top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 69

8 minutes ago
7 min read

శర్మిష్ఠ ఎక్కడో ఒక మూల గదిలో ఏడుస్తూ ఉంటుందనుకొంది దేవయాని. 



ఆమె ఊహకు విరుద్ధంగా మదనిక, కణికలతో కలిసి శర్మిష్ఠ దేవయాని గదిలోకి వచ్చింది. 

Kachadevayani - Part 69 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 69 తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 20/09/2026


కచదేవయాని ధారావాహిక 69వ భాగం: దేవ-దానవ యుద్ధం ముగిసి రాక్షసులు విజయం సాధించినప్పటికీ, దానవ రాజ్యంలో ఆ సంతోషం మచ్చుకైనా కనిపించలేదు. తమ ప్రియతమ యువరాణి శర్మిష్ఠ స్థానంలో శుక్రాచార్యుని పుత్రిక దేవయాని యయాతి మహారాజును పెళ్లి చేసుకోనుండటంతో అంతటా శోకచ్ఛాయలు అలముకున్నాయి. గురుపుత్రిక అసంతృప్తి చెందకూడదన్న రాజాజ్ఞతో రాజ్యమంతా పండుగ వాతావరణాన్ని నటిస్తుంటే, గుండెల్లో కసిని దాచుకుని నవ్వులు పూయిస్తోంది శర్మిష్ఠ. ప్రతీకారంతో పెళ్లిపీటలెక్కిన దేవయాని ఎందుకు అసంతృప్తితో రగిలిపోతోంది? విరక్తితో యయాతి ఎందుకు సామాన్య సేవకుడిలా మారాడు? రచయిత్రి టి. వి. యెల్. గాయత్రి గారు అందించిన ‘కచదేవయాని’ 69వ భాగాన్ని పూర్తిగా చదవండి.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.  శర్మిష్ఠ  ప్రేమించింది  యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని.


తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని  సహాయం  కోసం  దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. దేవదానవ  యుద్ధంలో  దేవతలు  సంధికి  సిద్ధపడతారు.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కచదేవయాని - 69వ భాగం


రచన :టి. వి. యెల్. గాయత్రి

***********


యుద్ధం ఆగిపోయింది. దానవులు గెలిచారు. కానీ ఆ సంతోషం దానవుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. కారణం తమకు ప్రియమైన యువరాణి శర్మిష్ఠ వివాహం ఆగిపోయింది. శర్మిష్ఠ స్థానంలో  దేవయాని యయాతిని పెళ్లి చేసుకుంటోంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దానవులు. 

అంతటా నిశ్శబ్దం. ప్రజల ముఖాల్లో విచారం. రాచపరివారంలో శోకచ్ఛాయలు తాండవిస్తున్నాయి. గమనించాడు వృషపర్వుడు. 


ఆ రోజు ఉదయం తన మంత్రులను, సేనాధిపతులను, రాజ్యంలోని పెద్దలను సమావేశపరిచాడాయన. 


"శ్రద్ధగా వినండి! గురుపుత్రిక వివాహం యయాతి రాకుమారునితో నిశ్చయించాము. 

దిక్కులు వెలిగిపోయేలాగా రాజ్యం అంతటా అలంకారాలు చెయ్యండి! పాతాళ, నాగలోకాల నుండి వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లను ఘనంగా చెయ్యండి! ఏ విషయంలోనూ గురువుగారు కానీ, గురుపుత్రిక కానీ అసంతృప్తి చెందరాదు! "అన్నాడు. 


"కానీ మహారాజా! "అంటూ లేచాడు దీర్ఘదర్శి. 


"చెప్పు! "


"మన రాకుమారి జీవితానికి ఏముంది? మన బిడ్డకు జరగాల్సిన వివాహం ఇది.... "

దీర్ఘదర్శి మాట పూర్తి కాకుండానే 


"ఆపు! దీర్ఘా! మన భవిష్యత్తరము సుఖంగా జీవించడానికి మన జీవితాలను పణంగా పెట్టడంలో తప్పేముంది? యుద్ధంలో ఎంతో మంది వీరులు ప్రాణాలను కోల్పోయారు. వారి కంటే మన బిడ్డల త్యాగాలు గొప్పవి కావు! అందరికీ ఇదే నా ఆదేశం! 

ఎవ్వరూ దిగులుగా, బాధగా కనిపించకూడదు. అందరూ కళకళలాడుతూ ఉత్సవాన్ని జరిపించాలి!, ఇది నా ఆజ్ఞ! "అన్నాడు వృషపర్వుడు. 


తలవంచుకొని కూర్చున్నాడు దీర్ఘదర్శి. మహారాజు ఆదేశాన్ని ముఖ్యమైన వాళ్లందరికీ చేరవేశారు అధికారులు. 

వివాహ వేడుకలు మొదలయ్యాయి. 


ఆ రాత్రి అంతఃపురంలోకి వచ్చాడు వృషపర్వుడు. 

