top of page
Original.png

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 17 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 29/12/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక

రచన: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన “దయ్యం@తొమ్మిదోమైలు” కథతో, ఎస్సై మోహన్, రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి రాత్రివేళ తొమ్మిదో మైలు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది. 

తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్, మురళిని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు. ఊర్లో దీనదయాళు ధైర్యం చెప్పడంతో భూములు అమ్మడం మానుకుంటారు.. అయితే కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాలెంలో భయం పెరిగింది. ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు దీనదయాళును హత్య చేయించారు. అది దయ్యం పనేనని భయపడ్డ ప్రజలు చాలామంది భూములు అమ్ముకుని ఎటో వెళ్లిపోయారు. దీనదయాళు హత్యను విచారించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు యాక్సిడెంట్‌లో రెండు కాళ్లు కోల్పోతాడు.


చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను భయపెట్టాలనుకుంటారు మురళి, నవ్య. ముందుగా నవ్య స్నేహితుల సహకారంతో కనకయ్య అనుచరుడు ఆర్ముగంను భయపెడతారు.



గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 17 చదవండి. 


"నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కనకన్న కోసం మనం చిక్కుల్లో పడటం ఎందుకని అనిపిస్తోంది." అన్నాడు ఆర్ముగం.


మరికొంతసేపటికే పోలీసు దుస్తుల్లో కొందరు ఆర్ముగం ఇంటికి వచ్చారు.


"కనకయ్య కమీషనర్ గారికి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడాడు. ఆ నంబర్ నువ్వు ఇచ్చావట. నిజమేనా?" లాఠీని ఆర్ముగం భుజానికి ఆనించి అడిగాడు పోలీస్ దుస్తుల్లో ఉన్న మురళి.


"అది.. దీనదయాళు అని ఎవరో వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి, బెదిరించాడు. ఆ నంబర్ కనకయ్యకు చెప్పాను. అంతకంటే నాకేమీ తెలీదు సర్" 


"ఆ విజిటింగ్ కార్డు ఏదీ?" అడిగాడు మురళి.


భయపడుతూ ఆ కార్డు అందించాడు ఆర్ముగం.

"ఇది ఒక ట్రావెల్స్ వాళ్ళ విజిటింగ్ కార్డు" అన్నాడు మురళి కోపంగా.


"అవును సర్, ఆ వచ్చిన వ్యక్తి ఇచ్చింది ఇదే. ఆయన వెళ్ళాక చూస్తే ఈ కార్డు మీద పెన్ తో ఒక పేరు, నంబర్ రాసి ఉన్నాయి. ఆ పేరు తెలుగులో ఉంది. నేను చదవలేను. చదవమని నా భార్యకు ఇచ్చాను. "అంటూ భార్య వంక తిరిగి, "చెప్పవే ఆ విషయం." అని అరిచాడు.


"అవునయ్యా. అందులో 'దీనదయాళు' అనే పేరు ఉంది. ఒక నంబర్ ఉంది. ఆ విషయం ఈయన కనకయ్యకు చెప్పాడు. ఇందాక ఆయన ఫోన్ చేసి ఆ నంబర్ కమీషనర్ గారిదని చెప్పి మమ్మల్ని తిట్టాడు. మేము మళ్లీ చూస్తే ఆ కార్డు మీద పేరుగానీ నంబర్ గానీ లేవు" దీనంగా చెప్పింది ఆమె.

 

'పేదల భూములు చవకగా కొట్టేయడానికి ప్రజల మనిషి దీనదయాళును కిరాతకంగా చంపారు. ఆయన ఉంటే భూములు ఆక్రమించలేరు కాబట్టి ఆ ఘాతుకానికి పాల్పడ్డారు.. ఆ దీనదయాళు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి దయ్యమై వచ్చాడు. తొమ్మిదో మైలు దగ్గర తిరుగుతున్నాడు. మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు" చెప్పాడు మురళి.


"మాకు ఏ పాపం తెలీదయ్యా. చేసిందంతా ఆ కనకయ్య బాబే. భూమి నా పేరుతో రిజిస్టర్ చేసి అవసరమైనప్పుడు అమ్మేస్తానని చెప్పాడు. అందుకు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. కాదనలేక సరేనన్నాను. అంతకు మించి నాకేమీ తెలీదయ్యా" కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు ఆర్ముగం.

"ఒక వారం లోపల ఆ భూములు అమ్మేయడమో తన పేరుతో మార్చుకోవడమో చెయ్యమని ఆ కనకయ్యకు చెప్పు. అప్పుడు నీకు భయం ఉండదు. లేదంటే కనకయ్యతో పాటు నిన్ను కూడా ఆ దీన దయాళు దయ్యం చంపేస్తుంది. జాగ్రత్త" అని చెప్పి, బయటకు నడిచాడు మురళి.


***


ఆర్ముగం ఇచ్చిన నంబర్ కు ఆవేశంతో కాల్ చేశాడు కనకయ్య.

