కచదేవయాని - పార్ట్ 54
- T. V. L. Gayathri
- 11 hours ago
- 5 min read

Kachadevayani - Part 54 - Telugu Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 54 - తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 18/05/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. యయాతిని కలిసి జరిగిన విషయాలు చెబుతుంది శర్మిష్ట. తండ్రి శుక్రాచార్యుని పిలిపించి, శర్మిష్ఠను తన దాసిగా చెయ్యమని కోరుతుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తండ్రి ప్రేమా? గురు ధర్మమా?
సందిగ్ధంలో శుక్రాచార్యుడు.
టి. వి. యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 54 వ భాగం వినండి.
నాగలోకంలో ఉన్న శుక్రాచార్యునికి దేవయాని తనను తల్చుకుంటోందని మనసులో అనిపించింది. 'చిట్టి తల్లికి ఏమయింది?' అనుకుంటూ అక్కడి వాళ్ళతో చెప్పి వేగంగా ఆకాశమార్గాన బయలుదేరాడు. దివ్యదృష్టితో కూతురు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి మఱ్ఱి చెట్టు దగ్గరికి వచ్చాడు.
ఆయనను చూడగానే దుర్జయుడు, నారాచి గబగబా వచ్చి "గురువుగారూ! శరణు! శరణు!" అంటూ ఆయన పాదాల మీద పడ్డారు.
"లేవండి! లేవండి! ఏమయింది? మీరంతా ఇక్కడ ఉన్నారు?" అని ప్రశ్నించాడాయన.
"గురువుగారూ! మాకు, మహారాజుకు, పరివారానికి అభయాన్ని ప్రసాదించండి! మీ వాత్సల్యమే మాకు రక్ష!" అంటూ దీనంగా వేడుకున్నాడు దుర్జయుడు.
"మీకేమీ భయం లేదు! అసలు విషయం చెప్పండి!"
గురువుగారూ! ఏదో చిన్న పిల్లల మధ్య తగాదా... రాకుమారికి, అమ్మాయిగారికి మధ్య చిన్న గొడవ. అంతే! మీరు రాకుమారిని క్షమించండి! ఏదో ఆటల్లో వచ్చే గొడవ అంతే!.. అమ్మాయిగారు బావిలో జారి పడ్డారు... జరిగిన దానికి. క్షమించండి గురువుగారూ!" అంటూ నారాచి శుక్రాచార్యుని ముందు మోకరిల్లింది.
"సరే! సరే! ముందు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా? ఎవ్వరికీ ఏమీ కాదు! నిశ్చింతగా ఉండండి!" అంటూ శుక్రాచార్యుడు గుడారం లోపలికి వచ్చాడు.
తండ్రిని చూడగానే దేవయాని ఒక్క ఉదుటున లేచి వచ్చింది. కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరాడాయన.
భోరుమంది దేవయాని.
"ఏమైంది తల్లీ! నేను వచ్చేశానుగా!.. దిగులు పడకమ్మా! దిగులు పడకు!" అంటూ ఓదార్చాడు.
"ఆ రాక్షసి పిల్ల అహంకారంతో నన్ను బావిలోకి తోసేసింది... తండ్రిగారూ! నా ప్రాణం పోయి ఉండేదే!... సమయానికి ప్రతిష్ఠానపురం యువరాజు యాయాతి వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను..."
"భగవంతుడి దయ వల్ల నిన్ను క్షేమంగా చూస్తున్నాను తల్లీ! పద! గురుకులానికి వెళ్దాం! యాయాతి పరివారానికి కృతజ్ఞతలు చెబుతాను. నహుషచక్రవర్తి నాకు బాగా తెలిసిన వాడు. అతడి కుమారుడు ఎంతో మంచి కుర్రవాడు..."
"తండ్రిగారూ! గురుకులానికి నేను రాను! ఆ అహంకారి శర్మిష్ఠను శిక్షించందే ఇక్కడి నుండి కదిలేది లేదు! దానవరాజును పిలిపించండి! ఆ రాక్షసి చేసిన ఘాతుకానికి తగిన శాస్తి జరగాల్సిందే!" అంటూ బుసలు కొడుతూ చెప్పింది దేవయాని.
"అలాగే! అలాగే! ఇప్పుడే పిలిపిస్తాను! క్షమాపణ చెప్పిస్తాను! శాంతించు తల్లీ!" అనునయించాడు శుక్రాచార్యుడు.
"ఏమిటి? ఊరికే క్షమాపణ చెబితే సరిపోతుందా? దానికి రాజకుమారిననే గర్వం... ఆ పొగరుతో ఎలా అంటే అలా ప్రవర్తిస్తోంది... ఇక నుండి నాకు దాస్యం చెయ్యాలని చెప్పండి! నాలుగు రోజుల్లో దానికున్న గర్వాన్ని తగ్గిస్తాను! మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డ జాతి... హు!.. మనం లేకపోతే వాళ్లకు భవిష్యత్తు లేదు..." క్రోధంతో ఊగిపోతోంది దేవయాని.
ఆలోచిస్తున్నాడు శుక్రాచార్యుడు.
అసలు దేవయాని బావిలో జారి పడిందా? లేక ఉద్దేశ పూర్వకంగా బావిలోకి తోశారా? అంత సాహసం శర్మిష్ఠ ఎందుకు చేస్తుంది? చిన్నప్పటి నుండి తెలిసిన పిల్ల. దేవయాని తండ్రినే చూస్తోంది.
"మీరు ఏమాలోచిస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళను శిక్షించటానికి మీనమేషాలు లెక్క వేయకండి! నాకు ఘోరమైన అవమానం జరిగింది. దానిని భరిస్తూ నేను బ్రతకలేను! చెప్పండి తండ్రిగారూ! మీ కూతురును అవమానించిన వాళ్ళను వదిలి పెడతారా? నేను చెప్పినట్లు చెయ్యండి! లేకపోతే పచ్చిగంగ ముట్టను! నా ప్రాణాలు పోయే దాకా ఇలాగే ఉంటాను!" దేవయాని కంఠంలో ధిక్కారం.
శుక్రాచార్యుడికేమీ పాలుపోవటం లేదు. ఒక వైపు తననే నమ్ముకున్న దానవరాజు. మరొక వైపు ప్రాణసమానమైన కూతురు. ఇప్పుడెలా?
"నాకు తెలుసు!మీకు నా కంటే ఆ దానవరాజుతో మొహమాటం ఎక్కువ. వాళ్ళు కాసేపు పొగిడితే మీరు కరిగిపోతారు!... కూతురు మీద కంటే ఆ శర్మిష్ఠ మీద ప్రేమ ఎక్కువ... అందుకే తటపటాయిస్తున్నారు కదూ!"అంటూ మళ్ళీ వెక్కివెక్కి ఏడవసాగింది దేవయాని.
కంగారు పడ్డాడు శుక్రాచార్యుడు.
"అదేమీ లేదు తల్లీ! బాధపడకు! వృషపర్వుని పిలిపిస్తాను! నాకు నీ కంటే అధికులెవరున్నారు? నువ్వేమి కోరితే అది తెచ్చి పెడతాను! ఊరుకోమ్మా! ప్రపంచంలోనే గొప్ప మంత్రవేత్త శుక్రాచార్యుని కూతురు దుఃఖపడటమా? ఊరుకో తల్లీ! ఊరుకో!" అంటూ ఆమె తల మీద చెయ్యి వేశాడాయన.
ఏడుపును ఆపింది దేవయాని.
"అయితే తక్షణం దానవరాజును పిలిపించండి! శర్మిష్ఠను నాకు దాసిగా ఏర్పాటు చెయ్యండి!" దేవయాని గొంతులో కర్కశత్వం.
కానున్నది కాక మానదు.
తలను పంకించి గుడారం బయటకు వచ్చాడు శుక్రాచార్యుడు.
ఆయనను చూడగానే పరుగున ఆయన దగ్గరికి వచ్చాడు దుర్జయుడు. అతడి వెనకాలే నారాచి.
"మీరు వెళ్లి మహారాజును పిలుచుకొని రండి!" ఆదేశించాడాయన.
సందిగ్ధంగా నిలబడ్డారిద్దరూ.
"ఏమీ భయం లేదు!వెళ్ళండి!మహారాజును తీసికొని రండి!"అన్నాడాయన.
చేసేదేమీ లేక రాజధానికి వెళ్లారిద్దరూ.
ఇంతలో అక్కడికి పింగళుడు వచ్చాడు. దేవయానిని రక్షించినందుకు యువరాజు యాయాతిని మెచ్చుకొని, ఆమెకు వసతి కల్పించినందుకు పింగళుడికి కృతజ్ఞతలు తెలిపాడాయన. కాసేపు ఆయనతో మాట్లాడి వెళ్లిపోయాడు పింగళుడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 55 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |


