top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 46

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 46 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 17/03/2026

కచదేవయాని - పార్ట్ 46 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

“యయాతి విజయంతో రాజ్యం ఆనందంలో ఉంది… కానీ దేవయాని హృదయంలో మాత్రం మండుతున్నది ఈర్ష్యాగ్ని!”

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 

కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్య భాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. పొర్ణమినాడు కలుస్తానని  చిలుక రూపంలో ఉన్న చారుమతి ద్వారా వర్తమానం పంపుతాడు యయాతి. 

వచ్చేది కచుడనీ, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది దేవయాని. చారుమతి తన అసలు రూపంలోకి వస్తుంది. 

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కచదేవయాని ధారావాహిక నలభై ఆరవ భాగం చదవండి. 


నహుష చక్రవర్తి తన పరివారంతో దానవరాజ్యానికి బయలుదేరాడు. సంయాతిని, ప్రయాతిని ప్రతిష్ఠాన పురానికి రక్షణగా ఉంచి లక్ష మందితో బయలుదేరాడు.

గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు బారులు బారులుగా వెళుతున్నాయి.రాచపరివారంతో పాటు సైన్యం కదలుతోంది.మంత్రులు, దాసదాసీలు, విదూషకులు, వైద్యులు, వంటవాళ్ళు, వ్యాపారస్థులు మాత్రమే కాకుండా సామాన్య పురజనులు కూడా చక్రవర్తితో  బయలుదేరారు.


పింగళ, శక్తిధరులు యయాతి వెంటే ఉన్నారు.

యయాతికి ఎక్కడలేని ఉత్సాహంగా ఉంది.

శర్మిష్ఠతో వివాహం నిశ్చయం కాబోతున్నది. ఇంక కొద్ది రోజులే....


అతడు ఒకసారి రథంలో  స్నేహితులతో పాటు కూర్చుని ఛలోక్తులు వేస్తూ ప్రయాణిస్తున్నాడు. కాసేపు గుర్రం మీద వచ్చి సైనికులను, మంత్రులను పలకరిస్తున్నాడు.మరోసారి ఏనుగు మీద ఎక్కి వచ్చి తండ్రితో కబుర్లు చెప్పి వెళుతున్నాడు. ఇంకోసారి సేవకులతో మాట్లాడుతూ నడుస్తున్నాడు.

మరోసారి వేదపండితులతో పాటు ప్రయాణిస్తూ ధర్మశాస్త్ర చర్చ చేస్తున్నాడు. మరోసారి సామాన్య జనులతో కలిసి జానపద నృత్యాలు చేస్తూ  పాటలు పాడుతున్నాడు. ఇంకోసారి చిన్నపిల్లలతో ఆటలాడుతూ అల్లరి చేస్తున్నాడు.


ప్రపంచంలోనే గొప్ప యోధుడైన యయాతి అందరినీ తగిన విధంగా ఆదరిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. దారిలో వచ్చే రాజ్యాల దగ్గర విడిది చేసి వాళ్ళు చేసిన సత్కారాలను స్వీకరించి నహుషచక్రవర్తి పరివారం మెల్లగా కదలి దానవరాజ్యానికి దగ్గరలోకి వస్తూ ఉంది.


దానవరాజ్యంలో చక్రవర్తి రాక కోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. రాజ్యమంతటా దీపాలు. పూలతో అలంకారం. రహదారుల నిండా రంగురంగుల ముగ్గులు. రాజభవనంలోని ఆడవాళ్లంతా విరజాదేవి చుట్టూ చేరి ఆమె కుమారుడైన యయాతిని పొగుడుతున్నారు. కొంతమంది కవయిత్రులు యయాతి మీద కవితలు వ్రాసి పాడుతున్నారు. అతడు విమానాన్ని గెలుచుకొని వచ్చిన విజయ గాథను కొంత మంది నాటకం లాగా ప్రదర్శించి సంతోషిస్తున్నారు. విజయుడైన యయాతి వృషపర్వ మహారాజుకు కాబోయే అల్లుడని అక్కడక్కడా గుసగుసలు వినిపిస్తున్నాయి.


అయితే ఆ విషయాన్ని రాచకుటుంబం ధృవీకరించాలి. అప్పటి దాకా అది బహిరంగ రహస్యం. అంతఃపురంలో  ఎక్కడలేని సందడి! శర్మిష్ఠ కనిపిస్తే చాలు పెద్దవాళ్ళు ఆమెను ముద్దు చేసి ఆశీర్వదిస్తున్నారు. దేవయానికి నహుష చక్రవర్తి దానవ రాజ్యానికి వస్తున్నాడని తెలుసు. నాలుగేళ్ల క్రితం ఆయన కొంతమంది పరివారంతో ఆశ్రమానికి వచ్చి తన తండ్రి గారి ఆశీస్సులు తీసికొన్నాడు. బంధువుల మధ్య రాకపోకలు సహజం. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు.


అతడి కుమారుడి విజయగాథను చెలికత్తెల ద్వారా దేవయాని కూడా విన్నది.అయితే ఎప్పుడూ కచుని మీద ద్వేషంతో జ్వలిస్తుండే ఆమె అంతఃపురంలోని సందడి గురించి పెద్దగా పట్టించుకోలేదు. రాజ్యంలో శర్మిష్ఠ పుట్టినరోజని నెలల తరబడి ఉత్సవం చేశారు. "పనికిమాలిన వాళ్ళు! పనీపాట లేని మూర్ఖులు! ఆ పిల్లను తెగ ముద్దు చేస్తూ అందలం ఎక్కిస్తూ ఉంటారు!"అనుకుంటూ మనసులో చికాకు పడుతూ ఉంటుంది దేవయాని. శర్మిష్ఠ అంటే రోజు రోజుకూ ఈర్ష్యతో మండిపోయే దేవయాని దృష్టి అంతా రాబోయే పౌర్ణమి రోజు మీదే ఉంది.నిమిషాలు, గంటలూ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటోంది. శర్మిష్ఠకు కూడా సమయం భారంగా గడుస్తోంది. పౌర్ణమి ఎప్పుడొస్తుంది?..


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 47 త్వరలో

===============================================

T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page