కచదేవయాని - పార్ట్ 36
- T. V. L. Gayathri

- 3 days ago
- 5 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 36 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/01/2026
కచదేవయాని - పార్ట్ 36 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడిని కలిసి, కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని. అతనితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది. శత్రువును కదలకుండా చేసే మణిని దేవయానికి ఇస్తాడు దుర్మిలుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై ఆరవ భాగం చదవండి.
యయాతి విమాన చోదక శిక్షణను తీసుకుంటున్నాడనే సమాచారం దానవ రాజుకు చేరింది.నహుషచక్రవర్తి ప్రతిష్ఠానపురానికి చేరుకున్నాడు.
యయాతి విమాన పోటీ ముగించుకొని రావటానికి ఇంకా నెలపడుతుంది.
వృషపర్వునికి గర్వంగా ఉంది. తన అల్లుడు సామాన్యుడు కాడు. వీరాధి వీరుడు. భూలోకంలో అటువంటి వాడు దుర్భిణీ వేసి వెదికినా కనిపించడు. గబగబా అంతఃపురానికి వచ్చి సుమాలినీ దేవికి విషయం చెప్పాడు. శుభవార్త విన్న వెంటనే ఆమె కూడా ఎంతో సంతోషంతో విరజాదేవి దగ్గరికి వచ్చింది. అప్పటికే సంయాతి కుమారునితో ఆ విషయమే ముచ్చటిస్తోంది విరజాదేవి.
"యయాతి కుమారుడు వచ్చేదాకా మీరందరు ఇక్కడే ఉండండి విరజా! అతడు వచ్చాక అమ్మాయిని చూపించి ముహూర్తాలు పెట్టుకుందాము! " అంటూ అభ్యర్థించింది సుమాలినీ దేవి.
"నిజమే! ఇంతలో వెళ్ళటం రావటం ఎందుకు?" ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంది విరజాదేవి.
ప్రతిష్ఠానపురంలో చేయవలసిన రాచకార్యాలున్నాయని తానొక్కడే వెళ్ళిపోయాడు సంయాతి. వృషపర్వుని బంధుజనం కూడా ఇక్కడే ఉండిపోయారు.కాబోయే అత్తగారైన విరజాదేవి ప్రక్కనే తిరుగుతూ, కబుర్లు చెబుతూ, ఆవిడ అవసరాలు చూసుకుంటూ ఉంది శర్మిష్ఠ. విరజాదేవి వచ్చినప్పటి నుండి ఆమెకు,ఆమె బంధుగణానికి ప్రత్యేకమయిన భవనంలో విడిది ఏర్పాటు చేశాడు దానవరాజు. వాళ్ళతో కాలక్షేపం చేస్తూ రాత్రికి ఎప్పటికో తన గదిలోకి వచ్చి పడుకుంటోంది శర్మిష్ఠ.
ఆ రోజు మదనిక, కణిక లిద్దరు శర్మిష్ఠ గదిని సర్దుతున్నారు. వాళ్లకు ఆమె మంచం మీద ఉండే దిండు క్రింద శర్మిష్ఠ, యయాతిల చిత్రపటం దొరికింది.
ఆశ్చర్యం! పూలమాలలు వేసుకొని చిత్రంలో ఉన్నారిద్దరు.
అప్పుడే గదిలోకి వచ్చింది శర్మిష్ఠ.

"ఇదన్నమాట రహస్యం! మాతో మాట మాత్రమైన చెప్పలేదే! ఎంత అన్యాయం!... ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? హమ్మ!... నువ్వు మా స్నేహితురాలవేనా?"
మదనిక చేతిలోని చిత్రాన్ని చూచి గబుక్కున చెలుల దగ్గరికి వచ్చింది శర్మిష్ఠ.
ఊహు! చిక్కలేదు. కణిక చేతికి చిత్రాన్ని అందించింది మదనిక.
వాళ్ళను పట్టుకుందామని శర్మిష్ఠ. ఆమెకు చిక్కకుండా చెలులు మంచం చుట్టూ పరిగెత్తుతున్నారు.
"చెప్తేనే ఇస్తాము! "అంటూ ఉడికిస్తున్నారు చెలులు.
కాసేపటికి ఉక్రోషంగా మంచం మీద కూలబడింది శర్మిష్ఠ.
"మొత్తం చెప్పు! మా దగ్గరే దాచి పెడతావా? హన్నా!... చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం! ఇప్పుడు పరాయి వాళ్లమయిపోయామా! " నిష్టూరంగా బుంగమూతి పెట్టింది కణిక.
"సరే! సరే! చెప్తాను! చెప్తాను! ముందా చిత్రాన్ని ఇలా ఇవ్వండబ్బా! "అంటూ ప్రాధేయపడింది.
"ఊహు! చెప్పాల్సిందే! నిన్ను నమ్మేదే లేదు! " నవ్వుతున్నారు చెలులు.
