top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 26

Updated: Dec 8, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 26 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 04/12/2025

కచదేవయాని - పార్ట్ 26 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 



దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని. 


పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. యయాతి అందరి మన్ననలు పొందుతాడు. శర్మిష్ఠ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి వెళ్లాలనుకుంటాడు యయాతి.


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 26 చదవండి. 


భరద్వాజ మహర్షి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లారు మిత్రులందరు.

అప్పుడే భోజనం చేసి వచ్చి, పూలతోటలో  పచార్లు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి.


యువతీ యువకుల్ని చూడంగానే "ఏమిటి ఇలా వచ్చారు?" అన్నాడు సాదరంగా మహర్షి.


"ఏమీ లేదు గురువర్యా! ఒక విమానాన్ని ఏర్పాటు చేస్తే సరదాగా అలా వెళ్లి తిరిగివద్దామని!...." అంటూ నసిగాడు కచుడు.


"రేపు ఉదయానికి అందరికీ విమానాలు ఏర్పాటు చేస్తున్నాము! ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు? రేపు ఉదయం వెళ్ళండి!"


"అదికాదు గురువర్యా! భూలోకానికి వెళదామని! ఇక్కడ అర్థరాత్రి అయితే అక్కడ తెల్లవారుతుంది....నా స్నేహితులు భూలోకం  చూద్దామని అంటుంటే..." బుర్ర గోక్కుంటూ మెల్లగా చెప్పాడు కచుడు.


"భూలోకానికా! అక్కడేమన్నా విశేషం ఉందా?"


మహర్షి ప్రశ్నకు బిత్తరపోయారు  మిత్రులందరు.


"లేదు లేదు!"అంటూ ఒకేసారి ముక్త కంఠంతో గట్టిగా అరిచారందరు.


పెద్దగా నవ్వాడు భరద్వాజ మహర్షి.


"మీరందరూ ఇంత గట్టిగా చెబుతున్నారంటే పెద్ద విశేషమే ఉందని అర్ధం. అదేదో మా లాంటి వాళ్లకు చెప్పకూడదని కూడా అర్థం! సరే! మీ రహస్యం నా కెందుకు? మీరు నన్ను సహాయం అడిగారు కాబట్టి విమానాన్ని తెప్పిస్తాను!...."


ఆయన మాట పూర్తి కాకుండానే


"దానిని నడపటానికి ఎవరైనా చోదకుడు కావాలి మహర్షీ!"అన్నాడు కచుడు.


"ఎందుకు? నువ్వు ఉన్నావు కదా! ఈ రాత్రి పూట విమాన చోదకుడు ఎక్కడ దొరుకుతాడు! నీ స్నేహితులు మాత్రమే వెళతారా? వీళ్లెవరో నాకు పరిచయమే లేదే!నువ్వు నా శిష్యుడివి. ఇంతకు ముందు కూడా నువ్వు విమానాలని జాగ్రత్తగా నడిపినవాడివి. భూమి మీద రథాలను నడపటానికి పెద్ద అనుభవం అక్కర్లేదు. అదీ ఆకాశంలో అయితే కొత్త వాళ్లకు తెలియదు.. నేనింకా నువ్వు వెళుతున్నావనుకొని విమానాన్ని తెప్పిద్దామనుకుంటున్నాను!..." అనుమానంగా చూస్తున్నాడు మహర్షి.


అసలుకే మోసం వస్తుందని గ్రహించాడు కచుడు. 


గబక్కున మహర్షి పాదాల వద్ద కూర్చున్నాడు.


"లేదు లేదు! గురువర్యా! నేను... నేను వీళ్ళను తీసికొని వెళ్తున్నాను. నాకు తోడుగా ఇంకో చోదకుడు ఉంటే బాగుంటుందని అలా అడిగాను.. అంతే! ఇంకేమీ లేదు!"

అన్నాడు ప్రాధేయ పడుతున్నట్లుగా.


"ఇంకొకరు దొరకటం కష్టం! నువ్వు ఒక్కడివే ఇంతకు ముందు ఎన్నోసార్లు నడిపావు కదా! సందేహం ఎందుకు? "


"లేదు గురువర్యా! విమానాన్ని తీసికొని నేను వెళ్ళగలను!" స్థిరంగా చెప్పాడు కచుడు.


"సరే! తెల్లవారే సరికి రావాలి! గుర్తుపెట్టుకోండి! ఎక్కువ సేపు భూలోకంలో ఉండరాదు!దేవేంద్రుల వారికి తెలిస్తే నాకు మాట వస్తుంది. తర్వాత బాగుండదు! జాగ్రత్తగా తిరిగి రండి!" అని హెచ్చరించాడు భరద్వాజ మహర్షి.


"తప్పకుండా గురువర్యా! మీకు ఎటువంటి సమస్యా రానివ్వను!" అంటూ ఆయన పాదాలకు శిరసు వంచి నమస్కారం చేశాడు కచుడు.


మిగిలిన మిత్రులందరు మహర్షికి పాదాభివందనాలు చేశారు.


"మీకు శుభం కలుగుగాక!" అంటూ అందరిని ఆశీర్వదించాడు భరద్వాజ మహర్షి.


కాస్త దూరం రాంగానే

"అదేమిటి కచా! నీకు దానవుల రాజ్యంలో ప్రమాదం ఉంది కదా! విమానము వద్దు!ప్రయాణమూ వద్దు! నా ముచ్చట కోసం నువ్వు కష్టాల్లో పడటం సబబు కాదు!మానుకొంటాను!" అన్నాడు యయాతి.


