మంచిబాట
- T. V. L. Gayathri
- Jan 22
- 1 min read
Updated: Jan 29
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #Manchibata, #మంచిబాట

Manchibata - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 22/01/2025
మంచిబాట - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
(తేటగీతులు )
మద్యపానంపు మత్తులో మరచి తనువు
మనుజులీనాడు వెఱ్ఱితో మసలు కొనుచు
నీచులై సంఘమందున నీల్గుచుండ
జాతి మనుగడ శుభముగా సాగుటెట్లు?
దురిత మైనట్టి దారిలో దొరలుచుండి
యువత పెడదారి పట్టుచో నుస్సురనుచు
జాతి నిర్వీర్య మగుతఱి జడుపు తోడ
తల్లి భారతి విలపించె తల్లడిల్లి.
మానవత్వము వీడిన మనుజతతికి
సంఘమర్యాద నిలిపెడి చదువునేర్పు
గురువులీనాడు కరవైరి ధరణియందు
వింత వ్యాధులు వ్యాపించె వీథి వీథి
మంచి బాటలో నడవండి మనుజులార!
భరతసంస్కృతీ విభవమ్ము మరువవలదు
చక్కనైనట్టి చదువులు చదువు కొనుచు
జాతి శ్రేయస్సు కోరుచూ సాగిపొండి!//

Profile Link:
Comments