top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 41

Feb 15
5 min read

Updated: Feb 20

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 41 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/02/2026

కచదేవయాని - పార్ట్ 41 - తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. అతనికి ప్రథమ స్థానం వచ్చి ఉండాలని మహర్షులు తలపోశారు. 

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక నలభై ఒకటవ భాగం చదవండి. 


బహుమతి ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమయింది. ముందుగా మంగళవాయిద్యాలు మోగిస్తూ గంధర్వ జాతి కళాకారులు కదులుతున్నారు.

ఆ వెనుక మహర్షులు వేదపాఠాలు చదువుతూ వస్తున్నారు. వారి వెనుక ముద్దుగా అలంకరించుకున్న కన్నెపిల్లలు నాట్యాలు చేస్తూ వస్తున్నారు. ఆతర్వాత బంగారు  కలశాలు పట్టుకొని మహిళామణులు వయ్యారంగా నడుస్తూ వస్తున్నారు.వారి వెనుక మెల్లగా గోవులు, వృషభాలు, గుర్రాలు, ఏనుగులు కదలి వస్తున్నాయి. ఆ తర్వాత ఆయుధాలు ధరించిన దేవసైన్యం కదులుతోంది.ఆ వెనుక భద్ర గజాన్ని ఎక్కి సతీ సమేతంగా దేవేంద్రుడు వేంచేస్తున్నాడు.

దేవతలు, కిన్నెరలు,కింపురుషులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీతిహోత్ర చక్రవర్తి తన కుమారులతో కలిసి వచ్చి దేవేంద్రుడిని ఆహ్వానించి గౌరవించాడు.

ఎటు చూసినా కోలాహలం... ఆనందం.. ఫలితాల కోసం ఉత్కంఠ.


జయంతుడు ప్రారంభోపన్యాసం చేశాడు.

తర్వాత దేవేంద్రుడు లేచి అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు.


"విమాన పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఇక ముందు కూడా ఉత్సాహవంతులైన యువత పోటీల్లో పాల్గొంటూ ఉండాలి. యువతను ప్రోత్సహించుటమే మా లక్ష్యం 

జగత్తును నూతన మార్గంలో నడిపించగలిగే సామర్ధ్యం నేటి యువతకు పుష్కలంగా ఉంది. పోటీలో బహుమతి రాని వాళ్ళు నిరుత్సాహ పడవలసిన పనిలేదు. అభ్యర్థులందరు అతి కఠినమైన శిక్షణను తీసికొన్నారు. అయితే పోటీ అని నిర్వహించినప్పుడు అందరికి ప్రథమ స్థానం రాదు కదా!అలా అని మిగిలిన వాళ్లకు తక్కువ సామర్ధ్యం ఉందని అనుకోరాదు. కొద్దిపాటి భేదం ఉంటుందంతే!అభ్యర్థులు అందరూ చక్కటి ప్రతిభను ప్రదర్శించారు. అందరికీ అభినందనలు! ఇప్పుడు ఫలితాలను వినండి!...... "

ఒక్క నిమిషం ఆగాడు దేవేంద్రుడు.

యయాతి భుజం తట్టాడు కచుడు. 


"మొదటి స్థానానికి గంధర్వ సేనాపతి హూహు ఎంపిక చేశాము!"దేవేంద్రుడు కొనసాగించాడు.


"ఇదేమిటి?... ఇదేమిటి?..."గుసగుసలాడుకొంటున్నారు  ప్రేక్షకులు. వాళ్ళ ముఖాల్లో విస్మయం.

పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు గంధర్వులు.


నివ్వెరపోయాడు కచుడు.


వెనక్కు తిరిగి మునుల వైపు చూశాడతడు.. అత్రి మహాముని కనిపించాడు. ఇద్దరి కళ్ళు కలుసుకొన్నాయి. తలను పంకించాడు అత్రి మహాముని.


దేవేంద్రుడి కంఠం మళ్ళీ వినిపించింది.


"రెండవ స్థానానికి గురుదేవులైన బృహస్పతులవారి కుమారుడు కచుడిని ఎంపిక చేశాము."మళ్ళీ ఆగాడు దేవేంద్రుడు.


దేవజాతి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు.

కచుడి భుజాలు పట్టుకొని ఊపేశాడు యయాతి.

అయిష్టంగా ముఖం పెట్టాడు కచుడు.

"ఫలితాల ప్రకటనలో ఏదో తప్పిదం జరిగింది యయాతీ!"


"నిజమే!నీకు ప్రథమ స్థానం రావాల్సింది! "అన్నాడు యయాతి.


"కాదు!కాదు!...." కచుడు ఇంకేదో చెప్పబోతుంటే దేవేంద్రుడి కంఠం మళ్ళీ వినిపించింది.


"ఇప్పుడు ఆఖరి స్థానంలో...."ఒక్క నిమిషం ఆగి అందరినీ చూశాడు దేవేంద్రుడు.


అంతటా నిశ్శబ్దం!


"భూలోకానికే సామ్రాట్టు అయిన నహుషచక్రవర్తి కుమారుడైన యయాతి కుమారుడిని ఎంపిక చేశాము....." 


దేవేంద్రుడి మాట పూర్తి కాకుండానే ప్రేక్షకులందరు లేచి నిలబడి ఆ  ప్రాంగణమంతా హోరెత్తి పోయేటట్లు చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. పుష్కర ద్వీపవాసులు  పెద్ద పెట్టున జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. 

ముని సంఘాల వాళ్ళు పెద్ద పెట్టున " జయోస్తు యయాతీ!విజయోస్తు యయాతీ!"అంటూ కేకలు పెడుతున్నారు. మహిళా ప్రేక్షకులందరు జాతి భేదం లేకుండా  యయాతిని అభినందిస్తూ శంఖాలను పూరిస్తున్నారు. చాలాసేపటి వరకు ఆ సందడి సద్దుమణగ లేదు.


దేవేంద్రుడికి అర్థమయ్యింది.

తమ వైపు నుండి యయాతికి ప్రథమ స్థానం దక్కలేదు. కానీ ప్రేక్షకులందరు జాతి భేదం చూపకుండా యయాతికి ప్రథమ స్థానమిచ్చి గౌరవించారు.


 జయంతుడి వైపు చూశాడు దేవేంద్రుడు.తండ్రి చూసిన చూపులో భావం అర్థమయ్యి తలదించు కొన్నాడు జయంతుడు.


కరతాళ ధ్వనుల మధ్య విజేతలకు బంగారు విమాన ప్రతిమలనందచేశాడు దేవేంద్రుడు.


అప్పుడే వీతిహోత్ర చక్రవర్తి వచ్చి దేవేంద్రుడి అనుమతి తీసుకొని పుష్కర ద్వీపంలో యయాతికి రాజ్య భాగాన్ని ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇది ఊహించలేదు హూహు.


కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళబోయాడతడు.

వెంటనే హూహు భుజాలను పట్టుకొని కూర్చో బెట్టాడు జయంతుడు.


"ఇప్పుడు ఆవేశం పనికిరాదు హూహూ!కాస్త సంయమనం పాటించు!"అంటూ ఎవరికీ వినపించకుండా  హూహును మందలించాడతడు.

బలవంతంగా ఉత్సవం అయ్యేదాకా కూర్చున్నాడు హూహు.

వైభవంగా ఉత్సవం ముగిసింది.


===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page