దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16
- seetharamkumar mallavarapu
- 2 days ago
- 5 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 16 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 18/12/2025
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక
రచన: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన “దయ్యం@తొమ్మిదోమైలు” కథతో, ఎస్సై మోహన్, రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి రాత్రివేళ తొమ్మిదో మైలు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది.
తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్, మురళిని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు. ఊర్లో దీనదయాళు ధైర్యం చెప్పడంతో భూములు అమ్మడం మానుకుంటారు.. అయితే కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాలెంలో భయం పెరిగింది. ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు దీనదయాళును హత్య చేయించారు. అది దయ్యం పనేనని భయపడ్డ ప్రజలు చాలామంది భూములు అమ్ముకుని ఎటో వెళ్లిపోయారు. దీనదయాళు హత్యను విచారించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు కోల్పోతాడు.
హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే నైట్ స్టే చేస్తే.. దయ్యం వారిలో చిట్టిబాబును భయంకరంగా గాయపరిచింది. వారు కూడా తమ మనుషులేనని మాట్లాడుకుంటారు మురళి, రితిక.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16 చదవండి.
హేతువాదుల సంఘటన జరిగిన కొన్ని రోజులకు దీపక్ ను అందరూ కలవాలని సందేశమిచ్చాడు కాల భైరవ ఆలయ సాధువు.
అందరూ శ్రీనివాసరావు ఇంటిలో సమావేశమయ్యారు. ఆయన పెద్ద కుమారుడు
దీపక్ మాట్లాడుతూ "అందరూ మనం ముందుగా అనుకున్నట్లు చేస్తేనే బాగుంటుంది. ఏమంటారు చిట్టి బాబు గారూ" అన్నాడు.
చిట్టిబాబు మాట్లాడుతూ "నేను గాయపడతాననే భయంతో దయ్యంలా నటించిన వ్యక్తి మరీ సుతారంగా రక్కడానికి ప్రయత్నించాడు. అలా అయితే ఎవరూ అది దయ్యమని నమ్మరు. అందుకే కాస్త బలంగా ఆ గోళ్లను నా ముఖంలోకి అదుముకున్నాను. అది కూడా సిసి కెమెరాల్లో నా ముఖం కనిపించదని రూఢి చేసుకుని అలా చేసాను." అన్నాడు.
"నిజమే. కెమెరాలకు, ఆ దయ్యం వీపు మాత్రమే కనిపిస్తుంది. కానీ టార్చి ఫోకస్ చేసిన ఎస్సై మోహన్ కు మీరు ఆ దయ్యం చేతులను మీకేసి అదుముకున్నట్లు తెలిసిపోయింది." అన్నాడు దీపక్.
"అదంతా క్షణాల్లో జరిగిపోయిన సంఘటన. పైగా రాత్రిపూట జరిగింది. ఎంత టార్చి వేసినా క్షణాల్లో అదంతా గమనించడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. ఆ ఎస్సై మోహన్ చాలా షార్ప్ అనుకుంటాను. విషయాన్ని అనుమానించాడు. మా మీద నిఘా ఉంటుందని హెచ్చరించాడు" అన్నాడు చిట్టిబాబు.
"అది మిమ్మల్ని బెదిరించడానికి హెచ్చరించడం కాదు. మీ పైన నిఘా ఉంటుందనీ, తొందరపడి మాకు గానీ మురళికి గానీ కాల్ చెయ్యొద్దని జాగ్రత్త చెప్పడం. ఆ ఎస్సై మోహన్ మన మనిషి కాకపోయినా స్వామినాథంతో గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి. మన ఊరి వాళ్ళ పట్ల సానుభూతి ఉన్న వ్యక్తి. తన ఉద్యోగ ధర్మానికి ఆటంకం రానంతవరకు మనకు సహకరిస్తారు." చెప్పాడు దీపక్.
తరువాత జరగాల్సిన మూడు పనులకు వేసిన పథకం గురించి చర్చించుకున్నారు.
మొదట చెన్నైలో ఉన్న రమణయ్య బంధువులను బెదిరించడం. ఈ బాధ్యతను మురళి, నవ్య తీసుకుంటారు. దాంతో తమ పేర్లమీద ఉన్న భూములను వెంటనే అమ్మి వేయాలని వాళ్ళు రమణయ్య మీద ఒత్తిడి తేవాలి.
తరువాత రమణయ్యకు చనిపోయిన దీనదయాళు ఆత్మ లేదా దయ్యం నుండి వేధింపులు రావాలి. ఈ బాధ్యతను గౌతమ్, రితిక స్వీకరిస్తారు.
ఇక మూడవ ప్లాన్.
టీవీ ఛానల్ వాళ్ళు డ్రోన్ తో తొమ్మిదో మైలు పరిసరాలు చిత్రీకరిస్తున్నప్పుడు దయ్యం మన గ్రామస్థుడొకరి పైన దాడి చెయ్యాలి. ఇది పట్టపగలు స్పష్టంగా రికార్డ్ కావాలి.