గంభీరంగా కూర్చుని ఉంది సుమాలినీ దేవి. ఆ ప్రక్కనే శర్మిష్ఠ. 

చూశాడు మహారాజు. 

"ఇలాగే ఉంటారా మీరు? కాస్త సంతోషంగా కనిపించండి! "అన్నాడు చికాకుగా. 


భర్త వైపు చూసింది సుమాలినీదేవి. 


"హు! సంతోషం! ఎక్కడి నుంచి వస్తుంది? మన బిడ్డకు జీవితం లేదు.... సంతోషం లేదు... ఆ దేవయాని మన మీద పగ తీర్చుకొంటోంది... ఏమీ చేయలేక ఏడుస్తూ కూర్చుంటున్నాము. అది కూడా తప్పేనా?" తీవ్రంగా పలికింది మహారాణి. 

అర్ధం అయింది మహారాజుకు. 

భార్యా బిడ్డల ప్రక్కన వచ్చి కూర్చున్నాడు. 


"అర్ధం చేసుకో మాలినీ! మన పరిస్థితిని గమనించు! మనము, మన రాజ్యముకూడా గురువుగారికి దాసులము. నాకు మాత్రం బాధ లేదా? దేవయాని ప్రతిష్ఠానపురానికి వెళ్ళాక ఏమి చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాము! "అన్నాడు అనునయంగా. 


కళ్ళనీళ్లను తుడుచుకొంది సుమాలినీదేవి. 


"నాన్నగారూ! మీరు చెప్పినట్లే  ముఖంలోకి సంతోషాన్ని తెచ్చి పెట్టుకొని అక్క పెళ్లిలో తిరుగుతాము! నాదొక విన్నపము... వింటారా?" అంది శర్మిష్ఠ. 


"చెప్పు తల్లీ! "


"నేను మునివాటికకు వెళ్లి తపస్సు చేసుకుంటానండి!... "


శర్మిష్ఠ మాట పూర్తి కాకుండానే 

"ఖర్మ! "అని తల కొట్టుకొంది మహారాణి. 


"ఆ దేవయానికి భూలోకవీరుడైన యయాతితో పెళ్లి. నా కూతురికి మాత్రం సన్యాసం!.. అంతా మన ఖర్మ! కోరి కోరి గురుపుత్రిక అని శనిగ్రహాన్ని తెచ్చి ఇంట్లో  పెట్టుకొన్నాము.. అదీ మన తెలివి తక్కువ తనం! మన పిల్లతో సమానంగా చూశాను! దానికి కృతజ్ఞత లేదు.. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టింది. రాజసంగా వచ్చి మన అల్లుడిని ఎగరేసుకొని పోతోంది... " అంటూ భోరుమంది మహారాణి. 

తల్లి భుజాలు పట్టుకొంది శర్మిష్ఠ. 


"ఊరుకో అమ్మా! నువ్వు ఆవేశపడినా ఏదీ ఆగదు! జరగాల్సిన హాని జరిగిపోయింది. ఊరుకో! " అంది మెల్లగా. 


"ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే గత్యంతరం లేదు మాలినీ! లోలోపల ఎలా ఉన్నా పైకి  మన బాధను కనిపించనివ్వొద్దు! ఏడుస్తూ కార్యాన్ని నిర్వహించే కంటే మనమందరం కాస్త సంతోషాన్ని నటిస్తూ, హుందాగా ప్రవర్తిద్దాము! " అన్నాడు మహారాజు. 


"ఆలాగే నాన్నగారు! మీరే చూస్తారుగా! మా అభినయం ఎలా ఉంటుందో! " అని పల్చగా నవ్వింది శర్మిష్ఠ. 


ఆ నవ్వులో జీవం లేదు. కానీ ఒక రకమైన కసి ఉంది. 

కూతురుని దగ్గరకు తీసుకొన్నాడతడు. 

"నాకు కూడా అదే కావాలి! " అని పక్కన ఉన్న గంటను కొట్టాడు. 


పరిచారిక లోపలికి వచ్చింది. 

"నా ఆజ్ఞను విన్నావుగా! ఈ నిమిషం నుండి అందరూ ఉత్సాహంగా ఉండాలి! ఎక్కడా ఏ లోపము జరుగరాదు! అందరికీ చెప్పు! " అన్నాడు మహారాజు నవ్వుతూ. 

"ఆలాగే మహారాజా! " అంటూ పరిచారిక వెళ్లిపోయింది. 


రెండోరోజు ఉదయం నుండి దేవయానికి పెళ్లికూతురుగా తయారు చేస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. 

 కిలకిలా నవ్వుతూ దాసీలు వచ్చి దేవయానిని నిద్రలేపారు. 

బంధువులతో కలిసి వచ్చిన సుమాలినీ దేవి ఆప్యాయంగా దేవయానిని పలకరించి  నగలు, చీరలు ఇచ్చి వెళ్ళింది. 


