top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 49

Updated: 20 hours ago



Kachadevayani - Part 49 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 07/04/2026

కచదేవయాని - పార్ట్ 49 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. దేవయాని, చెలులు కూడా ఆమె వెంట ఉంటారు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక నలభై తొమ్మిదవ భాగం చదవండి. 


“ప్రేమపై ద్వేషం… ఇప్పుడు ప్రాణాలకు ముప్పు!”


దేవయాని, శర్మిష్ఠలతో కలిసి చెలులందరు స్నానాలు చేస్తున్నారు. గాలి వేగంగా వీస్తోంది. వీళ్ళు ఒడ్డు మీద విడిచిన చీరలు, లుంగ చుట్టుకొని కోనేటి గట్టు చివరకు కొట్టుకొని పోయాయి. దేవయాని ధరించిన పల్చటి అంగవస్త్రంలో నుంచి ఆమె మెడలోని ఎర్రటి మణి వెలుగుతూ కనిపిస్తోంది.


ఈ మధ్య కాలంలో ఆమె ఒంటి మీద చూడలేదు ఆ మణిని. అసలు ఆ మణి ప్రత్యేకంగా ఉంది.

"అక్కా! క్రొత్త మణిలాగా ఉంది! ఎక్కడిది? ఎప్పుడూ నువ్వు పెట్టుకోగా చూడలేదు!" అంది దేవయాని దగ్గరగా వచ్చి కణిక.


చురచురా చూసింది దేవయాని.

"నా నగల గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు!" అంది విసురుగా.


చిన్నబుచ్చుకున్న ముఖంతో శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళింది కణిక.

దేవయానిని చూసింది శర్మిష్ఠ.


"ఈ రోజు అక్క ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది! గురువుగారి మీద బెంగ పడిందేమో! మీరు అక్కను ప్రశ్నలు వేసి విసిగించకండి!" అంది అతి మెల్లగా చెలులతో శర్మిష్ఠ.


అందరూ స్నానాలు చేసారు.

ఒడ్డుకు వచ్చారు. ఒక్కొక్కరు గుట్టలా పడి ఉన్న చీరల్లో నుంచి తమ తమ చీరలు తీసుకుని కట్టుకొని దేవాలయం వైపు వెళ్తున్నారు.


అక్కడ మదనిక, కణికలతో పాటు శర్మిష్ఠ మిగిలింది. దేవయాని ఇంకా నీళ్లలోనే ఉంది.

ఎలాగోలా ఊడల మర్రి దగ్గరికి వెళ్ళాలి! మణి ప్రభావంతో ఆమెలో ద్వేషం పెల్లుబుకుతోంది.

ఒడ్డున ఉన్న శర్మిష్ఠను చూసింది. వికృతమైన నవ్వు ఒకటి ఆమె ముఖంలో దోబూచులాడింది.


శర్మిష్ఠ గబగబా చీరను చుట్టుకుంది. యయాతి వచ్చే లోపల మరొక పట్టుచీర ధరించి అలంకారం పూర్తి చేసుకోవాలి! మహాదేవునికి పూజ కూడా చెయ్యాలి.

ఎంత లేదన్నా రెండు గంటలు పడుతుంది.


ఇంతలో దేవయాని నీళ్లలోనుంచి ఒడ్డుకు వచ్చింది.

చూసింది. శర్మిష్ఠ తన చీరను కట్టుకొని ఉంది.

మండిపోయింది దేవయానికి.

"నువ్వు నా చీర ఎందుకు కట్టుకున్నావ్?" తీవ్రంగా ఉంది దేవయాని కంఠం.


గబక్కున చీరను చూసుకుంది శర్మిష్ఠ.

నిజమే! మందారపూల చీర!

పొరబాటు!


"అయ్యో! చూసుకోలేదు అక్కా! రెండూ ఒక రకంగా ఉన్నాయి కదా! నువ్వు నా చీర కట్టుకొని వచ్చేయ్! మంటపంలో ఎలాగూ మార్చుకోవాలిగా!"


"అంటే! ఏమిటి నీ ఉద్దేశం? నీ చీరను నేనెందుకు కట్టుకుంటాను? నువ్వు ధరించిన వస్తువులు తీసుకోవటానికి నేనేమన్నా నీ సేవకురాలినా?" దేవయాని కంఠంలో ఆగ్రహం... ముఖంలో కాఠిన్యం...


చెలులు ఆలాగే నిల్చుని చూస్తున్నారు.


"పొరబాటు జరిగిందని చెప్పాను కదా అక్కా! పోదాం పద! త్వరగా పూజ చేసుకుందాం!" అనునయంగా అంది శర్మిష్ఠ.


దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి కదిలిందామె.


"అంత తొందరెందుకు రాజకుమారీ! ఓ... నీ ప్రియుడు వస్తాడనా? చిలుకతో రాయబారం పంపించాడు కదూ!..."


వికటంగా నవ్వింది దేవయాని.


గిరుక్కున వెనక్కు తిరిగింది శర్మిష్ఠ. ఆమెకు విషయం అర్థమవుతోంది. దేవయానికి తన ప్రేమ గురించి తెలుసు!

ఒక నిమిషం మౌనం!


"ఓహో! నీకు తెలుసన్న మాట! సరే! ఇక్కడికి వస్తున్నారు? అయితే ఏమిటి?"

శర్మిష్ఠ కంఠంలో రాజసం.


"పెద్ద వాళ్లకు తెలియకుండా నువ్వు సాగించే ప్రేమాయణం నేను కనిపెట్ట లేదనుకున్నావు కదూ!... అబ్బో! అందరినీ ఎంత తెలివిగా మోసం చేశావు!... పుట్టిన రోజుకు వచ్చి వెళ్ళడాలు... నీకు బహుమానాలు ఇవ్వడాలు!... ఆహా!... నీ నంగనాచి వేషాలకు ఈ రోజుతో ముగింపు నేనే పలుకుతాను! చూస్తూ ఉండు రాజకుమారీ!"


"నా ప్రేమ నా ఇష్టం! మధ్యలో నువ్వెవరు? నా ఇష్టమొచ్చినట్లుంటాను! మధ్యలో నీ అధికారం ఏమిటి? అయినా మా దగ్గర పడి ఉండే దానివి! నోరు మూసుకుని బ్రతుకు!" తీక్షణంగా చెప్పింది శర్మిష్ఠ.


"నువ్వు మర్చిపోయావా శర్మిష్ఠా! మా తండ్రిగారి దయాదాక్షిణ్యాల మీద నువ్వూ, నీ రాజ్యం ఆధారపడి ఉన్నాయి! మా తండ్రిగారు తలచుకుంటే మీరంతా క్షణంలో బూడిదవుతారు! నువ్వే అహంకారాన్ని తగ్గించుకుని ప్రవర్తించు!" బుసలు కొడుతూ గట్టిగానే సమాధానం చెప్పింది దేవయాని.


"మీ తండ్రిగారు మమ్మల్నేం రక్షించటం లేదు! ఏదో గురుపుత్రికవని ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్నే అవమానిస్తావా? మా మీదే విషం కక్కుతావా!... అయినా నువ్వొక వానపామువి! నువ్వు మమ్మల్నేం చెయ్యగలవు?"


"ఏం చేస్తానో ఈ రోజే చేసి చూపిస్తాను! చూస్తూ ఉండు! నీ ప్రియుడిని చంపటానికే నేనిక్కడికి వచ్చాను! వాడు ఈ రోజు నా నుంచి తప్పించుకోలేడు!" అంటూ అక్కడే ఒడ్డు మీద చీర కింద పడి ఉన్న చురకత్తిని తీసుకుని అతి వేగంగా ఊడల మర్రి వైపు పరిగెత్తసాగింది దేవయాని.


ఇది ఊహించలేదు శర్మిష్ఠ.

దేవయాని యయాతిని చంపటానికి వచ్చిందా?

దిమ్మతిరిగినట్లనిపించింది ఆమెకు.

త్వరగా తేరుకుంది మదనిక.


దేవయాని వెనకాలే ఆమె కూడా పరిగెత్తసాగింది.

శర్మిష్ఠ ఇక ఆలస్యం చెయ్యలేదు.

ఆమె కూడా వాళ్ళిద్దరి వెనకాల పరుగెత్తసాగింది.


విచిత్రం ఏమిటంటే యయాతి వీరాధి వీరుడు. అతడిని దేవయాని లాంటి ఒక సుకుమారమైన అమ్మాయి ఏం చెయ్యగలదు అనే ఆలోచన శర్మిష్ఠ బుర్రకు తట్టకపోవటం ఆశ్చర్యమే! దేవయాని వలన యయాతికి ఎటువంటి ఆపద కలగకూడదనే ఆరాటం ఒక్కటే ఆమెలో ఆందోళనను కలిగిస్తోంది.

===============================================

ఇంకా వుంది..

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page