'Srivariki Lekha' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 08/12/2023
'శ్రీవారికి లేఖ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
హారిక మనసు ఉండబట్టలేక.. రూమ్ లో గూట్లోంచి ఒక పుస్తకం తీసింది. పక్కన ఉన్న, పెన్ తీసి.. ఏదో ఆలోచిస్తూ, ముసి ముసి గా నవ్వుతూ.. పేపర్ పై తన మనసులో మాటలను అక్షరాలుగా... వ్రాయడం మొదలుపెట్టింది.
‘ప్రియమైన శ్రీవారికి... నేను మీ శ్రీమతి హారిక వ్రాస్తున్న మొదటి లేఖ! ఫోన్, మెయిల్స్, మెసేజెస్ కాలం లో ఈ ఉత్తరాలు ఏమిటో! అని మీకు అనిపించవచ్చు. ఇలాగ, శ్రీవారికి లేఖ వ్రాయడం లో ఉన్న ఫీలింగ్ చాలా బాగుంటుందని, రాత్రి.. ఇక్కడ పక్కింటి నా ఫ్రెండ్ చెప్పింది. తను కూడా నా లాగే, ఆషాడమాసం ఆహ్వానించిన కొత్త కోడలే! అందుకే, ఇలా మొదలుపెట్టాను..
మంచి అల్లుడు వచ్చాడని, మా అమ్మ తెగ మురిసిపోయి... ఇక్కడ అందరికీ చెప్పేస్తోంది. నాన్న అయితే, పెళ్ళి చూపులలో.. మీకు కాఫీ కుడా అలవాటు లేదని తెలిసి.. ఇప్పటికీ మురిసిపోతున్నారు. నేనైతే, నా కన్నా... అదృష్టం ఎవరికీ రాదనీ.. తలుచుకుని, వెర్రి డ్యాన్స్ వేస్తుంటాను.. ఎవరు లేకుండా చూసే సుమండీ!
మన పెళ్ళి చూపులు జరిగిన రోజు నా డైరీ లో హైలైట్ చేసి రాసాను.
ఆ రోజు మీరు టక్ చేసుకుని, సినిమా హీరో లాగ కార్ దిగి నడుస్తుంటే, కిటికీ లోంచి నేను చూసాను. ఎంతో బాగున్నారు.. పక్కింటి పిల్ల ఎంత అదృష్టవంతురాలో అని, అసూయ పడ్డాను. మిమల్ని ఎందుకో, చూడాలనిపించి.. మా ఇంట్లో పంపించారని చెప్పి, అందంగా సింగారించుకుని.. అక్కడకు వచ్చాను. కొంతసేపటికి మీరు ఎందుకో మా ఇంటికి వచ్చారు.. తర్వాత మన పెళ్ళి జరిగింది. తలచుకుంటే, ఇప్పటికీ చాలా ఆశ్చర్యమే!
ఈ ఉత్తరం అందిన వెంటనే, జవాబు తప్పక ఇవ్వండి. మీ ఉత్తరం కోసం, ఇక్కడ ఒక ప్రాణం.. విరహ వేదన తో వేచి ఉంటుందని మరువకండి’.
భర్త జవాబు కోసం.. ఎదురు చూస్తూనే ఉంది హారిక.
మూడు రోజుల తర్వాత.. "పోస్ట్!.. " అని ఒక గొంతుక విన్నాకా, వంటింట్లో ఉన్న హారిక పరిగెత్తుకుంటూ... ఉత్తరం కోసం వీధిలోకి వచ్చేసింది. అందుకున్న ఉత్తరం మీద భర్త పేరు చూసి.. మురిసి.. గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఎదురుగా.. తన పెనిమిటి ఉన్నట్టే అనుకుని.. ఉత్తరం మడత విప్పింది హారిక.
"అందమైనా నా శ్రీమతి కి.. నీ శ్రీవారు రాస్తున్న విరహ లేఖ!" నువ్వు ఒక విషయం మరిచినట్టున్నావు హారికా!.. మన మధ్య, ఈ నెల రోజులు ఫోన్ ఉండకూడదని, మీ అత్తగారు పెట్టిన షరతు మరిచావేమో! అయినా... ఉత్తరం చదువుతున్నంత సేపు,
నువ్వే కళ్ళ ముందు మెదిలావు హారిక. తన మాట కు విలువనిచ్చి... ఫోన్ వాడకుండా ఉన్నందుకు, మంచి కోడలు వచ్చిందని, మా అమ్మ ఇక్కడ తెగ మురిసిపోతుంది. అదృష్టం అంతా నీదే అని రాసావు.. చెప్పాలంటే, నేనే చాలా లక్కీ! ఆ అందమైన నవ్వు, అందమైన రూపం, మరింత అందమైన నీ మనసు.. నాకు సొంతం అయినందుకు.
మన పెళ్ళిచూపుల గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ రోజు కార్ దిగిన నేను.. మొదట నిన్నే చూసాను. మొదటి చూపులోనే, ఎందుకో తెగ నచ్చేసావు. కాళ్ళు మీ ఇంటివైపే లాగుతున్నా, అపాయింట్మెంట్ మీ పక్కింటి లో ఇచ్చాను కనుక... అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది.
పెళ్ళిచూపులలో ఎదురుగా, అమ్మాయి ఉన్నా... మనసంతా నువ్వే ఉన్నావు. అలా అనుకుంటుండగా.. దేవత వరం ఇచ్చినట్టు.. నువ్వు అక్కడ ప్రత్యక్షమయ్యావు. అంతగా అలంకరించుకుని వచ్చిన నిన్ను నా సొంతం చేసుకోవాలని, నువ్వూ.. అందుకే వచ్చావని నాకు అనిపించింది. నువ్వు వెళ్ళాక... మీ ఇంటికి వచ్చి, మీ అమ్మ.. నాన్నను ఒప్పించాను.
అసలు పెళ్ళిచూపులు చెడగొట్టడానికి, ఎంత కష్టపడ్డానో తెలుసా!.. మీ పక్కింటి అమ్మాయికి నేను నచ్చాను, కానీ నాకు నువ్వే నచ్చావు హారిక.
ఈ ఉత్తరం నీకు అందిన నాటికి... నువ్వు నా దగ్గరకు రావడానికి... మీ ఇంట్లో మాట్లాడుకుంటూ వుంటారు! నీ కోసం, ఎదురుచూస్తున్న.. నీ భర్త..
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలుతాత మోహనకృష్ణ
Comments