top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 39

Feb 2
5 min read

Updated: Feb 9

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 39 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 02/02/2026

కచదేవయాని - పార్ట్ 39 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 

కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది. శత్రువును కదలకుండా చేసే మణిని దేవయానికి ఇస్తాడు దుర్మిలుడు. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు యయాతి. 

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై తొమ్మిదవ భాగం చదవండి. 


ఆ రాత్రి న్యాయనిర్ణేతలందరూ సమావేశమయ్యారు. అగస్త్య, అత్రి, కశ్యపమహర్షులు ముగ్గురూ ఏకగ్రీవంగా యయాతిని ప్రథమ స్థానానికి ఎంపిక చేశారు. ద్వితీయస్థానానికి హూహును, తృతీయ స్టానానికి కచుడిని ఎంపిక చేశారు. 


వీళ్ళ నిర్ణయాన్ని త్రోసి పుచ్చాడు జయంతుడు. 


"మొదటి స్థానానికి హూహును ఎంపిక చేస్తున్నాను. తర్వాత కచుడిని, చివరగా సారంగదేవుడిని ఎంపిక చేస్తుతున్నాను. "


జయంతుని నిర్ణయం విని మొహాలు చూసుకున్నారు మహర్షులు ముగ్గురు. 


"అదేమిటి జయంతా! యయాతికి విజేతలలో స్థానమే లేదా? నైపుణ్యంలో, సామర్ధ్యంలో యయాతి చూపిన ప్రతిభ అసామాన్యం. నువ్వేమి ఆలోచిస్తున్నావు? " కశ్యపమహర్షి కంఠం అసహనంగా ధ్వనించింది. 


"దేవగంధర్వ జాతుల తర్వాత భూలోకవాసులకు బహుమానం ఇవ్వవచ్చు! ఇక్కడ నాలుగో బహుమతి లేదుకదా! "తాపీగా బదులు చెప్పాడు జయంతుడు. 


"అప్పుడు పోటీలో పాల్గొనటానికి భూలోకవాసుల నెందుకు రమ్మన్నారు? ప్రతిభతో సంబంధం లేకుండా మీ కిష్టమైన వాళ్ళకే బహుమానాలు పంచిపెట్టవచ్చు కదా! పోటీ అని పేరెందుకు? అందరినీ పిలిచి ఆర్భాటమెందుకు? "

అగస్త్యమహర్షి నిలదీశాడు. 


"మీరు శాంతం వహించండి మహర్షీ! యయాతి చాలా తెలివైనవాడు. చూశారుగా విమానానికి సొంతంగా మరొక యంత్రాన్ని బిగించుకొని పూలవాన కురిపించాడు. మనం భవిష్యత్తును గురించి ఆలోచించాలి! విమానాలు తయారు చేసుకొనే పరిజ్ఞానం మానవులకు లేదు. ఆ శాస్త్రం వాళ్లకు తెలియదు. శాస్త్రపరిజ్ఞానం దేవతలను దాటిపోతే రేప్పొద్దున్న భూలోకవాసులు ఆవేశంతో ఏదైనా అనర్థాన్ని తెచ్చి పెడతే మనమే బాధపడతాము.. మానవులు అంత సంయమనం ఉన్న వాళ్లు కారు. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రమాదాలు తెచ్చి పెడతారు. అల్పజ్ఞానం వున్నవాళ్ళను ఇప్పుడే నియంత్రించాలి. యయాతి యువకుడు, ఉత్సాహవంతుడు కూడా. కానీ అతడి చేతిలో విమానం పెట్టడం అంత క్షేమం కాదు! యయాతికి విమానాన్ని బహుమానంగా ఇస్తే భవిష్యత్తులో మానవులు దేవజాతిని లెక్క చేస్తారా? అమరావతి ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా? " మెల్లగా చెబుతున్నా జయంతుని కళ్ళల్లో స్థిరత్వం కనిపిస్తోంది. 


ఇదెక్కడి వివక్ష? 

 

"మా నిర్ణయాన్ని గౌరవించకపోతే మేమెందుకు ఇక్కడ? మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి! కానీ జయంతా! ఒకటి గుర్తుపెట్టుకో! మానవ జాతిని అల్పమయినదని తీసి వెయ్యకు! మేమందరమూ మనుషులమే! శాస్త్రపరిజ్ఞానం సాధించిన వాళ్ళమే! "

అగస్త్యమహర్షి వెళ్లిపోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. 