"మీరెవరికైనా చెప్తేనో? ఒట్టు వెయ్యండి! "చెయ్యి చాపింది శర్మిష్ఠ.
"ఒట్టు!..."
మెల్లగా యయాతి తన స్నేహితులతో కలిసి తన దగ్గరికి వచ్చిన విషయమంతా చెప్పింది శర్మిష్ఠ.
"ఆమ్మో! దేవతలతోనా? పైగా కచుడితోనా?" గుండెల మీద చెయ్యి వేసుకుంది కణిక.
"అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. ఆ కచుడు యువరాజుకు చాలా దగ్గరి స్నేహితుడు. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఏమంటారో అని చెప్పలేదు. పైగా మన దేవయాని అక్కకు కచుడు శత్రువు కూడా! ఎలాగో తెలియలేదు. పైగా మా అత్తగారు ఇక్కడే ఉన్నారు. తను నా కోసం రహస్యంగా వచ్చారు. యువరాజు చాలా మంచివారు. కానీ... దేవజాతి వాళ్ళతో స్నేహం.. ఏం చెయ్యను? అందుకని ఎవ్వరితో చెప్పలేదు...."
శర్మిష్ఠ ప్రక్కన వచ్చి కూర్చున్నారు చెలులు.కాసేపు మౌనంగా ఉన్నారు.
"నిజమే! కానీ మన జాతుల మధ్య శత్రుత్వాలే కాదు పెళ్లిళ్లు జరిగాయి. బంధుత్వాలు కూడా ఉన్నాయి. మన దేవయాని అక్క తల్లిగారు సాక్షాత్తు ఆ దేవేంద్రుడి కూతురు జయంతి. దానికి ఏమనాలి? పంతాలు పట్టింపులు ఎక్కువకాలం ఉండవులే! మనకు యువరాజు కావలసినవారు. వారి స్నేహితుల గురించి ఎందుకు బాధ? పైగా ఆ కచుడు ఈ భూలోకంలో ఉండడు. వాళ్ళది అమరావతి. ఈ విషయం గురించి నువ్వు పట్టించుకోకు! " అంటూ ధైర్యం చెప్పింది కణిక.
"అవును శర్మిష్ఠా! మనం అనవసరంగా కచుడి గురించి భయపడుతున్నామేమో! అన్నీ యువరాజు చూసుకుంటారు కదా! ఆ దేవతలు ఏదైనా హాని చేస్తే అతడికి తెలుస్తుంది. మంచిగా ఉంటే మనకూ వాళ్లకు మధ్య శాంతి నెలకొంటుంది."అంది మదనిక.
"నా ఆశకూడా అదే! రెండు జాతుల వాళ్ళు స్నేహంగా ఉంటే ఎంతో బాగుంటుంది. దాని కోసమే యువరాజు కృషి చేస్తున్నారు." అంటూ చిత్రాన్ని తీసికొని తన నగల పెట్టెలోదాచి, తాళం వేసి వచ్చింది శర్మిష్ఠ.
"అవును చెలీ! అందరికీ శుభం జరగాలని ఆశిద్దాం! అయితే కాబోయే శ్రీవారు విమాన చోదక శిక్షణలో ఉన్నారన్నమాట! మన సఖి కోసం విమానం తీసికొని వస్తాడేమో! "అంటూ శర్మిష్ఠ భుజం చుట్టూ చేతులు వేసింది కణిక.
నవ్వుకుంటున్నారు ముగ్గురు.
అంతలో తలుపు తోసుకుని అక్కడికి వచ్చింది దేవయాని.
"రా అక్కా! "అంటూ వచ్చి దేవయాని చెయ్యి పట్టుకొని తీసికొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టుకుంది శర్మిష్ఠ.
"ఈ మధ్య నాతో మాట్లాడటమే తగ్గించి వేశావు! "
దేవయాని మాటలకు నవ్వింది శర్మిష్ఠ.
"ఏదీ! బంధువులకు మర్యాదలు చేస్తూ... అలా గడిపేస్తున్నా! "
"ఊ!.. ఊ!.. నిన్ను చూడకపోతే నాకు తోచటం లేదు. అందుకే నీకోసం ఈ రోజు నుండి నీ గదిలోనే పడుకుందామని నిర్ణయించుకున్నా! " అంది నవ్వుతూ దేవయాని.
"అవునక్కా! మనమందరం ఒక్క నిమిషం కూడా చెలిని వదిలిపెట్టకూడదు! నీతో పాటు మేము కూడా ఇక్కడే పడుకుంటాము! నలుగురం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాము! " అంది మదనిక.
ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేసి వచ్చారు.
ఆ రాత్రి యయాతి ఆలోచనలతో శర్మిష్ఠకు నిద్ర పట్టలేదు.
అదే రాత్రి దేవయానికి కచుడి మీద క్రోధంతో నిద్ర పట్టలేదు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 36 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments