top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 43

Updated: 1 day ago

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 43 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 26/02/2026

కచదేవయాని - పార్ట్ 43 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్య భాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. 

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక నలభై మూడవ భాగం చదవండి. 


ప్రతిష్ఠానపురంలో అంతులేని కోలాహలం. భూమి మీదకు విమానాన్ని తెచ్చాడు యువరాజు.

ప్రజలు విరగబడి వచ్చి చూశారు.

ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం. ఇది యయాతి ఒక్కడి విజయమే కాదు. మానవులందరి విజయం. భవిష్యత్తులో మానవులు ఇంకా ఎన్నెన్నో సాహసాలు చేస్తారు. వాటన్నిటికీ ఇది ఒక శుభారంభం.

నహుషచక్రవర్తితో పాటు బంధుమిత్రులతో పాటు ఎంతో మంది సామంతరాజులు కూడా వచ్చి యయాతికి స్వాగతం పలికారు. కుమారుడిని సంతోషంగా కౌగలించుకొన్నాడు నహుషుడు. రాజధానిలో సందడే సందడి. యయాతి భవనం వింతకాంతులతో మెరిసి పోతోంది. దాసదాసీలందరు యువరాజును సేవించాలని పోటీ పడుతున్నారు.

పదిరోజులకు అంతా సర్దుమణిగింది.

ఇంకో వారం రోజులకు చారుమతి గంధర్వలోకానికి వెళ్తుంది. 

ఆమెకు బహుమానంగా ఇవ్వటానికి బండ్ల నిండుగా రత్నరాశులను, పట్టు వస్త్రాలను, వెండి బంగారు ఆభరణాలను సర్దించి అరుణకేశి మహర్షి వైద్యాలయానికి బయలుదేరాడు యయాతి.

అతడి వెంట పింగళుడు, శక్తిధరుడు కూడా ప్రయాణమయ్యారు.

చారుమతి! ....

మిత్రులు ముగ్గురు ఆమె గురించే మాట్లాడుకొంటూ ప్రయాణిస్తున్నారు. ఆమె నవ్వు, ఆమె అలక, ఆ చిలిపితనం... ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకు ఎగురుతూ వ్యంగ్యగా విసిరే ఛలోక్తులు...అవసరానికి సాయపడే మనస్తత్వం.... ఏ విషయం లోనైనా ఆమె కున్న అపారమైన పాండిత్యం.. ఇవన్నీ మిత్రులకు తెలుసు.ఇప్పుడు ఆమె అసలు రూపమెలా ఉంటుందో అన్న కుతూహలం.

అరుణకేశి మహర్షితోపాటు కచుడు, సారంగ దేవులు యయాతి వాళ్ళను సాదారంగా ఆహ్వానించారు. అందరూ ఒకచోట కూర్చున్నారు. సేవకులు బండ్లలోని బహుమానాలను కచుని విమానంలోకి సర్దుతున్నారు.


"ఇదంతా ఎందుకు?" అంది చారుమతి మొహమాటంగా.


"మాకు అక్క చెల్లెళ్ళు లేరు. నువ్వే మాకు ఆడపడుచువి. ఈ మాత్రం ఇవ్వక పోతే ఎలాగా?అసలు మమ్మల్ని అడిగి తీసికొనే హక్కు నీకుంది. కాదనకు! "అన్నాడు 

వాత్సల్యంగా యయాతి.


అతడి భుజం మీద వాలింది చారుమతి. కళ్లనీళ్లు తిరిగాయి యయాతికి.

ఇంతలో ఎంత అనుబంధం! 


"ఒక్క శర్మిష్ఠ రాజకుమారి తప్ప మనమందరం ఇక్కడ మళ్ళీ కలుసుకున్నాము " అంది శరావతి.


"దానవరాజ్యానికి వెళ్ళటానికి తయారవుతున్నాము. అక్కడికి పౌర్ణమి నాటికి వస్తామని మా నాన్నగారు దానవరాజుకు వర్తమానం పంపించారు. శర్మిష్ఠను చూడాలంటే ఇంకా ఇరవై రోజులు వేచి ఉండాల్సిందే! "యయాతి కంఠంలో దిగులు ధ్వనించింది.


"పోనీ! చారుమతితో రాజకుమారికి ఏదన్నా సందేశం పంపిస్తావా! నీకు కాస్త ఊరటగా ఉంటుంది! "అన్నాడు కచుడు.


"పంపించవచ్చు! పౌర్ణమి నాటికి అక్కడికి చేరుకుంటాము. అందరి ముందు పెళ్లి చూపుల్లో చూడటానికి ముందు శర్మిష్ఠను ఒకసారి ఏకాంతంగా కలుసుకోవాలని ఉంది. తనకు వీలవుతుందేమో కనుక్కుంటావా! బేలగా చారుమతిని అడిగాడు యయాతి.


మిత్రులందరు సన్నగా నవ్వుతున్నారు.


"అలాగే! రేపు ఉదయాన్నే వెళ్తాను! ఇంకో నాలుగు రోజులయితే నేనిలా ఎగురుకుంటూ వెళ్ళలేను! "అంది చారుమతి.


యయాతి హృదయం తేలికపడింది.

మిత్రులందరు చారుమతి ఔదార్యాన్ని పొగుడుతూ కూర్చున్నారు.

విందు వినోదాలతో ఆ రాత్రి గడిచింది.

===============================================

ఇంకా వుంది..

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page