కచదేవయాని - పార్ట్ 40
- T. V. L. Gayathri

- 20 hours ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 40 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 09/02/2026
కచదేవయాని - పార్ట్ 40 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక నలభయ్యవ భాగం చదవండి.
భరద్వాజుడిని తీసికొని ముని సంఘాల దగ్గరికి వచ్చారు మిగిలిన ముగ్గురు మహర్షులు. అక్కడ అప్పటికే వీతిహోత్ర చక్రవర్తి కూర్చుని ఉన్నాడు.
వీరిని చూడంగానే "రండి రండి మహర్షులారా!ఈ రోజు యయాతి ప్రదర్శన అద్భుతం!మేమందరం అదే విషయాన్ని ముచ్చటించుకొంటున్నాము!యయాతికి ప్రథమ బహుమతి ఖాయం!నా స్నేహితుడి కుమారుడు ప్రథమ స్థానాన్ని పొందటం నా కెంతో గర్వంగా ఉంది. "అన్నాడు వీతిహోత్ర చక్రవర్తి.
"లేదు వీతిహోత్రా!యయాతికి ప్రథమ స్థానం దక్కలేదు. " అంటూ దేవేంద్రుడి నిర్ణయాన్ని చెప్పాడు కశ్యప మహర్షి.
మునులందరి ముఖాల్లో విస్మయం కనిపించింది.
"ఇదేమిటి? అతడి విన్యాసాలు అందరి కంటే గొప్పగా ఉన్నాయి. చివరకు ప్రేక్షకులందరి మీద పూలు కురిపించాడు. అటువంటి ప్రదర్శన ఎవరూ చేయలేక పోయారు.. "
వీతిహోత్రుడి మాటలకు అడ్డం వచ్చాడు అత్రి మహాముని.
"ఇక్కడ ప్రతిభకు స్థానం లేదు వీతిహోత్రా!వివక్ష కొనసాగుతోంది. ఏదో మా కంటితుడుపుగా దేవేంద్రుడు యయాతికి తృతీయ స్థానాన్ని కట్టబెట్టాడు. "అసహనంగా పలికాడు అత్రి మహాముని.
మునిసంఘాల వాళ్ళు ఆలోచనలో పడ్డారు.
"దేవేంద్రుడు అందరినీ కలుపుకొని పోవాలని అంటూనే పక్షపాత ధోరణిని చూపించాడు. తన కుమారుడి నిర్ణయానికి అడ్డు చెప్పలేక పోతున్నాడనిపిస్తోంది. ఏదైనా యయాతికి మాత్రం అన్యాయం జరిగింది. " కశ్యప మహర్షి కంఠంలో అసంతృప్తి ధ్వనించింది.
"నిర్ణయం ప్రభువులది అయినప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడక పోవటమే మంచిది!మనం కూడా పట్టుదలకు పోయి ఇప్పుడు గొడవ పెట్టుకోవటమెందుకు?" అంటూ అనునయంగా మాట్లాడాడు భరద్వాజుడు.
వీతిహోత్రుడు తలను పనికించాడు.
"దేవేంద్రుడు యయాతికి ప్రథమ స్థానమీయక పోతే ఏమవుతుంది? తృతీయ స్థానానికైనా బహుమానంగా విమానాన్నివ్వాల్సిందే!నేను నా పుష్కర ద్వీపంలో కొంత భూభాగాన్ని యయాతికి బహుమానంగా ఇచ్చి, దానిలో అతడి కోసం ఒక రాజధానిని నిర్మింపచేస్తాను!ఇంతవరకు భూలోకవాసులెవ్వరూ పుష్కర ద్వీపంలో రాజ్యం చేసిన వాళ్లు కారు. యయాతికి మాత్రమే ఆ ఖ్యాతి దక్కుతుంది. "వీతిహోత్రుని మాటలకు ముని సంఘాల వాళ్ళందరు" శభాష్!బాగుంది!మంచి నిర్ణయం!"అంటూ మెచ్చుకున్నారు.
"మనమందరం ఎల్లవేళలా యయాతికి బాసటగా నడుద్దాము!కుర్రవాడిలో తెలివి తేటలే కాదు సాహస సామర్థ్యాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇటువంటి పుత్రుడిని కన్న నహుషచక్రవర్తి అదృష్టవంతుడు. మనందరమూ అతడికి ఆశీస్సులనందిద్దాము!మనంందరి తపోబలమే అతడిని అజేయంగా నిలబెడుతుంది. కోటి కోటి బహుమానాల కంటే మన ఆశీస్సులే ఆ చిన్నవాడికి రక్ష!"అన్నాడు అగస్త్య మహర్షి.
మునులందరు సంతోషంతో చప్పట్లు కొట్టారు.
ఆ రాత్రి హూహు దగ్గరికి వచ్చాడు జయంతుడు.
" యయాతి గురించి ఏమనుకుంటున్నావు? " జయంతుడిని అడిగాడు హూహు.
"అనుకోవటనికేముంది? భూలోకానికి విమానాన్ని తీసికెళ్తున్నాడు. వాడు తెలివైన వాడు. వాడిని ఎలా నిలువరించాలా అని ఆలోచిస్తున్నాను. "
"మా కిద్దరికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేయించు!నిమిషంలో వాడిని మట్టి కరిపిస్తాను!"అంటూ పళ్ళు పటపటా కొరికాడు హూహు.
అతడి భుజం మీద చెయ్యి వేశాడు జయంతుడు.
"ప్రస్తుతం మనం లౌక్యంగా ప్రవర్తించాలి. ముని సంఘాల వాళ్లంతా వాడి వీరత్వాన్ని పొగుడుకుంటూ తరిస్తున్నారు. వాడి మీద నా కెంత కోపం ఉందో నీకు తెలియంది కాదు.. అయినా రేప్పొద్దున అందరి ముందు వాడిని అభినందిద్దాము! మనిద్దరం కాస్త హుందాగా వ్యవహరిద్దాం! సమయమొచ్చినప్పుడు వాడి సంగతి చూసుకుందాం!"
మౌనంగా వున్నాడు హూహు.
అతడి మనసు యయాతి మీద క్రోధంతో రగిలిపోతోంది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 41 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments