కచదేవయాని - పార్ట్ 42
- T. V. L. Gayathri

- 18 hours ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 42 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/02/2026
కచదేవయాని - పార్ట్ 42 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. అతనికి ప్రథమ స్థానం వచ్చి ఉండాలని మహర్షులు, ప్రేక్షకులు తలపోశారు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక నలభై రెండవ భాగం చదవండి.
ఆ మరునాడు వీతిహోత్ర చక్రవర్తి యయాతిని విందుకు పిలిచాడు. పింగళ, శక్తిధరులతో కలిసి విందుకు వెళ్ళాడు యయాతి.
వీతిహోత్రుని కుమారులు సోమకీర్తి, బృందారకులు యయాతి వాళ్ళను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
"మీకు మాకు మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహసంబంధాలు ఉన్నాయి. నిన్ను మా సోదరునిగా భావించి మా ద్వీపంలో కొంత భూభాగాన్ని కానుకగా ఇస్తున్నాము. నీవు నీ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి, అభివృద్ధి చేయాలని మా అభిలాష. నీకు కావలసినట్లుగా రాజధాని నగరాన్ని నిర్మించమని విశ్వకర్మ గారికి చెబుదాము!"అన్నాడు యయాతి చేతులు పట్టుకొని సోమకీర్తి.
దానికి యయాతి
"ఈ ఒప్పందం వలన మన రెండు రాజ్యాల మధ్య స్నేహసంబంధాలు మరింత బలోపేతమవుతాయి. మనం ఒకరికొకరం తోడుగా ప్రయాణిద్దాము!"అంటూ సోమకీర్తిని కౌగలించుకొన్నాడు.
"నీకో హెచ్చరిక యయాతీ!విజయం అన్నది స్నేహితుల్ని, సత్కరాలను తెచ్చి పెడుతుంది. అయితే అదే విజయం శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. ఈ విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండాలి!భూలోకానికి విమానాన్ని పంపించటం దేవజాతి వాళ్ళల్లో కొందరికి ఇష్టం లేదు. తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు.... దేవతల దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. ప్రస్తుతం వాళ్లంతా దివ్యాస్త్రాలను సాధన చేసే పనిలో పడ్డారు. మేము కూడా దివ్యాస్త్రాలను కూడగట్టుకొనే ప్రయత్నాలను చేస్తున్నాము. నువ్వు కూడా నీ ప్రయత్నాలను మొదలు పెట్టు!"
"నేను కూడా అదే విషయం గురించే ఆలోచిస్తున్నాను కీర్తీ!భూలోకానికి వెళ్ళంగానే అత్రి మహాముని గారి దగ్గరికి వెళ్లి అడుగుతాను. ఆయన మా నాన్నగారి యజ్ఞాలకు క్రమం తప్పకుండా వస్తూ వుంటారు."
"అత్రి మహాముని గారితో పాటు అగస్త్య, భరద్వాజ మహర్షులను కూడా సంప్రదించు!మనం ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి! ఆలాగే భూలోకంలో మీ చుట్టు ప్రక్కల ఉండే ఉండే రాజులతో స్నేహసంబంధాలను పటిష్టం చేసుకో!జాగురూకత అవసరం!"
సోమకీర్తి చూపించే ఆప్యాయతకు సంతోషించాడు యయాతి. ఆ రోజంతా వాళ్ళతో గడిపి తన విడిదికి చేరుకున్నాడతడు.
రెండో రోజు ప్రయాణం.
కచుడు, సారంగదేవుడు వచ్చి యయాతిని కలుసుకొన్నారు.
"ఇప్పుడు మేమందరం భూలోకానికి వస్తున్నాము! వచ్చే నెల అమావాస్యకు చారుమతికి శాపం తొలిగిపోతుంది. తనకు శాపమిచ్చిన వాలఖిల్య మునుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆశీస్సులను తీసికొని గంధర్వలోకానికి వెళ్లిపోతుంది.అంటే మరో నెలపాటు చారుమతి, సారంగ దేవులు భూలోకంలో అరుణకేశి మహర్షుల దగ్గర ఉంటారు."
అంటూ వివరించాడు కచుడు.
"చాలా సంతోషం! మరి నీ సంగతేమిటి?"
"నేను ఇంకో ఆరునెలలు అరుణకేశి మహర్షుల దగ్గరే ఉంటాను. ఇంకా నేర్చుకోవలసిన శస్త్ర చికిత్సలు కొన్ని ఉన్నాయి."
"అయితే ఇంకేం!సమయం దొరికినప్పుడల్లా మా దగ్గరికి వచ్చి మాతో గడుపుతూ ఉండాలి!"
"ఆలాగే యయాతీ!" అంటూ నవ్వాడు కచుడు.
పుష్కర ద్వీప చక్రవర్తి కుటుంబానికి కృతఙ్ఞతలు తెలిపి యయాతి తను గెలుచుకున్న విమానంలో మిత్రులతో సహా భూలోకానికి తిరుగు ప్రయాణమయ్యాడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 43 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments