కచదేవయాని - పార్ట్ 51
- T. V. L. Gayathri

- 2 days ago
- 5 min read

Kachadevayani - Part 51 - Telugu Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 51 - తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 22/04/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక యాభై ఒకటవ భాగం చదవండి.
బావిలో చిక్కుకున్న దేవయాని…ఆపదలో కేకలు…
ఆమెను రక్షించడానికి ఎవరు వచ్చారు?
ఈ భాగం కథలో కీలక మలుపు!
“రక్షించండి! రక్షించండి!”
ఆ కేకలు ఎవరివో టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని యాభై ఒకటవ భాగంలో వినండి.
దేవయాని అడవి తీగల మధ్య చిక్కుకొంది. అది 'బావి' అని అర్థం కావటానికి కొద్ది సమయం పట్టింది. తీగలు ఒరుసుకోవడం వలన ఆమె లేత చర్మం మీద అక్కడక్కడా చీరుకుపోయింది. చిన్న అంగవస్త్రం కూడా కాస్త చిరిగింది. సుకుమారమైన దేహంతో దాదాపుగా నగ్నంగా బావిలో పడిన దేవయానికి దుఃఖం పొంగుకొని వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగిందామె. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు.
కోలాహల పర్వతం దగ్గరకు వచ్చింది నహుషచక్రవర్తి పరివారం.రాత్రి వాళ్లకు కోలాహల పర్వతం దగ్గర ఏర్పాటు చేశాడు వృషపర్వుడు.
దానవ సైన్యం ఒక వైపు, నహుషుని సైన్యం మరోవైపు కదులుతుంటే యయాతి రథం మీద మఱ్ఱిచెట్టును వెతుక్కుంటూ వస్తున్నాడు. అతడి వెనకాల కొద్ది దూరంలో పింగళుడు గుర్రం మీద వస్తున్నాడు.
తమ సైన్యం ఎక్కడో వెనకాల ఉంది. ఈ లోపల శర్మిష్ఠతో మాట్లాడి తన వాళ్ళని కలుసుకోవచ్చని యయాతి ఆలోచన.
మఱ్ఱి చెట్టు కనిపించింది.
అతడి మనసులో పరవశం. శర్మిష్ఠను చూడబోతున్నందుకు ఆనందం.
బావిలో ఉన్న దేవయానికి దూరంగా రథం చప్పుడు వినిపించింది.
'ఎవరో బాటసారులు వస్తున్నారేమో!లేదా కచుడేనా? ఎవరైనా ఇప్పుడు తాను ఈ బావి నుండి బయటపడాలి!'
ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని గట్టిగా " రక్షించండి!రక్షించండి!"అంటూ కేకలు పెట్టసాగిందామె.
రథం మీద వస్తున్న యయాతికి వినిపించాయా కేకలు. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు.
రథాన్ని ఆపాడు. మళ్ళీ కేకలు.దీనంగా కోమలమైన కంఠం. అమ్మాయి గొంతు. ఆపదలో ఉన్నట్లుంది.
ఈసారి ఎక్కడి నుండి కేకలు వినిపిస్తున్నాయో చూశాడు.
గట్టు కనిపించింది.
రథం దిగి గట్టు దగ్గరికి వచ్చి చూశాడు.
అది పాడుబడిన బావి అని అర్థం అయ్యింది.
వంగి కిందకు చూశాడు.
దాదాపుగా నగ్నంగా ఉన్న అమ్మాయి. తన వక్షోజాలను రెండు చేతులతో కప్పుకొని ఉంది. ఎక్కడో చూసినట్లుగా ఉంది కానీ గుర్తుకు రావటం లేదు.
"నేను నహుష చక్రవర్తి కుమారుడిని యయాతిని. మీరు...."
"నేను శుక్రాచార్యుని కుమార్తెను. దేవయానిని. నన్ను రక్షించండి!"
ఉలిక్కిపడ్డాడు యయాతి.
దేవయాని! ఆ రోజు శర్మిష్ఠ గడిలోకి వచ్చిన దేవయాని. ఈ స్థితిలో? ఏమైంది?
"అవశ్యం!భయపడకండి!"అంటూ రథం దగ్గరికి వెళ్ళాడు యయాతి.
ముందు ఆమెను బయటికి తీయాలి.
రథంలో నుండి ఒక పెద్ద శూలాన్ని తీసుకొని దానికి తన పొడవాటి ఉత్తరీయాన్ని కట్టి బావిలోపలికి జార విడిచాడు.
"వస్త్రాన్ని గట్టిగా పట్టుకోండి!"
గట్టిగా వస్త్రాన్ని పట్టుకొంది దేవయాని.
ఎక్కడ పడిపోతానోనని భయం భయంగా వస్త్రాన్ని పట్టుకొన్న దేవయానిని పైకి లాగాడు యయాతి.
