top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 31

Updated: 1 day ago

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 31 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 25/12/2025

కచదేవయాని - పార్ట్ 31 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 



దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమానం నడపడం నేర్చుకుంటాడు యయాతి.

శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి.


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి. 

ఇక కచదేవయాని ధారావాహిక ముప్పయ్యవ ఒకటవ భాగం చదవండి. 

శర్మిష్ఠ పుట్టినరోజు వేడుక అంగరంగవైభవంగా జరుగుతోంది. వెలిగిపోతోంది రాకుమారి. వేడుకకు హాజరయ్యింది దేవయాని. అందరితో పాటు ఉత్సవంలో పాల్గొంది కానీ శర్మిష్ఠా కచుల గురించే ఆలోచిస్తోందామె. ఎవరైనా పలకరిస్తే బలవంతంగా నవ్వుతూ సమాధానం చెబుతోంది. ఆమె ముఖంలో కళాకాంతి లేదు. సర్వం కోల్పోయిన దానిలా ఉంది.


ఉత్సవం జరుగుతుంటే, ప్రజలందరూ తరలి వచ్చి సింహాసనం మీద ఉన్న శర్మిష్ఠను పొగుడుతూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రజలందరికీ రాచబంధువులు కొందరు దానధర్మాలు చేస్తున్నారు. మరి కొందరు అధికారులు ప్రజలందరికీ విందు భోజనాలు పెట్టిస్తున్నారు.అంతటా కోలాహలం...అందరి ముఖాల్లో సంతోషం..


ఇంత ఉత్సవం జరుగుతుంటే వృషపర్వమహారాజు ఒక వైపు కూర్చుని సేనాని దీర్ఘదర్శితో ఏదో మాట్లాడుతున్నాడు. గమనించింది దేవయాని. మహారాజు ముఖకవళికలను బట్టి విషయం గంభీరమైనదని అర్థం  అయిందామెకు.


ఏమై ఉంటుంది?..... మహారాజు ప్రక్కన ఉన్న మంత్రులు కూడా కొంత విచారంగా ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు.


బహుశా కచుడు వచ్చిన విషయం గురించేనా?...ఎటూ ఆలోచించలేకపోతోంది.


ఈ పుట్టిన రోజు తంతు విసుగ్గా ఉందామెకు.

విందు భోజనం కూడా విషతుల్యంగా అనిపించింది. ఏదో బంతిలో కూర్చుని నాలుగు మెతుకులు కతికింది. కాసేపయ్యాక తనకు తలనొప్పిగా ఉందని సుమాలినీదేవికి చెప్పి, అక్కడి నుండి బయటపడి తన గదిలోకి వచ్చింది.


ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు దేవయానికి.


'కచుడు వచ్చి వెళ్లిన విషయం మహారాజుతో చెప్పాలి... ఆయన కూతురే కచుడితో ప్రేమాయణం సాగిస్తోందంటే ఆయన నమ్ముతాడా? వెంటనే శర్మిష్ఠను పిలిచి అడుగుతాడు. శర్మిష్ఠ ఏదో అబద్ధం కల్పించి చెప్పగలదు... పెద్ద జాణ! .. దానికి రాని విద్య లేదు...వెఱ్ఱి మారాజుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ.


మధ్యలో తన పరువు పోవటం తప్ప ప్రయోజనమేమీ ఉండదు! ఏం చెయ్యాలి?...

శర్మిష్ఠ గురించి ఎత్తకుండా కచుడిని తోటలో తను చూసిందని చెప్తే! .. ఎలా ఉంటుంది? '


ఆలోచిస్తోంది దేవయాని.


'కచుడు ఇంక శర్మిష్ఠ కోసం మళ్ళీ మళ్ళీ రాక మానడు. వస్తూనే ఉంటాడు. శర్మిష్ఠను అమరావతికి తీసుకొని పోవటమే అతడి లక్ష్యం. రాక్షసుల కూతుర్ని ప్రేమ పేరు చెప్పి తీసుకొనిపోతే ఇంకేముంది? దానవరాజు తన కూతురు కోసం దేవతలతో యుద్ధం చేయడు కాక చేయడు. ఆహా! ఎంత గొప్ప ప్రణాళిక! నయ వంచకుడు! ఆ నాడు మృత సంజీవని కోసం వచ్చి తనని మోసం చేశాడు. ఇప్పుడు శర్మిష్ఠను అడ్డం పెట్టుకొని రాక్షసుల్ని బలహీనులను చేయటం! వాడి బుర్రను బద్దలు కొట్టాలి! ఈ లోపలనే ఏదో ఒకటి చేసి కచుడిని పట్టి బంధించాలి! .... అతి కిరాతకంగా చంపెయ్యాలి! ... '


మంచం మీద ఆశాంతితో అటూ ఇటూ పొర్లుతోంది దేవయాని.


 ' ఒకప్పుడు తను కచుడిని ప్రాణంగా ప్రేమించింది. ఈ దానవుల నుండి అతడి ప్రాణాలను కాపాడుకోవటం కోసం అహరహం ప్రయత్నించింది. తన ప్రేమకు ఫలితం? మోసపోవటం... ఇప్పుడు అలా జరగకూడదు. అదే కచుడిని పట్టి బంధించాలి! వాడి ప్రాణాలు తీయాలి! ...అంతే! '


తెల్లవారే సరికి స్థిరనిశ్చయానికి వచ్చింది దేవయాని.


అప్పుడామెకు గాఢంగా నిద్ర పట్టింది.

===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page