కచదేవయాని - పార్ట్ 37
- T. V. L. Gayathri

- 26 minutes ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 37 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/01/2026
కచదేవయాని - పార్ట్ 37 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది. శత్రువును కదలకుండా చేసే మణిని దేవయానికి ఇస్తాడు దుర్మిలుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై ఏడవ భాగం చదవండి.
పుష్కర ద్వీపం.
యయాతి వాళ్లకు విమాన చోదక శిక్షణ పూర్తయ్యింది.
మరో రెండు రోజుల తర్వాత విమాన విన్యాసాల పోటీ ప్రారంభమవుతుంది.
యయాతికి చాలా ఉద్వేగంగా ఉంది.
ఆ రోజు రాత్రి కచుడు యయాతి విడిదికి వచ్చాడు. అతడి రాకను గమనించనంత దీర్ఘాలోచనలో ఉన్నాడు యయాతి.
అతడి భుజం మీద చెయ్యి వేశాడు కచుడు.ఉలిక్కిపడ్డాడు యయాతి.
"ఏమిటి మిత్రమా! అంత ఆలోచనలో ఉన్నావు?"
"విమాన విన్యాసంలో పాల్గొనటం మొదటిసారి కదా! మనసు కొంచెం ఉద్వేగంగా ఉంది."
నవ్వాడు కచుడు.
"మొదటిసారి ఎలా అవుతుంది? ఇప్పటికి వందల సార్లు అభ్యాసం చేశాము. పోటీ అనేది మొదటిసారి జరుగుతోంది. కంగారు ఉండటం సహజం. అయితే నీకు మాకు తేడా ఏమిటంటే మేము దాదాపు సంవత్సరం నుండి శిక్షణ తీసుకుంటున్నాము. నువ్వు ఈ నెలరోజుల నుండి నేర్చుకుంటూ పోటీకి సిద్ధపడుతున్నావు.మాకు కొంచెం అనుభవం ఉండవచ్చు! కానీ నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. మనసులో విశ్వాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. గెలుపోటములు అన్నవి దైవాధీనం. అంత మాత్రం చేత మన శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు. ధైర్యసాహసాలే విజయానికి సోపనాలు."అంటూ మిత్రుని భుజం తట్టాడు కచుడు.
"నిజమే! " అంటూ కచుడిని కౌగలించుకొన్నాడు యయాతి.
'పరీక్షను ఎదుర్కొనే సమయంలో కచుడి లాంటి స్నేహితుడు ప్రక్కనే ఉండటం తన అదృష్టం.' అనుకొన్నాడతడు.
పోటీ ప్రారంభం కానుంది.
మైదానప్రాంతంలో విమానాలు సిద్ధంగా ఉన్నాయి.
న్యాయనిర్ణేతలలో ముని సంఘాల వైపునుండి అత్రిమహాముని, కశ్యప ప్రజాపతి, అగస్త్య మహాముని ఉన్నారు.
దేవతల వైపునుండి దేవేంద్రుని కుమారుడు జయంతుడు, ఆదిత్యులలో ఒక్కడైన త్వష్ట, అష్టవసువులలో ప్రముఖుడైన ప్రభాసుడు ఉన్నారు. కచుడు, సారంగుడు, యయాతి, హూహులతో పాటు ఇరవైమంది అభర్థులు పోటీలో పాల్గొంటున్నారు.
పింగళ శక్తిధరు లిద్దరు పోటీలో పాల్గొనటానికి అర్హతను సాధించలేకపోయారు. అందుకని వాళ్ళు ప్రేక్షకులతో పాటు కూర్చున్నారు.
అందరికంటే ఉన్నతమైన సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుని ఉన్నాడు.
అతడి ప్రక్కన న్యాయనిర్ణేతలు. పోటీని చూడటానికి అన్ని జాతుల నుండి స్త్రీలు కూడా వచ్చి ఉన్నారు. వారికి విడిగా స్థలాన్ని కేటాయించారు కార్యనిర్వాహకులు.
వీక్షకులతో కిటకిటలాడి పోతోంది ప్రాంగణం.
జయంతుడు లేచి ప్రారంభోపన్యాసం చేశాడు. భరద్వాజ మహర్షిని,శిక్షకులను సన్మానించి అభ్యర్థుల పేర్లను చదివాడు.
తర్వాత దేవేంద్రుడు అభ్యర్థులను ఆశీర్వదిస్తూ ఉపన్యసించి కూర్చున్నాడు.
అభ్యర్థులు తమకు కేటాయించిన విమానాల దగ్గరికి వెళ్లారు. మంగళవాయిద్యాలు మ్రోగాయి.
యయాతి విమానాన్ని ఎక్కి కూర్చున్నాడు.
ముందుగా తల్లిదండ్రులను, గురువులను, ఇష్టదైవాన్ని ప్రార్థించాడు.
తలపై శిరస్త్రాణాన్ని ధరించబోతూ ప్రక్కకు చూశాడతడు.
ప్రక్కన ఉన్న విమానంలో కూర్చుని ఉన్న కచుడు నవ్వుతూ తన చేతిని ఊపాడు.
తను కూడా నవ్వుతూ బొటనవేలును పైకెత్తి కచునికి చూపించి శిరస్త్రాణాన్ని తలపైన పెట్టుకున్నాడు యయాతి.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 38 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments