top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 57


కచ దేవయాని 57లో రాజకుమార్తె శర్మిష్ఠ గురుకులానికి బయలుదేరుతుండగా, వెనుక వృషపర్వుడు మరియు సుమాలినీ దేవి బాధతో వీడ్కోలు చెబుతున్న భావోద్వేగ దృశ్యం.
కచ దేవయాని 57లో రాజకుమార్తె శర్మిష్ఠ గురుకులానికి బయలుదేరుతుండగా, వెనుక వృషపర్వుడు మరియు సుమాలినీ దేవి బాధతో వీడ్కోలు చెబుతున్న భావోద్వేగ దృశ్యం.

Kachadevayani - Part 57 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 57 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 09/06/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. దేవయాని కోరిక ప్రకారం వృషపర్వుడిని పిలిపిస్తాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠను  దేవయానికి  దాసిగా  పంపమంటాడు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


"రాజకుమార్తె నుంచి దాసీగా.. శర్మిష్ఠ జీవితంలో మొదలైన కొత్త అధ్యాయం! " 

టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 57వ భాగం చదవండి.


తెల్లవారింది. చక్రవర్తి ఆ ప్రాంతానికి వచ్చాడనగానే ముని సంఘాల వాళ్ళు వచ్చారు. మర్యాదా పూర్వకంగా ఆ ప్రాంతంలో ఉండే తీర్థ క్షేత్రాల గురించి చక్రవర్తితో చెప్పారు. అక్కడ ఉండే వింతలు, విశేషాలు చూసి రావటానికి పది రోజులు పడుతుంది. 


ముని సంఘాల వాళ్ళ విన్నపాల నాలకించి చక్రవర్తి పరివారంతో సహా బయలు దేరాడు. తల్లిదండ్రుల వెంట యయాతి కూడా కదిలాడు. 


వృషపర్వుడి ప్రాణం కొంచెం తెరిపిన పడ్డది. శర్మిష్ఠను గురుకులానికి పంపించే విషయాన్ని చక్రవర్తికి ఎలా చెప్పాలా అని మథన పడుతున్నాడతడు. ఇప్పుడా సమస్య లేదు. చక్రవర్తి వాళ్ళు తిరిగి వచ్చే లోపల శర్మిష్ఠను తిరిగి నగరుకు తెచ్చుకోవచ్చు. చక్రవర్తి వాళ్ళ తీర్థ యాత్రలకు ఏర్పాట్లు చేశాడతడు. 


తెల్లవారేసరికి శర్మిష్ఠను నిద్రలేపారు చెలులు. 

అప్పటికే యయాతి వాళ్ళు ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు. 

శర్మిష్ఠ గదిలోకి వచ్చింది నారాచి. 

"రాత్రి మహారాజు గురువుగారి దగ్గరికి వెళ్లి వచ్చారు రాకుమారీ! "


నారాచి ముఖంలో ఎక్కడ లేని దిగులు కనిపిస్తోంది. 


"గురువుగారు ఏమన్నారు నారాచీ?"


"నిన్ను దేవయానికి దాసీగా గురుకులానికి పంపించాలట! మనిద్దరం కాసేపట్లో గురుకులానికి వెళ్ళాలట! "


అర్ధం కానట్లుగా చూస్తోంది శర్మిష్ఠ. 

"దాసీగానా.. అంటే?"


"అంటే ఏముంది? ఆ దేవయానికి సేవ చేయాలి! దుష్టురాలు పగ తీర్చుకుంటోంది. గురుపుత్రిక గురుపుత్రిక అని పామును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము! భయంకరంగా విషాన్ని కక్కుతోంది. "


"అమ్మావాళ్ళు ఎక్కడున్నారు?"


"చక్రవర్తి వాళ్ళు తీర్థ యాత్రలకు వెళ్తున్నారు. వాళ్ళను సాగనంపి వస్తారు. ఈలోపల మనల్నిద్దర్ని తయారవమన్నారు. "అని నారాచి పెట్టెలో శర్మిష్ఠ దుస్తుల్ని సర్దసాగింది. 


ఇంతలో మదనిక, కణిక గది లోపలికి వచ్చారు. ఇద్దరి ముఖాల్లో అంతులేని డైన్యం. 

"ఆ దుష్టురాలి దగ్గర ఎలా ఉంటావోనని భయంగా ఉంది. "అంటూ శర్మిష్ఠను పట్టుకొని భోరుమంది మదనిక. 


శర్మిష్ఠకు కూడా మనసులో భయం వేస్తోంది. కానీ రాజకుమారి కాబట్టి కాస్త గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకుంది. 


"ఊరుకో మదనికా! ఊరుకో! ఇట్లాంటప్పుడే ధైర్యంగా ఉండాలి! గురుకులానికే కదా! అక్కడంతా మనవాళ్లే ఉంటారు. దిగులు పడాల్సిందేమీ లేదు. "అంటూ బింకంగా మదనిక భుజాన్ని తట్టి, తను కూడా కావాల్సిన సామాన్లను సర్దుకోసాగింది. 


కాసేపటికి శర్మిష్ఠ దగ్గరికి వచ్చారు సుమాలినీ దేవి, వృషపర్వులు. 


"ఒక్క పదిరోజులు మీ రిద్దరు ఓర్పుగా ఉండాలి! తర్వాత వివాహం గురించి గురువుగారితో చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాము! అంత వరకు జాగ్రత్తగా ఉండండి! ఇప్పటిదాకా దేవయాని మంచిపిల్ల అని అనుకుంటూ ఉన్నాము! ఇప్పుడు ఆమె నైజం తెలిసింది. అందుకే సావధానంగా ప్రవర్తించాలి! "కూతురికి, నారాచికి బోధించాడు వృషపర్వుడు. 


"అధిక ప్రసంగం వద్దు! ఇంతకుముందు లాగా దేవయానితో చనువుగా మాట్లాడవద్దు! గుర్తుపెట్టుకోండి! పరిస్థితి మారిపోయింది. కాబట్టి కాలానికి అనుగుణంగా నడచుకోవాలి! కాలం కలిసి వచ్చేదాకా తలవంచుకొని ఉండటమే శ్రేయస్కరం! "అనునయంగా జాగ్రత్తలు చెప్పింది సుమాలినీ దేవి. 


రాచనగరంతా విషాద వాతావరణం. ఈ విషయం అంతటా వ్యాపించింది. అందరిలోనూ దిగులు, బెంగ. కొంతమంది బంధువులు బాహాటంగానే దేవయానిని తిడుతున్నారు. 


శర్మిష్ఠను, నారాచిని తీసికొని గురుకులానికి వచ్చాడు వృషపర్వుడు. మహారాజు వచ్చాడనంగానే గురుకుల నిర్వాహకులు వచ్చి స్వాగతం పలికారు. వారికి విషయాన్ని చెప్పి, ఎప్పటికప్పుడు శర్మిష్ఠ క్షేమ సమాచారాన్ని తనకు చెప్పాలని ఆదేశించాడు వృషపర్వుడు. 


శుక్రాచార్యుడి ఆశ్రమానికి చేరుకున్నారందరు. వీళ్ళని చూసి "లోపలికి వెళ్ళండమ్మా! "అన్నాడు శుక్రాచార్యుడు. కాసేపు గురువుగారితో మాట్లాడి ఆయన దగ్గర సెలవు తీసికొని రాచనగరుకు వచ్చాడు వృషపర్వుడు. 


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 58 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page