వారం వారం బహుమతులు - ఫిబ్రవరి 2026
- Mana Telugu Kathalu - Admin
- 4 hours ago
- 3 min read
#WeeklyPrizesForTeluguStories, #VaramVaramBahumathulu, #StoryCompetitionUgadi2026, #TeluguStoryCompetition, #ComedyStoryCompetition

వారం వారం బహుమతులు - ఫిబ్రవరి 2026 - Weekly Prizes - February 2026 By manatelugukathalu.com Published In manatelugukathalu.com On 15/03/2026
మనతెలుగుకథలు.కామ్ వారి వారం వారం బహుమతులు ఫిబ్రవరి 2026
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్
విషయ సూచిక
1). బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
2). కొసమెరుపు కథల పోటీలు
3). హాస్యకథల పోటీలు
4). ఉగాది 2026 కథల పోటీలు
5). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) ఫిబ్రవరి 2026 ఫలితాలు
ధన్యవాదాలు:
దాదాపుగా అన్ని రచనలూ చదువుతూ ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్న సురేఖ పులి, పి.వి.పద్మావతి మధు నివ్రితి, సిరి ప్రసాద్, పాండ్రంకి సుబ్రమణి, శ్రీపతి లలిత గార్లకు, ఇంకా మరెందరో మా అభిమాన రచయితలకు, పాఠకులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఏ విధమైన పోటీలు, బహుమతులు లేకున్నా తమ కవితలు, వ్యాసాలు నిరంతరం పంపిస్తున్న మా అభిమాన రచయితలు, కవులు గద్వాల సోమన్న, నీరజహరి ప్రభల, భళ్ళముడి నాగరాజు, అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ, బులుసు రవిశర్మ, ఎం కే కుమార్, T. V. L. గాయత్రి, తాత మోహన కృష్ణ, యశోద గొట్టిపర్తి,రాయల కుమార్, Ch. ప్రతాప్ గార్లకు, ఇంకా మరెందరో మా అభిమాన రచయితలకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
గమనిక:
కొత్త రచయితల సమాచారం కోసం...
కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.
అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది 2026 పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.
ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.
కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.
మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.
మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com
మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.
1). బహుమతులకు సహకరిస్తున్న వారు
వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.
రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.
వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.
ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*శ్రీ భళ్ళముడి నాగరాజు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*G. S. S. కళ్యాణి గారు తమ అమ్మమ్మాతాతయ్యలు కీ. శే. ఉప్పలూరి సత్య ఫల్గుణ వెంకట అప్పారావు మరియు కీ. శే. ఉప్పలూరి లలిత నాంచారమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక బహుమతుల ఎంపికలో కూడా మాకు సహకరిస్తున్నారు.
*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*కొసమెరుపు కథల పోటీని శ్రీమతి కర్లపాలెం రుక్మిణమ్మ గారి స్మారకార్థం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao ) స్పాన్సర్ చేస్తున్నారు..
హాస్య కథల పోటీని కీ.శే. కర్లపాలెం మధుసూదనరావుగారి జ్ఞాపకార్థం, శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.
*M. K. కుమార్, భళ్ళముడి నాగరాజు, Dr. లక్ష్మీ రాఘవ కామకోటి, Dr. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, Dr. M. N. బృంద, పివి పద్మావతి మధు నివ్రితి ఇంకా మరికొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.
2). కొసమెరుపు కథల పోటీ&3). హాస్యకథల పోటీలు :
ఈ రెండు పోటీలు ఈ నెలతో ముగుస్తాయి. ఏప్రిల్ 2026 నుండి కొత్త తరహా పోటీలు ప్రారంభిస్తాము. ప్రకటన 31/03/2026 న మా పోస్ట్ లో ఉంటుంది.
4. ఉగాది 2026 కథల పోటీలు:
29/09/2025 నుండి 19/03/2026 వరకు మాకు చేరే కథలనుండి (06/10/2025 నుండి 31/03/2026) వరకు ప్రచురితమయ్యే కథల నుండి ఉగాది 2026 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.
కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 19/03/2026
ఫలితాలు: 15/04/2026
తదుపరి పోటీల ప్రకటన 31/03/2026 న ఉంటుంది.
5). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ):
అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2026 వరకు పొడిగిస్తున్నాము.
రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.
బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.
విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.
ఫిబ్రవరి 2026 వారం వారం బహుమతుల ఫలితాలు:
( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)
08/02/2026 | ||
08/02/2026 | ||
08/02/2026 | ||
08/02/2026 | ||
08/02/2026 | ||
15/02/2026 | ||
15/02/2026 | ||
15/02/2026 | ||
22/02/2026 | ||
22/02/2026 | ||
22/02/2026 | ||
22/02/2026 | ||
01/03/2026 |
కొత్తగా ప్రారంభించిన కొసమెరుపు కథల పోటీకి చక్కటి ప్రతిస్పందన లభించింది.
ఫిబ్రవరి 2026 నెలలో బహుమతి పొందిన కథ:
ఫిబ్రవరి 2026 |
( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)
కొత్తగా ప్రారంభించిన హాస్య కథల పోటీకి చక్కటి ప్రతిస్పందన లభించింది.
ఫిబ్రవరి 2025 నెలలో బహుమతి పొందిన కథ:
ఫిబ్రవరి 2026 |
విజేతలకు మా అభినందనలు.
వారికి వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు ప్రశంసాపత్రం పంపడం జరిగింది.
బహుమతి మొత్తం 22/03/2026 లోగా పంపడం జరుగుతుంది.
పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
తదుపరి పోటీల ప్రకటన 31/03/2026 న ఉంటుంది.
మల్లవరపు సీతారాం కుమార్
గౌరవ సంపాదకులు




Comments