దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 18
- seetharamkumar mallavarapu
- 1 day ago
- 5 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 18 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 07/01/2026
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 18 - తెలుగు ధారావాహిక
రచన: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జరిగిన కథ:
సెజ్ ఏర్పాటుకోసం తొమ్మిదో మైలు, వేటపాలెం పరిసరాల్లో వెయ్యి ఎకరాల భూసేకరణ జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా సంకల్పిస్తుంది. ముందుగా ఆ విషయం పసిగట్టిన రాజకీయ దళారీ వెంకటయ్య పేదల భూమి చవగ్గా కొని తరువాత అధిక ధరకు అమ్ముకోవచ్చని ప్లాన్ వేస్తాడు.
తొమ్మిదో మైలు ప్రాంతంలో దయ్యం తిరుగుతున్నట్లు పుకార్లు పుట్టిస్తాడు. తన దారికి అడ్డు వస్తున్న ప్రజా నాయకుడు దీనదయాళును హత్య చేయిస్తాడు. బినామీ పేర్లతో చాలా భూములు చవగ్గా కొంటాడు. ఆ హత్యపై విచారణ చేయించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాస రావు యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు.
పదేళ్ల తరువాత దీనదయాళు కొడుకు మురళి, కూతురు రితిక, శ్రీనివాస రావు కొడుకులు దీపక్, గౌతమ్, కూతురు నవ్య మరికొందరు యువతీయువకులు ఒక టీం గా ఏర్పడుతారు. తాము కోల్పోయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దీనదయాళు, దయ్యంగా వచ్చినట్లు ప్రచారం చేస్తారు.
చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను, కనకయ్య అనుచరుడు ఆర్ముగంను భయపెడతారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 18 చదవండి.
చెన్నై లో ఉన్న తన మనుషులతో ఫోన్ లో మాట్లాడాక వెంకటయ్య చికాకుగా ఉన్నాడు.
పదేళ్ల క్రిందట సెజ్ వస్తుందనే ఆశతో తొమ్మిదో మైలు పరిసరాల్లో దాదాపు మూడువందల ఎకరాలు కొన్నాడు. టౌన్ లో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మడంతో పాటు ఎక్కువ వడ్డీకి అప్పులు చేశాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికారం మారడంతో తన హవా నడవలేదు. సెజ్ ఏర్పాటు జరగలేదు.
ఇదిగో.. ఇప్పుడు భూములు తమ పేరుతో వద్దని తన బినామీల ఫోన్లు..
కానీ దయ్యం భయంతో ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. అప్పుల వాళ్ళ నుండి ఒత్తిడి పెరిగింది.
ఏ దయ్యం భయం చూపించి అప్పట్లో తను భూములు తక్కువ ధరకు కొనేశాడో అదే దయ్యం భయం ఇప్పుడు భూములు అమ్మడానికి లేకుండా చేసింది. చూస్తుంటే పదేళ్ల ముందటి ధరకే అమ్మాల్సి వచ్చేలా ఉంది. తను చేసిన అప్పుల వడ్డీకి తన ఆస్తులు మొత్తం అమ్మినా సరిపోదు.
ఇలాంటి సమయంలో ఆ భూములు వేరే పేర్లతో మార్చడం చిన్న విషయం కాదు. ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాడు వెంకటయ్య.
ఇంతలో అతని ఫోన్ మోగింది.
డిస్‌ప్లేలో దీనదయాళు అని పడింది.
ఉలిక్కి పడ్డాడు.
భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాడు.
"నేను చెన్నై కమీషనర్ గారి పీఏని. ఇక్కడ ఉన్న మీ బంధువులు ఆంధ్రాలో తొమ్మిదో మైలు దగ్గర భారీగా భూములు కొన్నట్లు తెలిసింది. వాళ్ళు మీ పేరు చెబుతున్నారు. విచారణకు మా పోలీస్ ఆఫీసర్ దీపక్ ను, ఇంటెలిజెన్స్ ఎస్సై రితికా మేడం ను పంపుతున్నాము. వాళ్లకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి" అన్నాడు అవతలి వ్యక్తి.
