కచదేవయాని - పార్ట్ 58
- T. V. L. Gayathri

- Jun 17
- 6 min read
Updated: Jun 24
#కచదేవయాని #KachaDevayani #Sharmishtha #Devayani #TeluguSerial #TeluguStory #IndianMythology #MahabharataStories #TeluguKathalu #ManaTeluguKathalu

Kachadevayani - Part 58 - Telugu Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 58 - తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 17/06/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. దేవయాని కోరిక ప్రకారం శర్మిష్ఠను దేవయానికి దాసిగా పంపమంటాడు శుక్రాచార్యుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"రాజకుమార్తె నుంచి దాసీగా.. శర్మిష్ఠ జీవితంలో మొదలైన కొత్త అధ్యాయం! "
"రాజకుమార్తె శర్మిష్ఠకు మొదటి ఆజ్ఞ... నగలు తీసేసి దాసీ దుస్తులు ధరించమంది దేవయాని!"
టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 58వ భాగం చదవండి.
శుక్రాచార్యుడి ఆశ్రమంలో ఇరవై దాకా పెద్ద గదులు ఉన్నాయి. ఆయనకు, దేవయానికి సేవ చేయటానికి యాభై మంది దాకా దాసదాసీ జనం ఉన్నారు. ఒక దళపతి సైన్యంతో ఎప్పుడూ ఆశ్రమాన్ని కాపలా కాస్తుంటాడు. నాలుగు రథాలు, అందుకు తగ్గట్లుగా పాతిక గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆశ్రమంలో పది ఏనుగులు కూడా ఉన్నాయి. ఆశ్రమానికి దూరంగా ఉన్న గురుకులాన్ని మొత్తాన్ని నిర్వహించే యంత్రాంగం ఒకటి విడిగా ఉంటుంది.
ఆ గురుకులంలో దాదాపు పదివేల మంది దాకా దానవ జాతి విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. మూడు వందల మంది ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల యోగక్షేమాలు చూస్తూ చదువు చెబుతూ ఉంటారు. దేవయానికి సేవ చేసే దాసీలను అజమాయిషీ చేయటానికి ముక్త, భద్రిణి అనే అధికారిణులు ఉన్నారు.
అటువంటి ఆశ్రమంలోనికి అడుగు పెట్టారు శర్మిష్ఠా నారాచీలు.
శర్మిష్ఠను చూడగానే అక్కడున్న వాళ్లంతా "రాకుమారీ!" అంటూ వినయంగా వంగి నమస్కారం చేశారు. వాళ్ళను చూసి స్నేహంగా నవ్వింది శర్మిష్ఠ.
వీళ్ళు వచ్చారని లోపల గదిలో ఉన్న దేవయానికి కబురందించారు దాసీలు.
"వాళ్ళని లోపలికి రమ్మనండి!" అంది దర్పంగా దేవయాని.
రాజకుమారి వస్తే ఎందుకని దేవయాని స్వాగత మర్యాదలు చేయటం లేదో దాసీలకు అర్థం కావటం లేదు. అలాగే నిల్చున్నారు వాళ్ళు.
"ఏమిటి? చెప్పింది వినిపించటం లేదా? వెళ్ళండి!" గట్టిగా కసిరిందామె.
"ఏమిటో!" అని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ కదిలారు దాసీలు.
దేవయాని గదిలోకి వచ్చారు శర్మిష్ఠ, నారాచీలు.
మంచం మీద నుండి లేచి శర్మిష్ఠ దగ్గరికి వచ్చింది దేవయాని.
"నేనంటే ఏమిటో అర్థం అయింది కదా! ఒక్క రోజులో నీ జీవితం తలకిందులయింది కదూ! రాజకుమారి స్థాయి నుండి దాసీగా... ప్రతి నిమిషం నీ స్థితిని గుర్తు పెట్టుకొని మసలుకో! నీ అహంకారం, నీ దర్పం నా దగ్గర పనికి రావు!" తీక్షణంగా పలికిందామె కంఠం. అప్రయత్నంగా నారాచి పిడికిళ్లు బిగుసుకున్నాయి.
తలవంచుకుంది శర్మిష్ఠ.