అతడితో పాటు లేచారు అత్రి, కశ్యపు లిద్దరు. 

అప్పుడే అక్కడికి వచ్చాడు దేవేంద్రుడు. ఆయన వెనకాలే భరద్వాజమహర్షి. 


వారిని చూడంగానే లేచి నిల్చున్నారు జయంత, త్వష్ట, ప్రభాసులు. 


వినయంగా మహర్షులకు నమస్కారం చేశాడు దేవేంద్రుడు. మామూలుగా అయితే ప్రసన్నంగా ఆశీర్వదించవలసినవాళ్ళు. మౌనంగా నిలుచుని ఉన్నారు. 


"ఏమిటి విషయం? " విస్మయంగా అడిగాడు దేవేంద్రుడు. 


"ఇక్కడ ఇంత పక్షపాత ధోరణి ఉంటుందని అనికోలేదు. మీ కుమారుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మాకు నచ్చటం లేదు! అంతే! "

అంటూ విషయాన్ని దేవేంద్రుడికి వివరించాడు అత్రిమహాముని. 


అర్థమయింది దేవేంద్రుడికి. 


"ముందు మీరు కూర్చోండి! ఇంత చిన్న విషయానికే ఆవేశపడితే ఎలా? మీరందరూ మాకెప్పుడూ పూజనీయులే! మహర్షుల ఔన్నత్యం మాకు తెలియదా? ఇలా ఇవ్వండి! విజేతలెవరో నేను నిర్ణయిస్తాను! " అంటూ నవ్వుతూ మహర్షులను కూర్చో బెట్టాడు. విజేతల పట్టికను తీసి చూశాడు. 


లేఖినితో సరిచేశాడు. 


"ఇదిగో ప్రథమ స్థానంలో హూహూను, ద్వితీయ స్థానంలో కచుడిని, తృతీయంలో యయాతిని ఎంపిక చేశాను. ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా? మాకు వివక్ష అనేదే ఉంటే పోటీనెందుకు నిర్వహిస్తాము? మాకు అన్ని జాతుల వాళ్ళు సమానమే! "అంటూ నవ్వుతూ పట్టికను మహర్షులకు అందించాడు. 


అప్పటికీ మహర్షుల మొహంలో సంతృప్తి కనిపించలేదు. 


"దేవేంద్రా! .. "అంటూ ఏదో చెప్పబోతున్న కశ్యపమహర్షిని కనులతో వారించాడు భరద్వాజ మహర్షి. మౌనం వహించాడు కశ్యప మహర్షి. 

మిగిలిన వాళ్లెవరు మాట్లాడలేదు. కాసేపు సరదాగా ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పసాగాడు దేవేంద్రుడు. వేడిగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. 

నలుగురు మహర్షులు దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకొని బయటికి వచ్చారు. 


వాళ్ళటువెళ్ళగానే " అదికాదు నాన్నగారూ! యయాతికి విమానాన్ని.. " 

అంటున్న జయంతుడిని ఆగమన్నట్లు చేతితో సైగ చేసి 

" నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదు! అతడు మనకు సేవ చేసుకుంటూ గడుపుతాడు. అంతే! ఇందులో కంగారు పడవలసింది ఏమీ లేదు. ఈ మానవులు వెళ్లి దానవులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటే అప్పుడు ఆలోచించాలి కానీ! .. అదిప్పట్లో సాధ్యం కాదు! .. మనకు భూలోకంలో బలమైన సామంతరాజు దొరికాడనుకో! "అన్నాడు దేవేంద్రుడు. 


"ఆ నహుషుడు వంద యజ్ఞాలు చేసి, అమరావతిలోకి మీకు పోటీగా వస్తేనో? "అంటున్న జయంతుని భుజాన్ని తడుతూ దేవేంద్రుడు

" నహుషుడా? వంద యజ్ఞాలా? అప్పుడే పూర్తి చేస్తాడా? అనవసరమైన ఆలోచనలతో బుర్రపాడు చేసుకోకు! నీ స్నేహితులతో వెళ్లి సరదాగా గడుపు! "

అంటూ పెద్దగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు దేవేంద్రుడు. 


అలా వెళుతున్న తండ్రినే చూస్తూ నిలుచున్నాడు జయంతుడు. 

===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page