన్యాధ్యక్షుడు రాజుకు చేరవేశాడు. రాజు హుటాహుటిన నగల దోపిడీ గురించి సమావేశం ఏర్పాటు చేశాడు.
రాజు మంత్రితో "బందిపోటు దొంగలు మన రాజ్యంలో రాజు సంపదపై ఏనాడూ పడలేదు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టారే తప్ప... ఆ సంపద ఎక్కడ దాచిపెట్టారు?" అన్నాడు.
మంత్రి "రాజా, దొంగలను పట్టుకోవడంలో ఆరితేరిన మన కుక్కలను వదిలి సంపద ఎక్కడ దాచారో తెలుసుకోవచ్చు" అనగా, వెంటనే రాజు కుక్కలను వదిలాడు.
ఆ కుక్కలు తిన్నగా రాజ్యం మధ్యలో ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. మంత్రి వెంటనే ఆ చెరువులోని నీటిని భటులను పెట్టి తోడించాడు. ఒక రోజంతా భటులు కష్టపడిన తరువాత నీటిని మొత్తం తోడారు. చెరువులోని నీరు మొత్తం తోడిన తరువాత భటులు చెరువును గాలించగా నగలన్నీ దొరికాయి. బందిపోట్లు చేసిన ఈ పనికి రాజుతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. దీని వెనుక మతలబు ఏమిటి అని రాజు మంత్రిని అడిగాడు.
మంత్రి ఇలా చెప్పాడు: "మన రాజ్యంలో వ్యవసాయం ప్రజల జీవనాధారం. ఆ వ్యవసాయానికి మూలం ఈ పెద్ద చెరువు. దీనిని తమరు పట్టించుకోలేదు. మీ వంశమంతా ఈ చెరువును ప్రతి ఏటా బాగుచేసి ప్రజలకు అన్నం పెట్టేవారు. తమరు అధికారంలోకి వచ్చి యాభై సంవత్సరాల నుండి ఈ చెరువును పట్టించుకోలేదు. రాజ్యమంతా సాగునీరు లేక పంటలు పండక కరువు తాండవిస్తోంది. ఈ చెరువును బాగుచేయాలనేది బందిపోట్ల ఆలోచన. ఇకనైనా తమరు చెరువును బాగుచేస్తే రాజ్యంలో ప్రజలకు అన్నం దొరుకుతుంది."
మంత్రి మాటలు రాజును మార్చాయి. ఆ చెరువును బాగుచేయించి రైతులకు సాగునీరు అందించాడు. ఇదివరకుటి తమ వంశం వారిలా ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తానని మనసులో ప్రతిన పూని రాజ్యపాలనపై దృష్టి పెట్టి మంచి పేరు సంపాదించాడు. పెద్ద చెరువుకు కాలువలు తవ్వించి రైతులకు మేలు చేశాడు. కొంతకాలానికి రాజు చేపట్టిన మంచి కార్యాల వలన మణివర్ధనుని రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు పూర్తిగా తగ్గాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments