కచదేవయాని - పార్ట్ 32
- T. V. L. Gayathri

- 1 day ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 32 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 30/12/2025
కచదేవయాని - పార్ట్ 32 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని.
శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. అసూయతో రగిలిపోతుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ముప్పయ్యవ రెండవ భాగం చదవండి.
నాలుగు రోజుల తర్వాత దానవరాజుతో మాట్లాడటానికి వ్యాయామశాలకు వెళ్ళింది దేవయాని. ప్రతి రోజూ పొద్దున్నే తన సేనా నాయకులతో ద్వంద్వ యుద్ధం, కత్తి యుద్ధం లాంటివి చేస్తూ ఉంటాడాయన. దేవయానిని చూడంగానే మహారాజు తన వాళ్ళందరినీ పంపించివేసి ఆమె దగ్గరకు వచ్చాడు.
" ఏమిటి తల్లీ! ఇలా పొద్దున్నే లేచి వచ్చావు? " అన్నాడు ఆప్యాయంగా.
"మీతో మాట్లాడదామని! ..." మొహమాటంగా చెప్పింది దేవయాని.
"కూర్చో తల్లీ! నాన్నగారి గురించేనా! వారు వచ్చేసరికి మరొక నెల రోజులు పడుతుందని కబురు వచ్చిందమ్మా! "
"నాన్నగారి గురించి కాదండి! ... శర్మిష్ఠ పుట్టినరోజు నాడు నేనొక వింతను గమనించాను. అది మీతో చెబుదామని! ...."
"అవునమ్మా! మన వాళ్ళల్లో కొంత మంది ఆకాశంలో పెద్ద వెలుగును చూశారట! అదేకాదు.. అంతఃపురానికి కాపలాగా ఉన్న భటులు ఎక్కడి వాళ్ళక్కడ సొమ్మసిల్లి పడి వున్నారు. పూలతోటలోకి ఎవరో అగంతకులు వచ్చి వెళ్ళారనటానికి సాక్ష్యంగా కొన్ని గుర్తులు, పాదముద్రలు కనిపించాయి. రాచనగరుకు భద్రతను పెంచాను... వాళ్ళు ఎవరో కనుక్కోవటానికి మన గూఢచారులు ప్రయత్నిస్తున్నారు....."
"అలా దొంగతనంగా తోటలోకి వచ్చిన వాళ్ళను నేను చూశాను మహారాజా! "
"ఎవరు?"
తీవ్రంగా ఉంది మహారాజు కంఠం.
" అతడు.... అతడు.... కచుడు మహారాజా! ఓ పది పదిహేను మంది దేవ, గంధర్వజాతి వాళ్ళను వెంటబెట్టుకొని సాయుధుడై వచ్చాడు. అతడిని నేను గుర్తు పట్టాను. నాకు ఒక విషయం అర్ధం కాలేదు. అతడి వెంట ఆడపిల్లలు కూడా వచ్చారు. మీకు తెలియచేయాలని అనుకొనే లోపల వాళ్ళు మాయమయ్యారు. కాసేపటికి ఆకాశంలో పెద్ద వెలుగు కనిపించింది. అది ఒక వెలుగుతున్న యంత్రం లాగా ఉంది..."
వృషపర్వుని కళ్ళు ఎఱ్ఱబడ్డాయి.
"ద్రోహి! వాడు మళ్ళీ ఎందుకొచ్చాడు? భటుల మీద ఏదో మంత్ర ప్రయోగం చేసుంటాడు.. సందేహం లేదు! కానీ వాడికి మన అంతఃపురం దగ్గర ఏం పని? పిరికిపంద! ధైర్యంగా యుద్ధం చేసి గెలిచే తెలివితేటలు లేవు.. ఈ దేవతల మాయోపాయాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. సరిగ్గా నాన్నగారు లేని సమయంలో వచ్చాడంటే వాడి ఉద్దేశ్యమేమిటో తెలుసుకోవాలి! నాన్నగారు మాత్రమే వాళ్ళ పన్నాగాలను తెలుసుకోగలరు. సమయానికి ఆయన ఇక్కడ లేరు! నేను కూడా ఈ విషయం గురించే సేనాధిపతిని హెచ్చరించాను. ఈ సారి దేవతలతో యుద్ధం వస్తే వెనక్కు తగ్గేదేలేదు.."
దేవయాని మౌనంగా వింటోంది.
"భయపడ్డావా తల్లీ! నీకేమి ప్రమాదం జరగదు.. నిశ్చింతగా ఉండమ్మా! "
"లేదు మహారాజా! నాకు భయం లేదు. ఆ కచుడు మహా మాయావి. నన్ను నమ్మించి మోసం చేశాడు.ఈసారి మాత్రం అంత ధైర్యంగా తోటలోకి వచ్చాడంటే మన అంతఃపురంలోనే ఎవరో అతడికి సహాయం చేస్తున్నారని పిస్తోంది."
వృషపర్వుని కనుబొమలు ముడిపడ్డాయి.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 33 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments