top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 27

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 27 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 08/12/2025

కచదేవయాని - పార్ట్ 27 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని. 

పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. శర్మిష్ఠ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి వెళ్లాలనుకుంటాడు యయాతి. అతనికోసం విమానం ఏర్పాటు చేస్తాడు కచుడు.


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 27 చదవండి. 


రాత్రిపూట మెల్లగా విమానం ఆకాశంలో వెళుతోంది. దూరంగా రాజధాని. మినుకు మినుకు మంటున్న దీపాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం చీకటిగా ఉంది.

దూరంగా దట్టమైన చెట్లతో పూలతోట కనిపించింది.

కచుడు బాణాన్ని తీసి అభిమంత్రించి సమ్మోహనాస్త్రాన్ని వేశాడు. రాచభవనాలకు కాపలాగా ఉన్న భటులు ఎలా వున్నవాళ్లు అలాగే మత్తులోకి జారుకున్నారు.


"వెళ్ళు చారుమతీ! నేను ఈ చెట్లకవతల ఉన్న మైదాన ప్రాంతంలో విమానాన్ని ఆపుతాను! నువ్వు వెళ్లి యయాతి వస్తున్నాడని రాకుమారికి చెప్పిరా! మేము భవనం వెనకాలే ఉంటాము!" అన్నాడు కచుడు.


చారుమతి రివ్వున ఎగురుకుంటూ వెళ్ళింది.


విమానం మెల్లగా భూమిమీద దిగింది.


యయాతి ధనుర్బాణాలు సర్దుకొన్నాడు. శరావతి చేతిలో కత్తి పట్టుకొని దిగింది. ఆమెకు కూడా కొద్దిగా యుద్ధవిద్యలు తెలుసు. సారంగదేవుడు తన బల్లెంతో సహా ఎగిరి కిందికి దూకాడు.

అందరూ ఆ తోటలోనికి మెల్లగా నడుస్తూ వస్తున్నారు.


చారుమతికి యువరాణి ఉండే భవనం ఏమిటో కనిపెట్టడానికి కాస్త సమయం పట్టింది.

చివరకు అన్ని భవనాల్లోకంటే అందమైన భవనాన్నొక దాన్ని చూసింది.

ఆ భవనం ప్రత్యేకంగా ఉంది. దాని అలంకరణ అద్భుతంగా ఉంది. ' అదే శర్మిష్ఠ భవనం అయ్యుండాలి' అనుకుంటూ కిటికీల నుండి లోపలికి చూస్తూ వెళుతోంది.

చివరాఖరుకు రెండో అంతస్తులో ఉన్న పెద్ద గదిలో నిద్రపోతున్న శర్మిష్ఠ కనిపించింది.


యయాతి చెప్పింది నిజమే! చిత్రంలో కంటే వెయ్యిరెట్లు అందంగా ఉంది.

చారుమతి ఎగురుకుంటూ యయాతి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడికి రావాలో చెప్పి వెంటనే శర్మిష్ఠ గదిలోకి వచ్చింది.


"శర్మిష్ఠా! శర్మిష్ఠా!" అంటూ పిలిచింది నెమ్మదిగా.


లేవలేదు శర్మిష్ఠ.

ఇలా కాదు అనుకొని పక్కనే ఉన్న పూలగుత్తి లోనుంచి ముక్కుతో ఒక పువ్వును తీసి ఆమె బుగ్గ మీద మెల్లగా తట్టింది.


ఉలిక్కిపడి లేచింది శర్మిష్ఠ.

ఎదురుగ్గా రంగురంగుల చిలుక.


"నువ్వు శర్మిష్ఠ రాకుమారివే కదా!" అడిగింది చారుమతి.


ఆశ్చర్యపోయింది శర్మిష్ఠ.

చిలుక మాట్లాడటమేమిటి? ఏమిటీ మాయ!

దుప్పటిని గుండెల మీదకు లాక్కుంది.


"భయపడకు శర్మిష్ఠా! నేను యయాతి యువరాజు స్నేహితురాలిని. చారుమతిని. నీ పుట్టిన రోజుకు రహస్యంగా యువరాజు వచ్చాడు. ఈ భవనం వెనుక తోటలో ఉన్నాడు."


ఒక్క ఉదుటున లేచింది శర్మిష్ఠ.

"నిజంగా!" శర్మిష్ఠ గుండె వేగంగా కొట్టుకొంటోంది.


"అవును! నువ్వు తయారవ్వు! ఒక్క అరగంటలో వస్తాడు!"

అంటూ వెళ్ళబోయింది చారుమతి.