"ముక్తా! వీళ్ళ పెట్టెలను తీసుకెళ్లి దాసీలుండే కుటీరంలో పెట్టించు! వీళ్లకు దాసీలు కట్టుకొనే దుస్తులనివ్వు!" అని శర్మిష్ఠ వైపు తిరిగి,
"నీ నగలన్నీ ఒలిచి పెట్టు! ఇక్కడ సింగారించుకొని తిరగటానికి ఇది నీ రాజమందిరం కాదు! నా ఆశ్రమం! ఇదిగో చూడు! నావి ఉతికి పెట్టాల్సిన చీరలున్నాయి. వాటిని కాలువ దగ్గరికి తీసుకెళ్లి శుభ్రంగా ఉతికి ఆరేసి తీసుకొనిరా!" అని మళ్ళీ ముక్త వైపు తిరిగి "దీనికెవ్వరూ సహాయం చేయకూడదు! ఒకవేళ నా మాట కాదని ఎవరైనా దీనికి సహాయం చేశారో వాళ్ళ ప్రాణాలు పోతాయి! తెలిసిందా!" అంటూ హుంకరించింది.
ముక్త పెట్టెలను తీసుకొని వెళ్లిపోయింది.
దేవయాని ఇలా కర్కశంగా ఆజ్ఞాపిస్తుంటే అక్కడున్న దాసీలంతా మాడిపోయిన ముఖాలతో చూస్తున్నారు. వాళ్లంతా దానవజాతి వాళ్ళు. వాళ్ళల్లో తమ జాతి పట్ల అభిమానం ఎక్కువ.
'మన రాజకుమారికి ఇంత అవమానమా?'అని అందరి హృదయాల్లో బాధ కలుగుతోంది.
దాసీలు తెచ్చి ఇచ్చిన దుస్తులను కట్టుకుంది శర్మిష్ఠ.
ఇప్పుడామె ఒంటి మీద ఒక్క నగ కూడా లేదు. అన్నింటినీ ఒలిచి పెట్టింది. చీరల మూటను తీసుకొని ఆశ్రమం వెనుక ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళింది.
ఆ గదిలో నారాచి మిగిలింది.
"నువ్వు వెళ్లి గదులన్నీ శుభ్రం చేసిరా!" అని ఆజ్ఞాపించి మంచం మీద పడుకొని గ్రంథపఠనంలో మునిగింది దేవయాని.
ఆ గదిలోనుంచి బయటకు రాగానే నారాచి చుట్టూ మూగారు దాసీలు.
టూకీగా దేవయాని దుర్మార్గం గురించి చెప్పి "అహంకారంతో మిడిసిపడుతోంది. దేవుడు చూస్తూ కూర్చోడు... ఇంతకింత అనుభవిస్తుంది" అంటూ వాళ్ళతో చెప్పుకొని వాపోయింది నారాచి.
అందరు సానుభూతిగా నారాచిని ఓదార్చారు.
కాలువ ఒడ్డుకు వచ్చింది శర్మిష్ఠ. అంతకు ముందు సైనిక శిక్షణ తీసుకొన్న అనుభవం ఉందామెకు. వంట చేయటం, ఇల్లు సర్దటం లాంటి పనులు ఆమెకు వచ్చు. కానీ ఈ బట్టలు ఉతకటం చేతకాని పని. ఊపిరిని గట్టిగా పీల్చుకుంది. నేర్చుకుంటుంటే రాని పని ఏముంటుంది? జాగ్రత్తగా బట్టలుతుకుతోందామె.
మధ్యాహ్నటికల్లా బట్టల మూటను తెచ్చి దేవయాని ముందు పెట్టింది శర్మిష్ఠ.
వెటకారంగా నవ్వింది దేవయాని.
"పాపం! బట్టలుతికి ఉతికి రాజకుమారి సుకుమారమైన చేతులు బొబ్బలెక్కాయా? ఆకలి వేస్తున్నట్లుంది. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించకండి! పచ్చడి మెతుకులు ఎట్లా ఉంటాయో రుచి చూపించండి!" అంటూ దాసీలకు పురమాయించి లోపలికి వెళ్లిందామె.
దాసీల వెనకాలే తమకు కేటాయించిన కుటీరాలకు వచ్చారు శర్మిష్ఠ, నారాచీలు.
దాసీలుండే చిన్న చిన్న కుటీరాలవి. గురువుగారి ఆశ్రమానికి చాలా దూరంలో ఉంటాయవి. రాజకుమారి కోసం ఉన్నంతలో సౌకర్యంగా తయారు చేసి పెట్టారు దాసీలు.
రహస్యంగా వాళ్ళు తినే ఆహారాన్ని వీళ్లకు తెచ్చి పెట్టారు వాళ్ళు. తమ రాజకుమారికి ఇంత కష్టం వచ్చిందని అందరికీ హృదయం ద్రవించిపోతోంది.
అయినా ఎవ్వరు ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇలా ఈ పది రోజులు గడపాలి.
===============================================
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |







Comments