top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 28

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 28 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 12/12/2025

కచదేవయాని - పార్ట్ 28 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:  మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 

పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు కచుడు. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి. 


ఆ సమయంలో దేవయానికి మెలకువ వచ్చింది. 

'ఇంకా తెల్లవారలేదు. ఈ రోజు శర్మిష్ఠ పుట్టినరోజు. తెల్లవారంగానే కోలాహలం మొదలవుతుంది. ' అనుకుంటూ పక్కమీద నుండి లేచి వెనుక వైపు వరండాలోకి వచ్చింది. 

అలా కాసేపు తోటలోకి చూస్తే హాయిగా ఉంటుందామెకు. అప్పుడప్పుడే సన్నటి వెలుగురేకలు వికసిస్తున్నాయి. క్రిందకు చూసింది దేవయాని. 


ఆశ్చర్యం! .. కచుడు! .. తోటలో.. 


తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. 


ఇది నిజమా! కచుడే! కోటి మందిలో ఉన్నా గుర్తు పట్టగలదు. ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు. 


ఎందుకొచ్చాడు? దానవరాజ్యంలోకి అంత ధైర్యంగా.. ప్రాణాలను ఫణంగా పెట్టి.. 

రాక్షసులు అతడిని చూస్తే చంపేస్తారు.. అంత సాహసం ఎవరికోసం? 


తన కోసమా! ఇక్కడ రాక్షసులు కాకుండా ఎవరున్నారు? తను మాత్రమే! తన కోసమే! మనసు మార్చుకొన్నాడేమో! తన కోసం వెతుక్కుంటున్నాడేమో! క్షమించమని వేడుకుంటాడేమో! .. 


గట్టిగా పిలిస్తే! .. ఆమ్మో! కాపలా వాళ్లకు వినిపిస్తుంది. వద్దు! వద్దు! ప్రమాదం! 


దేవయాని మనసు ఒక వైపు ఆనందంతో మరొక వైపు సందేహంతో ఊగిసలాడుతోంది. 

ఆ భవనంలో ఆమె గది నాలుగో అంతస్తులో ఉంది. 

తోటలోకి మెట్లు ఆమె చెలికత్తెల గది నుండి ఉన్నాయి. 


రెండో అంతస్తులో శర్మిష్ఠ ఉంటుంది. ఆమె గదిలోనుంచి తోటలోనికి వెళ్లొచ్చు! 

లేకపోతే అన్ని మెట్లు దిగి భవనం ముఖ ద్వారం నుండి వెళ్లి వెనుక వైపుకు వచ్చి తోటలోకి రావాలి. అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు. 

శర్మిష్ఠ గదిలో నుంచి తోటలోకి వెళ్ళటమే ఉత్తమం. 


దేవయాని ఆలస్యం చేయలేదు. 

గబగబా ముఖం కడుక్కుంది. చీర మార్చుకుంది. జడ విప్పి బరబరా దువ్వి జడ వేసుకుంటూ గది బయటకు వచ్చేసింది. 


అక్కడ దాసీజనం లేరు. 

' హమ్మయ్య! ' అనుకుంటూ వేగంగా మెట్లు దిగి శర్మిష్ఠ గది దగ్గరికి వచ్చి తలుపు తోయబోయింది. 


లోపల గడియ వేసి ఉంది. లోపల నుండి మగవాడి నవ్వు వినిపించింది. 

ఠక్కున ఆగిపోయింది దేవయాని. 


లోపల ఎవరున్నారు?


మహారాజమందిరం కొంచెం దూరంలో ఉంటుంది. మహారాజు తప్ప ఎవ్వరూ ఇక్కడికి రారు! ఈ సమయంలో ఆయన ఎందుకు వస్తారు? కిందా పైనా అంతస్తులలో శర్మిష్ఠ దాసీలు, స్నేహితురాళ్లు ఉంటారు. కాపలా వాళ్ళు కూడా సాయుధులైన ఆడవాళ్లే ఉంటారు. ఎవరై ఉంటారు?


తలుపుకు చెవి అనించి నిల్చుంది దేవయాని. మరలా మగవాడి నవ్వు.. ఏదో తేల్చుకోవాలి! 


"శర్మిష్ఠా! శర్మిష్ఠా! "అంటూ తలుపు తట్టింది. 


ఉలిక్కిపడ్డారు యయాతి శర్మిష్ఠలు. 


"ఇప్పుడెవరు?" అన్నట్లు చూశాడు యయాతి. 


"హుష్! "అని అటూ ఇటూ చూసింది శర్మిష్ఠ. 


యయాతిని దాచి పెట్టాలి! 


కిటికీకి అడ్డంగా కట్టి ఉన్న పరదా కనిపించింది. 


యయాతి చేతిని పట్టుకొని తీసికెళ్లి పరదా చాటున నిలబెట్టి" హుష్! "అని గబగబా తలుపు దగ్గరికి వచ్చింది. 


ఈ లోపల మరో రెండుసార్లు తలుపు తట్టింది దేవయాని. 


మెల్లగా తలుపు తీసింది శర్మిష్ఠ. 


"ఏమిటక్కా?"అంది అప్పుడే నిద్ర లేచినదానిలాగా. 


"నాన్నగారు వచ్చారా?" అంటూ లోపలికి రాబోయింది దేవయాని. 


"లేదక్కా! ఎవరూ లేరు! 

తలుపుకు చేతులడ్డంపెట్టి నిలబడింది శర్మిష్ఠ. 


అనుమానం ఇంకా ఎక్కువయ్యింది. 


"అప్పుడే లేచి స్నానం చేశావా?" శర్మిష్ఠ అలంకారం చూస్తే అప్పుడే నిద్ర లేచినట్లుగా లేదు. ఆ పట్టు పరికిణీ.. దాని మీద ఓణీ.. నగలు అన్నీ.. 


"లేదక్కా! ఇప్పుడే లేచాను! "


"లోపలికి రానిస్తావా లేదా నన్ను?" ముఖానికి నవ్వు పులుముకొని చనువుగా అడిగింది దేవయాని. 


ఇంక తప్పదు! 

కొంచెం దూరంగా జరిగి దారి ఇచ్చింది శర్మిష్ఠ. 


లోపలికి వచ్చింది దేవయాని. 


గదంతా దివ్యమైన అత్తరు పరిమళం. 


అది కచుడు వాడే అత్తరు పరిమళం. 

అతడు తన తండ్రి దగ్గరికి శిష్యునిగా వచ్చినప్పుడు అమరావతి నుండి సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు ఎన్నో తెచ్చి ఇచ్చాడు. వెళ్లేటప్పుడు కూడా మర్యాదగా ఎన్నో విలువైన రత్నాలు, దుస్తులు, అత్తరు భరిణలు తెచ్చి ఇచ్చాడు. అయితే అతడి మీద కోపంతో తను వాటిని నదిలో పారేసింది. 


అతడు రోజూ అత్తరు చల్లుకొని ఆశ్రమానికి వచ్చేవాడు. ఆ పరిమళం ఎంతో దూరం దాకా వ్యాపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిమళం. అంటే కచుడు శర్మిష్ఠ గదిలోకి వచ్చాడు. 

ఇక్కడే ఉన్నాడు.. 


శర్మిష్ఠ పరదా దగ్గరికి వెళ్లి నిల్చుంది. 

ఆమె కళ్ళల్లో కొద్దిగా బెరుకు కనిపిస్తోంది. 

ree

మంచం మీద కూర్చుంది దేవయాని. 

ఆమె దృష్టి ప్రక్కనే బల్ల మీద ఉన్న యయాతి తలపాగా మీద పడింది. 


"ఖర్మ "అనుకుంటూ నుదురు మీద కొట్టుకున్నాడు యయాతి. 


తలపాగాను చేత్తో పట్టుకొని చూస్తోంది దేవయాని. 


