కచదేవయాని - పార్ట్ 33
Updated: Jan 8
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 33 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 04/01/2026
కచదేవయాని - పార్ట్ 33 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడిని కలిసి, కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ముప్పయ్యవ మూడవ భాగం చదవండి.
ఆలోచిస్తున్నాడు వృషపర్వుడు.
తన వాళ్ళలో ద్రోహం చేసే వాళ్ళు ఎవరై ఉంటారు?
"ఎవరమ్మా వాళ్ళు?"విస్మయంగా అడిగాడు మహారాజు.
"నాకు తెలియదు మహారాజా! కానీ అతడిని చూస్తే ఇక్కడే అతడికి తెలిసిన వాళ్ళు ఉన్నారనిపిస్తోంది. కాసేపటికి వాళ్ళు మాయమయ్యారు. ఆ తర్వాతే ఆకాశంలో పెద్ద వెలుగు కన్పించింది..."
వృషపర్వుడు మాట్లాడకుండా కూర్చున్నాడు.
'తన వాళ్ళలో ఉన్న ద్రోహులను కనుక్కోవాలి! గురువుగారు లేనప్పుడే ఇలాటి సాహసం చేశారు. ఆయన ఉంటే దివ్యదృష్టితో కనుక్కోగలరు'.
ఆయననే చూస్తోంది దేవయాని.
కాసేపటికి ఏదో పరిష్కారం దొరికిన వాడిలాగా తలెత్తి దేవయాని వైపు చూశాడు మహారాజు.
"తల్లీ! నాకు తెలిసిన మంత్రవేత్త ఒకతను దగ్గర్లోనే ఉన్నాడు. అయితే ఆయనకు నాన్నగారికి ఉన్నంత దివ్యశక్తులు లేవు. సాధారణమైన సాధకుడు. మనకు ఏదైనా సహాయం చేస్తాడేమో కనుక్కుంటాను! "
"కచుడి వలన నాకు ప్రమాదం ఉండవచ్చు మహారాజా! నేను కూడా మీతో పాటు వచ్చి వారిని కలుసుకోవచ్చా! "
"ఆయన పేరు దుర్మిలుడు. దగ్గరలోని పర్వత గుహలో తాంత్రిక హోమాలు చేస్తూ ఉంటాడు. మనం రేపు వెళదాము! "
దేవయానికి సంతోషం వేసింది.తను శుక్రాచార్యుని కూతురునని తెలిస్తే ఎంతటి మంత్రవేత్త అయినా తనకు మొక్కవలసిందే! తన తండ్రిని మించిన మంత్రవేత్త ఈ భూలోకంలోనే లేడు.
"నిన్న నేను చూసిన విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పలేదండి. చెలికత్తెలలో ఎవరిని నమ్మవచ్చో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు... అందుకని..."

"మంచిపని చేశావు తల్లీ! నేను కూడా మీ రాణితో ఈ విషయం గురించి చెప్పలేదు. చిన్న పిల్ల! శర్మిష్ఠ తన పుట్టినరోజు పండుగ నాడు అనవసరంగా కంగారు పడుతుంది. పైగా బంధువులందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు ఎందుకులే అని... నాలుగు రోజుల తర్వాత నెమ్మదిగా చెప్తాను." అన్నాడు మహారాజు.
"రేపు ఉదయాని కల్లా నేను తయారై ఉంటాను మహారాజా! నా ప్రక్కన చెలికత్తెలు ఎవ్వరూ వద్దు! నేనొక్క దాన్నే ఆయనతో మాట్లాడాలనుకొన్నాను! " అంది దేవయాని.
"సరే తల్లీ! అయినా దేవతల వల్ల నీకేమీ ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది! నా ప్రాణాలను అడ్డు వేసయినా నిన్ను కాపాడుకొంటాను! "ధృఢంగా పలికింది వృషపర్వుని కంఠం.
నవ్వింది దేవయాని.
'కూతురు ఎవరితో ప్రేమాయణం సాగిస్తోందో తెలుసుకోలేని మహారాజు తన ప్రాణాలనెలా కాపాడుతాడు?'
అని మనసులో అనుకుందామె.
మహారాజు దగ్గర సెలవు తీసికొని అంతఃపురానికి వెళ్ళింది.
===============================================
ఇంకా వుంది..
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.





Comments