"అలాగే సర్" అని వెంకటయ్య ఫోన్ పెట్టిన వెంటనే డోర్ బెల్ మోగింది.
తలుపు తెరవగానే ఎదురుగా పోలీస్ దుస్తుల్లో దీపక్, రితిక, మరో ఇద్దరు పోలీసులు.
"చెన్నై నుండి వస్తున్నాము. బినామీ భూముల వ్యవహారంపై మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాము. " అన్నాడు దీపక్.
"అవన్నీ అబద్ధాలు. నేను నా లాయర్ తో మాట్లాడుతాను" అన్నాడు వెంకటయ్య, ఫోన్ అందుకోబోతూ..
అతని చేతి మీద లాఠీతో బలంగా కొట్టి, "ముందు చెన్నైస్టేషన్ కు పద. అక్కడినుంచి ఫోన్లు చేసుకుందువు గానీ" అన్నాడు దీపక్ కఠినంగా.
చటుక్కున రితిక కాళ్ళమీద పడ్డాడు వెంకటయ్య.
"మేడం.. నా కూతురు లాంటి వారు.. మీరైనా చెప్పండి. మా లాయర్ ఈశ్వర్ కు ఒక్కసారి కాల్ చేసుకోనివ్వండి. ' అని అర్థించాడు.
తన తండ్రి మృతికి కారకుడైన అతన్ని అప్పటికప్పుడే చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది రితికకు.
అయినా తమాయించుకుని, "అడుక్కుంటున్నాడు. కాల్ చేసుకోనిద్దామా?" అంది దీపక్ వంక చూస్తూ.
నిజానికి వాళ్లిద్దరూ ముందు రోజే ఆ అడ్వొకేట్ ఈశ్వర్ ను కలిశారు. అతని దగ్గర కూడా ఇరవై లక్షలు అప్పు చేసి ఉన్నాడు వెంకటయ్య. భూముల అమ్మకం జరిగితే గానీ తన బాకీ వసూలు కాదనీ, కాబట్టి వారికి సహకరిస్తానని చెప్పాడు ఈశ్వర్.
"లాయర్ గారూ.. వీళ్లెవరో చెన్నై పోలీసులట. నన్ను అరెస్ట్ చెయ్యాలని వచ్చారు. మీరే ఎలాగైనా సహాయం చెయ్యాలి. ఒకసారి వీళ్లతో మాట్లాడండి" అంటూ ఫోన్ దీపక్ చేతికి ఇవ్వబోయాడు.
ఆ ఫోన్ అందుకోలేదు దీపక్.
"మా కమీషనర్ గారు చెబితేనే వింటాను. ఎవరో ఫోన్ చేస్తే నాకెందుకు" అన్నాడు విసురుగా.
మళ్ళీ రితిక కాళ్ళమీద పడ్డాడు వెంకటయ్య, ఫోన్ అందుకుని స్పీకర్ ఆన్ చేసింది రితిక.
"చెన్నై పోలీసులకు వణక్కం. నేను అడ్వొకేట్ ఈశ్వర్ ను మాట్లాడుతున్నాను. మాకు వారం రోజులు టైం ఇవ్వండి. చెన్నై కోర్ట్ నుండి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాము. కుదరకుంటే నేనే స్వయంగా వచ్చి అతన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. రెండు రోజుల్లో ఆ భూముల వ్యవహారం కూడా సెటిల్ చేస్తాము. అసలు రైతులకు తిరిగి అమ్మేలా చూస్తాను" చెప్పాడు ఈశ్వర్.
"అదంత తేలిక కాదు. దయ్యం భయంతో ఎవరూ ఆ భూములు కొనరు. ఏమైనా అడ్వొకేట్ గా మీరు చెబుతున్నారు కాబట్టి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వెంకటయ్య ఊర్లో లేనట్లు రాసుకుంటాము" అన్నాడు దీపక్.
రితిక వెంకటయ్య వంక కోపంగా చూస్తూ "సక్రమంగా బతికితే ఒకరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు" అంది.
మరోసారి వెంకటయ్యకు వార్నింగ్ ఇచ్చి, రితిక, ఇతర పోలీసులతో బయటకు నడిచాడు దీపక్.