శర్మిష్ఠ ఎక్కడో ఒక మూల గదిలో ఏడుస్తూ ఉంటుందనుకొంది దేవయాని. 


ఆమె ఊహకు విరుద్ధంగా మదనిక, కణికలతో కలిసి శర్మిష్ఠ దేవయాని గదిలోకి వచ్చింది. 

"అక్కా! ఇప్పుడు ఉయ్యాల ఉత్సవానికి ఈ చీర బాగుంటుంది! కట్టుకుంటావా! లేకపోతే ఈ పసుపు రంగు చీర బాగుంటుందా?" అంది ఉత్సాహంగా చీరలను చూస్తూ. 


"ఇది కాదు శర్మిష్ఠా! ఈ ఆకుపచ్చ చీరను చూడు! దీన్ని కట్టుకుంటే అక్క మెరిసిపోతుంది! " అంది కణిక. 


నిర్ఘాంతపోయి చూస్తోంది దేవయాని. 


'ఇదేమిటి? తను ప్రేమించిన యయాతి దూరమవుతుంటే కొంచెం కూడా బాధపడకుండా శర్మిష్ఠ ఇలా ప్రవర్తింస్తుందేమిటి? '


అయోమయంగా నిల్చున్న దేవయానితో ఛలోక్తులు ఆడుతున్నారు శర్మిష్ఠా వాళ్ళు. 


ఆ పూట దేవయానికి ఉయ్యాల ఉత్సవం వైభవంగా జరిగింది. 

కొంతమంది ఆడపిల్లలు పాటలు పాడుతున్నారు. 

కొంతమంది నాట్యం చేస్తున్నారు. 

ఇంతలో విరజాదేవి వచ్చి శర్మిష్ఠను నాట్యం చేయమనడంతో నవ్వుతూ శర్మిష్ఠ నాట్యం చేసింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. 

దేవయానికి సంతోషంగా లేదు. అందరినీ నిశితంగా గమనిస్తోంది. 

అక్కడున్న వాళ్లంతా ప్రఫుల్ల వదనాలతో తిరుగుతున్నారు. 

రాత్రికి తన గదిలోకి వచ్చింది దేవయాని. 

ఆమెలో అసంతృప్తి


'తను యయాతిని గెల్చుకొంది. కానీ ఆ గెలుపులో ఏదో వెలితి. ఎక్కడో ఓడిపోయిన భావన. 

శర్మిష్ఠ ఏడిస్తే బాగుండేది. సుమాలినీదేవి దిగులుతో మంచం పడితే బాగుండేది. 

అదేమీ లేకుండా అందరూ ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అదే బాధ! అసలు యయాతిని  తను పెళ్లి ఎందుకు చేసుకుంటోంది? శర్మిష్ఠను ఏడిపిద్దామని! ఎక్కడో లెక్క తప్పింది. '

ఆలోచనలతో అసంతృప్తితో ఆ రాత్రి దేవయానికి నిద్రపట్టలేదు. 


అదే రోజు రాత్రి మరొక భవనంలో ఉన్న యయాతి ఆశాంతిగా పచార్లు చేస్తున్నాడు. 

దాసీగా ఆశ్రమంలో ఉన్న శర్మిష్ఠ రూపం గుర్తుకు వచ్చింది అతడికి. దుస్సహంగా ఉంది. 

మనసులో బాధ తగ్గటం లేదు. 


ఇంతలో పాలను తీసుకొని  గదిలోకి సేవకుడు వచ్చాడు. 

చూశాడు యయాతి. 

తను కూడా దేవయానికి దాసుడే! 

"నువ్వు వేసుకొనే దుస్తుల లాంటివి తెచ్చిపెట్టు! " అన్నాడు యయాతి సేవకుడితో. 


విస్మయంగా యువరాజును చూచి 

"ఆలాగే యువరాజా! "అని వెళ్లిపోయాడు సేవకుడు. 


వెంటనే యయాతి తన వంటి మీద ఉన్న మొత్తం ఆభరణాలను తీసివేశాడు. 


కాసేపటికి సేవకుడు సేవకులు ధరించే వస్త్రాలను తెచ్చిపెట్టాడు. 


"ఇంకేమన్నా కావాలా యువరాజా?"


"ఊ.... ఒక నులక మంచం పట్రా! "


నులక మంచాన్ని తెచ్చిపెట్టి సేవకుడు వెళ్లిపోయాడు. 


ఆ రాత్రి అతి సామాన్యమైన దుస్తులను ధరించి, నులక మంచం మీద పడుకున్నాడు యయాతి. ఇప్పుడు కొంచెం శాంతిగా ఉంది అతడికి. 

శర్మిష్ఠనే తల్చుకొంటూ ఎప్పటికో నిద్రపోయాడు వీరాధివీరుడైన భావి భూలోక చక్రవర్తి. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 70 త్వరలో

===============================================



T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page