"ఎవడ్రా నువ్వు.. దీనదయాళు పేరు చెబితే దయ్యమని భయపడతామనుకున్నావా.. అయినా పదేళ్లకు ముందు చనిపోయి ఇన్నేళ్లు నిద్రపోయావా.." అవతల కాల్ లిఫ్ట్ చేయగానే వెనకా ముందూ ఆలోచించకుండా అనేశాడు కనకయ్య.


కొంత సేపు నిశ్శబ్దం తరువాత అటువైపు నుంచి, "ఇది కమీషనర్ గారి పర్సనల్ నంబర్. ఈ నంబర్ నీకెలా వచ్చింది? మాకు తెలుగు తెలీదనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా.. మక్కెలు విరగ్గొడతాము. ఈ నంబర్ ఎలా తెలిసింది.. ముందు చెప్పు" అన్నారెవరో.


ఉలిక్కి పడ్డాడు కనకయ్య.


"సారీ సర్. పొరపాటున కాల్ చేసాను. నేను మాజీ మినిష్టర్ బంధువును." అంటూ ఏదో చెప్పబోయాడు కనకయ్య.


" ముందు ఈ నంబర్ ఎవరిచ్చారో చెప్పరా గాడిదా"


"తప్పయింది సర్, మా మనిషే ఆర్ముగం అనీ.. అతను ఇచ్చాడు"


"ముందు అతని నంబర్, అడ్రస్ చెప్పు"


భయంతో ఆర్ముగం నంబర్, అడ్రస్ చెప్పాడు కనకయ్య.

వెంటనే ఆర్ముగం కు కాల్ చేసి పోలీసులు వస్తారని, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. 

ఇందాకే ఆర్ముగం కాల్ చేసి పోలీసులు వచ్చి దీనదయాళు దయ్యంగా తిరుగుతున్నట్లు పోలీసులు హెచ్చరించారని చెప్పాడు. ఆ మాట విన్నప్పటి నుండీ ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నాడు కనకయ్య.


అతని సెల్ కు ఒక తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది.


కనకయ్య లిఫ్ట్ చేయగానే "నేను.. దీనదయాళు ను మాట్లాడుతున్నాను" అని వినిపించింది.


లేని ధైర్యాన్ని కూడగట్టుకుని, "ఆ పేరు చెబితే భయపడి పోతాననుకున్నావా? అయినా దీనదయాళు హత్యతో నాకు సంబంధం లేదు. కేవలం భూములు నా పేరుతో రిజిస్టర్ చేసుకున్నాను. అంతే." అన్నాడు కనకయ్య బింకంగా.


అవతలి వ్యక్తి "అడక్కుండానే నువ్వు చేసిన పొరపాట్లన్నీ చెప్పేసేలా ఉన్నావే.. నా పేరు దీనదయాళు. కమీషనర్ గారి అసిస్టెంట్‌ను. ఇందాక ఫోన్ చేసి ఏదేదో మాట్లాడావని తెలిసింది. కమీషనర్ గారు నిన్ను తీసుకొని రమ్మన్నారు. మరో అర గంటలో నీ దగ్గరకు మఫ్టీలో వస్తాను. రెడీగా ఉండు" అని కాల్ కట్ చేశాడు.


ఫోన్ పెట్టాడో లేదో.. నుంగంబాకంలో ఉన్న అతని పెద్ద అల్లుడినుండి కాల్ వచ్చింది.

ree

"ఇంటి దగ్గర పార్కింగ్ లో పెట్టిన నా ఆడి కారు మంటల్లో కాలిపోయింది. వాచ్ మాన్ కాల్ చేసి చెప్పాడు. నేను వెళ్ళేసరికే పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చినా ఉపయోగం లేకపోయింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను" చెప్పాడతను.


"అయ్యో.. ఎంత పని జరిగింది.. ఎవరిపైన అయినా అనుమానంగా ఉందా?" అడిగాడు కనకయ్య.


"మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లేసరికి బయట షూ స్టాండ్ పైన ఒక కవర్ ఉంది. 

ఓపెన్ చేసి చూస్తే కాగితంపై ఒక కారు మంటల్లో కాలుతున్నట్లు డ్రాయింగ్ గీచి ఉంది. కింద 'ఆర్ట్ బై దీనదయాళు' అని ఉంది. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు భయం కలుగుతోంది" అన్నాడతను.


"పోలీసులకు ఆ లెటర్ విషయం చెప్పావా?" అడిగాడు కనకయ్య.


"లేదు మామయ్యా. ఇప్పుడు తమిళనాడులో, ఆంధ్రాలో మనం అపోజిషన్ లో ఉన్నాము కదా. పాత విషయాలు.. అదే.. తొమ్మిదో మైలు.. దీనదయాళు.." అంటూ ఆగాడు.


