top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 30

Updated: 6 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 30 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 21/12/2025

కచదేవయాని - పార్ట్ 30 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 



దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి. 

ఇక కచదేవయాని ధారావాహిక ముప్పయ్యవ భాగం చదవండి. 


తెల్లవారే లోపల విమానాన్ని పుష్కర ద్వీపానికి చేర్చాడు కచుడు విమానాన్ని భరద్వాజ మహర్షికి ఒప్పజెప్పి మిత్రులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 


"మహర్షీ! నాకు విమానాన్ని నడపటం సాధ్యం అవుతుందా? "అని వినయంగా మహర్షిని ప్రశ్నించాడు యయాతి. 


నవ్వాడు భరద్వాజుడు. 


"ఇందులో సాధ్యం కానిదేముంది కుమారా!అదొక యంత్రం!మనలో పట్టుదల ఉండాలి అంతే!ఇప్పుడు కూడా కొంతమందికి నేర్పిస్తున్నాము!ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం నుండి విమాన విన్యాసాల పోటీని నిర్వహించాలని దేవేంద్రుల వారు సంకల్పించారు. పోటీలో గెలిచిన వారికి విమానాన్ని బహుమానంగా ఇస్తారు. పోటీకి ఇంకో నెల రోజులు సమయం ఉంది. ఈ నెల రోజుల్లో నువ్వు విమానాన్ని నడపటం నేర్చుకోవచ్చు కానీ విన్యాసాలు చేయాలంటే చాలా నైపుణ్యం కావాలి.. అలా అని అసాధ్యం అని మాత్రం అనుకోవద్దు! అది నీ తెలివితేటల మీద, అంకిత భావం మీద, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే గంధర్వుల్లో కొందరు, దేవతల్లో కొందరు విన్యాసాలు చేయడానికి ముందుకు వచ్చారు. దేవతల వైపు నుంచి గొప్ప నైపుణ్యం కలవాడు మన కచుడు. గంధర్వుల వైపు నుంచి నేర్పు కలవాడు హూహు. "అంటూ వివరించాడు భరద్వాజుడు


 సంతోషం వేసింది యయాతికి. 


"మహర్షీ! ముందు నేను నేర్చుకుంటాను! తర్వాత విన్యాసాల గురించి ఆలోచించవచ్చు! మీ వంటి పెద్దల ఆశీస్సులే మాలాంటి చిన్న వాళ్లకు బలాన్ని అందిస్తాయి. మా నాన్నగారికి చెప్పి అనుమతిని తీసుకొని వస్తాను!" అంటూ భరద్వాజ మహర్షికి సాష్టాంగదండప్రణామం చేశాడు యయాతి. 


చెయ్యెత్తి ఆశీర్వదించాడు మహర్షి. 


అక్కడి నుండి తమ తమ వసతి గృహాలకు బయలుదేరారు మిత్రులంతా. 


"అయితే నువ్వు ఒక నెలపాటు ఇక్కడే ఉంటావన్నమాట!" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు కచుడు. 


"ఇదంతా నీ చలవే! నువ్వు నాకు పరిచయం కాకపోతే అసలు విమానం అంటే ఏమిటో తెలిసేదే కాదు!" అన్నాడు యయాతి. 


"పద! వెళ్దాం! ఈరోజు నుండి నీకు కఠినమైన విమాన శిక్షణ ప్రారంభం అవుతుంది! అంటూ యయాతి భుజాన్ని తట్టాడు కచుడు. 


నహుష చక్రవర్తి దగ్గరికి వచ్చి విమాన చోదక శిక్షణ గురించి చెప్పాడు యయాతి. సంతోషంగా ఒప్పుకున్నాడు నహుషుడు. 

మరో రెండు రోజులకు వేద గోష్టి వైభవంగా ముగిసింది. 


తర్వాత నహుష చక్రవర్తి ఒక్కడే ప్రతిష్ఠానపురానికి తిరిగి వచ్చేశాడు. 


యయాతితో పాటు పింగళ, శక్తిధరులు కూడా విమాన శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 


విశ్వావసు చక్రవర్తి దగ్గర సేనాధిపతిగా పని చేస్తున్నాడు 'హూహు' అనే గంధర్వ యువకుడు. అతడు యుద్ధంలో వందమందినైనా ఒక్కసారిగా సంహరించగల బలవంతుడు. తెలివితేటల్ని, యుద్ధనైపుణ్యాన్ని కలబోస్తే హూహు రూపమవుతుంది. అతడి గంభీరమైన నడక, మాట, ప్రవర్తన చూచే వాళ్లకు కొంత భయాన్ని కలుగ చేస్తుంటాయి. అతడు కూడా విమాన విన్యాసాల్లో పాల్గొంటున్నాడు. 


కఠినాతి కఠినమైన విమాన చోదక శిక్షణ సాగుతోంది. 


వీళ్లందరికీ శిక్షకుడు 'మాణవకుడు 'అనే గంధర్వుడు. అతడు మృదుస్వభావి. ఓర్పుగా విద్యార్థులకు విమానంలో ఉండే భాగాలను వివరించటం, ఎలా నడపాలో నేర్పించటంతో పాటు, ఒకవేళ యంత్రం చెడిపోతే బాగుచేయటమెలాగో కూడా శిక్షణ ఇస్తున్నాడు. 


విమానాన్ని నడపటం నేర్చుకొన్న చోదకులకు దానితో విన్యాసాలు ఎలా చెయ్యాలో నేర్పించటానికి' బంధురకుడు' అనే దేవజాతికి చెందిన శిక్షకుడు నియమించబడ్డాడు. 

బంధురకుడు కొంచెం పెద్దవాడు. అయితే అతడికి చికాకు చాలా ఎక్కువ. విద్యార్థులు సరిగ్గా నడపకపోతే ఎక్కువ తక్కువలు చూడకుండా తిట్టి మరీ నేర్పిస్తాడు. 


యయాతికి తాను చిన్నప్పుడు గురుకులంలో గడపిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. 

అతడికి రాత్రి పవలు అనే తేడా కనిపించటం లేదు. రోజు రోజుకూ విమాన శిక్షణలో మెలకువలను ఆకళింపు చేసుకుంటున్నాడు. అంకితభావంతో నేర్చుకుంటూ ఇద్దరు గురువులకు ప్రీతి పాత్రుడయ్యాడు యయాతి. 


అయితే ఈ విషయం హూహుకు నచ్చటం లేదు. 'ఒక మానవుడు.. భూలోకం నుండి వచ్చి తమతో పోటీ పడుతున్నాడు.. 'అని క్రమక్రమంగా యయాతి మీద ఈర్ష్యను 

పెంచుకుంటున్నాడతడు. 


శిక్షణ కొనసాగుతోంది. 

===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page