top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 53

Updated: May 18


మఱ్ఱిచెట్టు దగ్గర గుడారం వెలుపల నిలబడి, వెళ్లిపోతున్న యయాతి రథాన్ని భావోద్వేగంగా చూస్తున్న దేవయాని
మఱ్ఱిచెట్టు దగ్గర గుడారం వెలుపల నిలబడి, వెళ్లిపోతున్న యయాతి రథాన్ని భావోద్వేగంగా చూస్తున్న దేవయాని

Kachadevayani - Part 53 - Telugu Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 53 తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 09/05/2026

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. యయాతిని కలిసి జరిగిన విషయాలు చెబుతుంది శర్మిష్ట.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

“ఒక్క అవమానం… ఒక రాజ్య భవిష్యత్తునే మార్చబోతోంది!” 

టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని యాభై మూడవ  భాగం చదవండి


తిరిగి వెళ్తూ మఱ్ఱిచెట్టు దగ్గర రథాన్ని ఆపాడు యయాతి. అప్పటికే అక్కడొక గుడారం వెలసి ఉంది. పరిచారికలు అటూ ఇటూ తిరుగుతున్నారు. యువరాజు యయాతి వచ్చాడని వాళ్ళు దేవయానికి చెప్పారు. వెంటనే గుడారం బయటికి వచ్చింది దేవయాని.


ఆమె మంచి చీర కట్టుకొని ఉంది.


"మీరు ఫలహారం చేశారా?" అంటూ నవ్వుతూ ఆమెను పలకరించాడు యయాతి.


"ఇంకా లేదు! మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు!" అంటూ నమస్కారం చేసింది దేవయాని.


"ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటం మనుషుల కనీస ధర్మం. మీరు ఫలహారం చేయండి! నేను మరలా వచ్చి గురువుగారి దర్శనం చేసుకుంటాను." అంటూ ఆమెకు ప్రతి నమస్కారం చేసి రథం ఎక్కి వెళ్లిపోయాడు యయాతి.


అతడు వెళ్లిన వైపు చూస్తూ నిల్చుంది దేవయాని. అతడి మంచితనం, ఆ ఠీవి, ఆ చక్కని నవ్వు, ఆ అందం... చూపు త్రిప్పుకోకుండా చూస్తూ ఉందామె.


ఇంతలో రథం మీద వచ్చిన శర్మిష్ఠ చెలికత్తెలు 'ఘూర్ణిక', 'మనోల' లు దిగారు.

వినయంగా వంగి దేవయానికి నమస్కారం చేసి 

"అక్కయ్యా! జరిగిన దానికి రాజకుమారి బాధపడుతున్నారు. రాజకుమారికి మీరంటే ఎంతో అభిమానం. మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపించారు. రండి అక్కయ్యా! రాచనగరుకు వెళ్దాం!" అంది మనోల.


తోక తొక్కిన తాచు లాగా లేచింది దేవయాని.

"ఏమిటి! ఆ రాక్షసికి అభిమానమా? నన్ను బావిలో తోసి ఇప్పుడు నంగనాచిలా రాచనగరుకు రమ్మంటుందా? ఓహో!... గొప్ప రాజనీతి వెలయిస్తోంది!.... నేను నగరిలో అడుగుపెట్టడం జరగదు! ఇంకో మాట నాతో మాట్లాడకు! వెళ్ళు! మీ అభిమానం, ప్రేమ నాకేమీ అక్కర్లేదు!"


"క్షమించండి అక్కయ్యా! జరిగిందేదో జరిగింది. మనం అంతా కలిసి ఉన్నవాళ్ళమే కదా! జరిగింది మరచిపోయి నగరుకు వెళదాం! రండి!" అంటూ తలవంచుకొని దేవయాని పాదాలు పట్టుకోబోయింది ఘూర్ణిక.


గబుక్కున తన పాదాలను వెనక్కు తీసుకొంది దేవయాని.


"పాపిష్టిదానా! నీ మురికి చేతులతో నన్ను ముట్టుకోకు! జాగ్రత్త! మా నాన్నగారు వచ్చాక మిమ్మల్ని, మీ రాజ్యాన్ని మిగలనివ్వరు. వెళ్ళు! ఆ దుష్టురాలికి చెప్పు! ఒళ్ళు దగ్గరపెట్టుకొని మసలుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోమను! నేను సామాన్యురాలిననుకుంటోంది! నేనంటే ఏమిటో చూపిస్తాను!"


అంటూ గిరుక్కున గుడారం లోపలికి వెళ్లిపోయింది దేవయాని.


చేసేదేమి లేక ఘూర్ణికను అక్కడే వదలి మనోల తిరిగి శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళింది.


దేవయాని తండ్రిని తలచుకుంటూ ధ్యానంలో కూర్చుంది.