ఆ సమయంలో కాల భైరవ ఆలయ సాధువు వచ్చి, "స్థానిక రైతులను ఏమీ చెయ్యవద్దనీ, భూములు ఆక్రమించుకున్న వాళ్ళను ఏమైనా చేసుకొమ్మనీ, ఇది కాల భైరవుడి ఆజ్ఞ అనీ చెబుతాడు.
దాంతో ఆ దయ్యం తాను దీనదయాళు ఆత్మననీ, భూములు రైతులకు అప్పగించేవరకు పోరాడతానని చెబుతుంది." చెప్పాడు దీపక్.
"ఇక భూములు తిరిగి కొనడానికి డబ్బులు రెడీ చేసుకొమ్మని ఇప్పటి తరం యువకులకు ముందుగానే చెప్పి ఉంచాము. గతంలో అమ్మిన ధరకే తిరిగి కొనుగోలు చేద్దాం. తరువాత ఏదైనా పారిశ్రామిక వాడకు సేకరణ జరిగితే ధర మనం నిర్ణయిద్దాం. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా డిమాండ్ చేద్దాం" అన్నాడు మురళి.
తరువాత తమ ప్లాన్ అమలు చేయడానికి మురళి, నవ్య చెన్నై బయలుదేరారు.
***
చెన్నై సెంట్రల్ స్టేషన్ బయట జనసందడి తగ్గుతున్న సాయంత్రం. రైలు నుంచి దిగిన మురళి, నవ్య ఒకరినొకరు చూసుకుని మౌనంగా నవ్వుకున్నారు. వేటపాలెం నుంచి దూరంగా ఉన్న ఈ మహానగరమే, తొమ్మిదో మైలు కథలో కీలక మలుపు తిప్పబోయే వేదిక అని ఇద్దరికీ తెలుసు. చేతిలో చిన్న బ్యాగ్, మనసులో పెద్ద పథకం.
స్టేషన్ దగ్గర్లో ఉన్న ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నారు.
"ఇలా ఒంటరిగా పరాయివాళ్ళతో హోటల్ గదిలో ఉండటానికి ఏమైనా ఫీల్ అవుతున్నావా?" అడిగాడు మురళి.
"ఇక్కడ పరాయివాళ్ళెవరు ఉన్నారు? అయినా నాతో ఉన్నది దీనదయాళు కొడుకు. ఏం జరిగినా ఆయన చూసుకుంటాడు" అంది నవ్య.
"నీ నమ్మకానికి థాంక్ యూ. ముందు రమణయ్య మామగారి ఇంటిని టార్గెట్ చేయాలి. అన్నాడు మురళి. “అక్కడినుంచే ఒత్తిడి మొదలుపెట్టాలి. మీ ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్యకు చెప్పావా?"
నవ్య తల ఊపింది. “మరో అరగంటలో వాళ్ళు ఇక్కడుంటారు. రమణయ్య బంధువులను భయపెట్టడం కాదు, పరిస్థితి ఎంత ప్రమాదకరమో అర్థమయ్యేలా చేయాలి. దయ్యం పేరు వినగానే వాళ్లే కదిలిపోతారు.” అంది.
మరో అరగంటకు నవ్య ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య, తన స్నేహితులు నలుగురితో ఆ హోటల్ రూమ్ కు వచ్చింది.
తమ ప్లాన్ వివరించింది నవ్య.
***
ఆ రోజు రాత్రి..
చెన్నైలోని ఓ పాత కాలనీ. రమణయ్య మామగారి ముఖ్య అనుచరుడి ఇల్లు. అతని పేరు ఆర్ముగం.
రాత్రి తొమ్మిది గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగింది.
"ఎవరు?" డోర్ దగ్గరకు వెళ్లి అడిగాడు ఆర్ముగం.
"తొమ్మిదో మైలు దగ్గర వేటపాలెం నుండి వచ్చాము. కామయ్య పంపించాడు."
దాంతో తలుపు తెరిచాడు ఆర్ముగం.
ఆరడుగుల ఆజానుబాహుడైన వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని పక్కన ఇద్దరు అనుచరులు ఉన్నారు.
"ఇంత రాత్రి పూట వచ్చారేం? మీరు వస్తున్నట్లు మా అన్న చెప్పలేదే.." అన్నాడు ఆర్ముగం.
"మేము సాధారణంగా రాత్రి పూటే తిరుగుతాము. ఎవరికీ తెలీకుండా పంపాడు కామయ్య. వేటపాలెం హీరో దీనదయాళు ఇప్పుడు దయ్యం అయ్యాడు. భూములు కొన్నవాళ్లందరినీ చంపేస్తానంటున్నాడు. తనపేరు లేదు కదా అని రమణయ్య, వాళ్ళ మామ.. అంటే మీ నాయకుడు కనకయ్య ధైర్యంగా ఉన్నారు." అంటూ దయ్యానికి సంబంధించిన వార్తాకథనాల తాలూకు వీడియో క్లిప్స్ చూపించాడు అతను.