"సరేలే. ఫోన్లో ఎందుకులే. నేను చిన్నల్లుడు వెంకటయ్యతో మాట్లాడుతాను. అక్కడ గవర్నమెంట్ మారి, సెజ్ రాలేదు. భూముల ధర పెరగలేదు. అమ్మేస్తే గొడవ తీరిపోతుంది" అని ఫోన్ పెట్టేసాడు.

ఇంతలో బయట డోర్ బెల్ మోగింది.

పోలీసులేమో.. అనుకుంటూ డోర్ తీసాడు కనకయ్య. బయట ఎవరూ లేరు. డోర్ కు అవతల ఒక కవర్ నేలపైన పడుంది.

వణుకుతున్న చేతులతో ఆ కవర్ తీసాడు. ఇంట్లోకి వచ్చి ఓపెన్ చేశాడు.


మంటల్లో కాలుతున్న కారు బొమ్మ...


గుండె ఝల్లుమంది..


వాచ్ మాన్ కి కాల్ చేశాడు.


"పార్కింగ్ లో మా కార్ జాగ్రత్తగానే ఉందా.." అడిగాడు.


"ఉందయ్యా. " చెప్పాడు వాచ్ మాన్.


"సరే.. కాస్త జాగ్రత్తగా ఉండు" చెప్పి ఫోన్ పెట్టేసాడు.

తరువాత తనకు వచ్చిన పేపర్ వంక పరీక్షగా చూశాడు.

'ఆర్ట్ బై దీన దయాళ్' అని ఉంది.

వెనక్కి తిప్పి చూశాడు. 

"ఇప్పుడే కాదులే. ఒక వారం టైం ఇస్తున్నాను" అని ఉంది.


"హమ్మయ్య" అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. 

మళ్లీ కాలింగ్ బెల్ మోగింది.

"ఎవరూ.." అనుమానంగా అడిగాడు కనకయ్య.

"నేనే.. మఫ్టీలో ఉన్న పోలీసును" చెప్పాడు బయట ఉన్న మురళి.

డోర్ తీసాడు కనకయ్య.

అతన్ని కూర్చోబెట్టి, "పొరపాటున కమీషనర్ గారికి చేశాను. వదిలేయండి" అన్నాడు చేతులు జోడించి.


"ఇంతకీ దీనదయాళును ఎందుకు చంపారు" అతని వంక సూటిగా చూస్తూ అడిగాడు మురళి.

"నాకేమీ తెలీదు. దీనదయాళు ఎవరు?" అమాయకత్వం నటిస్తూ అడిగాడు కనకయ్య.


"అన్ని విషయాలూ ఆర్ముగం చెప్పాడు" అంటూ ఆర్ముగం చెప్పిన మాటలు కొన్ని అతనికి వినిపించాడు. "ఇంకా చాలా చెప్పాడు. అవసరమైనప్పుడు కమీషనర్ గారి ముందు బయట పెడతాను." అన్నాడు పోలీసులా నటిస్తున్న మురళి.


"నిజంగానే నాకు ఆ హత్యలో భాగం లేదు. నాకు పూర్తి వివరాలు కూడా తెలీదు. వేటపాలెం గ్రామస్థులు భూములు అమ్మకుండా దీనదయాళు అడ్డు పడుతున్నాడని మా అల్లుడు వెంకటయ్య ఒకసారి చెప్పాడు. తరువాత అతన్ని దయ్యం చంపేసిందని అప్పట్లో టీవీలో వచ్చింది. నేను కేవలం భూములు కొనడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. వాళ్లకు ఏమీ తెలీదు. నేను చెప్పినప్పుడు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారు." చెప్పాడు కనకయ్య.


"ఇప్పుడు ఆ దీనదయాళు దయ్యమై వచ్చాడు. నీ అంతు చూస్తాడు. నీ తప్పు లేదంటున్నావు కాబట్టి ఆ భూములు నీ అల్లుడు వెంకటయ్య పేరుతో మార్చుకోమను. నువ్వు బతికి పోతావు" అన్నాడు మురళి.


"నా అల్లుడిని కూడా బతికించుకుంటాను. ఆ భూములు రైతులకు తిరిగి అమ్మేయమంటాను. ప్రభుత్వం మారడంతో అక్కడ సెజ్ రాలేదు. పైగా అటవీభూములలో బినామీ పేర్లతో ఇచ్చిన పట్టాలపై కోర్ట్ స్టే ఇచ్చింది. కాబట్టి ఆ భూములు అతనికి ఉపయోగం లేదు. రేపు ఫోన్ చేసి తీరిగ్గా మాట్లాడతాను. పెద్ద అల్లుడి కారు కాలిపోయిన విషయం అతనికి తెలిసే ఉంటుంది. " అన్నాడు కనకయ్య.


"చేసిన పాపాలు కొంతైనా తగ్గించుకోండి. దీనదయాళు దయ తలిచి వదిలేస్తాడేమో.. కమీషనర్ గారికి నేను సర్ది చెబుతాను." అంటూ బయటకు నడిచాడు మురళి.


==================================================

ఇంకా ఉంది

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 18 త్వరలో

==================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page