దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12
- Seetharam Kumar Mallavarapu
- 2 days ago
- 5 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 12 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 15/11/2025
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక
రచన: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. తిరిగి వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం అతన్ని గాయపరుస్తుంది.
తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు. ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తి, రితిక అన్నయ్య మురళి అని తెలుసుకుంటాడు.
తన తండ్రి మరణం దయ్యంవల్లనో భయం వల్లనో కాదని చెబుతాడు మురళి. ఆ విషయంగా లోతైన దర్యాప్తు జరపాలని అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు నిర్ణయిస్తాడు. అనూహ్యంగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు కోల్పోతాడు. అతని కొడుకే గౌతమ్.
హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చెయ్యడానికి బయలుదేరుతారు. దయ్యం వారిలో చిట్టిబాబును తీవ్రంగా గాయపరుస్తుంది. అతనికి తగిలిన గాయాల పట్ల అనుమానం వస్తుంది మోహన్ కు.
పది సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గౌతమ్ తో చెబుతూ ఉంటాడు మురళి. అప్పట్లో తొమ్మిదో మైలు పరిసరాల్లో దగ్గర భూములు కొనడానికి చెన్నై నుండి వస్తారు కొందరు వ్యక్తులు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 చదవండి.
మురళితో మాట్లాడుతూ "మీ నాన్నగారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అయన మీద ఎంతో నమ్మకం ఉన్న మీ ఊరి ప్రజలు భూములు అమ్ముకుని వెళ్లిపోవడం ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు గౌతమ్.
అప్పట్లో జరిగిన సంఘటనల గురించి స్వామినాథం, రంగయ్య, మురళి ఇలా వివరించారు.
***
పదేళ్ల కిందట పేద రైతుల కడుపు కొట్టడానికి నాయకులూ, వారికి సహకరించే మీడియా, పెట్టుబడి దారులూ, అందరూ కలిసి పకడ్బందీగా పన్నిన వ్యూహం ఇది. తొమ్మిదో మైలుకు దగ్గర్లో ఉన్న పట్టణంలో రమణయ్య అనే నాయకుడు ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన వాడు. ఏ పదవిలో లేకున్నా అన్ని పార్టీల పై స్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అతను.
ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధులు కొన్ని ఫ్యాక్టరీల సముదాయం కోసం స్థలం వెతుకుతూ ఉండటం రమణయ్య దృష్టికి వచ్చింది. వారికి దాదాపు వెయ్యి ఎకరాల అవసరం ఉంటుంది. అయితే వారి ప్రణాళిక ఇంకా పూర్తి రూపానికి రాలేదు. అందుకు మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు. కాబట్టి ఎవరూ అంత ఆసక్తి చూపలేదు.. ఈ సమయంలో భూమి చవకగా కొంటే తరువాత చాలా లాభానికి అమ్ముకోవచ్చని ప్లాన్ వేసాడు. తాను డైరెక్ట్ గా కొనడానికి వెళ్తే లేనిపోని అనుమానాలు కలగవచ్చు. అందుకని చెన్నైలో స్థిరపడ్డ తన మామగారికి చెప్పాడు. అయన తన మనుషులు కొందరిని తొమ్మిదో మైలు దగ్గరకు పంపాడు. ఆ విషయాన్ని రంగయ్య దీనదయాళుతో చెప్పాడు. భూములు కొనాలంటూ చెన్నై నుండి తమ ఊరికి రావడంలో ఏదో వ్యూహం ఉన్నట్లు పసిగట్టాడు దీనదయాళు. తొందరపడి భూములు అమ్మవద్దని గ్రామస్థులను హెచ్చరించాడు.