"ఈ వెనుక వైపు మెట్లు ఉన్నాయి!" అంటూ గదికి వెనుక వైపు ఉన్న తలుపు తీసి మెట్లు చూపించింది శర్మిష్ఠ.


చారుమతి వెళ్లి పోయింది.


శర్మిష్ఠకు కంగారుగా ఉంది.

పరిగెత్తుకుంటూ వెళ్లి గదికి ప్రధాన ద్వారాన్ని మూసి గడియ పెట్టింది.


"ఇంక చెలికత్తెలు రారు!" అనుకుంటూ స్నానాల గదిలో దూరింది.

గబగబా స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి తల దువ్వెసింది.అద్దంలో ఒకసారి చూసుకొంది.


మామూలుగా అయితే ఆమె స్నానం చేయటానికి రెండుగంటలు పడుతుంది.

గదిలో ఏమున్నాయో చూసింది. రాత్రి చెలికత్తెలు పెట్టిన పళ్ళు ఉన్నాయి. డబ్బాలో కాసిన్ని తీపి పదార్థాలు ఉన్నాయి.


"అయ్యో! ముందు తెలిస్తే బాగుండేది! అతడు వస్తున్నాడు... ఎలా ఇప్పుడు?... ఏం చెయ్యాలి?..."


శర్మిష్ఠలో ఏదో తెలియని తత్తరపాటు.


ప్రక్క బట్టలు సర్దింది. పూలగుత్తులను సరిగ్గా పెట్టింది. మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకొంది. 'ఈ ఓణీ బాగానే ఉంది కదా!' అనుకుంటూ ఉండగా వెనుక వైపున అడుగుల చప్పుడు వినిపించింది.


తిరిగి చూచింది.


యయాతి.


అతడి దేహం నుండి వెలువడుతున్న దివ్యమైన పరిమళం ఆ గది నిండా వ్యాపించింది.


"పుట్టిన రోజు శుభాకాంక్షలు రాజకుమారీ!" అంటూ దగ్గరికి వచ్చాడు యయాతి.


కళ్ళు దించుకొంది శర్మిష్ఠ.


"ఏదీ! అప్పుడేదో బంధించాలి శిక్షించాలి అన్నావు! అపరాధి నీ ఎదురుగా ఉన్నాడు మరి!" అంటుంటే తల ఎత్తి చూచిందామె.

నవ్వుతున్నాడతడు.

"అప్పుడు... అప్పుడు మీరని తెలియదు... నాకు..."


తడబడుతోంది శర్మిష్ఠ.


యయాతి తన తలపాగాను తీసి అక్కడున్న బల్లమీద పెట్టాడు.

రింగులు రింగులుగా ఉన్న తన ఒత్తైన జుట్టును వెన్నక్కు తోసుకున్నాడు.


"కూర్చోండి!", అంది శర్మిష్ఠ.

ree

అతడు తన దుస్తులలోనుంచి చిన్న బంగారు పెట్టెను తీశాడు.

అందులో ఉన్న ముత్యాలహారం ధగధగా మెరుస్తోంది.

హారాన్ని చేతిలో పట్టుకున్నాడతడు.


"నీ పుట్టిన రోజుకు రావాలనే సంకల్పమే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది."


శర్మిష్ఠ మదిలో వేయి వేణువులు మోగుతున్నాయి. ఏమి మాయ చేశాడో తెలియదు కానీ అతడి సమక్షంలో చెప్పలేని పరవశత్వం కలుగుతోంది.


"నా స్నేహితుల సహకారంతో ఇక్కడికి రాగలిగాను.ఈ రోజు నుండి మనిద్దరము ఒకరికొకరం తోడుగా ప్రయాణిద్దాము! చెప్పు! నా మీద నీ అభిప్రాయం ఏమిటి? మన వివాహం నీకు ఇష్టమేనా? పెద్దవాళ్ళ ద్వారా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూ

ఉన్నాము..నువ్వే నా మహారాణివని నిశ్చయించుకున్నాను. నేను నీకు నచ్చితే చెప్పు!"


శర్మిష్ఠ సిగ్గుపడింది.

ఎలా చెబుతుంది?

నవ్వాడతడు.


"పోనీ! చెప్పొద్దులే! ఈ హారం నీ మెడలో నేను అలంకరించనా!.. నీకు ఇష్టమైయితే!"

అంగీకార సూచకంగా శర్మిష్ఠ వెనక్కు తిరిగింది.

అతడు సున్నితంగా ఆ హారాన్ని ఆమె మెడలో అలంకరించాడు.

అతడి వ్రేళ్ల కొనలు మెడ దగ్గర తగిలేసరికి ఝల్లుమంది శర్మిష్ఠ హృదయం.

===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 27 త్వరలో

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page