top of page

దేవుని కొలువగ దేహికి సుఖమగు




'Devuni Koluvaga Dehiki Sukhamagu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 08/12/2023

'దేవుని కొలువగ దేహికి సుఖమగు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


దేవుని సాయము పొందక జీవుడు

బతుకుట కష్టము ధరణి యందున

మానవ ప్రార్థన ఎరుగని దేవుడు

మందిర మొదులియు మరుగున జేరును

మేరుపృష్ఠము మేలని నిలువగ

ఇనుమడించగ ఇలలొ భాదలు

ఖర్మ ఫలమని కాంచుచు దేవువుడు

దీనుల కింకను తానే దిక్కని

చేరును భువికిని చేయగ ప్రార్థన

జయ జయ ధ్వానము జేయుచు మ్రొక్కగ

పరమాత్వ వినుచును పరవశమొందును

అందుకె దేవుని ప్రార్థన దేహికి ముఖ్యము

మానవు లందరు దేవుని నీడన

కానగ నుందురు కలతన లేకను

దేవుని నమ్మిన దేహికె సుఖమన

ఇంకా నమ్మని ఇతరులు పుడమిన

పంకము అనెడియు పాపపు బతుకుతొ 

కుందుచు ఉందురు కుంభిని యందున

తలిదండ్రి జేసిన పుణ్యము వలననె

విలవిల లాడక బతుకుతురిక విపుల యందున

  • సుదర్శన రావు పోచంపల్లి


18 views0 comments

Comments


bottom of page