top of page
Original.png

ఏది శాశ్వతం?

Updated: Jan 29, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #EdiSaswatham, #ఏదిశాశ్వతం


Edi Saswatham - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 24/01/2025

ఏది శాశ్వతం?తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


(తేటగీతి మాలిక )


ఘడియ ఘడియలు కాలంబు కదిలిపోవు 

నిమిషమెట్లైన నిలుచునా నిశ్చలముగ

పాలుమాలిక లేకుండ పఱుగు పెట్టు 

యుగములెన్నియో లెక్కించ నూహ కలదె?


సూర్య చంద్రులు మాయమై సొమ్మసిలగ

విశ్వమందున్న లోకముల్  నశ్వరమయి 

ప్రళయ గర్జన లత్తరి బహుళమవగ 

కాల మొక్కటి మెల్లగా కదలుచుండు.


జీవరాశులు పుట్టుచు చెదరిపోవు 

బ్రహ్మమొక్కటే తుదకట బయలు పడును 

సృష్టి చేసిడి పరమాత్మ చింతపడక 

కాలమందున్న వింతలన్ గాంచుచుండు.


జన్మ జన్మల బంధముల్ సాగుచుండ 

'నేను నాదను 'భావన 'నేతి నేతి '(లేదు, లేదు )

తెలిసి కొన్నట్టి వానిదే తెలివియనుచు 

కాలగతిలోని మర్మంబు కనుము నరుడ!


మనది యనుకున్న దంతయు మాయకదర!

కరిగిపోవునీ కాలంబు క్షణములోన 

శాశ్వతంబైన వస్తువు జగతిలోన

కానరాదంచు నెఱుగుమా కనులు తెరచి! //



Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page