కచదేవయాని - పార్ట్ 48
- T. V. L. Gayathri

- 1 day ago
- 5 min read

Kachadevayani - Part 48 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 31/03/2026
కచదేవయాని - పార్ట్ 48 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్య భాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. పొర్ణమినాడు కలుస్తానని చిలుక రూపంలో ఉన్న చారుమతి ద్వారా వర్తమానం పంపుతాడు యయాతి.
కచుడి మీద పగతో దేవయాని, యయాతి మీద ప్రేమతో శర్మిష్ఠ ఎదురు చూస్తూ ఉంటారు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక నలభై ఎనిమిదవ భాగం చదవండి.
"చేతిలో మణి, మనసులో కుట్ర శర్మిష్ఠకు ఎదురుగా ప్రమాదం!"
ఉత్కంఠభరితమైన టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - నలభై ఎనిమిదవ భాగం చదవండి.
ఆ రాత్రి దుర్మిలుడిచ్చిన మణిని పెట్టె లోనుంచి తీసింది దేవయాని. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. మణిని చేతిలో పట్టుకొని ' ఇదే నా ఆయుధం! ఇదే నా ఆశయానికి సాధనం! ' అనుకుంటూ మంచం మీద పడుకుంది. ఆమె మనస్సు ఉద్వేగంగా ఉంది.' రేపు వచ్చే అవకాశాన్ని తాను ధైర్యంగా ఉపయోగించుకోవాలి! శర్మిష్ఠ! .... రాజకుమారి... ప్రియుడి మరణాన్ని చూస్తూ గోలు గోలు మని ఏడుస్తూ.....' దేవయాని మణిని అపురూపంగా గుండెల మీద పెట్టుకొని తనలో తాను చేయబోయే పనికి సిద్ధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది.
తెల్లవారక ముందే లేచి తయారయ్యంది శర్మిష్ఠ.
నీలిరంగు మీద తెల్లని హంసల చిత్రాలతో నేసిన పట్టు చీర అది.
దానికి తగిన ఆభరణాలు ధరించిందామె.
అప్పటికి ఇంకా దేవయాని తయారవుతూ ఉంది.
దుర్మిలుడు ఇచ్చిన మణిని మెడలో వేసుకొంది. మరొక ముత్యాల గొలుసును మాత్రం ధరించింది.జడ వేసుకుంటూ ఉంటే శర్మిష్ఠ వచ్చింది.
"అరే! నీ చీర నా చీర రెండూ ఒకే రకంగా ఉన్నాయి! భలే తమాషా! "అంది శర్మిష్ఠ నవ్వుతూ.
చూసింది దేవయాని.
నిజమే!
రెండూ నీలి రంగు చీరలే.అయితే దేవయాని చీర మీద మందార పూవుల చిత్రాలు ఉన్నాయి.
మణి ప్రభావం దేవయాని మీద పని చేస్తోంది.
చికాకుగా మొహం పెట్టిందామె.
శర్మిష్ఠ దగ్గరికి వచ్చింది.
" చూడు! నువ్వేదో అందగత్తె వని అందరూ తెగ పొగుడుతుంటారు కదా! నీ ఒంటికి ముదురు రంగులు బాగుండవు! లేత రంగుల చీరలు కట్టుకుంటే కాస్త బాగుంటావు! ఇలాటి రంగులు నా లాంటి వాళ్లకు బాగుంటాయి! నువ్వు రాజకుమారివి కాబట్టి నీ వాళ్లంతా నీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ రాచరికం లేని నాడు ఎలా ఉంటావో ఒకసారి ఊహించుకో! "
అవాక్కయింది శర్మిష్ఠ.పుట్టి బుద్ధెరికి ఇలాంటి విమర్శను ఎప్పుడూ వినలేదామె. ఇంకెవరైనా రాజకుమారిని చిన్న మాట అంటే చాలు! వాళ్ళ తల ఎగిరిపోతుంది! అసలు అక్కకు ఏమయింది?
ఇలా మాట్లాడుతుందేమిటి? కనీస మర్యాద కూడా మరచిపోయి! ....
ఈ లోపల మదనిక " వెళ్దామా! "అంటూ అక్కడికి వచ్చింది.
"పద! త్వరగా వెళ్ళాలి! "అని కదిలింది శర్మిష్ఠ.ఆమె ముఖంలో ప్రసన్నత లేదు.
వాళ్ళ వెనకాలే బయలు దేరింది దేవయాని.
వీళ్ళు భవనం వెలుపలికి వచ్చే సరికి కణిక,ఘూర్ణికలతో పాటు ఇంకో పదిహేను మంది చెలికత్తెలు తయారుగా ఉన్నారు.
ఐదు రథాలు సిద్ధంగా ఉన్నాయి.
