top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 25

Updated: Dec 4, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 25 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 30/11/2025

కచదేవయాని - పార్ట్ 25తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని. 

పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. యయాతి అందరి మన్ననలు పొందుతాడు. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 25 చదవండి. 

మూడవ రోజు మళ్ళీ వేదగోష్ఠి మొదలయింది.


వివిధలోకాలకు చెందిన కళాకారులు తమ తమ ప్రతిభను చూపిస్తున్నారు. అప్సరసల నాట్యప్రదర్శనలు ఒకవైపు, మరొక వైపు గంధర్వుల సంగీత కార్యక్రమాలు, మరొక వైపు నాటకాలు ఇలా మనోరంజకంగా సాగుతున్నాయి. సాయంత్రానికి అందరి ప్రదర్శనలు పూర్తయ్యాయి. అప్పుడే వరుణదేవుడు వచ్చాడక్కడికి. నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోతున్నాడతడు. ఆయన వెనుక దేవజాతివాళ్ళు కొందరు పెద్ద భోషాణం పెట్టెను మోసుకొని వచ్చారు.


 వచ్చిన అతిథులకు ఇవ్వటానికి బహుమానాలున్నాయా పెట్టెలో.


వరుణదేవుడు ఒక్కొక్కరికీ వాళ్ళ వాళ్ళ హోదాను బట్టి మర్యాదగా ఆ బహుమతులను పంచుతున్నాడు.


కచునికి వైద్యశాలలో చేసే శస్త్రచికిత్సలకు కావల్సిన పరికరాల నిచ్చాడు. నహుష చక్రవర్తికి యజ్ఞయాగాదులలో ఉపయోగించే పూజా సామగ్రీ బహుమతిగా వచ్చింది.

యయాతికి ఒక అద్భుతమైన ముత్యాలహారాన్ని ఇచ్చాడు వరుణదేవుడు.


ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుందనగా దేవేంద్రుడు అందరినీ ఉద్దేశించి "రేపు మన గోష్ఠికి విరామాన్ని ప్రకటిస్తున్నాము!ఎల్లుండి నుండి మరో రెండు రోజుల పాటు ముగింపు ఉత్సవాలు జరుగుతాయి!"అంటూ తెలిపి సభను ముగించాడు.


ఆ రాత్రి విందు దగ్గర మిత్రులతో కలిసి కచుడు యయాతిని కలుసుకొన్నాడు.

అందరూ ఎవరికి వచ్చిన వచ్చిన బహుమతులను మిగిలిన వాళ్లకు చూపించుకుంటున్నారు.

తనకు వచ్చిన హారాన్ని అందరికీ చూపించాడు యయాతి.


"బాగుంది కానీ ఇది ఆడపిల్లలకయితే బాగుంటుంది!"అన్నారు ఆడపిల్లలు.


"నిజమే సుమా!చూడగా ఇది ఆడపిల్లలు పెట్టుకొనే హారం లాగానే ఉంది!"అన్నాడు కచుడు.


"ప్చ్!శర్మిష్ఠకు బాగుంటుంది! రేపు ఆమె పుట్టినరోజు... నేనిక్కడ చిక్కుకొన్నాను!"అన్నాడు యయాతి.అతడి కంఠంలో కొంత దిగులు ధ్వనించింది.


"పోనీ!వెళ్ళి రాకుమారిని చూసి వస్తావా?" అన్నాడు కచుడు.


"అదేమన్నా దగ్గరా దాపా? ఇలా వెళ్ళి అలా రావటానికి?" 


"గట్టిగా తల్చుకున్నామంటే నిజంగానే అలా వెళ్లి ఇలా రావచ్చు!"అన్నాడు కచుడు నవ్వుతూ.


"ఎలా? "ఆశ్చర్యంగా ఉంది యయాతికి.


"మన భరద్వాజమహర్షుల వారు విమానాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే అవి అమరావతికి మాత్రమే పరిమితం. భూలోకానికి ఆ శాస్త్రవిజ్ఞానం అందుబాటులో లేదు. ఇప్పటిదాకా గంధర్వు దేవజాతి వాళ్ళలో కొందరు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తున్నారు.మా లాంటి వాళ్ళము కొందరము వాటిని నడపటం నేర్చుకొన్నాము కూడా!అయితే మాకు కేవలం నడపటం మాత్రమే నేర్పించారు కానీ సొంతంగా ఎక్కడికీ తీసికొని వెళ్ళకూడదు. అయితే భరద్వాజుల వారు మాతో చాలా చనువుగా ఉంటారు. ఆయనకు నేనంటే ప్రత్యేకమైన అభిమానం. ఒకసారి భూలోకంలో వచ్చిన వరదల్లో మునులు కొందరు చిక్కుకొని పోయారు. అప్పుడు ఆయన నాకు విమానాన్ని ఇచ్చి పంపించి వాళ్ళను కాపాడమని చెప్పారు. నేను ఆయనను అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు.చూద్దాం!"

వివరించాడు కచుడు.


" నువ్వు విమానం ఏర్పాటు చేసినా నేనొక్కడినే ఎలా వెళ్తాను? తెలియని చోటు!అందరికీ తెలిసేటట్లు వెళ్ళకూడదు!మా నాన్నగారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారు!...పోనీ రహస్యంగా వెళ్లినా అక్కడ అంతఃపురం ఎక్కడ ఉందో కనుక్కోవటం కష్టం!పైగా అక్కడ భద్రత ఎక్కువే ఉంటుంది.... ఈ ఆలోచన కష్టమే అనిపిస్తోంది!"అంటూ తనకున్న సందేహాలను వెలిబుచ్చాడు యయాతి.


"అవన్నీ దాటవచ్చు!కానీ నువ్వు వచ్చావని రాకుమారికి చెప్పేవాళ్ళు కావాలిప్పుడు.... నువ్వు కాకుండా రాకుమారిని ఎవరైనా చూశారా!"


"నేను శర్మిష్ఠను అడవిలో చూశాను.. మనలో చారుమతి ఒక్కటే ఆమె చిత్రపటాన్ని చూసింది. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలదు కూడా!"


"ఇంకేం!చారుమతిని తీసికెళ్ళు!"


"అలా అయితే సారంగదేవుడిని కూడా తీసికొని వెళితే బాగుంటుంది.ప్రియుడికి దూరం చేశానని చారుమతి నన్ను తిట్టుకోకుండా!"పెద్దగా నవ్వాడు యయాతి.

అతడి నవ్వులో శృతి కలుపుతూ దూరంగా ఉన్న సారంగదేవుడిని పిలిచాడు కచుడు.

 సారంగదేవుడి భుజం మీదే ఉంది చారుమతి.


విషయాన్ని వాళ్లకు చెప్పాడు కచుడు.


 " ప్రేమికులకు సహాయం చేస్తే పుణ్యం! సరే అయితే!"అంది చారుమతి.


ఇంతలో ఆడపిల్లల్లో కొందరు శర్మిష్ఠను చూచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతామన్నారు.

వాళ్ళతో పాటు మగపిల్లలు కూడా వస్తామన్నారు.

అందరూ కలసి పదిహేనుమంది తేలారు.


"సరే!అందరినీ తీసికొని వెళ్ళు యయాతీ!"అన్నాడు కచుడు.


ఇక విమానం కావాలి.


===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page