వీడియో తాత్పర్యం చెప్పండి
- P. V. Padmavathi Madhu Nivrithi

- 3 hours ago
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #VideoThatparyamCheppandi, #వీడియోతాత్పర్యంచెప్పండి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Video Thatparyam Cheppandi - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 26/02/2026
వీడియో తాత్పర్యం చెప్పండి - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
I)
ఆ రోజు శ్రీలేఖ తన స్నేహితులతో ఇలా అన్నది: -
"ఈ వీడియో చూడండి, తరువాత దాని తాత్పర్యం చెప్పండి."
"సూచన: తాత్పర్యం కనిపించి- కనిపించకుండా ఉంటుంది. తాత్పర్యం పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలి. సరి అయిన సమాధానం చెప్పిన వారికి బహుమతి ఉంటుంది,"
అని చిరునవ్వుతో సవాలు విసిరింది శ్రీలేఖ.
II)
వీడియోలో శ్రీలేఖ మరియు ఆమె ప్రాణస్నేహితురాలు మేఘన అనేక చోట్లలో, బహిరంగ ప్రదేశాల్లో నిల్చుని... రోడ్లలో నిల్చుని... రకరకాల పండ్లు తింటున్నారు... ఆరగిస్తున్నారు.
పది నిముషాల వీడియో అయిపోయింది. దాని తాత్పర్యం ఏమిటో చెప్పాలి... పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలి. అదీ షరతు.
III)
ఒక్కొక్కరి (స్నేహితుల) ఒక్కొక్క జవాబు ఇలా వినిపించింది.
1వ జవాబు)
"రోజూ కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది... అందులో విటమిన్లు ఉంటాయి... ఐరన్ ఉంటుంది."
2వ జవాబు)
"విహార యాత్రలకు వెళుతూ ఉండాలి అప్పుడప్పుడు... ఇంటి సభ్యుల బృందాలుగా... స్కూల్-కాలేజీ-ఆఫీసు-వ్యాపార సంస్థల సభ్యుల-స్నేహితుల బృందాలుగా... అప్పుడు కొత్త చోట్ల గురించి తెలుస్తుంది."
3)
"విహార యాత్రల వల్ల మానసిక వికాసం వస్తుంది."
4)
"విహార యాత్రల వల్ల ప్రకృతి నుండీ పెక్కు మంచి విషయాలు నేర్చుకోవచ్చు."
5)
"విహార యాత్రల వల్ల ఎందరో కొత్త స్నేహితులను పొందవచ్చు, చేసుకోవచ్చు."
6)
"విహార యాత్రల వల్ల రవాణా సంస్థలకు... ఇతర చిరు వ్యాపారులకు జీవనోపాధి ఇవ్వవచ్చు."
7)
"చెట్లు ఎక్కువగా నాటండి బహిరంగ ప్రదేశాలలో... నీటిలోని మొక్కలు, బంగ్లా గోడలపై పాకే తీగలు... మిద్దెలపై వనములు - మొక్కలు... వాటివల్ల రెండింతల లాభం... కాలుష్యం వాతావరణం నుండి పీలుస్తుంది... మరియు ప్రాణవాయువు (ఆక్సిజన్) వాతావరణంలో వదులుతుంది."
8)
"రోడ్లు - స్థలములు శుభ్రంగా ఉంచుకోవాలి... నీరు నిలువ ఉండకూడదు."
అందరి జవాబులు అయిపోయాయి.
IV)
ఆఖరికి శ్రీలేఖ ఇలా చెప్పింది చిరునవ్వుతో,
"మీరు చెప్పిన పాయింట్లు అన్నీ బాగానే ఉన్నాయ్... కానీ పర్యావరణానికి మేలు చేసేవి ఏవీ లేవు."
"మేము పండ్లు తిన్నాక తొక్కలు ఎక్కడైనా వేసామా... రోడ్డు మీద వేసామా?", అని అడిగింది శ్రీలేఖ.
"లేదు", అని అరిచారు అందరూ.
"మేము పండ్లు తిన్నాక... తొక్కలు మా బ్యాగులలో వేసుకున్నాం... ఇంటికొచ్చాక డస్ట్‌బిన్‌లో- చెత్తబుట్టలో వేశాము."
"చెత్త రోడ్లలో, వేరే చోట్లలో, ఇతర బహిరంగ ప్రదేశాలలో,... నీటిలో, నదులు, సముద్రాలు, కాలువలు, కోనేరులలో, ఉద్యానవనాల్లో వేయరాదు... ఒక సంచి పెట్టుకొని దానిలో వేసుకోవాలి... మున్సిపాలిటీ వారు కేటాయించిన చెత్తబుట్టలలో వేయాలి."
"అన్ని రకాల చెత్తలను ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, పేపర్, గాజు... వగైరా తక్కువగా సృష్టించాలి... రీసైకిల్ చేయాలి... వాటి నుండి విద్యుత్ మరియు ఇతర ప్రయోగకరమైన వస్తువులను తయారు చేయాలి... ఎన్నో దేశాలు అలా చేస్తున్నాయి."
V)
"ఇవిగో అందరికి బహుమతులు... ఈ ఆరోగ్యకరమైన పండ్లను ఆరగించండి... దానిపైనుండి తీసిన తోలు ఎక్కడ వేస్తారు?" అని అడిగింది శ్రీలేఖ.
"అగో... అక్కడున్న చెత్తబుట్టలో", అన్నారందరూ ఉషారుగా నవ్వుతూ ఆనందోత్సాహాలతో.
------------------- చిన్న కథ సమాప్తం. -------------------
-------------- నీతి -------------------
1)
చెత్త రోడ్లలో, వేరే చోట్లలో, ఇతర బహిరంగ ప్రదేశాలలో,... నీటిలో, నదులు, సముద్రాలు, కాలువలు, కోనేరులలో, ఉద్యానవనాల్లో వేయరాదు... ఒక సంచి పెట్టుకొని దానిలో వేసుకోవాలి... మున్సిపాలిటీ వారు కేటాయించిన చెత్తబుట్టలలో వేయాలి.
రోడ్లు-స్థలములు శుభ్రంగా ఉంచుకోవాలి... నీరు నిలువ ఉండకూడదు.
లేకుంటే రకరకాల జ్వరాలు-వ్యాధులు వ్యాపిస్తాయి... జెర్మ్స్, క్రిములు, కీటకాలు, దోమల (వాటి గుడ్ల-పెంపకం-ఉత్పత్తి) వల్ల.
2)
మున్సిపాలిటీ వారితో సహకరించాలి.
3)
అన్ని రకాల చెత్తలను ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, పేపర్, గాజు... వగైరా తక్కువగా సృష్టించాలి... రీసైకిల్ చేయాలి... వాటి నుండి విద్యుత్ మరియు... (ఇతర) ప్రయోగకరమైన వస్తువులను తయారు చేయాలి... ఎన్నో దేశాలు అలా చేస్తున్నాయి.
4)
రోజు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది... వాటిల్లో పెక్కు విటమిన్లు ఉంటాయి... ఐరన్ ఉంటుంది కాబట్టి.
(గమనిక: ఏదీ అతిగా తినవద్దు). ... వ్యాయామం రోజు చేయాలి... కనీసం నడక.
5)
చెట్లు ఎక్కువగా నాటండి బహిరంగ ప్రదేశాలలో... నీటిలోని మొక్కలు, బంగ్లా గోడల పై పాకే తీగలు... మిద్దెల పై వనములు - మొక్కలు... వాటివల్ల రెండింతల లాభం... కాలుష్యం వాతావరణం నుండి పీలుస్తుంది... మరియు... ప్రాణవాయువు (ఆక్సిజన్) వాతావరణంలో వదులుతుంది.
--------- నీతి సమాప్తం -----
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments