top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 38

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 38 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 29/01/2026

కచదేవయాని - పార్ట్ 38 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 

కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది. శత్రువును కదలకుండా చేసే మణిని దేవయానికి ఇస్తాడు దుర్మిలుడు. విమాన విన్యాస పోటీకి సిద్ధమవుతాడు యయాతి.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విమాన విన్యాస పోటీ ప్రారంభమయింది.


ముందుగా నలుగురు అభర్థుల విమానాలు ఆకాశంలోకి వేగంగా వెళ్లాయి. విమానాల నుండి వెలువడుతున్న పొగ ఆకాశంలో గీతలు గీస్తున్నట్లుగా ఉంది.విమానాలు

పైకి క్రిందకు తిరుగుతుంటే ధూమరేఖలు రకరకాల ఆకృతుల్లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి.


ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. అభ్యర్థులు చేస్తున్న విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. మొదటి నలుగురు తమ విన్యాసాలు పూర్తి చేసి విమాన కేంద్రానికి వెళ్లారు.

ఆ తర్వాత మరొక నలుగురు అభర్థుల  విమానాలు ఆకాశంలోకి దూసుకొని పోయాయి. వారిలో హూహు ఉన్నాడు.


చిత్రవిచిత్రమైన గతుల్లో విమానాన్ని ఫల్టీలు కొట్టిస్తున్నాడు హూహు.

ఒకసారి పక్షిలాగా, మరొకసారి మొసలిలాగా, మరొకసారి గుఱ్ఱంలాగా విమానాన్ని తిప్పుతున్నాడతడు.


ఆకాశంలో ధూమరేఖలు ఆయా ఆకారాల్లో కనిపిస్తూ ఉంటే ప్రేక్షకులు విభ్రాంతిగా చూస్తున్నారు . హూహు చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఇంత 'కంటే గొప్పగా ఇంకెవ్వరూ చేయలేరు 'అనుకున్నాడు దేవేంద్రుడు. 


గంధర్వులు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు.

ఆ విధంగా విన్యాసాన్ని విజయవంతంగా ముగించాడు హూహు.


ఆ తర్వాత మరో నలుగురు అభ్యర్థులు విమానాలతో దూసుకొని వచ్చారు.

వారిలో కచుడు ఉన్నాడు. ఉత్కంఠగా చూస్తున్నారు ప్రేక్షకులు.

కచుడు తన విమానాన్ని ఒకసారి శంఖం ఆకారంలో, మరొకసారి ఏనుగు ఆకారంలోనూ, ఇంకోసారి ఛత్రం ఆకారంలోనూ త్రిప్పాడు.చాలా కష్టమైన విన్యాసాలవి. అతడి విన్యాసాలను చూస్తూ ప్రేక్షకులు తమని తాము మరచిపోయారు.

ఆ వెనువెంటనే మరొక నాలుగు విమానాలు ఆకాశంలోకి దూసుకొని వెళ్లాయి.

అభ్యర్థులు విమానాలను వేగంగా ఫల్టీలు కొట్టిస్తున్నారు.వారిలో యయాతి ఉన్నాడు.


మిగిలిన వాళ్ళతో పోలిస్తే అతడికి అనుభవం తక్కువ.

అతడు ఆకాశంలోకి దూసుకొని పోతూ త్రిశూలాన్ని చిత్రించాడు.

అటువంటి విన్యాసం చేయాలంటే ముగ్గురు చోదకులు కలిసి చెయ్యాలి. కానీ యయాతి ఒక్కడే ఒక్క విమానంతో చేసి చూపించాడు.


తర్వాత  ఆ విమానం పాములాగా మెలికలు తిరిగింది.

అష్టదళ పద్మాన్ని చిత్రించిన విమానం ఒక్కసారి క్రిందకు రాసాగింది. చోదకుడు పట్టు కోల్పోయాడని,తమ మీద విమానం కూలి పడిపోతుందేమోనని దేవేంద్రుడితో సహా అందరూ చేతులు తలపైకి పెట్టుకున్నారు. ఆందోళనగా చూస్తున్నాడు కచుడు.ఆ సమయంలో విమానానికి ప్రమాద మేదన్నా జరిగితే మిగిలేది బూడిద మాత్రమే! కానీ అలా జరగలేదు!


ప్రేక్షకులకు అతి దగ్గరగా వచ్చిన విమానం అంతే వేగంగా  పైకి వెళ్ళిపోయింది. గిరగిరా తిరుగుతూ ధ్వజాన్ని సృష్టించింది.అందరూ ఊపిరి పీల్చుకున్నారు.చివరకు విల్లు నెక్కు పెట్టిన బాణపు ఆకారంలో విమానాన్ని త్రిప్పాడు. వెనువెంటనే విమానంలోనుండి ప్రేక్షకుల మీద పూలను  జల్లులాగా కురిపించాడు. ప్రేక్షకులు పరవశించారు. చిన్న పిల్లలు సైతం కేరింతలు కొట్టారు. ఇక మహిళామణులయితే కిలకిలా నవ్వుతూ యయాతికి చేతులు ఊపుతున్నారు. అలా తన విన్యాసాలను ముగించి విమాన కేంద్రానికి చేరుకున్నాడు యయాతి.


ఇంత క్రిందకు వచ్చి తిరిగి ఆకాశంలోకి వెళ్ళటమనే విన్యాసం చేయాలంటే చాలా నైపుణ్యం కావాలి.ఆలాగే అందరి మీద పూలను కురిపించటం కూడా! దేవేంద్రుడు ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టటంతో ప్రేక్షకులందరు లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. 


అప్పుడు భరద్వాజుడు తన ప్రక్కనున్న బంధురకుడితో "  యయాతి చేసినవి అద్భుతమైన  విన్యాసాలు! నీ శిష్యులకు ఎంత చక్కని శిక్షణ నిచ్చావోయి! ముందు నిన్ను మెచ్చుకోవాలి!" అన్నాడు ప్రశంసిస్తూ.


"నా శిక్షణ కాదు మహర్షీ! మిగిలిన విన్యాసాలన్నీ నేను నేర్పించినవే!కానీ యయాతి చేసిన ఈ  రెండు విన్యాసాలు మాత్రం నా శిక్షణలో లేవు. అతడు  ఎలా చేశాడో మరి!"అన్నాడు బంధురకుడు.


అతడికి కూడా యయాతి చేసిన విన్యాసాలను చూస్తే ఆశ్చర్యం కలిగింది. అద్భుతమనిపించింది.


"కచ్ఛితంగా యయాతికి ప్రథమ బహుమతి వస్తుంది.సందేహం లేదు!"అన్నాడు భరద్వాజుడు.


"అవును మహర్షీ! నేను కూడా అదే అనుకుంటున్నాను!"అన్నాడు బంధురకుడు.


తర్వాత మిగిలిన అభ్యర్థులు విన్యాసాలు చేశారు. అందులో సారంగదేవుడొక్కడే చెప్పుకోదగ్గట్లుగా విమానంతో విన్యాసాలు చేశాడు.


పోటీ ముగిసింది.

అభ్యర్థులందరు వచ్చి తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు.

ఆ మరుసటి దినం ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పి జయంతుడు అభ్యర్థులను, వారికి శిక్షణ నిచ్చిన శిక్షకులను పొగుడుతూ ఉపన్యసించాడు.

తర్వాత దేవేంద్రుడు పేరు పేరునా అభర్థులను మెచ్చుకొని స్వస్తి వాక్యాలు పలికాడు.

అందరూ వాళ్ళ వాళ్ళ విడిది గృహాలకు చేరుకున్నారు.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 39 త్వరలో

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page