సందేహం లేదు! 


ఇది కచుడిది. 


అమరావతిలో వాళ్ళు చేసే పనిని బట్టి తలపాగాలు పెట్టుకొంటారు. 

ఉపాధ్యాయులకు ఒక రకమైన తలపాగాలు, సైనికులకు మరో రకంవి, వైద్యులకు ఇంకోరకం ఇలా వృత్తులను బట్టి తలపాగాలు ఉంటాయి. పైగా తలపాగాల మీద వారి పేరు ముద్రించి ఉంటుంది. కచుడు వైద్యుడు. తలపాగాను పరిశీలనగా చూసింది. కచుడి పేరు చిత్రించి ఉంది. 


తనకు బాగా తెలిసిన తలపాగా అది. మొదటిసారి దానవులు కచుడిని చంపేసినప్పుడు అతడి వస్తువులను పట్టుకొని ఎంతసేపో ఏడ్చింది తను. 

అతడి తలపాగాను ఎన్ని సార్లు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చిందో! 


ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కచుడు. 


తన కోసం కాదు! .. శర్మిష్ఠ కోసం! .. 


నెమ్మదిగా తలపాగాను తీసి బల్లమీద పెట్టింది. 


"ఇది ఎవరిది శర్మిష్ఠా! "అడిగింది మెల్లగా. 

ఆమె కంఠం ఆమెకే కొత్తగా ఉంది. 


శర్మిష్ఠ అబద్ధం చెప్తుందని తెలుసు. 


"అదీ! .. దాన్ని.. దాన్ని.. నాన్నగారికి ఎవరో.. "

తడబడుతోంది శర్మిష్ఠ. 


"బహుమానంగా ఇచ్చారు! అవునా! "


దేవయాని నిశితంగా శర్మిష్ఠనే చూస్తోంది. 


తలూపింది శర్మిష్ఠ. 


"సరే! నేను వెళ్తాను! "అంటూ లేచింది. శర్మిష్ఠ వెనకాల పరదా చాటున పొడుగ్గా నీడ.. కచుడు.. అనుకుంది దేవయాని.


మెల్లగా తలుపుదగ్గరికి వచ్చింది దేవయాని. 

అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది శర్మిష్ఠ. 

గబగబా తలుపు దగ్గరికి వచ్చింది. 

వెనక్కు తిరిగి పరదా వెనుక నీడని చూస్తూ గది బయటకు వచ్చేసింది దేవయాని. 


గబక్కున తలుపు గడియ పెట్టింది శర్మిష్ఠ. 


"హమ్మయ్య! "గుండెల నిండా గాలి పీల్చుకొంది. 


 పరదా చాటు నుండి బయటకు వచ్చాడు యయాతి. 


"ఎవరు? మీ బంధువా?" 


"అంతకంటే ఎక్కువ. మా గురువుగారి కూతురు దేవయాని. "


"ఇక్కడే తిష్ఠ వేస్తుందేమో అనుకున్నా! త్వరగానే వదిలింది! "అన్నాడు యయాతి మెల్లగా. 


"అక్కకు అనుమానం వచ్చినట్లుంది. మీరు వచ్చినట్లు ఎవరికైనా తెలిస్తే ఎలా? అందరూ నన్ను ఆట పట్టిస్తారు! వివాహం కాకుండానే.. "


"మనిద్దరికీ కొంచెం ఇబ్బందే మరి! అందులో ఒక లాభం ఉంది! పెద్దవాళ్ళు వెంటనే ముహూర్తాలు పెట్టేస్తారు! అప్పుడు.. "


శర్మిష్ఠ ముఖం ఎర్రగా కందిపోయింది. 


చిన్నగా నవ్వాడు యయాతి. 


బయట తలుపు దగ్గరే నిలబడి ఉంది దేవయాని. 


లోపల నుండి సన్న సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. 


గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే క్రోధంతో, దుఃఖంతో తన గదిలోకి వెళ్ళింది దేవయాని. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 29 త్వరలో

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page