సాధారణంగా రైతులు భూమిని నమ్ముకుంటారు కానీ అమ్ముకోవడానికి ఇష్టపడరు. అందుకే భూసేకరణ జరిపేటప్పుడు ఎక్కువ మొత్తం ఆశ చూపి కొంటారు. ఒకరిద్దరు అమ్మడానికి సిద్ధపడితే తరువాత మిగిలిన వాళ్ళను ఒప్పించడం సులభం అవుతుంది.
వేటపాలెం మారు మూల గ్రామం కాబట్టి దయ్యం పేరుతొ భయపెట్టి భూములు కొనవచ్చని అనుకున్నాడు రమణయ్య.
అతని ప్లాన్ ప్రకారం దయ్యం లాంటి రెండు ఆకారాలు రాత్రి పూట తొమ్మిదో మైలు దగ్గర బస్సు దిగిన ఇద్దరు వ్యక్తులను తరుముకున్నాయి. ఈ విషయం గురించి మీడియాలో అవసరానికి మించి ప్రచారం జరిగింది. ఐనా దీనదయాళు ఇచ్చిన ధైర్యంతో ఎవరూ భూములు అమ్మలేదు.
సరిగ్గా ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆ ఊరి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసింది.
అదే కాల భైరవ ఆలయంలో విగ్రహం మాయం కావడం.
వేటపాలెం గ్రామస్థులు టౌన్ కు వెళ్లాలంటే వాగు దాటి తొమ్మిదో మైలు దగ్గరకు వెళ్లి బస్సు ఎక్కాలి. ఆలా వెళ్ళేటప్పుడు వాగుకు ముందున్న ఆలయానికి వెళ్లి క్షేమంగా వాగు దాటించమని వేడుకుంటారు.
ఒక రోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన వాళ్ళు అక్కడ కాలభైరవుడి విగ్రహం లేకపోవడంతో కేకలు పెట్టారు.
ఊర్లోకి తిరిగి వచ్చి అందరికీ ఆ విషయాన్ని చెప్పారు. మొత్తం ఊరంతా అక్కడికి చేరుకున్నారు.
రెండు రోజుల ముందు దయ్యం కనపడటం, ఇప్పుడు విగ్రహం మాయం కావడంతో ఊరికి ఏదో ఉపద్రవం రాబోతోందని గుసగుసలు మొదలయ్యాయి. ముఖ్యంగా రమణయ్య అనుచరుడు కామయ్య, అతని మనుషులు భయాన్ని నూరిపోయడం ప్రారంభించారు.
"మన ఊరికి అరిష్టం చుట్టుకుంది. ఈ మారుమూల అడవి పక్కన ఉన్న గ్రామంలో కాలభైరవుడిని నమ్ముకునే ఇన్నాళ్లు ఉండగలిగాం. ఆ స్వామికి మనమీద కోపం వచ్చింది. ఇక ఈ ఊర్లో ఉంటే మన ప్రాణాలకే అపాయం. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ వూరు విడిచి పెట్టి వెళ్ళాలి. అయినకాడికి భూములు అమ్ముకుని వెళదాం. "
ఇదీ కామయ్య బృందం చేస్తున్న ప్రచారం.
దీనదయాళు బృందం విగ్రహం లేని కాలభైరవ ఆలయం వద్ద సమావేశమయ్యారు.
"ఇక భూములు అమ్మకుండా ఊరి వాళ్ళను ఆపడం చాలా కష్టం" విచారంగా చెప్పాడు రంగయ్య.
"నేను ఒక నిర్ణయానికి వచ్చాను" చెప్పాడు దీనదయాళు.
అందరూ అతని వంక ఆసక్తిగా చూసారు.
"మన ఊరి రైతులకు ధైర్యం కలిగించడానికి ఒకటే మార్గం. ప్రతిరోజూ అర్థరాత్రి నేను ఒంటరిగా తొమ్మిదో మైలు వరకు వెళ్లి తిరిగి వస్తాను. అప్పుడైనా భయం పోతుందేమో.. " అన్నాడు దీనదయాళు.