బయటకు వెళ్ళాక "బాగానే బెదిరినట్లు ఉన్నాడు. అతని ఇంట్లో పని చేసే రాము మీ ఊరివాడు కావడం మనకు ఉపయోగ పడింది" అన్నాడు దీపక్.
"అవును. మనం ఇచ్చిన నంబర్లు దీనదయాళు, దయ్యం@తొమ్మిదో మైలు, చెన్నై పోలీస్.. ఇలా వెంకటయ్య ఫోన్ లో ముందుగా ఫీడ్ చేసి ఉంచాడు. ఈ రోజు రాత్రికి అతనికి దయ్యం పేరుతొ కాల్ చేద్దాం. కిటికీ దగ్గర దయ్యం నీడలు పడేలా రాము చూసుకుంటాడు" చెప్పింది రితిక.
వాళ్ళు వెళ్ళాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వెంకటయ్య.
'దీనదయాళు హత్య, సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు కు యాక్సిడెంట్ చేయించడం, కాలభైరవ విగ్రహం చోరీ.. ఈ పాపాలు తనని వెంటాడుతున్నాయా..
నో.. తను ఇలా భయపడడం ఏమిటి.. ? నేరాలు చేయడం తనకు ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య కదా.. ఏదో ఒక దుష్ట శక్తి తనకు సహాయం చెయ్యక పోదు.. ' అలా ఆలోచిస్తూ చాలా సేపటికి నిద్రలోకి జారుకున్నాడు.

అర్థరాత్రి అతని సెల్ మోగింది.
డిస్‌ప్లేలో దీనదయాళు అని కనిపించింది.
అంటే చెన్నై కమీషనర్ గారి మనిషన్నమాట.. అనుకుని లిఫ్ట్ చేసాడు.
"అదేమిటి సర్ అప్పుడే చేశారు?' అన్నాడు ఆందోళనగా.
"నెంబర్ సరిగా చూడరా వెధవా.. " అన్నాడు అవతలి వ్యక్తి.
చూసాడు వెంకటయ్య.
దీనదయాళు దయ్యం అని ఉంది.
అతని చేతిలోని ఫోన్ జారి కింద పడింది.
అదిరే చేతులతో తిరిగి ఫోన్ అందుకున్నాడు.
"ఫోన్ కాల్ కే అదిరిపోతున్నావ్.. రాత్రికి నేరుగా వస్తాను. సిద్ధంగా ఉండు " అన్న మాటలు వినపడ్డాయి.
స్పృహ కోల్పోయాడు వెంకటయ్య.
రాము అతని ముఖం మీద నీళ్లు జల్లాడు.
భయంగా కళ్లు తెరిచాడు వెంకటయ్య.
"రామూ! దీనదయాళు దయ్యమై వస్తున్నాడు. రాత్రికి నన్ను చంపేస్తాడేమో.. " భయంగా అన్నాడు.
"ఊరుకోండి సర్.. ఆయన్ని చంపిన కామయ్య మనుషులు ఇంకా దర్జాగా తిరుగుతున్నారు. మీకేమవుతుంది.. " అన్నాడు రాము.
'కామయ్య చేత ఆ పని చేయించింది నేనే. అందుకే నాకంత భయం.. ' మనసులో అనుకున్నాడు వెంకటయ్య.
"ఒక సలహా చెబుతాను. చేస్తారా.. " అడిగాడు రాము.
"చెప్పరా. ఈ గండం గట్టెక్కితే చాలు" అన్నాడు వెంకటయ్య.
"వాగు దగ్గర కాల భైరవ ఆలయంలో విగ్రహాన్ని పెడతానని మొక్కుకోండి. దయ్యం రాకుండా ఆయనే కాపాడుతాడు" సలహా ఇచ్చాడు రాము.
అప్పట్లో దొంగిలించిన విగ్రహం అమ్మడానికి వీలు కాలేదు. ఒక పాడుబడ్డ బావిలో వేయించాడు.
'దాన్ని తీసి గుడిముందు ఉంచుతాను. దయ్యం నుండి నన్ను కాపాడు స్వామీ' అని మొక్కుకున్నాడు వెంకటయ్య..
==================================================
ఇంకా ఉంది
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 19 త్వరలో
==================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.




Comments