రథాల ప్రక్కన బలిష్ఠమైన ఆడవాళ్లొక పదిమంది బల్లేలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళ నడుముల దగ్గర కత్తులు వేలాడుతున్నాయి.అందరూ ఆడవాళ్ళే! మగసైనికులు ఎవ్వరూ రావటం లేదు.
ఇంతలో శర్మిష్ఠ భవనానికి కాపలాగా ఉండే 'నారాచి 'అనే యోధురాలు వీళ్ళ దగ్గరికి వచ్చింది. నారాచికి నలభై ఏళ్ళుంటాయి. కాయబారు మనిషి. చేతిలో ఆయుధం లేకపోయినా పదిమంది యోధులను ఒంటి చేత్తో మట్టి కరిపించగల బలవంతురాలు.
"అదేమిటి? మనకు తోడుగా రక్షక భటులు రావటం లేదా?" ఆశ్చర్యంగా అడిగింది దేవయాని.
"ఎందుకు? దేవాలయానికి శత్రువులెవరు వస్తారు? మన సీమలోకి అడుగు పెట్టే సాహసం ఎవరు చేస్తారు? అంత ధైర్యం ఎవరికుంటుంది? అయినా మేమంతా యుద్ధ విద్యల్లో నిష్ణాతులం! ఏం భయం లేదక్కా! "అంది శర్మిష్ఠ దర్పంగా.
"అలాగా! అంత యోధులా మీరంతా?... హు! ..మీ గురించి గొప్పలు మీరు చెప్పుకోవాల్సిందే! .." అంది వెటకారంగా దేవయాని.
చివుక్కున తల ఎత్తి దేవయానిని చూసింది నారాచి.
ఆమె చెయ్యి కత్తి పిడి మీద బిగుసుకుంది.
'ఊరుకో! ' మన్నట్లుగా కళ్ళతో నారాచికి సైగ చేసింది శర్మిష్ఠ.
తలను పంకించింది నారాచి.
వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా " ఇప్పుడే వస్తా! "అంటూ భవనం లోపలికి పరుగెత్తింది దేవయాని.
ఆమె వెళ్లిన వైపే చూస్తున్నారందరు.
"ఈ రోజు అక్కకేమయింది?"అడిగింది కణిక.
"ఏమో! తెలీదు! ఇలా మాట్లాడటాన్ని ఇప్పుడే వింటున్నా! "బదులిచ్చింది శర్మిష్ఠ.
"ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటాను! "అంది నారాచి కోపంగా.
" ఊరుకో నారాచీ ! అక్క గురుపుత్రిక! కాస్త నిదానించు! "అంది మందలింపుగా శర్మిష్ఠ.
తలవంచుకొని నిల్చుంది నారాచి.
గదిలోకి వచ్చిన దేవయాని తన మంచం ప్రక్కన ఉన్న సొరుగు లోనుంచి ఒక చురకత్తిని తీసుకొంది.
"ఇది చాలు! కచుడిని చంపటానికి! "అనుకుంటూ కత్తిని ఎవరికీ కనిపించని తీరులో బొడ్డు దగ్గర దోపుకొని, చీరను గట్టిగా కట్టుకొని మళ్ళీ పరుగు లాంటి నడకతో వచ్చి శర్మిష్ఠ వాళ్ళను చేరుకుందామె.
రథాలు బయలు దేరాయి. దేవాలయానికి చేరుకున్నారందరు. ముందు రోజే వీళ్ళ రాక గురించి మహారాజు నుండి దేవాలయ అధికారులకు సమాచారం అందింది. వీళ్లందరినీ పూర్ణ కుంభంతో స్వాగతించారు అధికారులు.
"రాజకుమారీ! మీరంతా త్వరగా స్నానం చేసి రండమ్మా! మహాదేవునికి పూజలు చేస్తాము! "అని చెప్పారు పూజారులు.
ఆడపిల్లలంతా కోనేటి దగ్గరికి వెళ్లారు. మిగిలిన యోధురాళ్లు రథాల్లోనుంచి స్నానం అయ్యాక ఆడపిల్లలు ధరించే నగలు, చీరలు, అలంకార సామగ్రిని తీసి మంటపంలో సర్దుతున్నారు.
ఆ రోజేమిటో గాలి రివ్వుమని వీస్తోంది.
నారాచి ఆకాశం వైపు చూసింది.సమయానికి ఉదయించాల్సిన సూర్యుడు ఇంకా రాలేదు. ఆకాశంలో నల్లటి మేఘం ఒకటి సూర్యుడికి అడ్డంగా వచ్చింది.
నారాచి మనసు కీడును శంకించింది.
'రాజకుమారికి వివాహం అనుకుంటూ ఉంటే తన మనసెందుకు ఆందోళన పడుతోంది?' అనుకుంటూ కోనేటి వైపు చూసింది.
శర్మిష్ఠ వాళ్లంతా తమ తమ చీరలు విప్పి చిన్న చిన్న అంగవస్త్రాలు కట్టుకొని కోనేటి లోకి దిగుతున్నారు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 48 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |




Comments