అతడికి భయంగా ఉంది. అనవసరంగా దానవుల సీమలో కచుడికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే తనను తాను క్షమించుకోలేడు.


"ఫర్వాలేదు యయాతీ! వెళ్లి వద్దాం! " అని తన మిత్రుల వైపు తిరిగి "ఇంకొక్క గంటలో ప్రయాణం! తయారయ్యి రండి!" అంటూ వాళ్ళను పంపించాడు కచుడు.


"వద్దు కచా! ఇంకో నెలరోజుల్లో శర్మిష్ఠను చూస్తాను! ఇంతలోపల ఏమవుతుంది? రాక్షసులు నిన్ను చూస్తే వదలి పెట్టరు. నా మాట విను!" వారించాడు యయాతి.


"భయపడకు యయాతీ! ఇంతకు ముందులాగా కాదు! నా దగ్గర మంత్రాస్త్రాలు ఉన్నాయి. వాటితో శత్రువులను ఎదుర్కోవచ్చు! ఈ పరిజ్ఞానం కూడా భూలోకానికి రాలేదింకా!"


"అస్త్రాలంటే?" 


"మంత్రంతో దేవతను ఆరాధించాలి. ఉదాహరణకు వారుణాస్త్రం. వరుణదేవుడిని మంత్రం ద్వారా ఆహ్వానిస్తే ఆయన కున్న శక్తి వచ్చి మనం వేసే బాణంలో నిండుతుంది. అలా, ఒక్క బాణాన్నే కాదు గడ్డిపోచను కూడా మహాశక్తివంతంగా చేసి శత్రువుల మీద ప్రయోగించవచ్చు! అదొక మంత్రశాస్త్రం. తపస్సు ద్వారా వస్తుందీ శక్తి."


"ఎంత ఆశ్చర్యం! కచా! నువ్వు సామాన్యుడివి కాదు!"

మనస్ఫూర్తిగా కచుడిని మెచ్చుకున్నాడు యయాతి.


"పద! పద! సమయం మించిపోతుంది. నాకు ఆ ప్రాంతం బాగా తెలుసు. రెండు మూడు సార్లు గురువుగారితో రాజధానికి వెళ్ళాను కూడా! నా ఊహ ప్రకారం అంతఃపురానికి దగ్గర్లో ఒక పెద్ద వనం ఉండాలి! ఆడవాళ్లు విహరిస్తూ ఉంటారక్కడ. ముందు చారుమతిని పంపిద్దాము! చూచి చెప్తుంది. భయంలేదు!"


కచుడు ఎంత ధైర్యం చెబుతున్నా యయాతికి కొంచెం భయంగానే ఉంది.


రాత్రికి తన స్నేహితుల దగ్గర బస చేస్తున్నట్లు తండ్రికి వర్తమానం పంపించాడతడు.


 కచుడి గదిలోకి వచ్చారిద్దరు.


"నువ్వు నా దుస్తులు వేసుకొని తయారవ్వు యయాతీ! ఈ లోపల మనకు కావల్సిన ఆయుధాలు సర్దుతాను!" అంటూ తన దుస్తులలోంచి కొత్తవి తీసి యయాతికి ఇచ్చాడు కచుడు.


కాసేపటికి ఇద్దరూ తయారయ్యారు.

దాదాపుగా ఇద్దరివీ ఒకే రకం దుస్తులు.

వాటికి తగ్గ ఆభరణాలతో యయాతిని అలంకరించాడు కచుడు.


అద్దంలో చూసుకున్నారిద్దరు.


"అంతా బాగానే ఉంది ! రాకుమారి నిన్ను చూడంగానే మురిసి మూర్ఛపోతుంది! అలా ఉన్నావు!"


పరిహాసం చేశాడు కచుడు.


"మహానుభావా! బాగుంది నీ కోరిక! ఉన్న కాసేపట్లో  మూర్ఛలు.. కళ్ళు తిరగటాలు అయితే ఇంక ముచ్చటెక్కడ?"


గలగలా నవ్వాడు కచుడు.


"సరే! ఇంకో రత్నాలహారం పెట్టుకుంటావా?"


"చాలు! చాలు! ఇప్పటికే మీ అమరావతి ఆభరణాలు ధగధగలాడి పోతున్నాయి. ఇంకా పెట్టుకుంటే రాజకుమారుడిలాగా కాకుండా రత్నాల వ్యాపారిలాగా ఉంటాను! అప్పుడు మా రాకుమారి నన్ను గుర్తు పట్టదు సరికదా మళ్ళీ శత్రువుననుకొని కత్తి పట్టుకొని యుద్ధం చేయగలదు. అసలే వీరనారి!"


"కష్టమే! ఈ తలపాగా పెట్టుకో!" అంటూ తలపాగాను అందించాడు కచుడు.


తలపాగా పెట్టుకొని చూసుకున్నాడు యయాతి.


"ఇది కాస్త బిగుతుగా ఉంది మిత్రమా! ఇంకోటి ఉందా?" 


"అన్నీ నాకు సరిపోయేవే ఉన్నాయి! విమానంలోనే కదా! కాసేపు తీసేద్దువు గానీ!" అంటూ సుగంధ భరితమైన అత్తరు భరిణను తెరచి కాస్త యయాతి మీద చల్లి, ఇంకాస్త తన మీద చల్లుకొన్నాడు కచుడు.


ఆ దివ్యమైన పరిమళానికి ఆ ప్రదేశమంతా ఘుమఘుమలాడి పోయింది.

ముత్యాలహారాన్ని జాగ్రత్తగా తన దుస్తులో దాచుకొని విమానం ఎక్కాడు యయాతి.

===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page