భయంగా చూసాడు ఆర్ముగం.
“మీకు వేటపాలెం భూముల విషయం తెలుసు కదా? అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరం. దీనదయాళు ఆత్మ తిరుగుతోందని ఊరంతా నమ్ముతోంది. భూములు మీ పేర్లమీద ఉన్నాయని ఎవరికైనాతెలిస్తే మేమేం జరగదని హామీ ఇవ్వలేం.”
ఆ మాటలు వినగానే ఇంట్లో నిశ్శబ్దం.
ఆర్ముగం భార్య మాట్లాడుతూ "నేను అప్పుడే చెప్పినాను. ఒకరిని మోసం చెయ్యొద్దబ్బా అని. ఈ మనిషి వినలేదు" అంది.
"భూములు వాళ్ళ పేరుతొ మార్చుకోమని మీ నాయకుడికీ, వాళ్ళ మామకే చెప్పు. అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోకు." అన్నాడు అతను.
"మీ పేరు తెలుసుకోవచ్చా" అడిగాడు ఆర్ముగం.
"ఇదిగో విజిటింగ్ కార్డు. అవసరమైతే కాల్ చేయండి" అంటూ ఒక కార్డు ఇచ్చి తన అనుచరులతో వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.
అతను వెళ్ళాక ఆ కార్డు వంక చూసాడు ఆర్ముగం.
తెలుగులో పెన్ తో ఒక పేరు రాసి ఉంది. కింద ఫోన్ నంబర్ ఉంది.
అతనికి తెలుగు చదవడం రాదు. భార్య చేతికి ఇచ్చి చదవమన్నాడు.
'ఆమె కష్టం మీద చదివింది 'దీనదయాళు' అని.
ఉలిక్కి పడ్డాడు ఆర్ముగం.
"సరిగ్గా చదవవే మొద్దు మొహమా" అన్నాడు ఆర్ముగం ఆందోళనగా.
"సరిగ్గా చదివాను సుందరాంగుడా" అందామె కోపంగా.
వెంటనే తమ నాయకుడు కనకయ్యకు ఫోన్ చేసాడు ఆర్ముగం.
ఆ ఫోన్ నంబర్ చెప్పాడు.
"నేను కనుక్కుంటాను. నువ్వు పెట్టెయ్" అన్నాడు కనకయ్య.
మరి కొద్ది సేపటికే ఆర్ముగం ఫోన్ మోగింది.
"చెప్పు కనకన్నా" అన్నాడు ఆర్ముగం.
"కొంప ముంచావు. నువ్వు ఇచ్చిన నంబర్ చెన్నై పోలీస్ కమీషనర్ గారి పర్సనల్ నెంబర్ అట. ఈ నంబర్ ఎవరిచ్చారు? అని అడిగారు. నీ నంబర్, అడ్రస్ అడిగారు. చెప్పక తప్పలేదు. పోలీసులు వస్తే నీ దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు చూపించు" అన్నాడు కనకయ్య.
వెంటనే తన దగ్గరున్న విజిటింగ్ కార్డు వంక చూసాడు ఆర్ముగం. అదెవరో ట్రావెల్స్ వాళ్ళ కార్డు అది. దానిపైన ఇందాక పెన్ తో రాసిన పేరు, నంబర్ ఇప్పుడు లేవు.
అయోమయంగా చూసాడు ఆర్ముగం.
వణుకుతున్న గొంతుతో భార్యను పిలిచాడు.
ఇందాక ఈ కార్డును తడి చేతులతో పట్టుకున్నావా.. పెన్ తో రాసిన అక్షరాలు కనిపించడం లేదు.." అని అడిగాడు.
"లేదే.. మీ గ్లాస్ లో ఉన్న మందు ఒలికి ఉంటుంది" అంది కోపంగా చూస్తూ..
"తమాషాలు కాదు. ఆ నంబర్ పోలీస్ కమిషనర్ గారిది. ఇప్పుడు మన ఇంటికి పోలీసులు వస్తున్నారట . కనకన్న చెప్పాడు. వాళ్లకు చూపించడానికి ఈ కార్డు మీద నంబర్ లేదు." అన్నాడు భయంగా.
"ఆ కనకయ్య పోలీసులకు ఏదోదో చెప్పి తప్పించుకోవాలి కానీ ఇలా మిమ్మల్ని ఇరికించవచ్చా? నేనైతే ఆ కనకయ్య సంగతులన్నీ చెప్పేస్తాను” అందామె.
==================================================
ఇంకా ఉంది
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17 త్వరలో
==================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.




Comments