ఇంకా కొంచెం లోపల ఉండగానే తన కుడి చేతిని అందించాడతడు. ఎడమ చేతితో తన వక్షోజాలను కప్పుకొని కుడి చేత్తో అతడి చేతిని గట్టిగా పట్టుకొంది దేవయాని.
మరొక చేత్తో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పైకి తెచ్చి గట్టు ప్రక్కన నిలబెట్టాడతడు.
ఆమె స్థితి చూసి గబగబా శూలాని కున్న ఉత్తరీయాన్ని విప్పి ఆమె మీద కప్పి రథం దగ్గరికి వెళ్లాడు.
రథంలో బిందెలో మంచినీళ్లు ఉన్నాయి. బంగారు కలశంతో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు.
గటగటా తాగింది దేవయాని. కాస్త ప్రాణం కుదుటపడిందామెకు.
సరిగ్గా వస్త్రాన్ని చుట్టుకొంది. ఇప్పుడు కాస్త నయం!
"ఎలా పడ్డారు? "
అతడి ప్రశ్న విని తలెత్తి అతడి వైపు చూసింది దేవయాని.
స్ఫురద్రూపం. ఎత్తైన భుజాలు. కళ్లల్లో రాజసం.
"పడలేదు... తోసింది. రాక్షసి...."
"ఇది రాక్షస భూమి! అయినా మీరు గురుపుత్రిక! మిమ్మల్ని ఎవరు బావిలోకి తోస్తారు?"
విస్మయంగా అడిగాడు యయాతి.
"శర్మిష్ఠ!.... ఈ రాజు కూతురు. రాజకుమారిననే అహంతో నన్ను తోసింది."
ఆమె కంఠంలో ఎక్కడలేని ఆగ్రహం.
విచిత్రంగా ఉంది యయాతికి. 'శర్మిష్ఠ దేవయానిని బావిలోకి తోయడమేమిటి? అర్థం కావటం లేదు.'
అయితే అతడు తొందరపడలేదు.
"మిమ్మల్ని మీ నాన్నగారి ఆశ్రమం దగ్గర దించనా!" అన్నాడు మృదువుగా.
"వద్దు! నాన్నగారు లేరు. ఆయన నాగలోకానికి వెళ్లారు. నేను ధ్యానంలో కూర్చుని నాన్నగారిని పిలిస్తే ఆకాశగమనం ద్వారా వస్తారు. నేను ఇక్కడే ఉంటాను!"అంది దేవయాని.
"అలా అయితే మీకు వసతిని ఏర్పాటు చేస్తాను! ఉండండి!" అంటూ రథంలోని శంఖాన్ని తీసుకుని గట్టిగా పూరించాడు.
శంఖనాదం వినిపించింది పింగళుడికి.
గుర్రాన్ని వేగంగా తోలుకుంటూ వచ్చాడు.
"పింగళా! వీరు గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. వీరికి వసతి ఏర్పాటు చెయ్యి! పరిచారికలను, మహిళా వైద్యులను పిలిపించు!
వీరి నాన్నగారు వచ్చేదాకా రక్షణ ఏర్పాట్లు చూసుకో!" అని దేవయాని వైపు తిరిగి
"మీ నాన్నగారు వచ్చేదాకా మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి! మేము ఈ దానవరాజ్యాన్ని ఏలే వృషపర్వమహారాజుకు బంధువులం! మాకు గురువుగారంటే ఎంతో గౌరవం! మీరు సందేహించకండి!" అన్నాడు యయాతి నెమ్మదిగా.
ఇప్పుడు చేసేదేముంది? అతడు శర్మిష్ఠకు బంధువు!
ఇంకో దారి లేదు. అతడు చెప్పింది విని తండ్రిగారు వచ్చే దాకా ఇక్కడే ఉండటం మంచిది.
అంగీకారంగా తలను ఊపి రెండు చేతులు జోడించి
"ఆపదలో ఉన్న నన్ను కాపాడారు! మీ మేలును మరువలేను!" అంది మెల్లగా దేవయాని.
ఆమె దగ్గర సెలవు తీసికొని దేవాలయం వైపు వెళ్లిపోయాడు యయాతి.
దేవయానికి అతడు దేవాలయానికి ఎందుకు వెళుతున్నాడనే ఆలోచన వచ్చింది. కానీ అతడు శర్మిష్ఠకు బంధువు. వాళ్లకు ఈ ప్రాంతమంతా తెలిసే ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా మహాదేవుడిని దర్శించుకొంటూ ఉంటారు. అదొక క్షేత్రం. అంతకంటే ఏమీ ఆలోచించలేకపోయిందామె.
"అమ్మా! మీరు ఈ చెట్టు కింద కూర్చోండి! మా వాళ్ళని తీసుకొని వస్తాను!" అన్నాడు పింగళుడు.
అతడి వెంట కదిలింది దేవయాని.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 52 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments