అతడే హరి!
- T. V. L. Gayathri

- Jan 25
- 1 min read
Updated: Feb 4
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #AthadeHari, #అతడేహరి, #ద్విపద

Athade Hari - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/01/2025
అతడే హరి - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
(ద్విపద )
నరహరి రూపుని నమ్మిన చాలు
కరువును తొలగించి కలిగించు మేలు/
పాపుల దండించు ప్రభువును దల్చు!
శ్రీహరి సన్నిధి సేవగ మల్చు/
దేవళమందున దేవుని గనుము!
పావనమౌ ధర్మపథమున చనుము!
మ్రొక్కుచు కృష్ణుని పూజలు సల్పు!
సొక్కుచు శౌరిపై చూపును నిల్పు!
పావనచరితుని భక్తిగ కొల్చు!/
జీవనమంతయు చెంతనే నిల్చు
హరికీర్తన వినగ నాపదల్ తొలగు
చరితము పాడగ సాంత్వన కలుగు /
ప్రణతులనర్చింప పాలించు వేల్పు
తనభక్తుల మనికి దయతోడ నిల్పు /
వరములొసంగెడు వరదుడె వాడు
కరములందించి నిన్ గాపాడు ఱేడు./
వెరపును బోద్రోలి విజయము నిడుచు
పరమాత్ముడౌ హరి భక్తికి పొలుచు /
ముక్తిపథంబును ముందుగ జూపి
భక్తులన్ బ్రోచును భయమును బాపి/
ముజ్జగముల నేలు మురహరి యతడు
సజ్జనులకు ఘన సఖుడటనితడు.//

Profile Link:




Comments