"రాత్రిళ్ళు ఈ దారెంట వెళ్లడం మామూలుగానే ప్రమాదం. అడవి పక్కన ఊరు మనది. తోడేళ్ళు, ఎలుగుబంట్లు మనుషుల మీద దాడి చెయ్యడం గతంలో జరిగింది. పైగా వాగు దాటాలి. పోనీ మనం ఇద్దరు ముగ్గురం కలిసి రోజూ గస్తీ తిరుగుదాం. " అన్నాడు స్వామినాథం.
"అలా కాదు. నేను ఒంటరిగా వెళ్తే కలిగే ధైర్యం వేరు. ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని మీరు దయ్యాలు లేవని ప్రచారం చేయాలి" అన్నాడు దీనదయాళు.
అతని మాటలు వింటోంది పక్కనే ఉన్న అతని భార్య చామంతమ్మ. ఆమె పక్కా పల్లెటూరి మనిషైనా భర్త అభ్యుదయ భావాలకు సహకరిస్తుంది.
"అద్గదీ. నా మొగుడి దయిర్యం చూసినాక, ఆ కామయ్య మనుషుల నోర్లు మూసుకొని పోతాయి. " అంది.
దీనదయాళు నిర్ణయాన్ని రచ్చబండ దగ్గర ప్రకటించాడు సర్పంచి.
"అతను వెళ్లి వచ్చినట్లు నమ్మకం ఏమిటి? మాలో ఎవరన్నా సాయంత్రం వెళ్లి ఏదైనా ఒక వస్తువును తొమ్మిదో మైలు దగ్గర ఉన్న చింత చెట్టు కొమ్మకు కట్టి వస్తాము. దీనదయాళు రాత్రి వెళ్లి దాన్ని తీసుకుని వచ్చి మాకు చూపించాలి" అన్నాడు కామయ్య.
"ఊరి వాళ్లకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు దీనదయాళు. అతని ధైర్యాన్ని గురించి మీ కితాబు అఖ్ఖరలేదు" అన్నాడు సర్పంచి.
"మేము నమ్మాలంటే ఆ పని చెయ్యాల్సిందే" అన్నాడు కామయ్య.
ఒప్పుకున్నాడు దీనదయాళు.
ఆ రోజు సాయంత్రం కామయ్య తన అనుచరులతో వెళ్లి చింత చెట్టు కొమ్మకు తన పాత చొక్కాను కట్టి వచ్చాడు.
అర్థ రాత్రి చేతిలో టార్చితో దీనదయాళు ఒంటరిగా బయలు దేరడానికి సిద్ధమయ్యాడు. చామంతమ్మ అతనికి వీర తిలకం దిద్దింది.
మిత్రులకు వీడ్కోలు చెప్పి ఒంటరిగా బయలుదేరాడు దీనదయాళు. వాగులో నీళ్లు కాస్త ఎక్కువగానే ఉండటంతో సైకిలును బాట పక్కన ఉంచి నీళ్ళలోకి దిగాడు. జాగ్రత్తగా వాగును దాటి తొమ్మిదో మైలు చేరుకున్నాడు. కాస్త దూరంలో ఉన్న చింత చెట్టును చేరుకున్నాడు. గాలికి ఆ చెట్టు కొమ్మలు బలంగా ఊగుతున్నాయి.
చెట్టు కొమ్మల పైకి టార్చిని ఫోకస్ చేసాడు. ఒక కొమ్మకు వేలాడుతోంది కామయ్య కట్టిన చొక్కా.
ఆ కొమ్మ దగ్గరకు వెళ్తూ ఉండగా ఒక రాయి అతని చేతిలోని టార్చిని బలంగా తాకింది. టార్చి కింద పడిపోయి ఆరిపోయింది. అంతలో చింత చెట్టు వెనకనుంచి రెండు తెల్లటి ఆకారాలు బయటకు వచ్చాయి.
కింద పడివున్న టార్చిని తీసుకొని వాటివైపు బలంగా విసిరాడు దీనదయాళు.
ఆ ఆకారాలు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాయి.
"ఇది చాలు మీరు దయ్యాలు కాదని చెప్పడానికి. టార్చికే భయపడితే దీని చూస్తే ఏమవుతారో.. అంటూ తన నడుం దగ్గర దాచుకున్న పిడి బాకును బయటకు తీసాడు దీనదయాళు.
అంతే!
ఆ ఆకారాలు పక్కనున్న పొలాల్లోకి వేగంగా పరుగెత్తి అదృశ్యమైపోయాయి.
కొమ్మకు కట్టిన కామయ్య చొక్కాను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు దీనదయాళు.
తిరిగి వాగును దాటుకుని వేటపాలెం చేరుకున్నాడు. మరుసటి రోజు సర్పంచి ఊరి ప్రముఖులందరినీ సమావేశ పరిచాడు.
"దీనదయాళు ధైర్యాన్ని చూసారుగా. దయ్యం భయం లేనప్పుడు కూడా రాత్రుళ్ళు ఒంటరిగా ఎవరూ వెళ్లారు. అలాంటిది దయ్యం తమను తరిమిందని మన ఊరి వాళ్ళు చెబుతున్నా ధైర్యంగా ఒంటరిగా అర్థరాత్రి వెళ్ళివచ్చాడు. అదికూడా తొమ్మిదో మైలు వరకు వెళ్ళాడు. ఇదంతా ఎందుకు చేసాడు? దయ్యం భయంతో ఎవరూ భూములు అమ్ముకుని నష్ట పోకూడదని ఇలా చేసాడు. అక్కడ ఏం జరిగిందనేది అతని నోటిగుండా విందాం" అన్నాడు సర్పంచి.
దీనదయాళు మాట్లాడుతూ "ఎవరికైనా దెబ్బ తగిలితే నొప్పి పడుతుంది. ఇంకా పెద్ద దెబ్బ తగిలితే గాయం అవుతుంది. అంతకంటే పెద్ద దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది. ఇవన్నీ జరిగాకే కదా ఎవరైనా దయ్యంగా మారేది? మరి అలాంటి దయ్యాలు నేను టార్చి విసరగానే ఎక్కడ దెబ్బ తగుల్తుందోనని చేతులు అడ్డం పెట్టుకున్నాయి. అది మనుషులు చేసే పని. అవి దయ్యాలైతే ఆ టార్చిని మింగేసి నా పైకి దూకాలి. కానీ నేను చిన్న ఆయుధాన్ని చూపగానే దయ్యాలు పారిపోతాయా? ఇది మనల్ని భయ పెట్టడానికి ఎవరో చేస్తున్న కుట్ర" అన్నాడు.
"నన్ను చూస్తూ మాట్లాడతావేమిటి? అయినా ఒకరోజు వెళ్ళగానే ఆ దయ్యం నీకోసం కాచుకుని కూర్చుంటుందా? ఒక నెలైనా తిరుగు, అప్పుడు ఒప్పుకుంటాం నీ మాట. అయినా నీకు ధైర్యం వుంటే నువ్వు అమ్మొద్దు. మిగతావాళ్ళని అడ్డుకోవడం ఎందుకు? ఎవరి ప్రాణమైన పోతే నువ్వు బాధ్యత తీసుకుంటావా? " అన్నాడు కామయ్య.
అలా జరగనివ్వను. అయినా అవసరమైతే నా ప్రాణం వదులుకుంటాను" అన్నాడు దీనదయాళు.
'అవసరమైతే నీ ప్రాణం తీసి ఆ భూములు అమ్మిస్తాను. రేపే పట్నం వెళ్లి రమణయ్యను కలవాలి' అనుకున్నాడు కామయ్య.
==================================================
ఇంకా ఉంది
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 13 త్వరలో
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.




Comments