శర్మిష్ఠ చెలులతో కలిసి రాచనగరుకు చేరుకుంది.

ఆమె నేరుగా తల్లి దగ్గరికి వెళ్లి యయాతి చెప్పమన్నట్లుగా కొంత విషయాన్ని దాచి, ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పింది.

కలవరపడింది సుమాలినీ దేవి.అయినా తమాయించుకొంది.


"మీ నాన్నగారు రాజధాని పొలిమేర దాకా మంత్రులను, సేవకులను తీసుకొని వెళ్లారు. చక్రవర్తి ఇంకో గంటలో వస్తున్నారు. వారితో విందు అయ్యాక గానీ మనతో మాట్లాడరు. ఇప్పుడు ఇలా జరగటం... ఎలాగా!... అందులో గురుపుత్రిక విషయంలో! సరే! ఆమెను బావిలో నుంచి ఎవరు బయటకు తీశారు? వాళ్లెవరు? కనుక్కుందాము!


ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది కదా! సరే, నువ్వు కంగారు పడకు! సాయంత్రం పెళ్లి చూపులు. ఈ దిగులు నీ ముఖంతో అస్సలు కనిపించకూడదు! నవ్వుతూ ఉండాలి! దేవుడి దయవలన యయాతితో నీ వివాహం కుదిరితే మాకు నిశ్చింతగా ఉంటుంది! వెళ్ళు! వెళ్లి కాస్త తినేసి విశ్రాంతి తీసుకో! ఏమీ ఆలోచించకు! ఏమైనా పెద్దవాళ్ళం ఉన్నాం కదా! మేము చూసుకుంటాము!" అని శర్మిష్ఠకు చెప్పవలసినవి చెప్పి పంపించి వేసిందామె.


వెంటనే నారాచి వైపు తిరిగి 

"నారాచీ! అయిందేదో అయిపోయింది! పిల్లలిద్దరు క్షేమంగా ఉన్నారు. నువ్వు దేవయాని దగ్గరికి వెళ్ళు! నీ వెంట ఒక ముప్ఫయి మంది చెలికత్తెలను తీసుకొని వెళ్ళు! అక్కడే ఉండు! గురువుగారు వస్తే ఆయన పాదాల మీద పడి శరణు వేడు! శర్మిష్ఠను ఆయన శపించకుండా చూడు! ఆయన ఆకాశగమనంతో వస్తారు. ఆయన దేవయానితో మాట్లాడే లోపల నువ్వు ఆయన దగ్గర అభయాన్ని, ఆశీస్సులను పొందు!


అర్థం అయిందా! చక్రవర్తి వాళ్ళు విశ్రాంతి తీసుకొనే సమయంలో మహారాజు గురువుగారి దగ్గరకు వస్తారు! అప్పటిదాకా నువ్వే సమర్థవంతంగా ప్రవర్తించాలి! నీకు తోడుగా దుర్జయుడిని పంపిస్తాను! అతడు కూడా వచ్చి వేడుకుంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి మన మీద కోపం రాకూడదు! వెళ్ళు!" అని ఆజ్ఞాపించింది.


"అలాగే మహారాణీ!"అంటూ అతివేగంగా అక్కడి నుండి వెళ్లిపోయింది నారాచి.


వెంటనే దుర్జయుడికి కబురు చేసింది సుమాలినీదేవి.

దుర్జయుడు గురుకులాన్ని నిర్వహించే అధిపతి.

శుక్రాచార్యుడికి కుడిభుజం లాంటి వాడు. సమర్థుడు.

పరుగెత్తుకొని వచ్చాడు అతడు.


క్లుప్తంగా  జరిగింది చెప్పి "దుర్జయా! నువ్వు, నారాచి అక్కడే ఉండి గురువుగారికి కోపం రాకుండా చూసుకోవాలి! కూతురంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఆమె ఏం చెబితే అది చేస్తారు! మన రాజకుమారికి ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోవాలి! జాగ్రత్త!" అంటూ జాగ్రత్తలు చెప్పింది సుమాలినీ దేవి.


"మహారాణీ! మీరు నిశ్చింతగా ఉండండి! మేము చూసుకుంటాము!" అని రాజధాని నుండి వేగంగా బయలుదేరి, శుక్రాచార్యులకు అభిమానపాత్రులైన శిష్యులను పిలిపించి, వారితో పాటు దేవయాని దగ్గరికి వెళ్ళాడు దుర్జయుడు. మరొక వైపు చెలికత్తెలతో కలిసి నారాచి కూడా దేవయాని దగ్గరికి వచ్చింది.

===============================================


===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@satyasiripuram-y9e

• 3 hours ago

Aapadhalo unnavanni adhukonadam manishi yokka kaneesa dharmam .

Like
bottom of page