top of page
Original_edited.jpg

కచదేవయాని - పార్ట్ 24

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 24 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 20/11/2025

కచదేవయాని - పార్ట్ 24తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని. 

పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 24 చదవండి. 


రెండవ రోజు వేదగోష్ఠికి అందరూ వెళ్లారు. కచుడు యయాతిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. 


మొదటగా దేవేంద్రుడు లేచి నిల్చున్నాడు. 


"సభ్యులారా మీరందరూ ఇక్కడికి రావడం ఎంతో ముదావహం! ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాల నేదే ఈ సభ యొక్క ఉద్దేశం. మీ మీ లోకాలలో ఉన్న సమస్యలు ఏమిటో మాకందరికీ తెలియ చెప్పండి! అన్ని జాతుల వాళ్ళు సుఖంగా సఖ్యంగా ఉండటమే మనమందరము కోరుకోవలసింది. సమస్యలను విని పెద్దలైన వాళ్ళతో వాటికి పరిష్కార మార్గాల గురించి కూడా చర్చించుకొందాము! సర్వ జీవకోటి శ్రేయస్సును మేము కోరుకుంటున్నాము! ముందుగా ముని సంఘాల వారు వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పండి! " అంటూ అందరిని ప్రసన్నంగా చూచి కూర్చున్నాడు. 


ముని సంఘాల వాళ్లు తమ ప్రతినిధిగా అత్రి మహామునిని మాట్లాడమని చెప్పడంతో ఆయన లేచి ఇలా మాట్లాడసాగాడు. 

"భూమి మీద చక్రవర్తులు ఎవరైనా సరే మా ముని సంఘాలను జాగ్రత్తగా చూసుకోవాలి! మా యజ్ఞ యావాదులకు ఎటువంటి విగ్రహాలు రాకూడదు! ఎందుకంటే మా తపోఫలితంలో ఆరవ వంతు రాజుకు, ప్రజలకు శ్రేయస్సును చేకూరుస్తుంది. అయితే ఈ మధ్య ప్రజలలో ముని సంఘాలు అంటే కొంత చులకన భావం ఏర్పడుతోందని మేము గమనించాము. మాకు వ్యతిరేకంగా సిద్ధాంతాలను ప్రచారం చేసేవాళ్లను కఠినంగా శిక్షించి మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి! "అంటూ ముని సంఘాలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడాడు. 


ఆ తర్వాత గంధర్వులు, , కింపురుషులు వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాక దేవేంద్రుడు నహుషచక్రవర్తి వైపు తిరిగి 

"చక్రవర్తీ! భూలోక ప్రతినిధిగా మీరీ సభకు విచ్చేశారు. మీరు కూడా మీ సమస్యలను తెలియపరచండి! " అంటూ సాదరంగా పిలిచాడు. 


నహుషుడు లేచి నిల్చుని చేతులు జోడించి "మహేంద్రా! నేను యజ్ఞయాగాదులు చేసుకుంటూ నా రాజ్యభారాన్ని నా కుమారులకు అప్ప చెప్పాను! మా యువరాజు యయాతి మా భువిపై నున్న సమస్యలను సరిగ్గా వివరింపగలడు! కుమారునికి ఈ సభలో మాట్లాడే అనుమతినీయ ప్రార్థన! "అని అభ్యర్థించాడు. 


దేవేంద్రుడు నవ్వుతూ అంగీకారసూచకంగా తలను పంకించాడు. 


యయాతి లేచి గౌరవపూర్వకంగా అందరికీ అభివాదం చేశాడు. 

ree

"ప్రస్తుతం భూలోకంలో శాంతి నెలకొని ఉంది. దానవులు కూడా కొంత సంయమనాన్ని పాటిస్తున్నారు. చాలా వరకు రాజ్యాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి. అయితే విద్య విషయంలో అనుకున్నంత మార్పు రాలేదనే చెప్పాలి.. విద్యావంతులైన వాళ్ళ సంఖ్య తక్కువ గానే ఉంటోంది. విద్య కేవలం బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలకు మాత్రమే పరిమితమయ్యింది. స్త్రీలకు చదువుకొనే వెసులుబాటు లేదు. కర్షకులకు, రైతులకు ఆ అవకాశం దొరకటం లేదు. సాధారణంగా ముని సంఘాలు మాత్రమే గురుకులాలను నిర్వహిస్తున్నారు. గురుకులాలు పల్లెలకు, పట్టణాలకు చాలా దూరంగా ఉంటున్నాయి. విద్యకోసం శ్రామికులు తమ జీవనోపాధిని వదులుకోలేరు. కాబట్టి గురువులే జనుల దగ్గరికి వచ్చి చిన్న చిన్న పాఠశాలల్లో విద్య నేర్పించే ఏర్పాటు చేసుకోవాలి! మా రాజ్యంలో ఉన్న జనపదాల్లో ఎక్కడి కక్కడ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాము. దానికి ముని సంఘాల సహకారం అవసరం అవుతుంది. అలాగే మారుతున్న కాలంతో పాటు న్యాయ, శిక్షా స్మృతులను సవరించాలి! పాత కాలపు చట్టాలను సవరించాలి! వాటి మీద ప్రజలకు అవగాహనను కల్పించాలి! స్త్రీలకు కేవలం సంగీత నాట్యాలలో శిక్షణ నిప్పిస్తే చాలనే అభిప్రాయంలో మనమందరం ఉంటున్నాము.. స్త్రీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి! .. స్త్రీలకు పలురకాల విద్యలను నేర్పిస్తే వారు భావి యుగాన్ని సమర్థవంతంగా నిర్మించగలరు. ఇక వైద్య, జీవ పరిరక్షణ, క్షిపణి, అణు శాస్త్రాల్లో దేవతలు, మునులు మాత్రమే పరిశోధన చేస్తున్నారు. వాటిని సామాన్యులు కూడా నేర్చుకొనే అవకాశం కల్పించాలి! పరిశోధనలు చేసే వాళ్ళు దానవులైనా సరే వాళ్ళను ప్రోత్సాహించాలి! ఇటువంటి సమావేశలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ, కష్ట నష్టాలను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని నా అభిప్రాయం. అన్ని లోకాలను పరిపాలించే దేవతలు అన్ని జాతుల సమైక్యత కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే భూమి మీద ఉన్న సప్త ద్వీపవాసులు సుఖంగా ఉంటారు.! నేను నా అభిప్రాయాలను ఇంత మంది పెద్దల ముందు ప్రకటించాను.. నా భాషణలో దోషములు ఉంటే పెద్దలు మన్నించగలరు! "అంటూ అందరి వైపు చూచి తలవంచి, చేతులు జోడించాడు యయాతి. 


ఒక్క నిమిషం నిశ్శబ్దం! ఆ తర్వాత ఆ ప్రాంగణమంతా కరతాళధ్వనులతో మార్మ్రోగిపోయింది. కచుడు సంతోషం పట్టలేక యయాతి భుజాలు పట్టుకొని ఊపేశాడు. 

దేవేంద్రుడు నవ్వుతూ 

"నహుష చక్రవర్తీ! మీ కుమారుడు నూతనమైన ఆకాంక్షలు, ఆశయాలు కలవాడు. యువతరానికి ప్రతినిధి. మనల్ని మించిపోయాడు. తప్పకుండా యువతకు మా సహకారాన్ని అందిస్తాము! "అన్నాడు. 


ఆ సాయంత్రానికి సభ పూర్తయ్యింది. 


అలా యయాతికి పుష్కర ద్వీపంలో రెండవ రోజు గడిచింది.


======================================================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 25 త్వరలో

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page