top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 47



Kachadevayani - Part 47 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 23/03/2026

కచదేవయాని - పార్ట్ 47 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్య భాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. పొర్ణమినాడు కలుస్తానని  చిలుక రూపంలో ఉన్న చారుమతి ద్వారా వర్తమానం పంపుతాడు యయాతి. 

కచుడి మీద పగతో దేవయాని, యయాతి మీద ప్రేమతో శర్మిష్ఠ ఎదురు చూస్తూ ఉంటారు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక నలభై ఏడవ భాగం చదవండి. 

చెల్లెలి ప్లాన్… అక్కకు తెలియని రహస్యం

శ్రీమతి టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని నలభై ఏడవ భాగంలో తెలుసుకోండి.


రేపే పౌర్ణమి.


ఆ సాయంత్రం శర్మిష్ఠ వృషపర్వుని భవనానికి వెళ్ళింది. అది గమనించి దేవయాని కూడా ఆమె వెనకాలే బయలుదేరింది.

రేపు నహుష చక్రవర్తి దానవ రాజ్యానికి చేరుకుంటాడు. స్వాగత సన్నాహాల ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చిస్తున్నాడు వృషపర్వుడు.


"నాన్నగారూ!"అంటూ వచ్చింది శర్మిష్ఠ.


ఏమిటన్నట్లు నవ్వుతూ కూతురిని చూశాడతడు.


"రేపు ఉదయం మహాదేవుని ఆలయానికి వెళ్లి వస్తానండి!"అంది శర్మిష్ఠ.


"రేపు చక్రవర్తి వాళ్ళు వస్తున్నారు కదా!ఈ రోజు వెళ్లి రావాల్సింది!"అన్నాడు వృషపర్వుడు.


"ఉదయమే వెళ్లి దర్శనం చేసుకొని వస్తాము నాన్నగారూ!..." అంది గునుస్తూ శర్మిష్ఠ.


"ఎంత సేపు మహారాజా!పంపించండి!చక్రవర్తి వాళ్ళు వచ్చే సరికి మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళు భోజనాలు చేసి విశ్రాంతి తీసికోవాలి!ఈ లోపల పిల్లలు వచ్చేస్తారు!"అన్నాడు దీర్ఘదర్శి నవ్వుతూ.


"సరే!చూడు!త్వరగా వచ్చెయ్యాలి!సాయంత్రానికల్లా నువ్వు తయారుగా ఉండాలి!వెళ్లి మహాదేవునికి భక్తిగా పూజలు చేసిరా!"అని వెనకాల వస్తున్న దేవయానిని చూసి 

" రామ్మా!రా!నువ్వు కూడా చెల్లెలితో పాటు వెళ్లి దేవుని దర్శనం చేసుకొని రామ్మా!" అన్నాడు వృషపర్వుడు.


తండ్రి మాటలు విని ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది శర్మిష్ఠ.


దేవయాని!....


ఆమెకేం చేయాలో తోచలేదు.


"ఆ మహాదేవుని దేవాలయాన్ని మా నాన్నగారు కట్టించారు. అంతకు ముందు అక్కడొక చిన్న మంటపం మాత్రమే ఉండేది. సహస్రమంటపాలతో  మా నాన్నగారు ఎంతో శ్రద్దగా కట్టించారు. ఆ ప్రక్కనే అద్భుతమైన కోనేరు ఉంది. దానిలో స్నానం చేస్తే ఎటువంటి రోగాలైనా తగ్గిపోతాయి. అంత మహిమాన్వితమైన కోనేరు అది.భక్తిగా వేడుకొంటే చాలు!ఎలాంటి కోరికలనైనా తీరుస్తాడా భోళా శంకరుడు. మీరు ఆ కోనేటిలో స్నానం చేసి అక్కడే ఉన్న పూలతోటలోని పూలతో స్వామికి పూజ చేయండి!అయితే ఉదయమే వెళ్లి త్వరగా రావాలి!"అన్నాడు వృషపర్వుడు.


"ఆలాగే నాన్నగారూ!"అంటూ వెనక్కు మరలింది శర్మిష్ఠ.


ఆమె వెనకాలే దేవయాని నడుస్తోంది. ఇద్దరూ ద్వారం దగ్గరికి వచ్చారు.

శర్మిష్ఠకు నిరుత్సాహంగా ఉంది.


'రేపు దేవయాని తమ వెంట వస్తే యయాతితో ఏకాంతంగా ఎలా మాట్లాడాలి? అసలు కుదురుతుందా? ' బెంగగా ఉంది శర్మిష్ఠ.


శర్మిష్ఠ ముఖకవళికల్ని గమనిస్తోంది దేవయాని.


"నేను నీతో రావటం ఇష్టం లేదా శర్మిష్ఠా!"


తత్తర పడింది శర్మిష్ఠ.


"అబ్బే!... అదేం లేదక్కా!నువ్వు పొద్దున్నే తయారవ్వు!వెళ్ళొద్దాం!"అంది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో శర్మిష్ఠ.


'చూస్తుండు శర్మిష్ఠా!రేపటితో నీ కలలసౌధం ఎలా కాలి బూడిదవుతుందో!నీ సంతోషం... నీ కోరికలు అన్నీ నీ కళ్ళముందే ఎలా నాశనమవుతాయో!చూద్దువు గానీ!'అనుకుంటూ తను కూడా కృత్రిమంగా  నవ్వింది దేవయాని.


ఇద్దరు భవనానికి వచ్చారు.


"రేపు మనతో పాటు అక్క కూడా వస్తే ఎలా?" అంది చెలులతో శర్మిష్ఠ.


"నువ్వేం కంగారు పడకు!అక్క గురించి మేము చూసుకుంటాం!మేమంతా వెయ్యి మంటపాలు ప్రదక్షిణలు చేసి వస్తాము!ఈ లోపల యువరాజుతో నువ్వు మాట్లాడుతూ ఉందువు గానీ!"అంటూ ఉపాయం చెప్పింది మదనిక.


"అలా అయితే మనతో పాటు మరో ఇరవై మందిని తీసికెళ్దాం!"అంది కణిక.


"అక్కకు నా మీద అనుమానం రాకుండా మీరే చూసుకోవాలి!సరేనా!"అంటూ నవ్వింది శర్మిష్ఠ.


చెలులు కూడా నవ్వారు.


ఆ రాత్రి యయాతి గురించి కలలు కంటూ కలత నిదుర పోయింది శర్మిష్ఠ.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 48 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page